Search
  • Follow NativePlanet
Share
» »చొట్టనిక్కర - దర్శిస్తే జీవితం ధన్యం !

చొట్టనిక్కర - దర్శిస్తే జీవితం ధన్యం !

By Mohammad

చొట్టనిక్కర కేరళ రాష్ట్రంలోని అందమైన కుగ్రామం. ఈ గ్రామం ఎర్నాకులం జిల్లా, కొచ్చి పొలిమేరలలో ఉంటుంది. దక్షిణాది గ్రామాలవలే రోడ్డు ప్రయాణాలు చేసేవారు పచ్చటి పొలాలను చూసి ఆనందించవచ్చు. ఈ గ్రామంలోని ప్రజల జీవితాలు భజనలు, ప్రార్థనలతో నిండి ఉంటాయి. లక్షలాది యాత్రికుల మనోభావాలకు చోటనిక్కర నిదర్శనంగా నిలుస్తుంది.

చొట్టనిక్కర దేవాలయం

చొట్టనిక్కర దేవాలయం

చిత్రకృప : Roney Maxwell

పర్యాటకుడిని ఆనందపరిచేందుకు ఈ చిన్న గ్రామం అనేక ఆకర్షణలు కలిగి ఉంది. చొట్టనిక్కర దేవాలయం లేదా దీనినే చొట్టనిక్కర భగవతి దేవాలయం అని కూడా అంటారు. ఇది ఒక ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం అనేక శతాబ్దాల కిందటిది. దీనిలో మాత భగవతి విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయ శిల్పశైలి అద్భుతం. విశ్వకర్మ స్తపతిల నమూనాలో ఉంటుంది. ఈ దేవాలయంలో జరిగే చొట్టనిక్కర మాకం తోజాల్ వేడుక ప్రసిద్ధి గాంచినది. ఈ పండుగకు అనేకమంది భక్తులు, పర్యాటకులు వస్తారు.

కాడుతుర్తి శివ దేవాలయం

కాడుతుర్తి శివ దేవాలయం

చిత్రకృప : Ssriram mt

కాడుతుర్తి శివ దేవాలయం

కేరళలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో కాడుతుర్తి శివాలయం ఒకటి. దీనినే తాళీ దేవాలయం అంటారు. ఇందులోని శివ విగ్రహాన్ని ఖరాసురుడు అనే రాక్షసుడు ప్రతిష్టించాడని చెబుతారు. దేవాలయంలో శివుని కథలు అద్భుత చెక్కడాలుగా కనపడతాయి.

పూర్ణత్రయేశ దేవాలయం

పూర్ణత్రయేశ దేవాలయం

చిత్రకృప : Challiyan

పూర్ణత్రయేశ దేవాలయం

పూర్ణత్రయేశ - విష్ణుమూర్తి అవతారం. వెయ్యి సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయంలో పిల్లలు లేనివారు పూజలు చేస్తే పిల్లు పుడతారని నమ్మకం. నవంబర్ - డిసెంబర్ నెలలో జరిగే వృచ్చికోత్సవం ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

మ్యూజియం

మ్యూజియం

చిత్రకృప : Rojypala

మ్యూజియం

గతంలోని త్రిరూెనితుర హిల్ ప్యాలెస్ అయిన పురావస్తు మ్యూజియం మరొక ప్రధాన ఆకర్షణ. ఈ మ్యూజియంలో ఒకప్పటి కొచ్చి రాజ్యానికి సంబంధించిన వస్తువులు ప్రదర్శంచారు. కాడు తురుతి శివ దేవాలయం మరియు పూర్ణత్రయేశ దేవాలయం లు రెండూ కూడా పర్యాటకులు తప్పక చేడదగినవి. ఎంబాంక్ సరస్సు కాడుతుిుతి శివ దేవాలయానికి సమీపంలో కలదు.

చోటనిక్కర ఆలయం లోపలి భాగం

చోటనిక్కర ఆలయం లోపలి భాగం

చిత్రకృప : Ssriram mt

భక్తి, సంస్కృతుల సమ్మేళనం

చొట్టనిక్కర దేవాలయం మరియు ఇతర దేవాలయాలు ఈ చిన్న గ్రామంలో ఒక విశిష్ట సంస్కృతిని నెలకొ్ల్పాయి. భక్తి గీతాలు, మతపర ఉపన్యాసాలు దేవాలయాలనుండి వినపడుతూంటాయి. ఈ దేవాలయాలలో అనేక వేడుకలు, పండుగలు జరుపుతారు. సంవత్సరంలో చాలా భాగం భక్తులు వేడుకల పేరుతో దర్శిస్తూనే ఉంటారు.

ఇది కూడా చదవండి : శబరిమల గురించి తెలియని 10 నిజాలు !

ఓనం పండుగ సీజన్ లో నిర్వహించే తిరుఓనం, నవరాత్రి పండుగ, వ్రుశ్చిక మండల మమోత్సవం, త్రికార్తీక పండుగ, రామాయణ మాసం మరియు ఉత్తరం హారతి పండుగ వేడుకలు చొట్టనిక్కరలో ప్రసిద్ధి. చొట్టనిక్కర దేవాలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు ఊరేగింపు కొరకై ఏడు పెద్ద ఏనుగులను ఉపయోగిస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలి.

ఈ గ్రామ దేవాలయాలను సందర్శించాలంటే ఆగస్టు నుండి మార్చి వరకు ఉత్తమ సమయం. ప్రాంత పండుగలకు కూడా సందర్శన ప్రణాళిక చేయవచ్చు. కొచ్చి పరిసరాలలో ఉండటంతో రవాణా తేలిక.

చొట్టనిక్కర ఎలా చేరుకోవాలి ?

చొట్టనిక్కర ఎలా చేరుకోవాలి ?

చిత్రకృప : Sudheer KG

చొట్టనిక్కర ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 37 km ల దూరంలో ఉన్న కొచ్చి సమీప విమానాశ్రయం.

రైలు మార్గం : త్రిపునితుర స్టేషన్ (4 km), ఎర్నాకులం జంక్షన్ (16 km) లు చొట్టనిక్కర సమీపాన కలవు.

రోడ్డు మార్గం : కొచ్చి, ఎర్నాకులం నుండి బస్సులు చొట్టనిక్కర వస్తుంటాయి. బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, కోయంబత్తూర్, మంగళూరు తదితర ప్రాంతాల నుండి కొచ్చి చేరుకొని, అక్కడి నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులలో ఇక్కడికి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X