• Follow NativePlanet
Share
» » ఈ దేవాలయకు వెళితే ప్రసాదంతో పాటు ఆ ‘యాంగిల్స్’పై నాలెడ్జ్ కూడా ఫ్రీ

ఈ దేవాలయకు వెళితే ప్రసాదంతో పాటు ఆ ‘యాంగిల్స్’పై నాలెడ్జ్ కూడా ఫ్రీ

Written By: Kishore

ఇక్కడ ఆ పందిరి వేస్తే...మీరు పట్టె మంచెం చేరే సమయం దగ్గరవుతుంది.

అమ్మాయిలూ ఇక్కడ 'అవి లూజ్'గా ఉంటే మీ 'కోరిక'నెరవేరదు

హిందూ మతానికి సంబంధించి ఒక మానవుడు తన జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే ధర్మాలను వయస్సు, కాలం, పరిస్థితులకు అనుగుణంగా పాటించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ భూలోకం స్వర్గమయం అవుతుందని పెద్దలు చెబుతారు. ఇందు కోసమే దేవాలయాను కూడా నిర్మించారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా దేవాలయం అనగానే దైవ దర్శనం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం, పాపాలను పోగొట్టుకొని పుణ్యం సంపాదించడం అని చాలా మంది భావిస్తారు. మన పెద్దలు కూడా వీటిని మాత్రమే చెపుతారు. అయితే దేవాలయాల నిర్మాణంలో కామాన్ని అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రజలకు తెలియజేయడానికి వీలుగా పూర్వ కాలంలో వాటి నిర్మాణం జరిగిందని కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇందుకు ఉదాహరణ వాటి పై ఉన్న శిల్పాలే. అలా కామకేళి ప్రధాన అంశంగా తీసుకొని నిర్మించిన కొన్ని దేవాలయాలకు సంబంధించిన వివరాలు మీ కోసం. 

1. ఖజురహో

1. ఖజురహో

Image Source:

ఖజురహో దేవాలయాలు చాలా చిన్న ఆలయాలు. ఇవి మధ్యప్రదేశ్ లోని చిన్న పట్టణమైన ఖజురహోలో ఉన్నాయి. ఇవన్నీ దేవాలయ సముదాయం. స్థల పురాణం ప్రకారం శివుడితో పాటు చాలా మంది దేవతలను ఆ ప్రాంతాన్ని సందర్శించాడని చెబుతారు. అందువల్ల ఆలయాలు వారి గౌరవార్థం కట్టించబడ్డాయి.

2. రతి కేళి

2. రతి కేళి

Image Source:

ఈ దేవాలయాల యొక్క నిర్మాణం ప్రధానంగా దేవతలతో పాటు రతి కేళి భంగిమలతో కూడుకుని ఉంటాయి. ఇక్కడకు వచ్చిన పర్యాటకలు ఈ బొమ్మలను చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఇది హిందూ మతం యొక్క నాలుగు ప్రధాన అంశాలైన - ధర్మ, అర్దా, కామ, మోక్షాల్లో కామ కొంత ఎక్కువ మోతాదులో ఈ దేవాలయంలో కనిపిస్తుంది.

3. కోణార్క్

3. కోణార్క్

Image Source:

కోణార్క్ లోని సన్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సూర్యదేవాలయాల్లో ఒకటి. సూర్య భగవానుడికి అంకితమైన ఈ ఆలయం 13 వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది. దీనిని దీనిని 'బ్లాక్ పగోడా' అని కూడా పిలుస్తారు. కోణార్క్ సన్ టెంపుల్ ఒక పెద్ద రథం రూపంలో ఉంటుంది. రాతి చక్రాలు, స్తంభాలు, గోడలు అద్భుతంగా చెక్కినవి. అయితే దురదృష్టవశాత్తు చాలా శిల్పాలు వాతావరణంలో కలిగిన మార్పుల కారణంగానే కాకుండా విదేశీ దండయాత్రల కారణంగా ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నాయి.

4. శృంగారం ప్రధాన అంశంగా

4. శృంగారం ప్రధాన అంశంగా

Image Source:

ఆలయ గోడలపై మైథునం ప్రధాన అంశంగా చెక్కబడిన ఎన్నో శిల్పాలను చూడవచ్చు. బ్రిటిష్ వారు కొనార్క్ టెంపుల్ ను ' ఈ దేవాలయం అత్యంత అందమైనదే కాకుండా అత్యంత అశ్లీలమైనది' అని పేర్కొనే వారు. దీన్ని బట్టి ఇక్కడ ఆ సెక్సీ పాలు ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

5. జగదీష్ మందిర్, ఉదయపూర్

5. జగదీష్ మందిర్, ఉదయపూర్

Image Source:

మొదట్లో జగన్నాథ్ రాయ్ ఆలయం అని పిలిచే జగదీష్ మందిరం రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్న ఒక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఇది 3 అంతస్తుల ఆలయము. ప్రధాన ఆలయం నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడింది. దేవాలయంలో మిగిలిన భాగాలు ఇత్తడి వంటి లోహాలతో నిర్మించారు. ఈ దేవాలయ గోడల్లో మంనం మహారాణా జగత్ సింగ్ కాలం నాటి శాసనాలను కూడా చూడవచ్చు.

