• Follow NativePlanet
Share
» »మీ చర్మం చూసి ఎవరైనా ‘ఛీ’అంటుంటే ఇక్కడికి వెళ్లి వస్తే వారికి ‘గుణపాఠం’చెప్పొచ్చు

మీ చర్మం చూసి ఎవరైనా ‘ఛీ’అంటుంటే ఇక్కడికి వెళ్లి వస్తే వారికి ‘గుణపాఠం’చెప్పొచ్చు

Written By: Kishore

ఈ దేవాలయకు వెళితే ప్రసాదంతో పాటు ఆ 'యాంగిల్స్'పై నాలెడ్జ్ కూడా ఫ్రీ

భారత దేశంలో అనేక తీర్థాలు ఉన్నాయి. ఇక సరళమైన భాషలో చెప్పాలంటే జలపాతాలు, నీటి కుంటలు తదితరాలు. వీటిలో కొన్ని వివిధ కొండలు, కోనలను దాటుకుంటూ వస్తున్నాయి. ఆ సమయంలో అక్కడి అనేక ఔషద గుణాలు కలిగిన మొక్కలు, తీగలు, లతలు, కాయలు, చెట్టు వేరు, కాండం వంటి పై నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కారణం వల్ల సదరు నీటికి కూడా ఔషద లక్షణాలు ఉంటాయి. దీంతో ఈ నీటిని తాకడం, లేదా అందులో స్నానం చేయడం వల్ల మనకు ఉన్న కొన్ని జబ్బులు నయమవుతాయి. ఈ విషయాన్ని ఆయుర్వేద శాస్త్ర పండితులు కూడా చెప్పారు. అటువంటి తీర్థాలన్నీ ఏదో ఒక దేవాలయం వద్దనే ఉంటాయి. మరో రకంగా చెప్పాలంటే ఇటువంటి తీర్థాల ఒడ్డునే దేవాలయాలను నిర్మించి ఉంటారు. అయితే ప్రజలు ఆ నీటికి ఔషద గుణం దేవుడి వల్ల వచ్చిందని నమ్ముతారు. అటువంటి తీర్థం గురించి ఈ కథనంలో తెలుసుకొందాం. ఈ తీర్థాన్ని చేరడం చాలా సాహసంతో కూడుకున్నది. అంతే కాదు ఏడాదికి నాలుగు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా కొన్ని విషయాలు మాత్రం సైన్సుకు అందని కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత మాట్లాడుకొందాం.

1. ఎక్కడ ఉంది.

1. ఎక్కడ ఉంది.

Image Source:

దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల తాలూకాలోని అనంతాడియ అనే గ్రామం సమీపంలో సుల్లమలె...బల్లమలే అనే అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో కొంత దూరం వెళితే సుల్లమలే తీర్థ అనే పవిత్ర ప్రాంతం దొరుకుతుంది.

2. చిన్న గుహలో

2. చిన్న గుహలో

Image Source:

ఇక్కడ నీరు ఎల్లప్పుడూ పారుతూ ఉంటుంది. ఈ ధారిలో ప్రయాణించడమే కాదు ఈ తీర్థంలో స్నానం చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఈ తీర్థం ఒక చిన్న గుహ లోపల ఉంటుంది. అందువల్ల గుహ లోపలికి పాకుకుంటూ వెళ్లాలి.

3. చిమ్మ చీకటిలో

3. చిమ్మ చీకటిలో

Image Source:

దాదాపు 10 అడుగుల లోపలికి చిమ్మచీకటిలో ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు మూడు అడుగుల వెడల్పు మాత్రమే ఉండే ఈ గుహలోకి దిగితే ఆక్కడ మొనదేలి ఉండే రాళ్లు శరీరాన్ని అక్కడక్కడ తాకుతాయి.

4. భయపెడుతుంది

4. భయపెడుతుంది

Image Source:

ఒక్కొక్కసారి గాయాలు కూడా కావచ్చు. ఆ మొనదేలిన బండరాళ్ల మధ్య వెలుతుంటే ఆ రాళ్ల పై పడే నీరు చేసే శబ్ధం ఒక్కొక్కసారి భయపెడుతుంది. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఆ నీటితో స్నానం చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతారు.

5. చర్మరోగాలు

5. చర్మరోగాలు

Image Source:

ముఖ్యంగా ఎటువంటి చర్మ రోగాలు ఉన్నవారైనా సరే ఒక్కసారి ఈ తీర్థంలో ముగితే వారికి వ్యాధి నయమవుతుందని తర తరాలుగా నమ్ముతున్నారు. అయితే ఏడాది మొత్తం ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదని భక్తుల నమ్మకం. నాలుగు రోజుల మాత్రమే ఈ తీర్థంలో మునగాల్సి ఉంటుంది.

6. ఆ నాలుగు రోజులు మాత్రమే

6. ఆ నాలుగు రోజులు మాత్రమే

Image Source:

ఎందుకంటే ప్రతి ఏడాది శ్రావణ అమావాస్య నుంచి బాధపద చవితి వరకూ అంటే నాలుగు రోజులు మాత్రమే ఈ నీటికి వ్యాధిని నయం చేసే శక్తి వస్తుందని స్థానికులు చెబుతుంటారు. అందువల్లే ఈ నాలుగు రోజులు ఈ తీర్థంలో స్నానం చేయడానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వీరిలో అధిక శాతం యువకులే ఉండటం ఇక్కడ గమనార్హం.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి