Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ "గిత్త"ను ఇచ్చి దీపాన్ని వెలిగిస్తే సంతాన ప్రాప్తి అంతేనా పాపపరిహారం కూడా

ఇక్కడ "గిత్త"ను ఇచ్చి దీపాన్ని వెలిగిస్తే సంతాన ప్రాప్తి అంతేనా పాపపరిహారం కూడా

వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

ఈ క్షేత్రంలో కోడె గిత్తను దేవాలయానికి దక్షిణగా ఇస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా వేల సంఖ్యలో ఇక్కడకు భక్తులు వస్తుంటారు. బ్రహ్మహత్యాపాతకాన్ని కూడా తొలగించగల విశిష్టత ఈ క్షేత్రంలోని తీర్థం సొంతం. ఈ క్షేత్రంలో కోటి శివలింగాలు ఉన్నాయని చెబుతారు. ఇక్కడ శివరాత్రి వందమంది అర్చకులు నిర్వహించే మహాలింగార్చన, రుద్రాభిషేకాలను చూడటానికి లక్షల సంఖ్యలో ప్రజలు ఇక్కడకు చేరుకొంటారు. ఈ క్షేత్రాన్ని హిందువులతో పాటు బౌద్ధ, జైన, ముస్లీంలు కూడా సందర్శించుకొంటూ ఉంటారు. ఈ క్షేత్రంలోని దేవాలయం ఆవరణలోనే 400 ఏళ్లనాటి మసీదును కూడా చూడవచ్చు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆలయానికి సంబంధించిన వివరాలు మీకోసం

దక్షిణ కాశీగా పిలుస్తారు

దక్షిణ కాశీగా పిలుస్తారు

P.C: You Tube

వేముల వాడ దక్షిణ కాశీగా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 160 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ కు 36 కిలోమీటర్ల దూరంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం ఉంది. ఇది పురాణ పరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న నగరం.

రాజేశ్వర ఖండంలో ఉల్లేఖించబడింది

రాజేశ్వర ఖండంలో ఉల్లేఖించబడింది

P.C: You Tube

ఈ క్షేత్రం విశిష్టతను భవిష్యోత్తర పురణంలోని రాజేశ్వర ఖండంలో ఉల్లేఖించబడింది. అర్జునుడి మునిమనుమడైన నరేంద్రుడు ఒక బుుషిని చంపి బ్రహ్మహ్యాపాతకాన్ని మూటగట్టుకొంటాడు. దీనిని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ కనిపించిన తీర్థాలన్నింటిలో మునిగి తనకు బ్రహ్మహత్యాపాతకా నుంచి విముక్తి కలిగించాలని ఆ శివుడిని ప్రార్థిస్తుంటాడు.

శివలింగం లభిస్తుంది

శివలింగం లభిస్తుంది

P.C: You Tube

ఈ క్రమంలోనే నరేంద్రుడు ప్రస్తుత వేములవాడలోని తీర్థంలో స్నానం చేస్తాడు. అప్పుడు అతనికి ఒక శివలింగం లభిస్తుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి అతని బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించేస్తాడు. ఇక ఆ శివలింగాన్ని ఆ తీర్థం ఒడ్డున నరేంద్రుడు ప్రతిష్టింప జేస్తారు. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం చెబుతుంది.

రాజన్నగా కూడా పూజిస్తారు

రాజన్నగా కూడా పూజిస్తారు

P.C: You Tube

ఇక్కడ ఉన్న పరమేశ్వరుడిని రాజరాజేశ్వరుడి పేరుతో భర్తులు కొలుస్తారు. కొంతమంది రాజన్నగా కూడా పూజిస్తారు. మూవిరాట్టుకు రాజరాజేశ్వరీ దేవి, ఎడమవైపున శ్రీ సిద్ధివినాయక విగ్రహాలు ఉంటాయి. ఇక ధర్మగుండం కోనేటి పై మూడు మంటపాలు నిర్మించారు.

శివుడికి అత్యంత ఇష్టమైన క్షేత్రం

శివుడికి అత్యంత ఇష్టమైన క్షేత్రం

P.C: You Tube

మధ్యలో ఉన్న మంటపంలో ఆ పరమేశ్వరుడి విగ్రహం ప్రతిష్టించపజేశారు. ధ్యాన ముద్రలో ఉన్న ఆ శివలింగం చుట్టూ ఐదు శివలింగాలు కూడా ఉంటాయి. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంల తర్వాత శివుడికి అత్యంత ఇష్టమైన క్షేత్రం ఇదేనని చెబుతారు.

అతి ప్రధానమైనది కోడె మొక్కు

అతి ప్రధానమైనది కోడె మొక్కు

P.C: You Tube

ఇక్కడ నిత్యం ఎన్నో రకాల పూజలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. ప్రజలు వివిధ రూపాల్లో తమ మొక్కులను చెల్లించుకొంటూ ఉంటారు. ఇందులో అతి ప్రధానమైనది కోడె మొక్కు. భక్తులు ఒక గిత్తను గుడికి తీసుకొచ్చి ప్రదక్షణ చేయిస్తారు.

గండ దీపాన్ని వెలిగించడానికి

గండ దీపాన్ని వెలిగించడానికి

P.C: You Tube

అటు పై దేవాలయం ప్రాంగణంలో ఒక చోట కట్టేసి గుడికి దక్షిణగా సమర్పిస్తారు. దీని వల్ల తమ పాపాలన్నీ తీరిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. అదే విధంగా ఈ దేవాలయంలో గండ దీపాన్ని వెలిగించడానికి కూడా భక్తులు పోటీ పడుతుంటారు. దీని వల్ల తమ జీవితాల్లో వెలుగులు ప్రసురిస్తాయని వారి నమ్మకం.

శివరాత్రి రోజు జరిగే పూజలు

శివరాత్రి రోజు జరిగే పూజలు

P.C: You Tube

ఇక్కడ శివరాత్రి రోజు జరిగే పూజలు చాలా ప్రత్యేకమైనవి. ఆ రోజున దేవాలయం మొత్తం దీపాలంకరణతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో ఇక్కడ మహాలింగార్చన జరుగుంతుంది. అమావస్య దాటి ఏకాదశి మొదలైన అర్థరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.

కేవలం హిందువులే కాకుండా

కేవలం హిందువులే కాకుండా

P.C: You Tube

ఈ దేవాలయంలోని స్తంభాల పై శైవ, వైష్ణవ, జైన, బౌద్ధమతాలకు చెందిన చాలా విగ్రమాలు ఉంటాయి.అందువల్లే ఈ దేవాలయాన్ని కేవలం హిందువులే కాకుండా బౌద్ధులు, జైనులు కూడా సందర్శిస్తూ ఉంటారు. ఈ దేవాలయం ప్రాంగణంలో మొత్తం కోటి శివలింగాలు ఉన్నాయని చెబుతారు.

400 ఏళ్లనాటి మసీదు ఉంది

400 ఏళ్లనాటి మసీదు ఉంది

P.C: You Tube

ఈ దేవాలయం ప్రాంగణంలో 400 ఏళ్లనాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఓ శివభక్తుడు ఈ గుళ్లో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడే చనిపోయాడని చెబుతారు. అందువల్లే ఆయన సంస్మరణార్థం ఈ మసీదును ఇక్కడ నిర్మించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X