• Follow NativePlanet
Share
» »ఇక్కడ క్రూర మృగాలకూ ప్రాణ భయం లేదు...మన మనస్సుకు ఆహ్లాదం తప్ప

ఇక్కడ క్రూర మృగాలకూ ప్రాణ భయం లేదు...మన మనస్సుకు ఆహ్లాదం తప్ప

Written By: Beldaru Sajjendrakishore

పర్యాటకం అంటే గుళ్లూ గోపురాలే కాదు. మరెన్నో రకాల ప్రాంతాలు కూడా మనలను రారమ్మని పిలుస్తున్నాయి. అందులో అభయారణ్యాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క అభయారణ్యంలో ఒక్కొక్క జంతువును లేదా పక్షులను ప్రధానంగా సంరక్షిస్తుంటారు. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయడమే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని కూడా వినియోగిస్తున్నారు. అయితే వాటి ఇలాంటి అభయారణ్యాల్లో సింహాలు, పులులు వంటి క్రూర మృగాలతో పాటు విదేశీ పక్షులు కూడా ఉన్నాయి.

వారికి ఈ పర్యటక ప్రాంతాలు అంటేనే ఎక్కువ ఇష్టం

పర్వత అందాలను సైకిల్ తో పలకరిద్దాం....

సృష్టి నాశనాన్ని ముందుగా తెలుసుకోవడానికి వెలుదామా

ఆంధ్రప్రదేశ్ లో కూడా అటు వంటి అభయారణ్యాలు, పక్షి సంరక్షణా కేంద్రాలకు కొదువు లేదు. అందులో కొన్ని ముఖ్యమైన ఈ వేసవి కాలంలో సందర్శించదగిన కొన్ని అభయారణ్యాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. రాష్ట్ర పర్యాటక శాఖ అక్కడ జంగిల్ సఫారీలను కూడా ఏర్పాటు చేసింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని సఫారీలను ఎంజాయ్ చేయండి. క్రూర మృగాలను, పక్షలను వాటి సహజ ప్రదేశాల్లో చూడటం మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

1. అతి పెద్ద మడ అడవులు

1. అతి పెద్ద మడ అడవులు

Image Source:

కోరింగ అభయారణ్యం లేదా కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవులు అభయారణ్యం. ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. ఇవి కాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి. అటవీశాఖ వారి లెక్కప్రకారం 235 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవులు దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి.

2. సుందర వనాల తర్వాత ఇదే

2. సుందర వనాల తర్వాత ఇదే

Image Source:

చిత్తడినేలలో పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ 'చిత్తడి అడవులు ' కేవలం నదీ సాగర సంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరరుగుతాయి. గంగాతీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని "సుందర వనాలు " మడ అడవుల తరువాతి స్థానం కోరంగి అభయారణ్యానిదే. అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతనుంచి భూమిని రక్షింస్తుంటాయి.

https://commons.wikimedia.org/wiki/File:Coringa_reserve_forest_park_mangrove_forest_04.jpg

https://commons.wikimedia.org/wiki/File:Coringa_reserve_forest_park_mangrove_forest_04.jpg

3. 199 రకాల జీవులు

Image Source:

మడ అడవులు వివిధ రకాల పక్షి జాతులతో పాటు ఉభయచరాలు, క్షీరదాలతో కలిపి మొత్తం 199 రకాల జీవులు ఇక్కడ నివసిస్తున్నాయని అటవీశాఖ నిర్థారణ చేసింది. ఇక్కడ చేపలు పట్టు పిల్లి, నీటికుక్క, నక్క వంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసలిని చూడవచ్చు. పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు.

4. వర్షాకాలం వెళ్లిన తర్వాత మాత్రమే

4. వర్షాకాలం వెళ్లిన తర్వాత మాత్రమే

Image Source:

వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబరు నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు. జనవరి నుంచి మార్చి నెలల వరకు సముద్రపు తాబేళ్ళు, సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికై వస్తాయి. సంవత్సరంలో 12 నెలలూ ఈ అభయారణ్యాన్ని దర్శించవచ్చు ఐతే దర్శించటానికి నవంబరు, డిసంబరు నెలలు అత్యుత్తమమైనవి.

5. సముద్రం వరకూ ప్రయాణం

5. సముద్రం వరకూ ప్రయాణం

Image Source:

గౌతమి నది ఉప్పుకయ్య లోని ఈ సుందరమైన మడ అడవులులో పడవల మీద సముద్రం వరకూ సుమారు 30 నిమిషాల సేపు ప్రయాణించగలిగే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. అభయారణ్య పడవ రేవు నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పడవ సౌకర్యం ఉంది. మనిషికి 50 రూ. లు ప్రవేశ ధరపై, రేవు నుంచి, సముద్ర ముఖద్వారం దాకా, పడవ లో, మడ అడవుల గుండా తీసుకు వెళ్తారు. కనీసం 10 మంది ప్రయాణీకులు ఉంటే పడవ నడుపుతారు. లేదా తక్కువైన ప్రయాణీకుల రుసుము కూడా చెల్లించి, సముద్రముఖము వరకు పయనించవచ్చును.

6. ఇలా చేరుకోవాలి

6. ఇలా చేరుకోవాలి

Image Source:

కాకినాడ రైల్వేస్టేషను నుండి 10 కి.మీ., రాజమండ్రి రైల్వే స్టేషను నుండి 70 కి.మీ. సమీప విమానాశ్రయం రాజమండ్రి. కాకినాడ నుంచి ఆటో లేక టాక్సీలో ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చును. ఇక్కడ తిరుగు ప్రయాణానికి వాహనాల లభ్యత తక్కువ కావున, అందుకు ముందుగానే వాహన ఏర్పాటు చేసుకోవాలి. లేనిచో కోరంగి బస్‌స్టాండ్ కు నడవాలి. వసతి సౌకర్యం: కోరింగ వద్ద అటవీ శాఖ వారి విశ్రాంతి గృహం. ముందస్తు అభ్యర్ధనపై భోజన సౌకర్యం ఉందిక్కడ.

7. చిరుతలు ఎక్కువగా కనిపిస్తాయి.

7. చిరుతలు ఎక్కువగా కనిపిస్తాయి.

Image Source:

కంబాలకొండ విశాఖపట్నం సమీపంలో ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది 1970 నుండి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది. అంతకు మునుపు ఇది విజయనగరం రాజుల ఆధీనంలో ఉండేది. ఇక్కడ చిరుత పులులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ సఫారీ సదుపాయం లేకపోయినా గైడ్ ల సహకారంతో మనం కొంత దూరం అడవులో వెళ్లి అటవీ అందాలను చూసి మురిసి పోవచ్చు. ఏడాది మొత్తం ఎప్పుడైనా వెళ్లవచ్చు.

8. ఏనుగుల సంరక్షణ కేంద్రం ఇదొక్కటే

8. ఏనుగుల సంరక్షణ కేంద్రం ఇదొక్కటే

Image Source:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒకే ఒక ఏనుగుల సంరక్షణ కేంద్రం కౌండిన్య అభయారణ్యం. ఇది చిత్తూరు జిల్లా, పలమనేరుకు సమీపంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ వేసవి విడిదిగా చెప్పుకునే హార్సీలీ హిల్స్ నుంచి ఇక్కడకు 106 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక నుంచి ఇక్కడకు ఏనుగులు వలస వస్తుంటాయి. కౌండిన్య అభయారణ్యం లోతైన కొండకోనలతో, ఎత్తైన శిఖరాలతో దట్టమైన అరణ్యముతో అలరారుతున్నది.

9. రెండు నదులు

9. రెండు నదులు

Image Source:

ఇక్కడ కైగల్ మరియు కౌండిన్య అనే చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. ఈ అభయారణ్యం సుమారు 358 చదరపు. కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించివున్నది. ఇది గ్రే గూడబాతులు, రోజీ గూడబాతులు, పెయింటెడ్ గూడుకొంగలు, తదితర పక్షులకు ఆవాసముగా ఉంది. కౌండిన్య వన్య ప్రాణి రక్షిత కేంద్రం సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ మరియు ఏప్రిల్ మధ్య అనుకూలంగా ఉంటుంది. శీతాకాల నెలల్లో ఇక్కడికి వలస వచ్చే అనేక పక్షుల సందడితో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.

10. ఇండియాలో అతి పెద్ద పులుల అభయారణ్యం

10. ఇండియాలో అతి పెద్ద పులుల అభయారణ్యం

Image Source:

నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇండియాలో అతిపెద్ద పులుల అభయారణ్యం. ఈ రిజర్వ్ 5 జిల్లాలలో (నల్గొండ జిల్లా,మహబూబ్ నగర్ జిల్లా,కర్నూలు జిల్లా,ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లా) విస్తరించి ఉంది. అభయారణ్యం వైశాల్యం 3,568 చ.కి.మీ. అభయారణ్యం ప్రధానకేంద్రం వైశాల్యం 1200 చ.కి.మీ. ఇక్కడ అభయారణ్యంలో బెంగాల్ పులి, ఇండియన్ చిరుత, స్లోత్ ఎలుగుబంటు, ఉస్సూరి ధోలే, చిటా, సాంబార్ డీర్, చెవ్రోటైన్, బ్లాక్ బక్, చింకారా మరియు చౌసింఘా మొదలైన జంతువులు ఎక్కువగా కనబడుతాయి.

11. ఏడాది మొత్తం

11. ఏడాది మొత్తం

Image Source:

ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతాన్ని ఏడాది మొత్తం ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఇక ఇక్కడకు దగ్గర్లో ఉన్న శ్రీ శైలం మల్లికార్జున స్వామి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ర్ట నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రత్యేకత కలిగిఉంది. ఈ ప్రాంతంలో పురాతన నాగార్జున కొండ మరియు నాగార్జున విశ్వవిద్యాలయ అవశేషాలు ఉన్నాయి.

12. మంచి నీటి సరస్సు

12. మంచి నీటి సరస్సు

Image Source:

రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి - పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. ఏడాది మొత్తం ఎప్పుడైనా సందర్శించడానికి అనువుగా ఉంటుంది.

13. కొండకర్ల

13. కొండకర్ల

Image Source:

ఇది రాష్ట్రంలో కొల్లేరు సరస్సు తర్వాత రెండవ పెద్ద మంచినీటి సరస్సు. ఒక వైపు కొండలు, వేరొక వైపు కొబ్బరిచెట్లు ఆవకు ప్రత్యేక అందాన్ని చేకూర్చుతున్నాయి. సరస్సు లోని వివిధ రకాల నీటి మొక్కలు, రకరకాల పక్షులు, ప్రకృతివీక్షకులకు కనువిందు కలగజేస్తాయి. నవంబరు, డిసెంబరు నెలలలో సైబీరియా మొదలగు అనేక దేశాల నుండి పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. అందమైన విదేశీ పక్షులు సందర్శకులను ఆకట్టుకొంటాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి