» »మంగళప్రద క్షేత్రం పొలాలిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం

మంగళప్రద క్షేత్రం పొలాలిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం

Posted By: Venkata Karunasri Nalluru

హిందూమతంలో దేవుళ్ళకు, దేవతలకి సమాన ప్రాముఖ్యత ఉంది. దేవతలు కొన్ని ప్రదేశాలలో చాలా శక్తివంతంగా వుంటారు అని చెప్పబడినది. భక్తులకు ఎవరైనా అన్యాయం చేస్తే వారికి ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుందని చెప్పబడింది. ఇటువంటి శక్తి (దేవతల) గురించి హిందూ సాంప్రదాయంలో ప్రజలకు ఎంతో గౌరవం మరియు నమ్మకం వుంది.

ఈ ఆదిశక్తికి అనేక రూపాలు ఉన్నాయి మరియు ఈ ఆదిశక్తి వెలసిన స్థలాలను పవిత్ర స్థాలాలుగా పూజిస్తారు. మీరు భారతదేశం యొక్క ప్రతి రాష్ట్రంలో ఈ ఆదిశక్తి దేవాలయాలను చూడవచ్చును. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం కర్నాటక యొక్క దక్షిణ కన్నడ జిల్లాలో గల పొలాలిలో ఉన్న ప్రసిద్ధ దేవి ఆలయాలలో ఒకటి.

మంగళప్రద క్షేత్రం పొలాలిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం

పొలాలిలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం

PC: Surajt88

శ్రీ రాజరాజేశ్వరి ఆలయ చరిత్ర

కొన్ని సంస్కృత పాఠాలలోని పలియపుర స్థానికంగా పురల్ గా వ్యవహరించబడేది. పురల్ అనే పేరు వరకు చివరికి పొలాలిగా పిలవబడుతుంది. వివిధ శాసనాలు మరియు చారిత్రక నివేదికల ప్రకారం ప్రస్తుత ఆలయం క్రీ.శ. 8 వ శతాబ్దంలో సురాత అనే రాజు నిర్మించాడు. 8 వ శతాబ్దానికి ముందు ఈ చిన్న పుణ్యస్థలంలో దేవత యొక్క చిత్రాన్ని పూజించేవారు. ఇది ఆలయంలో కూడా అశోకుని యొక్క శాసనాలు చెక్కబడినవనిపేర్కొన్నారు.

మంగళప్రద క్షేత్రం పొలాలిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం

ఆలయ పండుగ సమయంలో

PC: Surajt88

పొలాలి రాజరాజేశ్వరి ఆలయ ప్రదేశం

శ్రీ రాజరాజేశ్వరి ఆలయం భంత్వల్ తాలూకాలోని పొలాలి అనే గ్రామంలో వున్నది. పొలాలి కర్నాటకలో మంగుళూరు నగరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ఫల్గుని నది ఒడ్డున ఉంది.

పొలాలి రాజరాజేశ్వరి ఆలయ విశేషము

సాధారణంగా దేవాలయాలలో దేవతల రాతి విగ్రహాలు లేదా గ్రానైట్ విగ్రహాలను చూస్తుంటాం. కానీ పొలాలి దేవాలయంలో మట్టి విగ్రహం చూడవచ్చును. ప్రత్యేకంగా మట్టితో చేయబడిన రాజరాజేశ్వరి దేవి విగ్రహం అనేక సంవత్సరాల క్రితం నాటిది.

రాజరాజేశ్వరి ఆలయ కాంప్లెక్స్

ప్రధాన మందిరంలో దేవతగా రాజరాజేశ్వరి విగ్రహం ఉంది.

దీనితో పాటు, మహాగణపతి, సుబ్రహ్మణ్య, బాధ్రకాకాళి మరియు సరస్వతి విగ్రహాలు గల ఇతర ఆలయాలు ఉన్నాయి.

మంగళప్రద క్షేత్రం పొలాలిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం

సాంప్రదాయ ఫుట్బాల్ గేమ్

PC: Surajt88

పొలాలి చెండు ఫెస్టివల్

'చెండు' అంటే కన్నడలో బంతి అని అర్థం. పొలాలి చెండు ఫెస్టివల్ అంటే ఒక ఫుట్ బాల్ ఆట. ఈ వార్షిక ఈవెంట్ కోసం ఆసక్తికరంగా తోలు వస్తువులు తయారుచేసేవాడి కుటుంబం ఆట కోసం బంతిని ఒక ప్రత్యేకంగా తయారు చేస్తారు.

సాంవత్సరిక దేవాలయ ఉత్సవం అయిన పొలాలి చెండు ఫెస్టివల్ మార్చి - ఏప్రిల్ నెలలలో చేస్తారు. ఫుట్బాల్ టోర్నమెంట్ వార్షిక పండుగ నెలలో ఐదు రోజుల పాటు చేస్తారు. సాంప్రదాయకంగా ఈ ఫుట్ బాల్ ఆట 'మంచి పైన చెడు' గెలిచే విధాన్ని సూచిస్తుంది.

ఈ వార్షిక పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. దేవతను రధంపై గ్రామం చుట్టూ ఊరేగింపు చేస్తారు. ఇది ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది.

శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ఉత్తర కర్నాటకలోని ప్రసిద్ధ దేవీ దేవాలయాలలో ఒకటి. కాబట్టి దక్షిణ కన్నడ జిల్లాలో ఈ పురాతన ఆలయంను సందర్శించండి.