Search
  • Follow NativePlanet
Share
» »కూనూర్ పర్యటన ...ఒక మరువలేని అనుభూతి !

కూనూర్ పర్యటన ...ఒక మరువలేని అనుభూతి !

కూనూర్ ఒక అందమైన పర్యాటక ప్రదేశం. బెంగుళూరు నుండి 302 కి. మీ. ల దూరం మాత్రమే. ఊటీ కి సుమారు 17 కి. మీ. లు. కలదు. నీలగిరి కొండలలో ఊటీ తర్వాత ప్రసిద్ధి చెందినా హిల్ స్టేషన్ కూనూర్. నగర బిజి జీవనంతో విసిగి వేసారిన వారికి ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ గా కూనూర్ తప్పక సిఫార్సు చేయదగినది.

సముద్ర మట్టానికి సుమారు రెండు వేల మీటర్ల ఎత్తున కల కూనూర్ హిల్ స్టేషన్ నుండి నీలగిరి కొండల అద్భుత దృశ్యాలు చూడవచ్చు. కూనూర్ వెళ్ళే మార్గంలోనే, మీరు సమయం దొరికితే, ఊటీ కూడా సందర్శించవచ్చు.

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

కూనూర్ ఎలా చేరాలి ?
బెంగుళూరు నుండి కూనూర్ వెళ్ళే వారు ముందుగా స్టేట్ హై వే 17 నుండి మైసూరు మరల నేషనల్ హై వే 212 పై ప్రయాణించి గుండ్లుపేట్ చేరాలి బందిపూర్ నేషనల్ పార్క్, గుదలూర్, ఊటీ, అరవంకాడు, వెల్లింగ్టన్ ప్రదేశాలు మధ్యలో తగులుతాయి. ఇండియా లోని వేరే ప్రదేశాల వారు కోయంబత్తూర్ కు వెళ్లి అక్కడ నుండి మేట్టుపలయం చేరాలి. మేట్టుపలయం నుండి టాయ్ ట్రైన్ లో కూనూర్ చేరవచ్చు. లేదా సుమారు 14 సన్నని ఒంపులు కల మార్గంలో ఒక అద్దె కారులో ప్రయాణించవచ్చు. అయితే మార్గంలో అనేక సుందర ప్రకృతి దృశ్యాలు వీక్షించ వచ్చు.

Pic Credit: Wiki Commons

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

సింస్ పార్క్

అందమైన పచ్చటి షోలా గ్రాస్ మార్గాలు, సుందర దృశ్యాలు పురాణ గాధల దృశ్యాలు తలపిస్తాయి. వసంత కాలం వచ్చిందంటే చాలు పార్క్ అంతా రంగు రంగుల పూల తో ఆకర్షణీయంగా వుంటుంది. ఈ పార్క్ సముద్ర మట్టానికి సుమారు 1800 మీ. ల ఎత్తున కలదు.

Pic Credit: Thangaraj Kumaravel

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

లాంబ్స్ రాక్ మరియు లాస్ జలపాతాలు
ఈ జలపాతాలు కూనూర్ నుండి 8 కి. మీ. ల దూరం. డాల్ఫిన్ నోస్ వెళ్ళే మార్గంలో కలవు. మార్గంలో కోయంబత్తూర్ మైదాన ప్రాంతాలు కూడా చూడండి. ఇవి కూనూర్ నుండి 7 కి. మీ. ల దూరంలో కలవు. కూనూర్ - మేట్టుపలయం మార్గంలో కల ఈ ప్రదేశం ఒక అద్భుత పిక్నిక్ ప్రదేశం. ప్రకృతి ప్రియులకు ఒక స్వర్గం వాలే వుంటుంది.

Pic Credit: Thangaraj Kumaravel

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

డాల్ఫిన్స్ నోస్
డాల్ఫిన్స్ నోస్ ప్రదేశం కూనూర్ నుండి పది కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడి నుండి ప్రసిద్ధ నీలగిరి కొండల అందాలు చూడవచ్చు. కేథరిన్ జలపాతాలు చూడవచ్చు. మార్గంలో కల లేడీ కేనింగ్ సీట్ మరొక ఆకర్షణీయ ప్రదేశం.

Pic Credit : Thangaraj Kumaravel

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

ప్రకృతి నడకలు
ఆహ్లాదకర వాతావరణం కల కూనూర్ కాలి నడకలు ఇష్టపడే వారికి ఒక స్వర్గం వాలే వుంటుంది. కనుక అక్కడ కల తేయాకు తోటలలో లేదా సమీప గ్రామాలకు ఒక లాంగ్ వాక్ తప్పక చేయండి.

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

బర్డ్ వాచింగ్
బర్డ్ వాచింగ్ పట్ల మీకు ఆసక్తి వున్నా లేకపోయినా, వివిధ రకాల పక్షులు పైన ఎగరటం గమనిస్తారు. కూనూర్ ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి. అనేక ప్రదేశాలలో మీకు ఆసక్తి వుంటే, ట్రెక్కింగ్ చేసి మీ ధైర్య సాహసాలను, శారీరక దారుడ్యా న్ని పరీక్షించు కొనవచ్చు.
Pic Credit: Antony Grossy

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

కోరినన్ని ఆకర్షణల కూనూర్ !

షాపింగ్ ప్రియులా ?
ఇక్కడ సహజ సిద్ధమైన చీస్ తయారీ పరిశ్రమ కలదు. ఈ పరిశ్రమలో కోర్సులు కూడా మీకు ఆసక్తి వుంటే చేయవచ్చు. స్థానికంగా తయారు అయ్యే ఉత్పత్తులకు ఎన్నో దుకాణాలు కలవు. తేయాకు, తేనె, జాములు, చేతితో అల్లిన దుస్తులు, ప్రసిద్ధి.

Pic Credit: Brian Boucheron


మరిన్ని కూనూర్ ఆకర్షణలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X