• Follow NativePlanet
Share
» »ఆ మణి ఉండటం వల్లే అక్కడ అనంత సంపద

ఆ మణి ఉండటం వల్లే అక్కడ అనంత సంపద

Written By: Kishore

పరమశివుడు స్వయంగా వెలిసిన 12 ప్రదేశాలు జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వెలుగొందుతున్నయి. అందులో ఒక జ్యోతిర్లింగంలో ప్రతి రోజూ బంగారాన్ని సృష్టించే ఒక మణి ఉందని చెబుతారు. అందువల్లే ఆ దేవాలయంలో అనంతమైన సంపద పోగయ్యేదినిపురాణ కథనం. ఈ విషయం తెలుసుకొన్న మహ్మదీయ రాజులు కొందరు ఈ దవేవాలయాన్ని కొల్లగొట్టాడు. అయినా కొల్లగొట్టిన ప్రతిసారి ఈ ఆలయం పునరుద్ధరింపపడుతూ ఉంది. ఇక ఇక్కడ తీర్థంలో స్నానం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆలయం పూర్తి వివరాలు మీ కోసం..

ఈ వి'చిత్ర'మైన మ్యూజియం చూసావా గురు

1. మొదటి జ్యోతిర్లింగం

1. మొదటి జ్యోతిర్లింగం

P.C: You Tube

భారత దేశం నలుమూలలా జ్యోతిర్లింగాలు ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ దేవాలయం. ఇది గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది.

2. మొదట చంద్రుడు

2. మొదట చంద్రుడు

P.C: You Tube

ఈ దేవాలయాన్ని చంద్రుడు కట్టించాడని హిందు పురాణాలు చెబుతున్నాయి. దీని ప్రకారం దక్షుడి కుమర్తెలైన 27 మంది చంద్రుడు వివాహం చేసుకొన్నాడు. అయితే అందులో ఒకరైన రోహిణి మీద ఎక్కువ మక్కువ చూపేవాడు.

3. మిగిలిన వారు దక్షుడికి చెబుతారు

3. మిగిలిన వారు దక్షుడికి చెబుతారు

P.C: You Tube

దీంతో మిగిలిన వారంతా కలిసి దక్షుడితో తమ బాధను చెప్పుకొన్నారు. వెంటనే తన అల్లుడైన చంద్రుడిని క్రమంగా అతని కాంతి తగ్గిపోయి కుష్టురోగంతో బాధపడుతాడని దక్షుడు శపించాడు.

4. శాప విమోచనం కోసం శివుడిని

4. శాప విమోచనం కోసం శివుడిని

P.C: You Tube

శాపవిమోచనం కోసం చంద్రుడు శివుడిని ప్రార్థించగా ప్రసుత గుజరాత్ లోని ప్రభాస తీర్థం ఉన్న చోట శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు. దీంతో చంద్రుడు శాపం నుంచి విముక్తుడయ్యాడు.

5. చంద్రుడికి సోముడనే పేరు

5. చంద్రుడికి సోముడనే పేరు

P.C: You Tube

అటు పై శివుడి ఆదేశాలను అనుసరించి చంద్రుడు అందరి భార్యలను సమానంగా చూసుకొనేవాడు. ఇదిలా ఉండగా చంద్రుడికి సోముడనే పేరు కూడా ఉంది. అందువల్ల ఇక్కడ చంద్రుడు స్థాపించిన లింగానికి సోమేశ్వర లింగం అని పేరు.

6. అందువల్లే ఇక్కడ జ్యోతిర్లింగం

6. అందువల్లే ఇక్కడ జ్యోతిర్లింగం

P.C: You Tube

అంతే కాకుండా చంద్రుడు స్థాపించిన లింగంలో తాను నిత్యం కొలువై ఉంటానని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడని పురాణ కథనం. అందువల్లే ఈ క్షేత్రం జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతోందని చెబుతారు.

7. మొదట బంగారంతో

7. మొదట బంగారంతో

P.C: You Tube

ఈ ఆలయాన్ని మొదట చంద్రుడు బంగారంతో నిర్మించాడని చెబుతారు. అటు పై రావణుడు వెండితో, అనంతరం శ్రీ క`ష్ణుడు కొయ్యతో, భీముడు రాతితో నిర్మించాడని పురాణ కథనం.

8. శమంతక మణి

8. శమంతక మణి

P.C: You Tube

మరోవైపు ప్రతి రోజూ బంగారన్ని స`ష్టించే స్వభావం ఉన్న శమంతక మణి ఈ జ్యోతిర్లింగంలోనే ఉందని స్థానిక పూజారులు చెబుతూ ఉంటారు. అందువల్లే ఈ దేవాలయంలో అనంత సంపదకు నిలయమై అనేకసార్లు దోపిడికి గురయ్యిందని చెబుతుంటారు.

9.అపార సంపద

9.అపార సంపద

P.C: You Tube

ముఖ్యంగా ఈ ఆలయంలో అపార సంపద ఉందని తెలుసుకొన్న ఘజని మహ్మద్ ధార్ ఎడారి గుండా ఇక్కడకు చేరుకొని ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి సంపదను తరలించుకుపోయాడు.

10. దాడి చేసిన వారిలో ప్రముఖులు వీరే

10. దాడి చేసిన వారిలో ప్రముఖులు వీరే

P.C: You Tube

అటు పై ఆలయ పునరుద్ధరణ జరిగింది. అయితే 1308లో అల్లావుద్దీన్ ఖిల్జీ, అటుపై ఔరంగజేబుతో సహా పలువురు రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తూ అక్కడి సంపదను తీసుకువెళ్లేవారు.

11. 1950లో

11. 1950లో

P.C: You Tube

ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం స్వాతంత్రం తర్వాత 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేత నిర్మించబడింది. ఆలయం లోపల అంతా సువర్ణమయమై, సుందరమైన శిల్పాలతో అందంగాకనిపిస్తుంది.

12. గోడలన్నీ బంగారమే

12. గోడలన్నీ బంగారమే

P.C: You Tube

గర్భగుడిలో ఉన్న శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. శివలింగం వెనుక పార్వతి దేవి విగ్రహం ఉంటుంది. గోడలకు బంగారుతో తాపడం చేసి ఉంటుంది. ఇక ఇక్కడ జరిగే విశేష హారతి సందర్శన వల్ల పునర్జన్మ ఉండదని భక్తులు నమ్ముతారు.

13. మరో శివలింగం

13. మరో శివలింగం

P.C: You Tube

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న సోమనాథ ఆలయానికి సమీపంలో మరో శివాలయం ఉంది. ఇక్కడ గుడిలోని లింగం భూ గర్భంలో ఉంటుంది. అందువల్ల శిలింగ దర్శనం కోసం 20 మెట్లు దిగి వెళ్లాలి.

14. నేరుగా అభిషేకం

14. నేరుగా అభిషేకం

P.C: You Tube

ఇక్కడ పూజారులు భక్తుల చేత స్వయంగా శివుడికి అభిషేకం చేయిస్తారు. ఇదిలా ఉండగా ప్రభాస తీర్థంలోనే శ్రీ క`ష్ణుడు నిర్యాణం చెందాడని చెబుతారు. ఇక్కడి సముద్రంలో కపిల, హిరణ్య, సరస్వతి నదులు కలుస్తాయి. ఇక్కడ స్నానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు.

15.ఎలా చేరుకోవాలి.

15.ఎలా చేరుకోవాలి.

P.C: You Tube

అహ్మదాబాద్ కు సోమనాథ్ దేవాలయానికి మధ్య 410 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం దాదాపు ఏడు గంటలు. అదే విధంగా వేరవాల్ కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ళఉంది. అహ్మదాబాద్ నుంచి సోమనాథ్ దేవాలయానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి