Search
  • Follow NativePlanet
Share
» »హొయసల అత్యద్భుత కట్టడం - చెన్నకేశవ ఆలయం !

హొయసల అత్యద్భుత కట్టడం - చెన్నకేశవ ఆలయం !

By Mohammad

సోమనాథపుర కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఈ పట్టణంలో చెన్నకేశవ స్వామి ఆలయం ప్రసిద్ధి. దీనిని హొయసల రాజులు కట్టించారు. మూడు గోపురాలు ఉన్న ఈ దేవాలయం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. హొయసల రాజైన మూడవ నరసింహ కు విధేయుడైన సైన్యాధిపతి సోమనాథ దగ్గరుండి ఆలయ బాగోగులు చూసుకున్నాడు. తదనానంతరం ఈ ప్రదేశానికి అయిన పేరే పెట్టారు.

ఘటోత్కచుని ఆశ్రమమే ... చిత్రదుర్గ !ఘటోత్కచుని ఆశ్రమమే ... చిత్రదుర్గ !

చెన్నకేశవ ఆలయాన్ని త్రికూటాచల ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మూడు ఆలయాలు, మూడు గోపురాలు పక్కపక్కనే అనుకోని ఉన్నట్లు కనిపిస్తాయి. బహుశా ! దీనిని చూసే త్రికూటాచల అనే పేరుపెట్టింటారు పూర్వీకులు. ఈ ఆలయ శిల్పసంపద నభూతో .. న భవిష్యత్. చూడటానికి రెండుకళ్ళూ చాలవనుకోండీ ! టెంపుల్ ప్రవేశ ద్వారం మొదలు .. గర్భగుడిలోని దేవుని వరకు అన్నీ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

పట్టడక్కాల్ - అబ్భురపరిచే మహాకళాకృతులు !పట్టడక్కాల్ - అబ్భురపరిచే మహాకళాకృతులు !

విష్ణువు

విష్ణువు

దేవాలయంలో విష్ణు భగవానుడు మూడు రూపాలలో దర్శనమిస్తాడు. అవి కేశవ, జనార్థన మరియు వేణుగోపాల.

చిత్రకృప : Bikashrd

కేశవ విగ్రహం

కేశవ విగ్రహం

మూడు విగ్రహాలలో మొదటిదైన కేశవ విగ్రహం ముష్కరులచే దొంగలింపబడినది.

చిత్రకృప : Vedamurthy J

వేణుగోపాల విగ్రహాలు

వేణుగోపాల విగ్రహాలు

మిగిలిన రెండు జనార్థన, వేణుగోపాల విగ్రహాలు ఆకారం కోల్పోయాయి.

చిత్రకృప : Lukas Vacovsky

శిల్పశైలి

శిల్పశైలి

దేవాలయ ప్రాంగణం పదహారు స్తంభాలతో, ఎత్తైన గోడలతో విశాలంగా ఉండి హొయసల శిల్పశైలిని ఉట్టిపడేలా చేస్తుంది.

చిత్రకృప : Dineshkannambadi

ఆలయ గోడలపై

ఆలయ గోడలపై

ఆలయ గోడలపై దీని నిర్మాణంలో పాల్గొన్న శిల్పుల, అప్పటి పాలకుల పేర్లు చెక్కారు.

చిత్రకృప : Dineshkannambadi

టెంపుల్ ద్వారం

టెంపుల్ ద్వారం

ఈ టెంపుల్ ద్వారం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

చిత్రకృప : Dineshkannambadi

మూడు గుడులు

మూడు గుడులు

చెన్నకేశవ ఆలయం, మూడు గుడులు, మూడు గోపురాలు కలిగి చూడముచ్చటగా ఉంటుంది. గదులలో గోపురాలకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.

చిత్రకృప : Goutamkhandelwal

నక్షత్ర ఆకారం

నక్షత్ర ఆకారం

గుడిని 16 కోణాలు గల నక్షత్ర ఆకారాల్లో నిర్మించారు. పైన గల గోపురాలు కూడా 16 కోణాలతో నిర్మించారు.

చిత్రకృప : Bikashrd

రాతిపలకలపై

రాతిపలకలపై

ఆలయం యొక్క రాతిపలకలపై అనేక హిందూ దేవతామూర్తుల ప్రతిమలను అందంగా చెక్కారు. కింది భాగంలో వివిధ జంతువుల రూపాలను చెక్కారు.

చిత్రకృప : Vinoth Chandar

అందమైన చెక్కడాలను

అందమైన చెక్కడాలను

ఆలయ గోడలపై భారత దేశ గొప్పవైన ఇతిహాసాలను వర్ణించే అనేక అందమైన చెక్కడాలను నిర్మించారు.

