Search
  • Follow NativePlanet
Share
» »సౌత్ ఇండియాలో దాగున్న సమ్మర్ ప్రదేశాలు !

సౌత్ ఇండియాలో దాగున్న సమ్మర్ ప్రదేశాలు !

By Mohammad

మండిపోతున్న ఎండల నుండి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారా ? అయితే ఈ వేసవి నుండి ఉపశమనం కలిగించే విధంగా చల్లని ప్రదేశాలను ఎంపిక చేసుకోండి ..! ఏంటి ..? చల్లని ప్రదేశాలు ఎక్కడని వెతకాలా ? రొటీన్ గా ఊటీ, కొడైకెనాల్ వెళ్ళి బోర్ కొడుతుందా ? సరే, ఈ కొత్త ప్రదేశాలను ఒకసారి చూసిరండి.

భారతదేశం మొత్తం మీద ఉన్న చల్లని ప్రదేశాలను పర్యటించాలంటే మీతరం కాదులెండి ..! ప్రస్తుతానికైతే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో రొటీన్ కు భిన్నంగా ఊటీ, కొడైకెనాల్ తప్ప మిగితా ప్రదేశాలను చూసొద్దాం ..! ఈ ప్రదేశాలు చాలా భాగం కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు కూడా ఉందనుకోండి(తక్కువ). మనకెల్లి లేవా ? అనే సందేశం మీ మదిలో ఉన్నదని నాకు తెలుసు. ఎంత వెతికినా ఆంధ్ర ప్రదేశ్ లో అరకు, అనంతగిరి, హార్స్లీ హిల్స్ మరియు తెలంగాణ లో హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ వద్ద ఉన్న అనంతగిరి తప్ప మిగితావి అంత కనిపించవు.

నాగరహోళే జాతీయ పార్క్

నాగరహోళే జాతీయ పార్క్

నాగరహోళే జాతీయ పార్క్ కు గల మరొక పేరు రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. 258 చ. కి. మీ. స్థలాన్ని ఆక్రమించిన ఈ పార్క్ కొడుగు మరియు మైసూరు జిల్లాలలో విస్తరించింది. జలపాతాలు, లోయలు, వాగులు, వంకలు, అందమైన జంతు సంపద, దట్టమైన అడవి ఇక్కడి ఆకర్షణలు. ఇక్కడికి వచ్చే వారు దగ్గరిలోని బ్రహ్మగిరి కొండలను చూడవచ్చు.

మరింత చదవండి : నాగరహోళే - పాముల నది ఒడ్డున విశ్రాంతి !

చిత్ర కృప : Yathin S Krishnappa

నాగరహోళే ఎలా చేరుకోవాలి ?

నాగరహోళే ఎలా చేరుకోవాలి ?

నాగరహోళే చేరుకోవటానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

నాగరహోళే కు సమీపాన 90 కిలోమీటర్ల దూరంలో మైసూర్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

నాగరహోళే కు సమీపాన 90 కి. మీ. దూరంలో మైసూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కలదు. ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రవేట్ బస్సుల్లో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం నుండి వచ్చే వారు మైసూరు, మంగళూరు, బెంగళూరు నుండి సొంత వాహనాల్లో కానీ లేకుంటే ప్రభుత్వ బస్సుల్లో కానీ ప్రయాణించి చేరుకోవచ్చు. మంగళూరు నుండి 225 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 220 కిలోమీటర్ల దూరంలో కలదు.

చిత్ర కృప : Ashwin Kumar

గోకర్ణం లేదా గోకర్ణ

గోకర్ణం లేదా గోకర్ణ

గోకర్ణ ఉత్తర కన్నడ జిల్లా లో ఉన్న హిందువుల ప్రముఖ పుణ్య క్షేత్రం. అలా అని కేవలం ఆలయాలు మాత్రమే ఉన్నాయానుకుంటే పొరబడినట్లే ..! బీచ్ లు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. గోకర్న బీచ్, హాఫ్ మూన్ బీచ్, కుడ్లే బీచ్, ఓం బీచ్ మరియు ప్యారాడైజ్ బీచ్ లు చూడదగ్గవి.

