Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఒక విచిత్రమై శివ స్వరూపం దర్శిస్తే..

ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఒక విచిత్రమై శివ స్వరూపం దర్శిస్తే..

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాళహిస్తి మండలంలో రేణి గుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖీ నది తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ శాతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ పరుశురామాలయం అంటారు.

అత్యద్భుతమైన శిల్ప శోభితమైన ఆ ఆలయం చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోకి వచ్చింది. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వ వేత్త ఒక ఏడాది పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి మొదటిసారి తెలియజేశారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు, మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం దర్శనమిస్తుంది.

అతి ప్రాచీన ఆలయం:

అతి ప్రాచీన ఆలయం:

ఈ ఆలయంలో గర్భగుడి గజ పుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామ లింగం సహజ సుందరగా మహామహిమాన్వితమైనది. ఇక్కడున్న శిలాశాసనాలు చూస్తే ఆలయం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తున్నది.

శివలింగాలలో ఇదే పురాతనమైనది

శివలింగాలలో ఇదే పురాతనమైనది

తవ్వకాలలో లభ్యమైన శాసనాల ఆధారంగా ఈ నిర్దారణ చేశారు. ఇప్పటిదాకా లభ్యమైన శివలింగాలలో ఇదే పురాతనమైనదిగా చెబుతున్నారు. శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు.

 లింగాన్ని చేక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు.

లింగాన్ని చేక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు.

ప్రాచీన శైవ పూజ విధానం తలపాగా, దోవతీ ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేదకాలంనాటిదని శాస్త్రఘ్నుల అంచనా. ప్రాచీన శైవ పూజ విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చేక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు.

అలాగే ఆలయ నిర్మాతలెవరో తెలియనీ

అలాగే ఆలయ నిర్మాతలెవరో తెలియనీ

అలాగే ఆలయ నిర్మాతలెవరో తెలియనీ ఈ శాసనాలలో స్వామి నిత్య దీప, ధూప నైవేద్యాల కోసం దానం చేసిన భూమి, ఆవులు, ధనం మొదలైన విషయాలను తెలియజేసే వివరాలుమాత్రం శాసనాలలో ఉన్నాయి. 1973లో జరిపిన పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో లభించే జేగురు రంగు రాళ్ల వలన ఆలయం రెండు లేక మూడవ శతాబ్దానికి చెందినదని అనుకున్నారు. కుండలు, పెద్ద సైజు ఇటుకలను పరిశీలిస్తే ఒకటవ , రెండవ శతాబ్దపు ఆంధ్ర శాతవాహనుల కాలం నాటివని నిర్థారించారు. కనుక ఆలయం క్రీ.శ ఒకటవ శతాబ్దికి చెందిన అతి పురతాన ఆలయం అని నిశ్చయంగా చెప్పవచ్చు.

త్రవ్వ కాలలో బయటపడ్డ శాసనాలు కొన్ని ఆలయపు లోపలి వెలుపలి గోడలపై

త్రవ్వ కాలలో బయటపడ్డ శాసనాలు కొన్ని ఆలయపు లోపలి వెలుపలి గోడలపై

త్రవ్వ కాలలో బయటపడ్డ శాసనాలు కొన్ని ఆలయపు లోపలి వెలుపలి గోడలపై ఉన్నాయి .వాటిలో కొన్ని పల్లవ, గంగ పల్లవ, బాణ,చోళుల కాలానికి చెందినవి . 802 కాలం వాడైన పల్లవ రాజు నంది వర్మ వేయించిన శాసనం ఉంది .ఆయా రాజులు ఏంతో భక్తీ ప్రపత్తులతో భూరి దానాలను శ్రీ పరశురామేశ్వర స్వామికి సమర్పించినట్లు తెలుస్తోంది .కాని ఎవరూ కూడా గుడిమల్లం పేరును ఎక్కడా పేర్కొనక పోవటం ఆశ్చర్యమేస్తుంది .

శ్రీ పరుశురామ ఆలయ విశేషాలు

శ్రీ పరుశురామ ఆలయ విశేషాలు

గర్భాలయం అంతరాలయం ముఖ మండపం కంటే తక్కువ లోతులో ఉంది .శివలింగాన్ని ఆనుకొని ఒక వేట గాడి నిలు వెత్తు విగ్రహం ఉండి సంభ్రమం గొలుపుతుంది. వీటిపై దేవుని పేరు, వేటగాని పేరు కూడా లిఖింప బడలేదు .గ్రామాన్ని మాత్రం ‘'విప్ర పీట ‘'అని పేర్కొన్నారు .అంటే బ్రాహ్మణ అగ్రహారం అన్న మాట .శివలింగం చిక్కని గోధుమ రంగు రాయితో తయారు చేయ బడింది . లింగం ఏడు అడుగుల ఎత్తు ,అడుగు మందం ఉండి కింద రెండు చేతులతో స్థానక ఆకారం లో శివుని శిల్పం ఉంది .

