Search
  • Follow NativePlanet
Share
» »కోటి దేవతలు కొలువై ఉన్న సురేంద్రపురి చూడటం పూర్వ జన్మ సుకృతం

కోటి దేవతలు కొలువై ఉన్న సురేంద్రపురి చూడటం పూర్వ జన్మ సుకృతం

కోటి దేవతలు కొలువై ఉన్న సురేంద్రపురి చూడటం పూర్వ జన్మ సుకృతం

నల్గొండ జిల్లాలోని యాదగిరి గుట్టకు సమీపంలో గల ఈ సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం తప్పక సందర్శించదగిన క్షేత్రం. కుందా సత్యనారాయణ కళాధామము ఒక హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయము. పర్యాటకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లగలిగిన హిందూ ధర్మ ప్రదర్శన శాల అని నిర్వాహకుల మాటలతో వర్ణించబడింది. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు, అలాగే పురాన ప్రాముఖ్యం కల దేవాలయాల నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి వర్ణరంజింతంగా అలంకరించి చూపరులకు కనువిందుచేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మలోకము, విష్ణులోకం, కైలాసం,స్వర్గలోకం, నరకలోకం, పద్మద్వీపం, పద్మలోకం దృశ్యరూపంలో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. మరి ఈ ఆద్యాత్మిక ప్రదేశం యొక్క విశేషాలేంటో తెలుసుకుందాం..

పద్మ రూపంలో

పద్మ రూపంలో

పద్మ రూపంలో అనేక దేవతా రూపాలు చూడవచ్చు. అలాగే మహాభారత, భాగవతము వంటి పుపాణేతిహాసాలలో చోటు చేసుకున్న దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా మలచిన శిల్పాలతో దృశ్యాలుగా దర్శించవచ్చు.

మంధర పర్వత సాయంతో క్షీరసాగర మధనం

మంధర పర్వత సాయంతో క్షీరసాగర మధనం

మంధర పర్వత సాయంతో క్షీరసాగర మధనం చేస్తున్న దేవతలను రాక్షసులను కూర్మావతారంలో ఉన్న విష్ణు మూర్తిని చూడవచ్చు. అలాగే గజేంద్ర మోక్ష సన్నివేశాలను తడ్రూపంగా మలచిన దృశ్యాలను చూడవచ్చు.

యుద్దానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల కృష్ణుడి

యుద్దానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల కృష్ణుడి

యుద్దానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల కృష్ణుడి విశ్వరూపదర్శనంను అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవచ్చు. కాళీయుని పడగల మీద నాట్యమాడుతున్న శ్రీకృష్ణుడిని చూడ వచ్చు. గోవర్ధనోద్ధరణ, గోపికా వస్త్రాపహరణ, రాక్షసంహారము, రాసలీలా దృశ్యాలను తిలకించ వచ్చు.

భవిష్య బ్రహ్మ అయిన హనుమ

భవిష్య బ్రహ్మ అయిన హనుమ

భవిష్య బ్రహ్మ అయిన హనుమ బాల్య సన్ని వేశాలను అతడు రామునుతో చేరిన పిదప జరిగిన సన్ని వేశాలను చూడవచ్చు. హనుమ సువర్చల కల్యాణం, లంకాదహనం, అక్షయకుమారులను సంహరించడం, రామలక్ష్మణులను భుజము మీదకు ఎత్తుకుని యుద్ధ భూమిలో వారికి సహకరించడం, బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వాటిలో కొన్ని.

 భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం

భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం

హనుమ చేతి ప్రసాదాన్ని అతడి స్వహస్తాలతో తీసుకోవచ్చు. ఆవు నుండి పడుతున్న పాలతో చేసిన కాఫీని త్రాగవచ్చు. ఇలాంటి అపురూప దృశ్యాలను అనేకము చూసి సందర్శకులు అద్భుత అధ్యాత్మిక ఆనందాను భూతిని పొందవచ్చు.

పంచముఖ శివుడు

పంచముఖ శివుడు

కళకు పెద్ద పీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల ద్రుష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనక నుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది.

నవగ్రహాలకు సతీ సమేతంగా

నవగ్రహాలకు సతీ సమేతంగా

నవగ్రహాలకు సతీ సమేతంగా వాహన సమేతంగా అధి దేవత ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా తొమ్మది ఆలయాలను ఇక్కడ నిర్మించడం విశేషం.

వేంకటేశ్వరస్వామి

వేంకటేశ్వరస్వామి

పంచముఖ హనుమంతుడు, శివుడు, శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ దేవాలయంలో ఆలయాలను ఇక్కడ నిర్మించారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వేంకటేశ్వరస్వామి ఈ దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు.

ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి

ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి

ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి మానసిక ప్రశాంతత నశించి, మనోధైర్యం సిద్ధిస్తుంది. బుద్ది, బలం, శక్తి, యశస్సు, ఆయురారోగ్యాలు చేకూరతాయి. వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది.

అమ్మవారి వాహనం సింహం నోటి నుండి

అమ్మవారి వాహనం సింహం నోటి నుండి

అమ్మవారి వాహనం సింహం నోటి నుండి కళాధామానికి ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది.

 దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల మినీ రూపాలు

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల మినీ రూపాలు

ఇక్కడ మరో విశేషం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల మినీ రూపాలు ఉన్నాలు. వీటిలో విజయవాడ కనకదుర్గ ఆలయం, షిర్డి సాయిబాబా ఉన్న ప్రధాన దేవాలయాల మినీ రూపాలు ఉన్నాయి. వీటిలో విజయవాడ కనక దుర్గ ఆలయం, షిర్డి సాయిబాబా గుడి, తిరుమల వెంటేశ్వర ఆలయం.

కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది.

కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది.

కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నయమైపోతాయని భక్తుల నమ్మకం. గర్భగుడి లక్ష్మి నరసింహుల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. గోదాదేవి మందిరం కూడా ఉంది. ఆలయం ఆవరణలో గల అద్ధాల మండపం, కొండపైన ఉన్న శివాలయం తప్పకుండా చూడదగినవి.

సురేంద్రపురి మణుమదీశ్వర ఆలయం

సురేంద్రపురి మణుమదీశ్వర ఆలయం

సురేంద్రపురి మణుమదీశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లో చూడదగ్గది కళాధామం. ఈ ప్రదేశాన్ని చూడాల్సిందేగానీ, చెప్పేందుకు అలవికానట్టిది మొత్తం ఈ ప్రదేశాన్నంతా కలియదిరిగేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది.

ఈ క్షేత్రంలోనే నాగ కోటిస్వరలయం నిర్మించారు

ఈ క్షేత్రంలోనే నాగ కోటిస్వరలయం నిర్మించారు

ఈ క్షేత్రంలోనే నాగ కోటిస్వరలయం నిర్మించారు, నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషాలు అననుభక్తుల కోసమే ఈదేవాలయాన్ని నిర్మించురు. ప్రతి ఆలయంలో ఒక మూల విగ్రహం ఉంటుంది కానీ ఇందులో కోటి పార్థివ లింగాలను నాగప్రతిమతో చేసిన కోటి సర్పాల ప్రతిమలు ఉన్నాయి. కాబట్టే దీనిని నాగకోటిస్వరలయం అంటారు.

కుందా సత్యనారాయణ కళాధామం

కుందా సత్యనారాయణ కళాధామం

టికెట్ బుకింగ్ టైమింగ్స్ : ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శించు వేళలు : ఉదయం 9:00 నుండి రాత్రి 7 :00 వరకు(ప్రతిరోజూ )
చిత్ర కృప : surendrapuri

భోజనం

భోజనం

బయట ఫుడ్ ను కుందా సత్యనారాయణ కళాధామం లో అనుమతించరు. వెజిటేరియన్ ఫుడ్ కుందా సత్యనారాయణ కళాధామం లో లభిస్తుంది. నాన్ - వెజ్ ఫుడ్ సురేంద్రపురి లో నిషేధం. చిత్ర కృప : surendrapuri

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

హైదరావాడ్ నుండి 65కిమీ దూరంలో ఉంది. రాయ్గిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుంచి చాలా బస్సులు కలవు.హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సురేంద్రపురికి సమీపాన రాయగిరి రైల్వేస్టేషన్‌ కలదు. యాదాద్రికి వచ్చే అన్ని బస్సులు సురేంద్రపురి మీదుగానే వెళతాయి. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X