మరింత చదవండి : దక్షిణ భారతదేశంలో బీచ్ ఒడ్డున ఉన్న ప్రముఖ శివాలయాలు !

చిత్ర కృప : Jacob.abraham

గోకర్ణ ఎలా చేరుకోవాలి ?

గోకర్ణ ఎలా చేరుకోవాలి ?

గోకర్ణ చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.


వాయు మార్గం

గోవా లోని డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం 140 కి. మీ. దూరంలో ఉండి, గోకర్ణ పట్టణానికి సమీపంలో ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ ల మీదుగా గోకర్ణ చేరుకోవచ్చు.

రైలు మార్గం

గోకర్ణం పట్టణానికి 20 కి. మీ. దూరంలో ఉన్న అంకోలా రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుండి స్థానిక బస్సులో లేదా ట్యాక్సీ లో ప్రయాణించి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

గోకర్ణం పట్టణానికి మార్గోవా, బెంగళూరు, మంగళూరు పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. పర్యాటకులు ప్రతి రోజు నడిపే టూరిస్ట్ బస్ ల ద్వారా కూడా గోకర్ణం చేరుకోవచ్చు.

చిత్ర కృప : Xavier Favro

చిక్కమగళూరు

చిక్కమగళూరు

చిక్కమగళూరు కర్నాటక రాష్ట్రంలోని జిల్లా మరియు పట్టణం. ఇక్కడ చూడటానికి ప్రత్యేకించి ఏమీ లేవు. ఆగండి .. ఆగండి ఏమీ లేవంటే ఏది లేదని కాదు .. చక్కని వ్యూ పాయంట్ లకి, ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశం అని. కెమ్మన గుండి, శృంగేరి, కుద్రేముఖ్ చిక్కమగళూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు. కెమ్మన గుండి హిల్ స్టేషన్ పూర్వం వోడెయార్స్ రాజులు వేసవి విడిదిగా ఉండేది. దీని చుట్టూ చక్కని వ్యూ పాంట్లు, తోటలు మరియు అందమైన జలపాతాలు చూడవచ్చు.

మరింత చదవండి : చిక్కమగళూరు - పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Manjunatha Narasimhaiah

చిక్కమగళూరు ఎలా చేరుకోవాలి ?

చిక్కమగళూరు ఎలా చేరుకోవాలి ?

చిక్కమగళూరు చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

చిక్కమగళూరు లో ఎటువంటి విమానాశ్రయం లేదు దీనికి సమీపంలో ఉన్న విమానాశ్రయం - మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది చిక్కమగళూరుకు 149 కి.మీ. దూరంలో ఉంటుంది. విమానాశ్రయం చేరిన తర్వాత ప్రయాణీకులు చిక్కమగళూరుకు టాక్సీలలో ప్రయాణం చేయవచ్చు.

రైలు మార్గం

చిక్కమగళూరుకు రైలు స్టేషన్ లేదు. దీనికి 40 కి. మీ. దూరంలో కడూరు మరియు 60 కి. మీ. దూరంలో హసన్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. హుబ్లీ ప్రధాన రైల్వే కూడలిగా ఉన్నది. ఇది 306 కి.మీ. దూరం ఉంది. కడూరు మరియు హసన్ రైల్వే స్టేషన్లనుండి చిక్కమగళూరుకు టాక్సీలు లభ్యమవుతాయి.

బస్సు లేదా రోడ్డు మార్గం

చిక్కమగళూరు కు బెంగుళూరు (240 కి.మీ.), మంగుళూరు (150 కి.మీ.), హుబ్లీ (306 కి.మీ.) మరియు తిరుపతి పట్టణాలనుండి బస్సు సౌకర్యం ఉంది. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ లగ్జరీ బస్సులను నడుపుతోంది.

చిత్ర కృప : prashantby

భిమేశ్వరి

భిమేశ్వరి

ప్రకృతి అందాలను భిన్నంగా ఆలోచిచేవారికి భీమేశ్వరి ఒక చక్కటి ప్రదేశం. బెంగళూరు నుండి 100 కి. మీ. దూరంలో ఉంటుంది. కావేరి నదిలో చేపలు పట్టడం ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం. ప్రత్యేకించి భీమేశ్వరిలో ఆటలాడే మహసీర్ చేపలు ఎంతో వినోదాన్ని కలిగిస్తాయి. ఇక్కడ బస చేయటానికి కాటేజీలు, గుడిసెలు, గుడారాలు ఉన్నాయి. నాన్ వెజ్ ప్రియులు రుచికరమైన చేపలు తినవచ్చు.

