Search
  • Follow NativePlanet
Share
» »పెళ్లికాని వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీవేంకటేశ్వరున్ని దర్శిస్తే వెంటనే పెళ్లి జరగుతుంది

పెళ్లికాని వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీవేంకటేశ్వరున్ని దర్శిస్తే వెంటనే పెళ్లి జరగుతుంది

తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపుర ఆలయం ఒకటి. ఆధ్యాత్మిక పరంగా భక్తులు తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రాల్లో శ్రీనివాస మంగాపురం ఒకటి. ఈ శ్రీనివాస మంగాపురలో స్వామి వారి శ్రీ కళ్యాణ వెంటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ, భక్తుల కోరికలను తీర్చుతి విరాజిల్లుతున్నాడు.

శ్రీ వేంకటేశ్వరుడు వివాహనంతరం అమ్మవారితో కలిసి తిరుగాడిన నేల కావడంతో ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 16వ శతాబద్దకాలంలో తాళ్లపాక అన్నమాచుర్యుల వారి మనువడు తాళ్లపాక చినతిరుమలయ్య పునరుద్దరించారిని స్థల ప్రసస్థి.

ఈ ఆలయానికి ఎక్కువగా అవివాహితులు

ఈ ఆలయానికి ఎక్కువగా అవివాహితులు

ఈ ఆలయానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో వచ్చి, కల్యాణోత్సవాలు జరపించడం విశేషం. చివరలో అర్చకులే ఇచ్చే ‘కళ్యాణకకంణం' ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ప్రతి రోజూ తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల అర్జితసేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు.

తిరుమల శ్రీవెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు

తిరుమల శ్రీవెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు

శ్రీనివాస మంగాపురంకు దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళిన మెట్లు ఉన్నాయి. యోగం, భోగం, వీరం, అభిచారిక అనే నాలుగు రకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని వైష్ణవాలయాలలో ప్రతిష్టిస్తారు. కాని తిరుమల శ్రీవెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు ఈ రూపాలకు అందని వాడు, అన్నింటికీ అతీతుడు కావున ఈయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని అర్ఛావతారం. శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడు కూడా అర్ఛావతరా స్వరూపుడే.

స్థలపురాణం ప్రకారం

స్థలపురాణం ప్రకారం

స్థలపురాణం ప్రకారం నారాయణవనంలో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీవేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై తిరుమలకు బయలుదేరుతాడు. శ్రాస్త్ర ప్రకారం పెళ్లైన దంపతులు ఆరు నెలలపాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం చేయకూడదని అగస్త్యమహర్షి చెప్పడంతో అగస్త్యాశ్రమంలో ఆరునెలలపాటు విడిది చేస్తారు. ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గర్లోనే తిరుమల కొండకింద కళ్యాణి నదీతీరాన ఉన్న శ్రీనివాసమంగాపురంలో ఎక్కువగా గడిపేవారు.

తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు

తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు

తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండు వరాలు ప్రసాధించినాడని పురాణాలు తెలుపుతున్నాయి. తన దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాసమంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శనభాగ్యం కల్పిస్తాననీ, పద్మావతీదేవని పరిణమయాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లికాని వారికి కళ్యాణ సౌభాగాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు.

స్వామి వారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి

స్వామి వారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి

ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి వచ్చీ, స్వామి వారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి ఆలయం జోలికి వెళ్లకుండా వెనుతిరిగారు. ఈ సమయంలో కొంత కాలం ఆలయం మూసివేయబడింది. అప్పుడు కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకునికి స్వామి కలలో కనబడి తాను శ్రీనివాసమంగాపురంలో కొలువై ఉన్నానని , తనకు పూజాదికాలు నిర్వమించమని చెబుతారు. అప్పటి నుండి మళ్లీ ఆలయం కళకళలాడుతుంది.

బ్రహ్మోత్సవాలు:

బ్రహ్మోత్సవాలు:

తిరుమలలో లాగే ఇక్కడ కూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ధ్వజారోహణంతో మొదలై తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గరలోని సువర్ణముఖీ నదిలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణుపాదంగా కొలుస్తుంటారు .

శ్రీ వారి మెట్టు

శ్రీ వారి మెట్టు

శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు.

చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి

చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి

చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు. కాని అలిపిరి వద్ద నున్న మెట్లదారి గుండా పైకి ఎక్కి నూరు మెట్ల దారి గుండా దిగే వారు ఎవరు ఉండరు

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

తిరుమతికి కేవలం 12కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సులో లేక ఆటోలో వెళ్ళవచ్చు.

విమాన మార్గం: తిరుపతి విమానశ్రయం నుండి లోకల్ ట్యాక్సీలను బుక్ చేసుకుని, శ్రీనివాసమంగాపురం చేరుకోవచ్చు. తిరుపతి విమానశ్రయం నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని శ్రీనివాసమంగాపురంకు 12కి.మీ దూరంలో ఉంది .

రైలు మార్గం: శ్రీనివాసమంగాపురానికి అతి దగ్గరలో 15కి.మీ దూరంలో రైల్వేస్టేషన్ ఉంది. రైల్వేష్టేషన్ చేరగానే అక్కడ నుండి కళ్యాణ వేంటశ్వరుని ఆలయనికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లవచ్చు. లేదా లోకల్ ఆటోలు అందుబాటులో ఉన్నాయి.

రోడ్డు మార్గం: తిరుపతి బస్ స్టేషన్ నుండి శ్రీనివాసమంగాపురంకు చాలా బస్సులు ఉన్నాయి. లోకల్ ఆటోల్లో కూడా చేరుకోవచ్చు. అలాగే టిటిడి వారి ఉచిత బస్సు సర్వీస్ లు కూడా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X