6. అలౌకి ఆనందాన్ని పొందినప్పుడే

6. అలౌకి ఆనందాన్ని పొందినప్పుడే

Image Source:

జగదీష్ మందిర్ ఆలయం కూడా కొన్ని శృంగార చిత్రాలను కలిగి ఉంది. అంతే కాకుండా ఇందుకు గల కారణాలు కూడా అక్కడ ఉండే శాసనాల్లో వివరించబడింది. మానవుడు తనకు ఇష్టమైన అలౌంకిక ఆనందాన్ని సొంతం చేసుకొన్నప్పుడే పరమాత్ముడిని తొరగా చేరుకోగలడని అందులో ఉన్నాయి.

7.మహారాష్ట్ర, మార్కండేశ్వర్

7.మహారాష్ట్ర, మార్కండేశ్వర్

Image Source:

మహారాష్ట్రలోని మార్కండేశ్వర దేవాలయంలో శివుడిని ప్రధానంగా ఆరాధిస్తారు. ఈ దేవాలయం చాలా పవిత్రమైనదిగా పర్యాటకులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడికి వెళితే మ`త్యు భయం పోతుందనేది వారి నమ్మకం. ఈ దేవాలయ గోడల పై కొన్ని శిల్పాలు రతి క్రీడను ప్రతి బింభించేవిగా ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు విభిన్న భంగిమల్లో రతి క్రీడలో ఉండే శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. కేవలం ఇవే కాకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఇటువంటి మరికొన్ని బొమ్మలను ఇక్కడ ఆలయ నిర్వాహకులు భద్రపరిచారని తెలుస్తోంది.

8. పడ్వాలి, మధ్యప్రదేశ్

8. పడ్వాలి, మధ్యప్రదేశ్

Image Source:

చంబల్ నదీ లోయకు సంబంధించిన పడ్వాలిలో వేల ఏళ్ల క్రితం నిర్మించిన విష్ణు, శివ దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటిలో చాలా వరకూ శిథిలమయి పోయాయి. ఆ శిథిలాల్లో కూడా చాలా శిల్పాలు ఇప్పటి వరకూ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

9. కామసూత్రాలకు అనుగుణంగా

9. కామసూత్రాలకు అనుగుణంగా

Image Source:

ఈ శిల్పాలు మొత్తం భారతీయ కామసూత్రాల ప్రకారం చెక్కినవే. పర్యాటకులు దేవాలయల్లోని మూల విరాట్టుల కంటే ఈ శిల్పాలనే ఎక్కువ ఆసక్తితో చూస్తుంటారు. ఇక్కడికి విదేశీయుల సంఖ్య కూడా ఎక్కువే.

10. సూర్యదేవాలయం, గుజరాత్

10. సూర్యదేవాలయం, గుజరాత్

Image Source:

గుజరాత్ లోని మోదెరా లో ఉన్న సూర్యదేవాలయం ప్రస్తుతం ఇప్పుడు ఎటువంటి ప్రార్థనలు, పూజలు జరగడం లేదు. ఈ దేవాలయంలో ప్రధానంగా సూర్యుడి విగ్రహంతో పాటు సముద్ర మథనానికి సంబంధించిన విగ్రహాలు, కుడ్య చిత్రాలను చూడవచ్చు.

11. అందుకనే

11. అందుకనే

Image Source:

అంతే కాకుండా వివిధ శ`ంగార భంగిమల్లో కనిపించే శిల్పాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. సంసార జీవితంలో మైథునం కూడా ఒక భాగమని చెప్పడానికే ఈ శిల్పాలను ఈ దేవాలయంలో ఏర్పాటు చేసినట్లు పురవస్తు శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

12. ఓసియన్, రాజస్థాన్

12. ఓసియన్, రాజస్థాన్

Image Source:

ఆలయ గోడలపై శృంగార మరియు లైంగిక చిత్రాలను చేర్చడం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదు. జైన మతంలో కూడా ఉన్నట్లు కొన్ని సందర్భాల్లో తెలుస్తోంది. రాజస్థాన్ లోని జోథ్ పూర్ శివారులోని ఓ గ్రామం. ఇక్కడ ఉన్న దేవాలయల్లోని చిత్రాలు, శిల్పాలను అనుసరించి దీనిని రాజస్థాన్ రాష్ట్రపు ఖజురహో అని పిలుస్తారు. దీన్ని అనుసరించి ఇక్కడ శిల్పాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు.

