Search
  • Follow NativePlanet
Share
» »శ్రావణ మాసం పున్నమి రోజున ఈ క్షేత్రం ఎడారిగా మారుతుందా? అప్పుడే యుగాంతమా?

శ్రావణ మాసం పున్నమి రోజున ఈ క్షేత్రం ఎడారిగా మారుతుందా? అప్పుడే యుగాంతమా?

తలకాడుకు సంబంధించిన కథనం.

యుగాంతం. భారతీయ పురాణాల నుంచి ఆధునిక సాంకేతిక శాస్త్రం వరకూ ఎన్ని పరిశోధనలు జరిగుతున్నా సమాధానం దొరకని ప్రశ్న. అయితే ఆ యుగాంతం ఎప్పుడు వస్తుందన్న విషయానికి సంబంధించి కొన్ని ముందస్తు సంఘటనలు జరుగుతాయని మాత్రం భారతీయ పురాణాలు చెబుతాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాలు ఇందుకు కేంద్రమవుతాయి.

భారత దేశంలోని పలు చోట్ల అటువంటి దేవాలయాలు ఉన్నాయి. అటువంటి కోవకు చెందిన ఓ శైవ దేవాలయలం ఒకటి కర్నాటకలో కూడా ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ దేవాలయం క్రమంగా కనుమరుగవుతోంది. యుగాంతానికి సరిగ్గా 24 గంటల ముందు ఈ దేవాలయం అదృశ్యమవుతుందని చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథనంతో పాటు ఈ క్షేత్రంలో చూడదగిన పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం మీ కోసం....

తలకాడు

తలకాడు

P.C: You Tube

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే స్కాందపురాణంలో ఈ తలకాడు ప్రస్థావన కనిపిస్తుంది. అందులో ఉన్న వివరాలను అనుసరించి బోయల పేరు పై ఈ పుణ్యక్షేత్రానికి తలకాడు అనే పేరు వచ్చింది.

తలకాడు

తలకాడు

P.C: You Tube

బోయజాతికి చెందిన తల, కాడు అనే ఇద్దరు సోదరులు జీవనం కోసం వేటాడేవారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రస్తుతం తలకాడు ఆలయం ఉన్న చోటుకు వస్తారు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

ఓ జంతువును వేటాడటం కోసం బానాలు వదిలారు. ఆ బానాలు ఓ శివలింగానికి తగిలి ఆ శివలింగం నుంచి రక్తం వచ్చింది. దీంతో వారు ఆ శివుడిని ప్రార్థిస్తారు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

వారి ప్రార్థనకు కరిగిన ఆ బోళా శంకరుడు ఓ వైద్యుడి రూపంలో వచ్చి అక్కడే ఉన్న చెట్ల ఆకులతో మందును తయారు చేసి ఆ శివలింగానికి పూస్తాడు. దీంతో ఆ శివలింగం నుంచి రక్తం కారడం ఆగిపోతుంది.

తలకాడు

తలకాడు

P.C: You Tube

అటు పై ఆకాశవాణి సూచనలను అనుసరించి ఆ సోదరులిద్దరూ ఆ శివలింగానికి ఆలయం కట్టిస్తారు. అంతేకాకుండా సాక్షాత్తు శివుడే వైద్యుడి రూపంలో రావడం వల్ల ఆ ఆలయంలోని శివుడిని వైద్యేశ్వర స్వామిగా కొలుస్తారు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

ఇక కర్నాటకలోని తలకాడు వైద్యేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివుడు పంచముఖాలూ, పంచనామాలతో, పంచ ఆవరణల్లో పంచలింగాలుగా కొలువై ఉన్నాడు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

అవే వైద్యేశ్వర, అర్కేశ్వర, వాసుకేశ్వర, సైకతేశ్వర, మల్లికార్జున లింగాలు. అలాగే ఇక్కడ పాతాళేశ్వర, మురాళేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి.

తలకాడు

తలకాడు

P.C: You Tube

ప్రతి ఆలయ దర్శనానికి ముందు కావేరి నదీలో స్నానం చేసి, ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకోవాడం ఇక్కడ ఆచారం. ఈ ఐదు ఆలయాలు 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి కాబట్టి మార్గాయాసం కూడా కనిపించదు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

ఒకవేళ ఏమైనా బడలికగా అనిపించినా నదీ స్నానం ఉందికదా. ఈ పంచముఖలింగాలనూ దర్శించుకున్న తర్వాత అక్కడకు చేరువలో ఉన్న కీర్తినారాయణస్వామి వారి ఆలయానికి వెళ్లి, స్వామివారిని సందర్శించుకోవాలి.

