» »ఇక్కడ కూడా ఆ దేవాలయాలు ఉన్నాయి...మీకు తెలుసా

ఇక్కడ కూడా ఆ దేవాలయాలు ఉన్నాయి...మీకు తెలుసా

Written By: Beldaru Sajjendrakishore

భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో పాటు జైనం, భౌద్ధం కూడా విరాజిల్లింది. ఆయా ధర్మాలకు అనుగుణంగా అనేక దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు వెలిశాయి. మరోవైపు ప్రపంచలో అన్ని మతాలవారు ప్రకతి దైవంగా పూజిస్తారు. పారే నది నీటితో పాటు జ్వలించే అగ్నికి ఆయా మత గ్రంధాలను అనుసరించి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ ప్రకతికి మూలం సూర్యుడన్న విషయాన్ని ఎవరూ కాదనలేని సత్యం. తన సూర్య కిరణాలతో ఈ జగత్తు మొత్తాన్ని మేల్కొల్పే ఆ ఆదిత్యుడి ప్రస్తావన భారత పురాణాల్లో కూడా ఉంది. అయితే శివుడు, విష్ణువు తదితర దేవుళ్లతో పోలిస్తే సూర్యుడికి భారత దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ చోట్ల మాత్రమే దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. అందులో అరసవెళ్లి సూర్యనారాయణ, కోనార్క్ సూర్యదేవాలయం వంటి రెండు మూడు ప్రాంతాలు మాత్రమే బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత దేశంలో మిగిలిన సూర్యదేవాలు అక్కడికి దగ్గర్లో ఉన్న పర్యటాక ప్రాంతాల వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. దక్షిణార్క టెంపుల్

1. దక్షిణార్క టెంపుల్

Image source

ఈ దేవాలయం బీహార్ లోని గయలో ఉంది. ఈ సూర్యదేవాలయం తూర్పునకు అభిముఖంగా నిర్మించారు. ప్రతాపరుద్రుడు ఈ దేవాలయన్ని నిర్మించినట్లు ఇక్కడి శాసనాలను అనుసరించి తెలుసుకోవచ్చు.

ఈ దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకునే ఆదిత్యుడు శరీరం పై కవచాన్ని కలిగి ఉండటం విశేషం. దేవాలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని నమ్ముతారు.

2. మరో రెండు దేవాలయలు...

2. మరో రెండు దేవాలయలు...

Image source

ప్రతి ఆదివారం ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక గయాలోనే మరో రెండు సూర్య దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి ఉత్తరాక సూర్య దేవాలయం, ఆదిత్య దేవాలయం. ఈ దేవాలయం ప్రధాన మూర్తికి ఎదురుగా సభా మంటపం ఉంటుంది. ఈ మంటపంలో ఉన్న స్థంభాల పై శివుడు, విష్ణువు, దుర్గా మాతా తదితర దేవతా మూర్తుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కారు.

3.బ్రహ్మణ్య దేవాలయం

3.బ్రహ్మణ్య దేవాలయం

Image source

మధ్యప్రదేశ్ లోని ఝాన్నీ పట్టణానికి దగ్గర్లో బ్రహ్మణ్య దేవాలయం అనే పేరుగల సూర్య దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని బరంజీ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేస్తే కుష్టు వంటి వ్యాధులు కూడా నయమవుతాయని ప్రజలు నమ్ముతారు.

4. 21 కోణాలు

4. 21 కోణాలు

Image source

ఇక్కడి దేవాలయంలో విగ్రహం నల్లని రంగులో ఉంటూ ఇటుక పీఠం పై ఉంటుంది. అంతేకాకుండా ఈ పీఠానికి 21 కోణాలు ఉంటాయి. ఇక్కడి విగ్రహానికి ఇత్తడి కవచం ఉంటుంది. ఈ కవచం దాదాపు వెయ్యేళ్లు క్రితం తయారు చేయబడినది ఇక్కడివారు చెబుతుంటారు.

5.సూర్య పహార్ వద్ద

5.సూర్య పహార్ వద్ద

Image source

అస్సాం లోని గోల్ పూర్ అనే ప్రాంతంలో ఉన్న సూర్య పహార్ అనే కొండ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం నిర్మాణంలో ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతను వాడారు. పురాణాల ప్రకారం సూర్యుడు అదితి, కశ్యప దంపతుల కుమారుడు. కాగా, సూర్యుడి జన్మ వ`తాంతాన్ని ఈ దేవాలయంలో చూడవచ్చు. ఈ మొత్తం కథను 12 చిత్రాల్లో అందంగా చెప్పారు.

6.సూర్యుడి శాశ్వత నివాస ప్రాంతం ఇదే

6.సూర్యుడి శాశ్వత నివాస ప్రాంతం ఇదే

Image source

హిందూ పురాణాల్లో సూర్య పహార్ సూర్యుడి శాశ్వత నివాస ప్రాంతంగా చెప్పబడింది. సూర్యుడి కొండ అడుగు భాగంలో ఎన్నో శివలింగాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా రాక్ కట్ విధానంలో తొలచబడిన అనేక కళాత్మక శిల్పకళ కూడా ఇక్కడ మనం చూడవచ్చు.

7.కుంభకోణం

7.కుంభకోణం

Image source

తమిళనాడులోని కుంభకోణం శివారులో సూర్యదేవాలయం ఉంది. ఈ ఆలయంలో సూర్యుడితో పాటు అంగారక, బ`హస్పతి, శుక్రుడు, రాహువు, కేతువు తదితర విగ్రహాలు కూడా ఉండటం విశేషం. ఇవి అన్నీ ప్రస్తుత ఖగోళశాస్ర్తంలోని సౌర్య కుటుంబాన్ని గుర్తుకు తెస్తుంటాయి.

8.800 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం

8.800 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం

Image source

ద్రవిడ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. చోళులు ఈ దేవాలయం అభివ`ద్ధిలో ప్రముఖ పాత్ర వహించారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఈ దేవాలయాన్ని ప్రాచూర్యంలోకి తీసుకురావడానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

9.అరసవెళ్లి సూర్యనారాయణ దేవాలయం

9.అరసవెళ్లి సూర్యనారాయణ దేవాలయం

Image source

మిగిలిన దేవాలయాలతో పోలిస్తే అరసవెళ్లి సూర్యనారాయణ దేవాలయం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఏడో శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం శ్రీకాకుళ పట్టణానికి దగ్గర్లో అరసవెళ్లి అనే గ్రామంలో ఉంది. రతసప్తమి రోజున ఇక్కడకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశంలోని వివిధ చోట్ల నుంచి కూడా అనక మంది భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు.

10. ఏడాదికి రెండుసార్లు

10. ఏడాదికి రెండుసార్లు

Image source

ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా దేవాలయంలోని ప్రధాన విగ్రహం పాదాలను తాకుతాయి. ఈ అద్భుత ద`ష్యం ప్రతి ఏడాది మూడు రోజుల చొప్పున రెండుసార్లు జరుగుతుంది. మర్చి 9 10,11 తేదీల్లో ఒకసారి, అక్టోబర్ 1,2, 3 తేదీల్లో మరోసారి తాకుతాయి. ఆ సమయంలో దేవుడిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.

11. కోణార్క్ దేవాలయం

11. కోణార్క్ దేవాలయం

Image source

భారత దేశంలోని ఏడు వింతల్లో ఒకటి కోణార్క్ దేవాలయం. గంగవంశానికి చెందిన నరసింహరాయ దీనిని నిర్మించారు. ఒరిస్సాలోని పూరికి 35 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. దీనిని 13వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది.

12. రథం ఆకారంలో

12. రథం ఆకారంలో

Image source

ఏడు గుర్రాలు ఓ రథంకి కట్టి ఉన్నట్లుగా ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు ప్రతీకగా చెబుతారు. ఇక ఈ రథానికి ఉన్న 24 చక్రాలు రోజులోని 24 గంటలకు ప్రతీకగా చెబుతారు. ఇలా ఈ దేవాలయం నిర్మాణంలోని ప్రతి అంశం సమయం, నెల, ఏడాది, మాసం తదితర విషయాలను సూచిస్తూ ఉంటుంది.

13.గుజరాత్ లో కూడా

13.గుజరాత్ లో కూడా

Image source

గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని మోదేరా గ్రామంలో ఈ దేవాలయం ఉంది. చాళుక్య వంశానికి చెందిన భీమ 1 అనే రాజు ఈ దేవాలయన్ని స్థానికంగా ఉన్న పుష్పావతి నదీ ఒడ్డున నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ ఆరాధన జరగడం లేదు. అయితే ఈ దేవాలయం గోడల పై ఉన్న చిత్రాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తారు.

14. చిత్రమైన సూట్

14. చిత్రమైన సూట్

Image source

సూర్యుడు విచిత్రమైన సూట్ తో పాటు బూట్లను కూడా ధరించినట్లు ఉన్న కొన్ని చిత్రాలను మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ దేవాలయం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. ఇక్కడ ఉన్కన శిల్ప సంపద, సభా మంటపం మన హిందూ శిల్ప కళకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. మంటపాల పై భాగాలు కూడా ఇక్కడ అనేకం చెక్కబడి ఉన్నాయి.