Search
  • Follow NativePlanet
Share
» »తాజ్ మహల్ గురించిన ఈ నిజాలు మీకు తెలుసా!!

తాజ్ మహల్ గురించిన ఈ నిజాలు మీకు తెలుసా!!

ప్రపంచం మొత్తానికి మన దేశంలోని ఆగ్రాలో కల తాజ్ మహల్ ఒక ప్రేమ గుర్తుగా షా జహాన్ కట్టించాడనే తెలుసు.

By Venkatakarunasri

ప్రపంచం మొత్తానికి మన దేశంలోని ఆగ్రాలో కల తాజ్ మహల్ ఒక ప్రేమ గుర్తుగా షా జహాన్ కట్టించాడనే తెలుసు. ఒక సీజన్ అనేది కూడా లేకుండా సంవత్సరం పొడవునా ప్రపంచం నలుమూలలనుండి పర్యాటకులు ఈ అద్భుత నిర్మాణ సౌందర్యం చూడటానికి వస్తూనే వుంటారు. తాజ్ మహల్ ను మొగల చక్రవర్తి తన భార్య ముంతాజ్ పై ప్రేమ చిహ్నం గా నిర్మించాడు. ఈ మహత్తర నిర్మాణం 1631 లో మొదలై 1653 వరకూ కొనసాగింది. అరుదైన ఈ కట్టడం యమునా నది ఒడ్డున కలదు. తెల్లని పాల రాయి తో నిర్మించబడిన తాజ్ మహల్ ఇండియా లో తప్పక మరోమారు కూడా దర్శించదగిన పర్యాటక ఆకర్షణ. ఈ అద్భుత నిర్మాణం ప్రపంచ ఏడు వింతలలో ఒకటిగా కూడా చ్కోటు చేసుకొంది. అయితే, తాజ్ మహల్ గురించిన కొన్ని వాస్తవాలను కూడా తప్పక తెలుసుకోవాలి. వాటిని తెలుసుకుంటే, మీరు మరింత ఆశ్చర్య చాకితులు అవుతారు.

తాజ్ మహల్ గురించిన ఈ నిజాలు మీకు తెలుసా!!

తాజ్ మహల్ గురించిన ఈ నిజాలు మీకు తెలుసా!!

ఒక సీజన్ అనేది కూడా లేకుండా సంవత్సరం పొడవునా ప్రపంచం నలుమూలలనుండి పర్యాటకులు ఈ అద్భుత నిర్మాణ సౌందర్యం చూడటానికి వస్తూనే వుంటారు. తాజ్ మహల్ ను మొగల చక్రవర్తి తన భార్య ముంతాజ్ పై ప్రేమ చిహ్నం గా నిర్మించాడు. తాజ్ మహల్ రోజులో వివిధ సమయాలలో వివిధ రంగులు మారుస్తుందని మీకు తెలుసా ? ఉదయం వేళ , ఈ కట్టడం పింక్ కలర్ లోను, పొద్దు ఎక్కువ అయ్యే కొద్దీ తెలుపు రంగులోను, రాత్రి వెన్నెల వెలుగులలో బంగారపు రంగును చూపుతుంది. కొంతమంది, ఈ రంగులు ఒక మహిళా యొక్క వివిధ మనో భావాలకు ప్రతీక అంటారు.

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ ను మొగల చక్రవర్తి తన భార్య ముంతాజ్ పై ప్రేమ చిహ్నం గా నిర్మించాడు. అపురూపమైన ఈ కట్టడాన్ని నిర్మించడానికి సుమారుగా 22 సంవత్సరాలు పట్టింది. సుమారు 22,000 మంది పనివారు తాజ్ మహల్ నిర్మాణంలో పని చేసారు. ఈ నిర్మాణం వివిధ దశలలో చేసారు.

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిజాలు !

తెల్లని పాల రాయి తో నిర్మించబడిన తాజ్ మహల్ ఇండియా లో తప్పక మరోమారు కూడా దర్శించదగిన పర్యాటక ఆకర్షణ. తాజ్ మహల్ కు నిర్మించబడిన స్తంభాలు, ఆ కట్టడం ఏ రకమైన ప్రకృతి విపత్తు కు ధ్వంసం కాకుండా నిర్మించారు. ఈ నిర్మాన్ని సపోర్ట్ చేసే నాలుగు స్తంభాలు కూడా బయటకు వాలి వుంటాయి.

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిర్మానికి ఆసియ ఖండంలోని వివిధ ప్రదేశాల నుండి అనేక విలువైన రాళ్ళను తెప్పించారు. రాజస్తాన్ నుండి మార్బుల్, పంజాబ్ నుండి జాస్పర్ టిబెట్ నుండి నీలపు రాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి లపిజ్ లాజౌళి, శ్రీ లంక నుండి ఎమేరల్ద్ చైనా నుండి క్రిస్టల్స్ తెప్పించారు.

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిర్మాణంలో నాలుగు శిల్ప శిలులను ఆచరించారు. పర్షియన్, తర్క, ఇండియన్ మరియు ఇస్లామిక్ స్టైల్స్ అన్నీ కలిపి తాజ్ మహల్ నిర్మాణం ఏర్పడింది.

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిజాలు !

ఈ అద్భుత నిర్మాణం లో పాల్గొనిన పని వారల చేతులను నరికి వేయమని, మరల వారు వేరే ఏ ఇతర ప్రదేశంలోను ఇటువంటి అద్భుత నిర్మాణం చేయరాదని అజ్నాపిస్తూ షా జహాన్ ఆజ్ఞలు జారీ చేసాడు. ఫలితంగా తాజ్ మహల్ నిర్మించిన పని వారాలు తమ చేతులను సైతం పోగొట్టుకున్నట్లు చెపుతారు.

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిజాలు !

కధనాల మేరకు యమునా నదికి ఆవలి ఒడ్డున తాజ్ మహల్ ను పోలిన మరొక తాజ్ మహల్ నలుపు రంగులో నిర్మించ కోరినట్లు కూడా చెపుతారు. అయితే, తన కుమారుడు ఔరంగా జేబ్ ఆయనను చెరసాలలో పెట్టిన కారణంగా షా జహాన్ ఆ పని చేయ లేకపోయాడు.

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిజాలు !

ఆగ్రాలోని తాజ్ మహల్ స్మారక నిర్మాణం లోపల ఉంచిన షాజహాన్ మరియు ముంతాజ్ యొక్క రెండు సమాధులు తప్ప మిగిలిన నిర్మాణం సమ రూపతలో ఒకే విధంగా నిర్మించబడింది.

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిజాలు !

చక్రవర్తి మరియు ఆయన భార్య ముంతాజ్ ల సమాధులు ప్రజలకు బయటకు కనపడవు. సందర్శకులు చూసే ప్రాకారం లోపలి భాగంలో అవి వుంటాయి. ఈ సమాధులు ఉపరితలం నుండి 7 అడుగులు లోతులో వుండి ఒక మెటల్ డోర్ తో లాక్ చేయబడి వుంటాయి.

తాజ్ మహల్ నిజాలు !

తాజ్ మహల్ నిజాలు !

నిర్మాణం యొక్క మెయిన్ డోర్ పై కురాన్ లోని శ్లోకాలు వుంటాయి. ముంతాజ్ సమాధి ఇరుపక్కలా అల్లా కు గల 99 పేర్లను చెక్కారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X