Search
  • Follow NativePlanet
Share
» »శివుడు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రం !

శివుడు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రం !

చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం అష్టాదశశక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా అమ్మవారికి నిలయం. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ.

చిత్రమైన కాళి ఆలయం - ఈ గుళ్ళో తాళం వేస్తే ఎటువంటి కోరిక అయిన తీరుతుంది !చిత్రమైన కాళి ఆలయం - ఈ గుళ్ళో తాళం వేస్తే ఎటువంటి కోరిక అయిన తీరుతుంది !

చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు !చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు !

చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం అష్టాదశశక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా అమ్మవారికి నిలయం. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. అమ్మవారి పేరుమీదనే ఈ ఊరికి పిఠాపురం అన్న పేరొచ్చింది.

కుక్కుటేశ్వర దేవాలయం కుక్కుటేశ్వర దేవాలయం కోనేరు (పాదగయ) కు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. గుడికి ఎదురుగా ఏకశిల నంది విగ్రహం అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొలువై ఉంటుంది.

ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి. పురుహూతికా దేవి ఆలయం కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.

టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. కుక్కుటేశ్వరుడి దేవళం

1. కుక్కుటేశ్వరుడి దేవళం

భారతదేశంలోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు.

చిత్ర కృప : Rajachandra

2. ఐతిహ్యం

2. ఐతిహ్యం

హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషను కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు. గుడి చాలా చిన్నది. అయినప్పటికి అష్టాదశ శక్తీ పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది.

చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.

3. శివ పూజ

3. శివ పూజ

శివమ్ అంటే మంగళం అని అర్థం .. శుభాలను ప్రసాదించువాడే శంకరుడు. శివ నామ స్మరణ వలన .. శివ పూజ వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి పరమశివుడు తన లీలా విశేషాలలో భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు .. వాటిలో 'పిఠాపురం' ఒకటి.

చిత్ర కృప : Rajachandra

4. అమ్మవారి శక్తి పీఠం

4. అమ్మవారి శక్తి పీఠం

సదా శివుడిని ఇక్కడ 'కుక్కుటేశ్వర స్వామి'గా పూజిస్తుంటారు. 'పిఠాపురం' అమ్మవారి శక్తి పీఠంగానే కాదు, స్వామివారు 'కోడి' రూపాన్ని ధరించిన క్షేత్రంగాను చెబుతారు. గయాసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తులు పథక రచన చేస్తారు.

చిత్ర కృప : Rajachandra

5. కుక్కుటేశ్వరుడు

5. కుక్కుటేశ్వరుడు

అందులోభాగంగా తెల్లవారక మునుపే గయాసురుడు మేల్కొనాలి. అలా జరగడం కోసం శివుడు 'కోడి' రూపాన్ని ధరించి కూస్తాడు. తెల్లవారిందనుకుని మేల్కొన్న గయాసురుడిని సంహరిస్తాడు. ఆ రాక్షసుడి కోరిక మేరకు స్వామి లింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఇక్కడి స్వామిని 'కుక్కుటేశ్వరుడు' గా ఆరాధిస్తూ వుంటారు.

pc: youtube

6. పుణ్య క్షేత్రం

6. పుణ్య క్షేత్రం

ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన పిఠాపురం పవిత్రమైన గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో జైన, బౌద్ధ, శైవ మరియు వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఉన్నది. పిఠాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్ఫు గోదావరి జిల్లాకు చెందిన పుణ్య క్షేత్రం.

pc: youtube

7. పుష్కర క్షేత్రం

7. పుష్కర క్షేత్రం

పిఠాపురాన్ని పూర్వం 'పీఠికాపురం' అనేవారు. పిఠాపురం రాజులు కళాపోషణను, సాహిత్యాన్ని పెంచిపోషించేవారు. పురాణాల్లో ఈ క్షేత్రాన్ని పుష్కర క్షేత్రంలో గా పేర్కొన్నారు. ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాథుడు తన పిఠాపురం గురించి తన కావ్యంలో ప్రస్తావించాడు కూడా.

అడిగిన వెంటనే వరాలిచ్చే ... అన్నవరం సత్యనారాయణ స్వామి !!

pc: youtube

8. శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం పిఠాపురం

8. శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం పిఠాపురం

దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు. ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం" గా ఏర్పాటు చేయబడింది.

pc: youtube

9. దత్త క్షేత్రములు

9. దత్త క్షేత్రములు

శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురం లో మాత్రమే కలదు. మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు కలవు.

కష్టాలు తొలగించే అయినవిల్లి గణపతి !!

pc: youtube

10. పిఠాపురంలో చూడవలసిన ఇతర దేవాలయాలు/ సందర్శనీయ స్థలాలు

10. పిఠాపురంలో చూడవలసిన ఇతర దేవాలయాలు/ సందర్శనీయ స్థలాలు

షిరిడి సాయి గురు మందిరం, కాలభైరవుడు ఆలయం, కుంతి మాధవస్వామి ఆలయం, వేణు గోపాలస్వామి ఆలయం, నూకాలమ్మ గుడి, కుక్క పాముగుడి, రాముని కోవెల , వెంకటేశ్వరస్వామి గుడి, కోతి గుడి, కోట సత్తెమ్మ తల్లి గుడి, శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం మొదలైనవి చూడదగ్గవి.

ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' !

pc: youtube

11. పిఠాపురం చేరుకోవటం ఎలా ?

11. పిఠాపురం చేరుకోవటం ఎలా ?

వాయు మార్గం

విమానాల్లో వచ్చే యాత్రికులు రాజమండ్రి (60 కి. మీ) లేదా వైజాగ్ (180 కి. మీ) ఎయిర్ పోర్ట్ లో దిగి, క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు.

pc: youtube

12. రైలు మార్గం

12. రైలు మార్గం

సామర్లకోట రైల్వే జంక్షన్ పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ బయట షేర్ ఆటోలు లేదా బస్టాండ్ కు వెళ్లి ప్రభుత్వ బస్సుల్లో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు.

pc: youtube

13. రోడ్డు మార్గం

13. రోడ్డు మార్గం

కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు ప్రతిరోజూ తిరుగుతుంటాయి.

ఇది కూడా చదవండి:అంతర్వేది .. గోదావరి సంగమ ప్రదేశం !

pc: youtube

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇండియాలో !</a><br><a href=కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !" title="ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇండియాలో !
కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !" loading="lazy" width="100" height="56" />ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇండియాలో !
కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X