మరింత చదవండి : బెంగళూరు : ఫిషింగ్ నేచర్ క్యాంప్ లు !

చిత్ర కృప : Trodly

భీమేశ్వరి ఎలా చేరుకోవాలి ?

భీమేశ్వరి ఎలా చేరుకోవాలి ?

భీమేశ్వరి వెళ్ళాలంటే మొదట సమీపాన ఉన్న బెంగళూరు నగరానికి వెళ్ళాలి. క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి భీమేశ్వరి కి సులభంగా చేరుకోవచ్చు.

వాయు మార్గం

భీమేశ్వరి కి సమీపాన ఉన్న విమానాశ్రయం 100 కి. మీ . దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

రైలు మార్గం

భీమేశ్వరి కి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ లేదా యశ్వంతపుర రైల్వే స్టేషన్.

రోడ్డు మార్గం

బీమేశ్వరి కి బెంగళూరు నుండి బస్సులు, క్యాబ్ లు, ట్యాక్సీ లలో ప్రయాణించి గంటన్నర లో చేరుకోవచ్చు.

చిత్ర కృప : Rishabh Mathur

కూర్గ్

కూర్గ్

కూర్గ్ లేదా కొడుగు కర్నాటక రాష్ట్రంలోని వేసవి విడిది ప్రదేశం. ఈ ప్రదేశాన్ని 'కర్నాటక కాశ్మీర్' అని, 'ఇండియా స్కాట్లాండ్' అని పిలుస్తుంటారు. కొత్త దంపతులకు ఇదొక స్వర్గం. కాఫీ, టీ తోటల సువాసనలు కొడుగు అంతటా వ్యాపించి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది 'కర్నాటక అరకు' అని చెప్పాలి.

చిత్ర కృప : Kalidas Pavithran

కూర్గ్

కూర్గ్

కూర్గ్ లో తాగే కాఫీ మజా మరెక్కడా రాదు. అమృతం వలె ఉంటుంది. పిల్లలు, పెద్దలు ... ఏ వయస్సు వారైనా సరే కూర్గ్ అందాలకు దాసోహం అవ్వక తప్పదు. ఉండటానికి రిశార్ట్‌లు, హోటళ్ళ తో పాటు వివిధ బస కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

మరింత చదవండి : కొత్త జంటల విహార కేంద్రం : కూర్గ్ !

చిత్ర కృప : Sudarshana

కొడుగు ఎలా వెళ్ళాలి?

కొడుగు ఎలా వెళ్ళాలి?

కొడుగు వెళ్ళటానికి రైలు, రోడ్డు ఆమరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన సౌకర్యం

కూర్గ్ లో ఎటువంటి విమానాశ్రయం లేదు కానీ దీనికి చేరువలో మూడు ఏర్ పోర్ట్ లు ఉన్నాయి. అవి వరుసగా మైసూర్(120 కి.మీ) , మంగళూరు(135 కి.మీ), బెంగళూరు(260 కి.మీ). మీ సౌకర్యాన్ని బట్టి క్యాబ్ లేదా బస్సుల్లో ప్రయాణించవచ్చు.

రైలు సౌకర్యం

కూర్గ్‌ కు సమీప రైల్వేస్టేషన్ మైసూర్. ఇక్కడ్నుంచి కూర్గ్ 114 కి.మీ. దూరంలో ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి మైసూరుకు రైళ్ల సౌకర్యాలు ఉన్నాయి. అంతే కాదు మంగళూరు మరియు హస్సన్(103 కి.మీ) లు కూడా దీనికి చేరువలో గల రైల్వే స్టేషన్ లు.

రోడ్డు సౌకర్యం

కూర్గ్ చక్కటి రోడ్డు వ్యవస్థ కలిగి ఉంది. ఇక రోడ్డు మార్గం విషయానికొస్తే మైసూర్ నుండి 120 కి. మీ. దూరంలో, హస్సన్ నుంచి 103 కి. మీ. దూరంలో , మంగళూరు నుంచి సుమారుగా 145 కి. మీ. దూరంలో ఉంటుంది.