తలకాడు

తలకాడు

P.C: You Tube

అలా చేస్తేనే యాత్రాఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సోమవారం ఇక్కడ ఇసక వేస్తే రాలనంత మంది భక్తలు ఉంటారు. అప్పుడు ఆ ప్రాంతం మొత్తం శివనామ స్మరణతో మారిమోగి పోతుంది.

తలకాడు

తలకాడు

P.C: You Tube

ముఖ్యంగా పౌర్ణమిరోజు మరీ ముఖ్యంగా శ్రావణ మాసం పున్నమి, కార్తీక పున్నముల్లో ఇక్కడికి వచ్చే భక్తజనంతో ఈ తలకాడు మొత్తం నిండిపోతుంది. వైద్యనాథేశ్వరస్వామిని సందర్శించడం వల్ల దీర్ఘరోగాలు, మొండివ్యాధులు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతారు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

తలకాడుకు దగ్గర్లోని శ్రీరంగ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని శ్రీరంగ రాయ అనే రాజు పాలన సాగించేవాడు. అయితే ఆయనకు ఒకసారి జబ్బు చేసింది. ఎంత ప్రయత్నించినా వ్యాధి నయం కాదు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

రాజ వైద్యుల సూచనమేరకు రాజ్యభారాన్ని తన రెండో భార్య అయిన అలమేలమ్మకు అప్పగించి వైద్యేశ్వరనాధుడి వద్దకు వెలుతాడు. అక్కడే ఉంటూ స్వామివారిని సేవిస్తూ ఉంటాడు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

ఈ విషయాన్ని గుర్తించిన పొరుగున ఉన్న మైసూరు రాజు చామరాజ ఒడయారు క్రీస్తు శకం 1610లో శ్రీరంగ పట్టణం పై దాడి చేసి ఆక్రమిస్తాడు. ఈ సమయంలో రక్తం ఏరులై పారుతుంది.

తలకాడు

తలకాడు

P.C: You Tube

శత్రు రాజుకు దొరకకుండా భర్త వద్దకు వెలుతున్న అలమేలమ్మను చామరాజ ఒడయార్ ఆదేశాల మేరకు సైనికులు వెంబడించి ఆమె నగలను తీసుకోవడమే కాకుండా ఆమెను బలత్కరించడానికి ప్రయత్నిస్తారు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

విషయం పసిగట్టిన అలమేలమ్మ కావేరి నదిలోకి తన ఆభరణాలను జాడవిడిచి శాపం పెడుతుంది. ఒడయారు పాలనలో ప్రముఖ సైనిక కేంద్రమైన తలకాడు ఇసుకదిబ్బగా మారిపోతుందని చెబుతుంది.

తలకాడు

తలకాడు

P.C: You Tube

అంతేకాకుండా ఒడయారు పాలనలోని మాలంగా సర్వనాశనం అవుతుందని ఆ మైసూరు వంశానికి వారసుడు లేకుండా పోతాడని మరో రెండు శాపాలు కూడా పెడుతుంది. ఈ విషయాన్నీ ఇప్పటికీ అక్షర సత్యాలయ్యాయి.

తలకాడు

తలకాడు

P.C: You Tube

కాగా, ఈ తలకాడుకు సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. దానిని అనుసరించి శ్రావణ సోమవారం ఈ తలకాడు మొత్తం ఇసుక దిబ్బగా మారి పోతుందని ఆ సమయంలో యుగాంతం సంభవిస్తుందని భక్తులు నమ్ముతారు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

ముఖ్యంగా పన్నేండేళ్లకు ఒకసారి యోగ, వైశాఖ నక్షత్రాలు ఒకే రేఖ పై వస్తాయి. అదే రోజు పౌర్ణమి సంభవిస్తుంది. ఆ రోజున ఈ ఐదు దేవాలయాల్లో ఒకేసారి మహా ఆరతి ఇస్తారు. ఇక యుగాంతం కూడా ఇదే రోజు సంభవిస్తుందని చెబుతారు.

తలకాడు

తలకాడు

P.C: You Tube

మైసూరుకు 28 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు 133 కిలోమీటర్ల దూరంలో తలకాడు పుణ్యక్షేత్రం ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి మైసూరుకు బస్సు, రైలు సర్వీసులు బాగున్నాయి. అక్కడి నుంచి తలకాడుకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. తలకాడులో రాత్రి బస అంత సౌకర్యంగా ఉండదు. అందువల్ల తిరిగి మైసూరు చేరుకోవడం ఉత్తమం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X