Search
  • Follow NativePlanet
Share
» »సీతా రాములు బంగారు జింకను చూసిన ప్రదేశం లో బంగారు గనులు..మన మధ్యనే ఉన్న ఆ ప్రదేశం తెలుసా!

సీతా రాములు బంగారు జింకను చూసిన ప్రదేశం లో బంగారు గనులు..మన మధ్యనే ఉన్న ఆ ప్రదేశం తెలుసా!

సీతా రాములు 14సం లు వనవాసం చేస్తున్న సమయంలో ఒక అడవిలో వెళ్తున్నారు. ఇంతలో వాళ్లకి ఒక బంగారుజింక కనిపించింది. అక్కడ తిరిగే జంతువులే బంగారు జంతువులైతే మరి ఆ ప్రాంతంలో ఎంత బంగారం వుండి వుండాలి.

By Venkatakarunasri

సీతా రాములు 14సం లు వనవాసం చేస్తున్న సమయంలో ఒక అడవిలో వెళ్తున్నారు. ఇంతలో వాళ్లకి ఒక బంగారుజింక కనిపించింది. అక్కడ తిరిగే జంతువులే బంగారు జంతువులైతే మరి ఆ ప్రాంతంలో ఎంత బంగారం వుండి వుండాలి. ఇంతకి ఆ ప్రాంతం ఎక్కడ వుందో? ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏమేమి వున్నాయో తెలుసుకుందాం. కోలార్ ను అల్లుకున్న కథలు ; కోలార్ చుట్టూ అనేక పురాణాలూ, కథలలో సనాతన రుషి వాల్మీకి ఇక్కడే నివాసం ఉండేవారన్నది ఒకటి. రాముడు తన వనవాసంలో కోలార్ ని సందర్శించాడు, రాముడు సీతను వదలివేసిన తరువాత ఆమె ఇక్కడే ఆశ్రయం పొందింది. వారి కుమారులైన లవకుశులు కోలార్ లోని వాల్మీకి ఆశ్రమంలోనే జన్మించారు.

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఎక్కడ వుంది?

సీతారాములు బంగారు జింకను చూసిన ప్రదేశం ఇప్పుడు కోలారు బంగారు గనులున్న ప్రదేశామట. ఇక్కడి బంగారు గనులకు కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉంది. ఒక అధ్యయనం ప్రకారం హరప్పా మరియు మొహంజొదారో నాగరికత నాటికే ఇక్కడ గనుల నుండి బంగారాన్ని వెలికితీసేవారు. గుప్తుల స్వర్ణయుగ కాలంలో దాదాపు 50 మీటర్లు భూమి లోపలికి తవ్వకాలు సాగించి బంగారాన్ని వెలికితీసేవారని తెలిసింది.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

కోలార్ - ప్రశాంత పట్టణం

కోలార్, కర్నాటకకు తూర్పు అంచున ఉన్న ఒక ప్రశాంతమైన పట్టణం. కోలార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ల సరిహద్దులో ఉండి 3,969 కిలోమీటర్ల మేర విస్తరించిఉంది. కోలార్ బంగారు గనులకు ప్రసిద్ది చెందింది, కానీ అలాగే దీనికి బంగార౦ లాంటి చరిత్ర కూడా ఉంది - ఈ పట్టణం గతంలో కొన్ని నిజంగా అద్భుతమైన దేవాలయాలు, కోటలు కలిగిఉంది.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

కోలార్ ను అల్లుకున్న కథలు ; కోలార్ చుట్టూ అనేక పురాణాలూ, కథలలో సనాతన రుషి వాల్మీకి ఇక్కడే నివాసం ఉండేవారన్నది ఒకటి. రాముడు తన వనవాసంలో కోలార్ ని సందర్శించాడు, రాముడు సీతను వదలివేసిన తరువాత ఆమె ఇక్కడే ఆశ్రయం పొందింది. వారి కుమారులైన లవకుశులు కోలార్ లోని వాల్మీకి ఆశ్రమంలోనే జన్మించారు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

యోధుడు-ముని అయిన పరశురాముడు కోలార్ పడమటి అంచున ఉన్న పచ్చని కొండలపై నివసించేవాడని చెప్తారు. దీని చరిత్ర ఆధారంగా ఇది పూర్వం నించి కొలార్ గానే పిలువబడింది. కోలార్ అనే పదం కొలహలపుర అనగా "హింసాత్మక నగరం"అనే పదం నుండి ఉద్భవించింది.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఈ ప్రశాంత పట్టణంలోని కొండలు చోళ, చాళుక్య రాజవంశాల మధ్య జరిగిన హింసాత్మక యుద్ధాలకు సాక్షులు. గత వైభవపు ఆనవాళ్ళు ఇప్పటికీ ఈ పట్టణంలో చూడవచ్చు. ఇక్కడ కొలారమ్మ, సోమేశ్వర దేవాలయాలు చూడదగ్గవి.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఇక్కడ పారాసైలింగ్, పర్వతారోహణ వంటి సాహస క్రీడలు పర్యాటకుల్లో బాగా ఆదరణ పొందాయి. కోలార్, బెంగుళూరుకి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

వారి తదనంతరం చోళులు, విజయనగర రాజులు, టిప్పు సుల్తాన్ కూడా బంగారం తవ్వకాలను కొనసాగించారు. 1802 లో కెప్టెన్ వారెన్ అను బ్రిటీష్ వ్యక్తికి గనుల తవ్వకాలకు అనుమతి లభించింది. పిమ్మట బెంగుళూరుకు చెందిన ఎం. ఎఫ్. లావెల్లీ అనే బ్రిటీష్ వ్యక్తి గనుల తవ్వకానికి అనుమతి కోరుతూ మైసూరు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

1875 లో అనుమరి మంజూరైనా అధిక ఖర్చు కావడంతో అతడు తవ్వకాలను ప్రారంభించలేకపోయాడు. కాలక్రమంలో జాన్ టేలర్ కంపెనీ చొరవతో ఇక్కడ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. కొన్ని వందల బ్రిటీష్ పౌరులు ఇక్కడికి తరలి రావడంతో ఈ ప్రాంతం చిన్న సైజు ఇంగ్లాండుని తలపించేది.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

కర్ణాటకతో బాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు నుండి కొన్ని వేల మంది ప్రజలు ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 1901- 1910 మధ్యకాలంలో ఈ గనులనుండి రికార్డు స్థాయిలో ఒక లక్షా డెబ్భైవేల (1,70,000) టన్నుల ముడి ఖనిజాన్ని వెలికితీశారు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

మంచి లాభదాయకంగా ఉండటంతో సంస్థ యాజమాన్యం కూడా ఇక్కడ గనుల తవ్వకాన్ని ప్రోత్సహించింది. పట్టణ శివార్లలోని 12 వేల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ తవ్వకాలు కొనసాగేవి. ముఖ్యంగా ఛాంపియన్ రీవ్ అనే గనిలో ఐతే దాదాపు 3 కిలోమీటర్ల తోతువరలు తవ్వకాలు జరిపారు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

దీనివలన ఈ గని ప్రపంచంలోనే లోతైన రెండవ గనిగా ప్రాచుర్యం పొందింది.పెరిగిన తవ్వకం వ్యయం మరియు ముడి ఖనిజంలో బంగారం శాతం గణణీయంగా తగ్గడంతో భారత జాతీయ ప్రభుత్వం 2001 మార్చి 21 న ఈ గనులను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

అసలు ఈ గని మూసివేయటానికి అక్కడి ప్రజలు చెప్పే కారణాలు మాత్రం వేరుగా వున్నాయి.అవేంటంటే అక్కడ దొరికే బంగారాన్ని అక్కడే వున్న కొంతమంది కాజేయదం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయిందని బంగారం వెతికేపనికి పెట్టె ఖర్చుతో పోలిస్తే లాభంతగ్గిపోవటంతో మూసివేసారుఅనే మాటలు కూడా వినిపిస్తాయి అక్కడి ప్రాంతంలో.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఇక ఆ గని లోపలి భాగంలో బ్రిటీష్ వాళ్ళు పెట్టిన ఇంటూ సింబల్స్ వున్నాయని ఇంటూ సింబల్స్ ప్రమాదానికి గుర్తు కావటంతో అక్కడికి వర్కర్స్ వెళ్ళటానికి భయపడుతున్నారని కాకపోతే ఆ ప్రాంతంలో ఇంకా బంగారం వుందనే అనుమానాలు కూడా ప్రజల్లో వున్నాయ్.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఇక మైతలాజికల్ కొస్తే రామలక్ష్మణసీతలు14 సంలు వనవాసం చేస్తున్నసమయంలో సీతారాములు ఆ ప్రాంతంలో నడుస్తూ వెళుతుండగా ఆ ప్రాంతంలో బంగారుజింకలువాళ్లకి కనిపించాయని కూడా చెపుతూవుంటారు అందుకే ఆ ప్రాంతంలో మొత్తం బంగారం వుందని చెపుతూ వుంటారు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

కోలార్ దగ్గర చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్

మార్కండేయ కొండ

కర్నాటకలోని కోలార్ జిల్లలో వోక్కలేరి గ్రామానికి దగ్గరలో ఉన్న మార్కండేయ కొండ అన్వేషిన్చడానికి పర్యాటకులకు సిఫార్స్ చేయబడినది. ఈ స్థలానికి మార్కండేయ ముని పేరు పెట్టారు. ఈ స్థలాన్ని మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి ఉపయోగించాడని స్థానికుల నమ్మకం.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

మార్కండేయ కొండ చేరిన తరువాత, పర్యాటకులు ఇదే పేరుతొ ఉన్న ఒక ఆలయాన్ని, జలశయాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ కొండపైన ఉన్న ఆలయంలో భక్తులు యమపాశానికి సంబంధించిన గుర్తులను కూడా చూడవచ్చు. మార్కండేయ కొండ చుట్టూ దట్టమైన అడవులను కలిగిఉంటుంది, కాబట్టి ప్రయాణీకులు ఆ స్థలంలో ప్రశాంతమైన పరిసరాల నడుమ సమయాన్ని గడపవచ్చు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఆదినారాయణ స్వామి గుడి

కోలార్ జిల్లాలోని ఎల్లోడు కొండల పైన వున్న ఆదినారాయణ స్వామి గుడిని యాత్రికులు తప్పక చూడాలి. బాగేపల్లి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో వున్న గుహాలయం ఇది. ఈ పుణ్య క్షేత్రంలో నగలు, అలంకారాలు లేని ఉద్భావమూర్తి రాతి విగ్రహం వుంటుంది. ప్రతీ ఆదివారం, ఇక్కడ ప్రత్యెక పూజ జరుగుతుంది.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ప్రతి ఏటా ఫిబ్రవరి - మార్చ్ నెలల్లో మాఘ మాసంలోని మూడో ఆదివారం నాడు ఆదినారాయణ స్వామి గుడిలో జరిగే రథోత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు చేరుకుంటారు. ఈ గుడిని చేరుకోవడానికి భక్తులు మొత్తం 618 మెట్లు ఎక్కాలి. ఈ 618 మెట్లలో గుడికి దగ్గరలో వున్న రెండు మెట్లు చాలా అసాధారణమైన ఎత్తులో వుండి, కేవలం తాడు సాయంతో మాత్రమె ఎక్కడానికి వీలవుతుంది.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

కోలారమ్మ గుడి

కోలార్ జిల్లాను సందర్శించే యాత్రికులు పార్వతి దేవి కోసం కట్టిన కోలారమ్మ గుడిని తప్పక చూడాలి. ‘ఎల్' ఆకారంలో వుండే ఈ తీర్థ స్థలం ద్రావిడ విమాన నిర్మాణ శైలి లో కట్టారు. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం చోళులు నిర్మించింది. కోలారమ్మ దేవి ఆశీస్సుల కోసం మైసూరు ను ఏలిన రాజులు ఈ తీర్థాన్ని సందర్శించేవారు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఈ గుడికి చేరుకున్నాక, గ్రానైట్ రాళ్ళతో చెక్కిన నమూనాలు, విగ్రహాలు యాత్రికులను అబ్బుర పరుస్తాయి. తేలు దేవత చేలమ్మ కూడా కోలారమ్మ దేవాలయంలో వుంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం చేలమ్మ దేవతకు పూజలు చేస్తే తేలు కాటు నుంచి రక్షణ లభిస్తుంది. (కన్నడంలో) హుండీ లేదా బావి కూడా ఈ తీర్థ స్థలి లో భాగం - దీంట్లో భక్తుల కానుకలన్నీ వేస్తారు. ఇక్కడి ఆచారం ప్రకారం, భక్తులు నేల మీద వున్న రంధ్రాలలో ఒక నాణెం ఉంచాలి.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

కోలార్ బంగారం గనులు

కోలార్ లో ప్రయాణించే పర్యాటకులు బంగారంపేట తాలూకా లోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ ని సందర్శించాలి. బ్రిటిష్ కాలంలో బంగారం ఉత్పత్తికి ఈ స్థలం పేరుగాంచింది. ఆ కాలంలో ఈ నగరం ఆంగ్లో-ఇండియన్లకే కాక, ఇటలీ, జెర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ జాతీయులకు నివాసంగా ఉండేది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒకప్పుడు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) లో పనిచేసే వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు నివాసంగా ఉండేది. అయితే, 2003 నించి గనులు మూతబడటం వల్ల వారి సంఖ్య వేలనుండి వందలకు తగ్గింది.

కోలార్ : ముచ్చటైన ప్రదేశాలు !కోలార్ : ముచ్చటైన ప్రదేశాలు !

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఈ స్థలం లోని ప్రకృతి దృశ్యాలు, సమశీతోష్ణ వాతావరణం బ్రిటన్ ను పోలివుండటం వల్ల బ్రిటీష్ వారు ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ ని "లిట్టిల్ ఇంగ్లాండ్" గా పిలిచేవారు. పర్యాటకులు ఇక్కడ బ్రిటీష్ నిర్మాణ శైలిలో నిర్మించిన భవనాలను కూడా చూసే అవకాశాన్ని పొందుతారు. టోక్యో (JAPAN) తర్వాత ఆసియాలో జలవిద్యుత్ ప్రాజెక్ట్ నుండి విద్యుత్ పొందే రెండో నగరంగా కోలార్ పేరుగాంచింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కోసం విద్యుత్తును ఉద్పత్తి చేయడానికి దక్షిణ భారత దేశంలో మొదటిసారి 1902 లో (శివనసముద్ర) జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రారంభమై౦ది. ప్రయాణీకులు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కు తూర్పున 3195 అడుగుల ఎత్తులో ఉన్న ప్రసిద్ది చెందిన దోడబెట్ట కొండను కూడా చూడవచ్చు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

కోటి లింగేశ్వర, కోలార్

కమ్మసాన్ద్ర గ్రామంలో ఉన్న కోటిలింగేశ్వర దేవాలయాన్ని కోలార్ సందర్శించే యాత్రికులు తప్పక చూడవలసినదే. ప్రపంచంలో కెల్లా పెద్ద లింగంగా చెప్పబడే 108 అడుగుల ఎత్తువున్న శివలింగంతో ఈ గుడిని స్వామి సాంబశివ మూర్తి నిర్మించారు. ప్రధాన దేవతకి అభిముఖంగా ఏర్పాటుచేసిన 35 అడుగుల ఎత్తువున్న శివుడి వాహనం నంది విగ్రహాన్ని కూడా యాత్రికులు ఇక్కడ చూడవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా దేశం నలుమూలల నించి భక్తులు ఇక్కడకు వచ్చి ఇక్కడి కోటిలింగేశ్వర ఆలయాన్ని దర్శిస్తారు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఈ గుడికి రాగానే విష్ణు, రాముడు, మహేశ్వరుడు, ఆంజనేయ స్వామి, అన్నపూర్ణేశ్వరి, బ్రహ్మ తదితర దేవతల విగ్రహాలు కూడా చూడవచ్చు. కన్యకాపరమేశ్వరి అమ్మవారికి, వెంకటరమణి స్వామికి, కరుమారి అమ్మ దేవతకు, పాండురంగ స్వామి కి కూడా ఇక్కడ కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ దొరికే లింగాలను కొని అవి గుడిలో ఉంచడం ద్వారా ప్రధాన దైవానికి భక్తులు అంజలి ఘటిస్తారు. ఉదయం, సాయంకాలం 6 గంటల సమయంలో పదిమంది అర్చకులు దేవుడికి నిత్యపూజలు చేస్తారు. భేరీవాయిద్యాల నడుమ మంత్రోచ్చారణ చేస్తూ ఇక్కడ ప్రతిష్టించిన ప్రతి లింగం మీద నీళ్ళు పోసి అభిషేకం చేస్తారు.

PC:youtube

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

ఎలా వెళ్ళాలి

రోడ్డు మార్గం

చుట్టూ పక్కల వున్న ఊళ్లకు బాగా అనుసంధానం వున్న కోలార్ కర్నాటక లోని ప్రధాన నగరాల్లో ఒకటి. బెంగళూరు నుంచి కోలార్ కు చాలా ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి యాత్రికులు, కాబ్ లు , SUVలు మాట్లాడుకుని కోలార్ చేరుకోవచ్చు.

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

రైలుమార్గం

నగర నడిబొడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కోలార్ లోనే రైల్వే స్టేషన్ వుంది. చుట్టుపక్కల అన్ని పట్టణాలకు, నగరాలకు ఇక్కడి నుంచి రైళ్ళు నడుస్తాయి. ఇక్కడి నుంచి యాత్రికులు టాక్సీలు మాట్లాడుకుని యాత్రా స్థలాలకు చేరుకోవచ్చు.

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యే !

వాయుమార్గం

దేశీయ, విదేశీ యాత్రికులకు సేవలందించే బెంగళూరు విమానాశ్రయం ఇక్కడి దగ్గరలో వుంది. కోలార్ నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఇది వుంది. బెంగళూరు విమానాశ్రయం దేశ, విదేశ గమ్యస్థానాలకు బాగా అనుసంధానించబడి వుంది.

గరుడ ఆలయం - ఆసక్తికర కధనాలు !గరుడ ఆలయం - ఆసక్తికర కధనాలు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X