చిత్ర కృప : ditya Patawari

మున్నార్

మున్నార్

మున్నార్ కేరళ లోని ఇడుక్కి జిల్లాలో గల అద్భుత హిల్ స్టేషన్. స్వదేశీయులు, విదేశీయులు ఇలా ఎవ్వరైనా సరే ఇక్కడి అందాలకు మంత్రముగ్ధులు ఆవ్వాల్సిందే ..! సైట్ సీయింగ్ లు ఇక్కడ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీరు కేరళ ట్రిప్ ప్లాన్ వేసుకుంటే అందులో మున్నార్ కూడా చేర్చుకోండి.

మరింత చదవండి : మున్నార్ - అందమైన ప్రకృతి సందర్శన !

చిత్ర కృప : aphotoshooter

మున్నార్ ఎలా చేరుకోవాలి ?

మున్నార్ ఎలా చేరుకోవాలి ?

మున్నార్ చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

మున్నార్ కు సమీపాన 105 కి. మీ. దూరంలో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

అంగామలీ మరియు అలూవా లు రైల్వే స్టేషన్ లు 120 కి. మీ దూరంలో ఉండి, మున్నార్ కు సమీపాన ఉన్నాయి. అంగామలీ స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కలుపబడి ఉంటుంది.

రోడ్డు మార్గం

మున్నార్ కు కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుండి తరచూ బస్సులు తిరుగుతుంటాయి. కొచ్చి, ఎర్నాకులం, తిరువనంతపురం, ఇడుక్కి ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు ప్రతిరోజూ నడుస్తుంటాయి.

చిత్ర కృప : Mohan Noone

వెంబనాడ్ సరస్సు

వెంబనాడ్ సరస్సు

వెంబనాడ్ సరస్సు కేరళ రాష్ట్రంలోనే అతి పెద్ద సరస్సు మరియు దేశంలోకెల్లా పొడవైన సరస్సు. ఇక్కడ కేరళ బ్యాక్ వాటర్ లో హౌస్ బోట్ ఆనందాలు మరువలేనివి. హౌస్ బోట్ లో కొన్ని గంటలు లేదా జంట రాత్రులు గడపవచ్చు. కొత్త జంటలు ఎక్కువగా హౌస్ బోట్ లో ప్రయాణించడానికి మొగ్గు చూపుతుంటారు.

మరింత చదవండి : కుమారకోం - కేరళ రాష్ట్రపు వర్షపు విందు !

చిత్ర కృప : Sajan Mullappally

వెంబనాడ్ సరస్సు ఎలా చేరుకోవాలి ?

వెంబనాడ్ సరస్సు ఎలా చేరుకోవాలి ?

వెంబనాడ్ సరస్సు కుమారకోం పట్టణంలో ఉన్నది. కుమారకోం కు రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

94 కి. మీ. దూరంలో ఉన్న కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం వెంబనాడ్ కు సమీపంలో ఉన్నది. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

కుమారకోం కు సమీపాన 15 కి. మీ. దూరంలో కోట్టాయాం రైల్వే స్టేషన్ కలదు. కోట్టాయాం దేశంలోని అన్ని ప్రధాన నగరాల తో కలుపబడి ఉన్నది. స్థానిక బస్సుల్లో ప్రయాణించి కుమారకోం చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

కొట్టాయం, బెంగళూరు, కోయంబత్తూరు, ఇడుక్కి, కొచ్చి నుండి కుమారకోం కు తరచూ బస్సులు నడుస్తాయి.

చిత్ర కృప : Prasad Pillai

అలెప్పి

అలెప్పి

అలెప్పి - కేరళ రాష్ట్రంలోని అందమైన టూరిస్ట్ ప్రదేశం. ఇక్కడి నుండే హౌస్ బోట్ లు ప్రారంభమవుతాయి. అద్భుతమైన సముద్ర అందాలను దగ్గరగా చూడటానికి అలెప్పి బీచ్ ఉండ నే ఉంది. బీచ్ చుట్టూ తాటి చెట్లు, కొబ్బరి చెట్ల వరుసలు అలుముకొని దట్టంగా ఉంటాయి. ప్యాలెస్ లు, మతసంబంధ కేంద్రాలు మరికొన్ని ఆకర్షణలు గా నిలిచాయి.