పురుషాంగం తో లింగానికి ముందు

పురుషాంగం తో లింగానికి ముందు

పురుషాంగం తో లింగానికి ముందు శివుడు అపస్మార పురుష లేక మరు గుజ్జు (యక్ష)బాహువులపై న నిలబడి నట్లు కనిపిస్తాడు .ఇలా ఎక్కడా శివ స్వరూపం మనకు కని పించదు .కుడి చేతిలో పొట్టేలు ,ఎడమ చేతిలో చిన్న పాత్రతో ఉంటాడు .బాహువులపై పరసు అంటే గండ్ర గొడ్డలి ఆని ఉంటుంది.

తలకు జటా జూటంతో జటా భార రూపంలో శివుడు

తలకు జటా జూటంతో జటా భార రూపంలో శివుడు

తలకు జటా జూటంతో జటా భార రూపంలో శివుడు కనిపిస్తాడు. చెవులకు చాలా లోలాకులు కర్ణాభరణాలుగా ఉన్నాయి. నడుముకు ధోవతి, దానిపై వస్త్ర మేఖల లంలింగాన్ని కప్పి వేస్తూ కనిపిస్తాయి. అందులో నుంచి స్పష్టం గా లింగం దర్శన మౌతుంది. యజ్ఞోప వీతం మాత్రం లేక పోవటం వింతగా ఉంటుంది .ఈయన లింగోద్భవ సమయ మహా శివుడు అని నమ్మకం.

ఈ ఆలయానికి ఒక పురాణగాథ

ఈ ఆలయానికి ఒక పురాణగాథ

ఒకప్పుడు ఇక్కడ పరశురామేశ్వరుడు అనే మహా భక్తుడు ఉండేవాడట ఆతను రోజూ దగ్గరలో ఉన్న కొలనులో గట్టుమీద ఉన్న గజ పుష్పాలు మొదలైన వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలను ఏరి తెచ్చి శివుడికి పూజ చేసేవాడు. అవి చాలా వింత ఆకారాలలో విచిత్ర పవిత్ర సువాసనలు వెద జల్లేవట. శివుడు ప్రీతి చెంది అతనిని అభినందింఛి ఆశీర్వ దించాడు.

 పరశురాముని పూజ దొంగ చాటుగా చూసిన ఒక అదృశ్య రాక్షసుడు

పరశురాముని పూజ దొంగ చాటుగా చూసిన ఒక అదృశ్య రాక్షసుడు

పరశురాముని పూజ దొంగ చాటుగా చూసిన ఒక అదృశ్య రాక్షసుడు ఒక రోజు అక్కడికి వచ్చి, ఆ పూలన్నీ తుంచి శివుడికి పూజ చేశాడు . శివ భక్తుడైన పరశురామేశ్వరుడు ఇది గమ నించి రాక్షసుడితో భీకరంగా పోరాడాడు. వాడిని చంపేలోపు వాడు అదృశ్యమైనాడు. శివుడు ఇద్దరి భక్తికి మెచ్చి, సంతోషించి ఇద్దరికీ సాయుజ్య ముక్తి ప్రసాదించాడట. ఇంతటి ప్రాచీన విశేష అరుదైన శ్రీ పరశురామాలయాన్ని దర్శించి తరించాలి .

ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం

ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం

ధూపదీపనైవేద్యాలు ఆలయ గర్భగుడి సైతం గజపుష్పాకారంలో గంభీరంగా వుంటుంది. చోళ, పల్లవ, గంగాపల్లవ,రాయుల కాలంలో దూపదీపనైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954 సంలో గుడి మల్లం గ్రామస్తుల నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది.

ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం

ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం

పూజలు పునఃప్రారంభం ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. తర్వాత 2009 సంవత్సరంలో పూజలు పునఃప్రారంభమయ్యాయ్. స్థానికులే ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు. అదే టిటిడి యే ఆ బాద్యత చేపడితే ఆలయం మరింత ప్రాచుర్యం పొందుతుంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

గుడిమల్లం చేరుకోవడానికి రోడ్ మార్గం సులభంగా ఉంది. అయినా కూడా సమీపంలో విమాన మరియు రైలుమార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం: గుడిమల్లం సమీపాన రేణిగుంట దేశీయ విమానాశ్రయానికి 11కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రైవేట్ వాహనాల్లో గుడిమల్లం చేరుకోవచ్చు.

రైలు మార్గం : గుడిమల్లం సమీపాన రేణిగుంట మరియు తిరుపతికి రైల్వేస్టేషన్లు కలవు. ఈ ఊర్ల నుండి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలున్నాయి.

రోడ్డు మార్గం : రేణిగుంట నుండి 11కి.మీ , తిరుపతి నుండి 22కి.మీ చిత్తూరు నుండి 85కి.మీ. చంద్రగిరి నుండి గుడిమల్లం గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటుగా జీపు, షేర్ ఆటోల సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X