13. రతి క్రీడ కూడా జీవితంలో ఒక భాగమే

13. రతి క్రీడ కూడా జీవితంలో ఒక భాగమే

Image Source:

ఈ జైన ఆలయంలో జైన గురువులు, మహావీరుడి జీవిత చరిత్రలను శిల్ప కళ రూపంలో అద్భుతంగా చెక్క బట్టాయి. ఈ శిల్పాలతో పాటు, నాగ దేవతల శిల్పాలు మరియు శృంగార చిత్రాలను కూడా ఉన్నాయి. మిగిలిన పనుల వలే రతి క్రీడ జీవితంలో ఒక భాగమని చెప్పడానికే ఈ శిల్పాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

14. విరూపాక్ష దేవాలయం, హంపి

14. విరూపాక్ష దేవాలయం, హంపి

Image Source:

కర్నాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హంపిలో విరూపాక్ష దేవాలయం ఉంది. తుంగభద్ర నదీ తీరంలో కలిగిన ఈ దేవాలయాన్ని యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించింది. ఈ దేవాలయంలో శివుడిని విరూపాక్ష స్వామి రూపంలో కొలుస్తారు.

15.శృంగార చిత్రాలు, శిల్పాలు కూడా

15.శృంగార చిత్రాలు, శిల్పాలు కూడా

Image Source:

ఇక్కడ ప్రధాన ఆలయం గోపురం నీడ తలక్రిందులుగా కనిపిస్తుంది. సంగీతం ప్రతిధ్వనించే రాతి స్థంభాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదే విధంగా ఈ ఆలయం ప్రహరీ గోడల పైనే కాకుండా కొన్ని స్థంభాల పై కూడా శృంగార చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి.

16.త్రిపురాంతక దేవాలయం

16.త్రిపురాంతక దేవాలయం

Image Source:

కర్ణాకలోని త్రిపురాంతక దేవాలయాన్ని క్రీస్తు శకం 1070లో పశ్చిమ చాళుక్యులు నిర్మించారు. ఇక్కడ శిల్పాలు భారతీయ శిల్ప కళకు అద్ధం పడుతాయి. ముఖ్యంగా అతి సూక్ష్మంగా రాతిని దారపు పోగుల వలే చెక్కిన శిల్పాలు ఇక్కడ చూడ ముచ్చటగా ఉంటాయి.

17. అనేక రతి భంగిమలు

17. అనేక రతి భంగిమలు

Image Source:

దీనితో పాటు ఇక్కడ రెండు తలలు ఉన్న గండ బేరుండా శిల్పాన్ని కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా రతి భంగిమలకు సంబంధించిన ఎన్నో శిల్పాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

18. కైలస టెంపుల్ ఎల్లోరా

18. కైలస టెంపుల్ ఎల్లోరా

Image Source:

ఎల్లోరా గుహలలో ఒక చిన్న భాగం లో ఉన్న కైలాస టెంపుల్ శివునికి అంకితం చేయబడింది. హిందువులు శివుడు నివశిస్తున్నట్లు చెప్పే కైలాసాన్ని ప్రతిబింభించేలా ఇక్కడ ప్రధాన శిల్పం ఉంటుంది.
ముఖ్యంగా రావణుడు కైలాసాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తున్న శిల్పం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. దీనికి అటు ఇటు పక్కనే కొన్ని శ`ంగార పరమైన శిల్పాలను కూడా మనం చూడవచ్చు.

19. లింగరాజ టెంపుల్, భువనేశ్వర్

19. లింగరాజ టెంపుల్, భువనేశ్వర్

Image Source:

భువనేశ్వర్ లోని లింగరాజ దేవాలయంలో ప్రధానంగా శివుడిని కొలుస్తారు. అదే విధంగా హరి, హర రూపంలో ఉన్న శిల్పం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇక్కడ భారతీయ కామసూత్రానికి సంబంధించిన శిల్పాలు కూడ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి.

20. రనక్ పూర్, రాజస్థాన్

20. రనక్ పూర్, రాజస్థాన్

Image Source:

రాజస్థాన్ లోని రనక్ పూర్ ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఉదయ్ పూర్ కు దగ్గరగా ఉంది. జైన మతానికి చెందిన మొదటి తీర్థాకరుడు వ`షభనాథుడికి చెందిన ఈ దేవాలయం పూర్తిగా తెల్లపాలరాతితో నిర్మించబడింది. ఇందులో కూడా కొన్ని రతి కేళకు సంబంధించిన విగ్రహాలను మనం చూడవచ్చు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి