Search
  • Follow NativePlanet
Share
» » భూలోక స్వర్గంలో ఈ ప్రాంతాలు మీకు కనువిందు కలిగిస్తాయి.

భూలోక స్వర్గంలో ఈ ప్రాంతాలు మీకు కనువిందు కలిగిస్తాయి.

ఉత్తరాఖండ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి కథనం.

దైవభూమిగా పిలువబడే ఈ ప్రాంతంలో ఆలయాలే కాదు పచ్చని పకతి అందాలకు కూడా కొదువ లేదు. అదే ఉత్తరాఖండ్. పురాణాల్లో పేర్కొన్న ఎన్నో ఆలయాలకు నిలయం ఈ హిమాలయ రాష్ట్రం. రుషికేష్ వంటి ప్రపంచ ఆధ్యాత్మిక ఖ్యాతి గాంచిన స్థలాలలు ఎన్నో ఈ రాష్ట్రం తన ఒడిలో దాచుకొంది. అదే విధంగగా నైనిటాల్, ల్యాండోవర్, చమోలీ వంటి సహజ ప్రకతి అందాలకు నిలయమైన ప్రాంతాలు కూడా ఈ రాష్ట్రం సొంతం. అంటే ఉత్తరాఖండ్ అటు ఆధ్యాత్మికంగానే కాకుండా ఇటు ఎకో టూరిజానికి కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అత్యంత ప్రమఖమైన ఐదు పర్యాటక ప్రాంతాల వివరాలు మీ కోసం.....

ల్యాండోవర్

ల్యాండోవర్

P.C: You Tube

ఉత్తరాఖండ్ లో అత్యంత ప్రశాంత వాతావరణానికి మారుపేరుగా ల్యాండోవర్ నిలుస్తుంది. ఎతైన కొండలు, కనుచూపుమేరలో పచ్చటి మైదానాలు, దూదెపింజల్లాంటి మేఘాలను చూస్తూ ఎన్ని గంటలైనా ఇట్టే గడిపేయవచ్చు.. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇక్కడ మాన మాటల కంటే మన మనసే ప్రక`తితో ఎక్కువగా మాట్లాడుతుంది. ఏడాది మొత్తం ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ముస్సోరికి చాలా దగ్గరగానే ఈ ల్యాండోవర్ ఉంటుంది.

నైనిటాల్

నైనిటాల్

P.C: You Tube

ఉత్తరాఖండ్ లో ఎక్కువ మంది సందర్శించే పర్యాటక ప్రాంతం నైనిటాల్. అటు కొత్తపెళ్లి జంటలతో పాటు కుటుంబంలోని ఏ వయస్సువారికైనా ఈ ప్రాంతం అత్యంత అనువైన పర్యాటక ప్రాంతమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా నైని సరస్సులో బోటు షికారును అటు మనసుకు నచ్చిన నెచ్చినలితో కాని ఇటు మనలను కన్నుల్లో పెట్టుకొని పెంచిన నాన్నతో చేసినా అందంగా కనిపించడం ఈ సరస్సు ప్రత్యకత.

రిషికేష్, హరిద్వార్

రిషికేష్, హరిద్వార్

P.C: You Tube

ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రుషికేష్, హరిద్వార్ లను హిందూమతాన్ని ఎక్కువగా ఆరాధించేవారు సందర్శిస్తుంటారు. భారత దేశ సహసయాత్రల రాజధానిగా కూడా హరిద్వార్ కు పేరు. ముఖ్యంగా ఇక్కడి రివర్ రాఫ్టింగ్ క్రీడ చాలా ప్రాచూర్యం చెందినది. అదే విధంగా హరిద్వార్ లో నిత్యం జరిగే గంగాహారతిని చూడటానికి విదేశాల నుంచి కూడా భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. ఏడాది మొత్తంలో ఎప్పుడైనా సందర్శించడానికి వీలవుతుంది.

చమోలి

చమోలి

P.C: You Tube

హిందూ పురాణాల్లో పేర్కొన్న ఎన్నో దేవాలయాలకు ఉత్తరాఖండ్ లోని చమోలి నిలయం. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా చమోలి సహజ ప్రక`తి అందాలకు కూడా నిలయం. ముఖ్యంగా ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవారికి ఈ చమోలి స్వర్గ ధామం. అదే విధంగా ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడే వారికి ఈ ప్రాంతం అత్యంత అనుకూలమైనది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల్లో దాదాపు 20 శాతం మంది ఫొటోగ్రఫర్లే అని చెబుతారు.

జిమ్ కార్పెట్

జిమ్ కార్పెట్

P.C: You Tube

రాయల్ బెంగాల్ టైగర్స్ సంరక్షణ స్థలమైన జిమ్ కార్పెట్ ఉత్తరాఖండ్ లో ప్రక`తి ప్రేమికులను ముఖ్యంగా వన్యప్రాణులంటే ఇష్టపడే వారికి ఎల్లప్పుడూ ఆహ్వానం పలుకుతుంది. ