Search
  • Follow NativePlanet
Share
» » సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాడ మాసం బోనాలు..జాతర..ఆలయ విశేషాలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాడ మాసం బోనాలు..జాతర..ఆలయ విశేషాలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాడ మాసం బోనాలు..జాతర..ఆలయ విశేషాలు

బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. హైదరాబాద్ లో లో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం లో ఈ శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ళ పుర్వానికి చెందినదని నమ్మకం. ప్రతి రోజు వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తారు. ఈ గుడిలో శక్తి కి మరియు అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ. జంట నగరాల్లో జరిగే అతి పెద్ద జాతర లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి, బోనాలు సమర్పిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి సికింద్రాబాద్ బోనాలను తిలకించేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలమంది భక్తులు వస్తుంటారు.

సికిందరాబాద్‌ నగరాలలో జాతర అంటేనే లష్కర్‌ బోనాలు

సికిందరాబాద్‌ నగరాలలో జాతర అంటేనే లష్కర్‌ బోనాలు

సికిందరాబాద్‌ నగరాలలో జాతర అంటేనే లష్కర్‌ బోనాలుగా పరిగణిస్తారు. లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. గ్రామదేవతలైన అమ్మవారికి ఆషాడ మాసంలో జాతరలు చేసి, బోనాలు సమర్పించుకుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, రాజ్యం సుభిక్షంగా ఉంటుదని నమ్మకం. తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి, బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆషాడంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ బోనాలతో ఈ బోనాల జాతరలు ప్రారంభమవుతాయి.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు.

 అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే

అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే

అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, రాజ్యం సుభిక్షంగా ఉంటుదని నమ్మకం. తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి, బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆషాడంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ బోనాలతో ఈ బోనాల జాతరలు ప్రారంభమవుతాయి.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు.

మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ

మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ

మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌ బోనాలను ఉజ్జయని మహాంకాళి బోనాలు అని ఎందుకు అంటారు.. ఆ పేరు ఎలా వచ్చింది.. తెలియాలంటే ఉజ్జయని మహాంకాళి దేవాలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే..

దేవాలయ విశేషాలు

దేవాలయ విశేషాలు

ఉజ్జయని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మితమైనది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను 1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు.

 ఉజ్జయిని అమ్మవారికి గుడి

ఉజ్జయిని అమ్మవారికి గుడి

అదే సమయంలో మిలటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడలని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ (లష్కర్)లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ వేడుకున్నారు.

 అమ్మవారు కరుణించడం వల్లనే

అమ్మవారు కరుణించడం వల్లనే

ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అమ్మవారు కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సురటి అప్పయ్య, ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్‌కు వచ్చారు. 1864వ సంవత్సరంలో కట్టె విగ్రహం తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి, మాణిక్యాలదేవీ విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేపట్టారు.

కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి

కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి

ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబసభ్యులకు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో (ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో) కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణ చేసి పూజలు ప్రారంభించారు.

మరో కథనం ప్రకారం

మరో కథనం ప్రకారం

ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావటంతో సికింద్రాబాద్‌లోనూ ఆషాఢంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు. అయితే మరో కథనం ప్రకారం ..
ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

 అమ్మవారి విగ్రహం పక్కనే

అమ్మవారి విగ్రహం పక్కనే

జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డబావిని పురుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు.

 ప్రతి ఆషాఢంలో

ప్రతి ఆషాఢంలో

1815 నుండి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి, వ్యాధుల బాధల నుండి ప్రజలను రక్షించాలని ఆయన నిర్ణయించారు. అప్పటి నుండి గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X