చిత్రకృప : Dineshkannambadi

మహాభారతం కధలు

మహాభారతం కధలు

దక్షిణపు గోడ పూర్తి గా రామాయణ గాధలు కలిగి వుండగా, ఉత్తరం గోడ పై పూర్తిగా మహాభారతం కధలు వర్ణించారు. టెంపుల్ వెనుక భాగంలో శ్రీ కృష్ణుడి కధలు వర్ణించారు.

చిత్రకృప : Adam63

విశిష్ట రీతిలో

విశిష్ట రీతిలో

ఈ మూడు మహా కావ్యాల వర్ణనలతో దేవాలయ గోడలు ఒక విశిష్ట రీతిలో నిర్మించబడ్డాయి.

చిత్రకృప : Quietsong

ప్రత్యేక శైలి

ప్రత్యేక శైలి

శ్రీ మహా విష్ణువు విగ్రహంతో ప్రధానంగా నిర్మించబడిన ఈ ఆలయం వైష్ణవ ఆలయాలలో ఒక ప్రత్యేక శైలి కలిగి వుంటుంది.

చిత్రకృప : Arijitroy1992

గోడలన్నీ మహా విష్ణువు

గోడలన్నీ మహా విష్ణువు

గోడల చిత్రాలన్నీ కూడా శ్రీ మహా విష్ణువు చిత్రాలతో నిండి వుంటాయి. వీటిలో ఎక్కడా శివుడి చిత్రం వుండదు.

చిత్రకృప : Bikashrd

సోప్ స్టోన్

సోప్ స్టోన్

ఈ టెంపుల్ ను మెత్తటి సోప్ స్టోన్ (సబ్బు రాయి)తో నిర్మించటం ఆనాటి శిల్ప శైలి నైపుణ్యానికి నిదర్శనంగా వుంటుంది.

చిత్రకృప : Bikashrd

సోమనాథ ఆలయం - మరిన్ని చిత్రాలలో !

సోమనాథ ఆలయం - మరిన్ని చిత్రాలలో !

లార్డ్ నరసింహ స్వామి విగ్రహం

చిత్రకృప : Quietsong

సోమనాథ ఆలయం - మరిన్ని చిత్రాలలో !

సోమనాథ ఆలయం - మరిన్ని చిత్రాలలో !

పిల్లన గ్రోవితో శ్రీకృష్ణుడు

చిత్రకృప : Quietsong

సోమనాథ ఆలయం - మరిన్ని చిత్రాలలో !

సోమనాథ ఆలయం - మరిన్ని చిత్రాలలో !

ముఖద్వారం నుండి చెన్నకేశవ స్వామి వ్యూ

చిత్రకృప : Dineshkannambadi

సోమనాథ ఆలయం - మరిన్ని చిత్రాలలో !

సోమనాథ ఆలయం - మరిన్ని చిత్రాలలో !

ఆలయంలోని మండపాలు, స్తంభాలు

చిత్రకృప : Dineshkannambadi

చెక్కడాలు

చెక్కడాలు

ఆలయ గోపురం పై చెక్కడాలు

చిత్రకృప : Anurag Akella

మండప గోడలు

మండప గోడలు

మండప గోడలు, కిటికీలు, అబ్బురపరిచే శిల్పాలు

చిత్రకృప : Dineshkannambadi

కన్నడ శిలాశాశనాలు

కన్నడ శిలాశాశనాలు

చెన్నకేశవ ఆలయంలో కన్నడ శిలాశాశనాలు

చిత్రకృప : Dineshkannambadi

 విష్ణుమూర్తి

విష్ణుమూర్తి

మండపంలో విష్ణుమూర్తి ప్రతిమ

చిత్రకృప : Dineshkannambadi

సీలింగ్

సీలింగ్

మండప సీలింగ్

చిత్రకృప : Dineshkannambadi

సీలింగ్

సీలింగ్

మండప సీలింగ్

చిత్రకృప : Dineshkannambadi

సీలింగ్

సీలింగ్

మండప సీలింగ్

చిత్రకృప : Dineshkannambadi

ద్వారం

ద్వారం

చెన్నకేశవ స్వామి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్లే ద్వారం

చిత్రకృప : Dineshkannambadi

లోపలి భాగం

లోపలి భాగం

చెన్నకేశవ స్వామి లోపలి భాగం

చిత్రకృప : Giridhar Appaji Nag Y

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

సోమనాథపుర పట్టణం మైసూర్ కు 38 కిలోమీటర్ల దూరంలో కలదు. మైసూర్, శ్రీరంగపట్నం నుండి రెగ్యులర్ గా సోమనాథపుర కు బస్సులు తిరుగుతుంటాయి. సోమనాథపుర లో రైల్వే స్టేషన్ కూడా కలదు. మీరు సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X