మరింత చదవండి : కేరళ హౌస్ బోట్ ఆనందాలు !

చిత్ర కృప : Swifant

అలెప్పి ఎలా చేరుకోవాలి ?

అలెప్పి ఎలా చేరుకోవాలి ?

అలెప్పి చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

అలెప్పి పట్టణానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం(84 కి. మీ), తిరువనంతపురం విమానాశ్రయం ( 150 కి.మీ) లు ఉన్నాయి. రెండు విమానాశ్రయాల నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి అలెప్పి సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

అలెప్పి లో రైల్వే స్టేషన్ ఉన్నది. బెంగళూరు, తిరువనంతపురం, కోయంబత్తూరు, మధురై, చెన్నై, మంగళూరు, ముంబై
నుండి రైళ్లు ఇక్కడికి వస్తుంటాయి.

రోడ్డు మార్గం

బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చి, ఎర్నాకులం నగరాల నుండి అలెప్పి కి తరచూ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Sivahari

తేక్కడి

తేక్కడి

తేక్కడి కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని అటవీ ప్రాంతం. చుట్టూ దట్టమైన అడవి, పచ్చిక బయళ్లు, గలగల పారే సెలయెర్లు ఇక్కడి ఆకర్షణలు. సెలయెర్ల వద్ద కి వచ్చి అటవీ జంతులు తమ దాహార్తి తీసుకోవటానికి వస్తుంటాయి. ప్రకృతి ప్రియులను కనువిందు చేసే వన్య మృగ సంరక్షణ కేంద్రాలు, ప్రశాంతత కోసం ఆయుర్వేద మసాజ్ స్పా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి.

మరింత చదవండి : ఎక్కడా లేని ప్రకృతి అందాలు తేక్కడి సొంతం!

చిత్ర కృప : Liji Jinaraj

తేక్కడి ఎలా చేరుకోవాలి ?

తేక్కడి ఎలా చేరుకోవాలి ?

తేక్కడి చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

తెక్కడికి దగ్గరలో ఉన్నది మధురై ఏర్‌పోర్ట్. ఇది 114 కి. మీ. దూరంలో ఉన్నది. అంతే కాదు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా 145 కి. మీ. దూరంలో ఉన్నది.

రైలు మార్గం

కొట్టాయం రైల్వే స్టేషన్‌కు 114 కిలోమీటర్ల దూరంలో తెక్కడి ప్రాంతం ఉన్నది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం

మధురై, కొచ్చి, త్రివేండ్రం వంటి నగరాల నుంచి బస్సు సదుపాయం కలదు.

చిత్ర కృప : Appaiah

ఎర్కాడ్

ఎర్కాడ్

తమిళనాడు లో ఊటీ, కొడైకెనాల్ తప్పనిచ్చి చూడవలసిన ప్రదేశాల్లో మొదటిది ఎర్కాడ్. ఇది పేదవాని ఊటీగా గా ప్రసిద్ధి కెక్కింది. వందల మీటర్ల ఎత్తున్న ఈ ప్రాంతం అందమైన దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. వ్యూ పాయింట్లు, తోటలు, ఆలయాలు చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి.

మరింత చదవండి : ఎర్కాడ్ - పేదోళ్ల 'ఊటీ' !

చిత్ర కృప : Thangaraj Kumaravel

ఎర్కాడ్ ఎలా చేరుకోవాలి ?

ఎర్కాడ్ ఎలా చేరుకోవాలి ?

ఎర్కాడ్ చేరుకోవాటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

ఎర్కాడ్ లో ఎటువంటి విమానాశ్రయం లేదు దీనికి సమీపంలో 183 కి. మీ. దూరంలో త్రిచి దేశీయ విమానాశ్రయం ఉంది. కోయంబత్తూర్, బెంగళూరు నగరాలు దగ్గరలో ఉన్న ఇతర విమానాశ్రయాలుగా ఉన్నాయి. త్రిచి నుండి ట్యాక్సీ ల ద్వారా ఏర్కాడు చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఎర్కాడ్ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు దీనికి సమీపంలో 35 కి. మీ. దూరంలో ఉన్న సేలం వద్ద రైల్వే స్టేషన్ ఉన్నది. దక్షిణ భారత దేశంలో ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లని సేలంలో తప్పకుండా ఆగుతాయి. జోలర్పట్టి, ఏర్కాడు నుండి 20 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్.

బస్సు లేదా రోడ్డు మార్గం

ఎర్కాడ్, తమిళనాడు మరియు దాని ప్రక్క రాష్ట్రాల అన్ని ప్రధాన నగరాలతో రోడ్డు మార్గాన్ని కల్గి ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు లతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా ప్రతి రోజు సేలం నుండి ఎర్కాడ్ కు నడుస్తాయి. కోయంబత్తూరు (190 కి.మీ), చెన్నై(356 కి. మీ), బెంగుళూరు(230 కి.మీ) నుండి కూడా ఇక్కడికి బస్సులు ఉన్నాయి.

చిత్ర కృప : V.v

కొల్లి కొండలు

కొల్లి కొండలు

కొల్లి కొండలు తమిళ నాడు నమక్కల్ జిల్లాలో సముద్ర మట్టానికి 1000 నుండి 1300 మీటర్ల ఎత్తున ఉంటాయి. ఇక్కడ చూడటానికి వ్యూ పాయింట్ లు, జలపాతం, ఆలయాలు మరియు ఆశ్రమాలు ఉన్నాయి.

మరింత చదవండి : కొల్లి హిల్స్ - సందర్శనీయ ప్రదేశాలు !

చిత్ర కృప : Karthickbala

కొల్లి హిల్స్ ఎలా చేరాలి ?

కొల్లి హిల్స్ ఎలా చేరాలి ?

కొల్లి హిల్స్ చేరుకోటానికి అన్ని రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

కొల్లి హిల్స్ కి 110 కి. మీ. దూరంలో ఉన్న ట్రిచీ సమీప విమానాశ్రయం. ట్రిచీ కి రెగ్యులర్ విమానాలు చెన్నై నుంచి అందుబాటులో ఉన్నాయి. ట్రిచీ విమానాశ్రయం నుండి కొల్లి హిల్స్ కు టాక్సీ రైడ్ కు సగటున 1200 రూపాయలు ఖర్చవుతుంది.

రైలు మార్గం


కొల్లి హిల్స్ కు సమీపంలోని రైల్వే స్టేషన్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేలంలో ఉంది. ట్రిచీ రైల్వే స్టేషన్ 90 కి. మీ. దూరంలో ఉంది. సేలం లేదా ట్రిచీ నుండి కొల్లి హిల్ కు టాక్సీ లేదా ఇతర ప్రవేట్, ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

కొల్లి హిల్స్ కు రోడ్ సౌకర్యం చక్కగా ఉంది. సేలం నుండి ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి కొల్లి చేరుకోవచ్చు. అలాగే చెన్నై, మధురై మరియు ట్రిచీ నుండి కూడా చేరుకోవచ్చు. సేలంలో బస్ స్టాండ్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లి కొండలు చేరటానికి ఒకవేళ మీరు టాక్సీ అద్దెకు తీసుకుంటే సగటున రూ. 1100 చెల్లించవలసి వస్తుంది.

చిత్ర కృప : Docku

కూనూర్

కూనూర్

ఊటీ కి 20 కి. మీ. దూరంలో ఉన్న కూనూర్ సముద్ర మట్టానికి 1850 మీటర్ల ఎత్తులో ఉన్నది. నీలగిరి కొండల్లో ఊటీ తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన ప్రదేశం కూనూర్. ఇక్కడ నీలగిరి కొండల అద్భుత దృశ్యాలు చూడవచ్చు. పార్క్ లు, జలపాతాలు, వ్యూ పాయింట్ లు, లో య లు ఆకర్షణలు గా ఉన్నాయి.

మరింత చదవండి : కూనూర్ - ఒక మరువలేని అనుభూతి !

