Search
  • Follow NativePlanet
Share
» »సంతానం కావాలా ఇక్కడికి వెళ్లండి?

సంతానం కావాలా ఇక్కడికి వెళ్లండి?

కర్నాటకలోని సూర్య సదాశివ దేవాలయం గురించి కథనం

ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. భక్తులు తాము కోరిన కోర్కెలు తీరితే ఆ భగవంతుడికి ప్రత్యేక కానుకలను చెల్లిస్తారు. ఒకరు పట్టుపీతాంబరాలు సదరు దేవుడికి కానుకలుగా ఇస్తే మరొకరు అరటిపళ్లు, గంటలను అందజేస్తారు. మరొకొన్ని దేవాలయాల్లో కేవలం ఇలాంటి వస్తువులనే కానుకలుగా చెల్లించాలన్న నిబంధన ఉంటుంది. ఇలాంటి కానుకలు అందజేసే విషయం ఒక్కొక్కసారి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అటువంటి వింతైన ఆచారం కలిగిన ఓ దేవాలయానికి సంబంధించిన కథనం మీ కోసం...

సూర్య సదాశివ దేవాలయం

సూర్య సదాశివ దేవాలయం

P.C: You Tube

ఇప్పుడు మనం చర్చించుకోబోయే దేవాలయం మట్టి బొమ్మలను కానుకలుగా అందజేస్తారు. భక్తులు ఏదైనా కోరిక కోరుకొంటే ఆ కోరిక నెరవేరితే ఆ కోరికకు అనుగుణంగా మట్టిబొమ్మను తయారుచేసి ఇక్కడి దైవానికి కానుకగా సమర్పిస్తారు.

సూర్య సదాశివ దేవాలయం

సూర్య సదాశివ దేవాలయం

P.C: You Tube

ఆ దేవాలయం పేరే సదాశివ రుద్ర దేవాలయం. ఈ దేవాలయం సూర్య అనే చిన్న గ్రామంలో ఉంటుంది. అందువల్లే ఈ దేవాలయాన్ని సూర్య సదాశివ రుద్ర దేవాలయం అని పిలుస్తారు.

సూర్య సదాశివ దేవాలయం

సూర్య సదాశివ దేవాలయం

P.C: You Tube

ఇది ప్రముఖ శైవక్షేత్రం. ఇక్కడ ఉన్న దేవాలయంలోని ఆచార వ్యవహారాలను మధ్వ సంప్రదాయాన్ని అనుసరించి నిర్వహిస్తారు. కోరిన కోర్కెలు తీరిన వెంటనే ఒక కుంచెడు బియ్యం, ఒక టెంకాయ, రూ.5 లతో పాటు ఒక మట్టి బొమ్మను కానుకగా సమర్పిస్తారు.

సూర్య సదాశివ దేవాలయం

సూర్య సదాశివ దేవాలయం

P.C: You Tube

మీరు ఏవిధమైన కోరికను కోరుతారో అదే విధమైన మట్టిబొమ్మను ఇక్కడ కానుకగా సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు సొంతిళ్లు కావాలని కోరుకొంటే మట్టితో తయారుచేసిన సొంతిల్లును ఇక్కడ కానుకగా అందించాలి.

సూర్య సదాశివ దేవాలయం

సూర్య సదాశివ దేవాలయం

P.C: You Tube

అదే విధంగా సంతానాన్ని కోరుకొంటే మట్టితో చేసిన చిన్నపిల్లల బొమ్మలను కానుకగా అందించాలి. ఈ బొమ్మలను స్థానికంగా లభించే ప్రత్యేక మట్టితో తయారుచేస్తారు. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి స్థానిక కళకారులు ఈ బొమ్మలు తయారు చేసి విక్రయిస్తుంటారు.

సూర్య సదాశివ దేవాలయం

సూర్య సదాశివ దేవాలయం

P.C: You Tube

ఒక్కొక్క బొమ్మ వెల రూ.100 నుంచి మొదలయ్యి రూ.2000 వరకూ ఉంటుంది. ఈ దేవస్థానానికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఒక చిన్నగది ఉంటుంది. ఈ గదిని అత్యంత పవిత్రమైన నదిగా భావిస్తారు.

సూర్య సదాశివ దేవాలయం

సూర్య సదాశివ దేవాలయం

P.C: You Tube

మనం దేవుడికి కానుకలుగా అందజేసిన బొమ్మలను పూజారులు ఇక్కడ ఉంచుతారు. అయితే కానుకలు మాత్రం మధ్యాహ్న పూజకు మొదలు దేవుడికి కానుకలుగా సమర్పించాల్సి ఉంటుంది. భ`గుమహర్షి శిష్యుల్లో ముఖ్యశిష్యుడు ఒకరు ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు.

సూర్య సదాశివ దేవాలయం

సూర్య సదాశివ దేవాలయం

P.C: You Tube
అతని తపస్సుకు మెచ్చిన శివపార్వతులు అతని కోరికమేరకు ఇక్కడ లింగరూపంలో కొలువై ఉన్నారని చెబుతారు. ఈ దేవాలయం ముందు భాగంలో ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి ఏడాది ఈ పుష్కరిణి వద్ద ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయం కర్నాటకలోని బెల్తంగడికి దగ్గరలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X