చిత్ర కృప : Thangaraj Kumaravel

కూనూర్ ఎలా చేరుకోవాలి?

కూనూర్ ఎలా చేరుకోవాలి?

కూనూర్ చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

కూనూర్ కు సమీపాన 60 కి. మీ. దూరంలో కోయంబత్తూర్ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం

ప్రధాన రైల్వే స్టేషన్ నుండి మెట్టుపాలయమ్ రైలు ద్వారా కూనూర్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

కోయంబత్తూర్ నుండి, మెట్టుపాలయమ్ నుండి, ఊటీ నుండి కూనూర్ కు బస్సుల్లో ప్రయాణించవచ్చు.

చిత్ర కృప : आशीष भटनागर

కోటగిరి

కోటగిరి

కోటగిరి తమిళనాడు రాష్ట్రంలో పెద్ద హిల్ స్టేషన్. కానీ మీకు దీని గురించి తేలేదు. అసలు పేరే వినిలేకుంటారు. సముద్ర మట్టానికి 1793 మీటర్ల ఎత్తున్న కోటగిరి నీలగిరి కొండల్లో ఉన్న కూనూర్, ఊటీ తో సమానంగా చెప్పవచ్చు. ట్రెక్కింగ్, ఆలయాలు, పార్కులు, జలపాతాలు, వ్యూ పాయింట్ లు, పర్వతాలు మరియు మ్యూజియం లు ఇక్కడి ఆకర్షణలు గా చెప్పవచ్చు.

మరింత చదవండి : ఉల్లాసపరిచే ఊటీ రైలు ప్రయాణం !

చిత్ర కృప : Ramana

కోటగిరి ఎలా చేరుకోవాలి ?

కోటగిరి ఎలా చేరుకోవాలి ?

కోటగిరి కి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉంటాయి.

వాయు మార్గం

కోటగిరి కి సమీపాన కోయంబత్తూర్ విమానాశ్రయం కలదు. ఘాట్ రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

కోయంబత్తూర్ ప్రధాన రైల్వే స్టేషన్ నుండి మెట్టుపాలయమ్ రైలు ద్వారా పర్వత ప్రాంతమైన కూనూర్ చేరుకొని, అక్కడి నుండి బస్సు లేదా క్యాబ్ లలో ఎక్కి వెళ్ళవచ్చు.

రోడ్డు మార్గం

మెట్టుపాలయమ్(33 కి.మీ), కూనూర్ నుండి మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డు ద్వారా కోటగిరి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Thangaraj Kumaravel

వల్పరై

వల్పరై

వల్పరై తమిళనాడు రాష్ట్రంలో సముద్రమట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ హిల్ స్టేషన్ లో మానవ నిర్మిత కాఫీ మరియు టీ తోటలు సమృద్దిగా ఉన్నాయి. లోతైన అడవులు, అభయారణ్యాలు మరియు జలపాతాలు చూడదగ్గవి.

మరింత చదవండి : వాల్పరై - ఒక పర్యాటక ఆనందం !
చిత్ర కృప : Navaneeth KN

వల్పరై ఎలా చేరుకోవాలి ?

వల్పరై ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

వల్పరై కి సమీపంలో 120 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం

వల్పరై కు సమీపాన పొల్లాచి రైల్వే స్టేషన్ కలదు. రైల్వే జంక్షన్ 120 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ లో కలదు.

రోడ్డు మార్గం

కోయంబత్తూర్, పొల్లాచి నుండి తరచూ వల్పరై కు రాష్ట్ర బస్సులతో పాటుగా, ప్రవేట్ వాహనాలు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Thangaraj Kumaravel

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెలవులను గడపటానికి సూచించదగిన ప్రదేశాలు హార్స్లీ హిల్స్, అరకు లోయ, అనంతగిరి

మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి : ఆంధ్ర ప్రదేశ్ - సమ్మర్ ప్రదేశాలు !

చిత్ర కృప : roadconnoisseur

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ఒకేఒక్క వేసవి విహార కేంద్రం మరియు ట్రెక్కింగ్ కేంద్రం ఉన్నది.

మరింత చదవండి : అనంతగిరి - తెలంగాణ వేసవి విహార కేంద్రం !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X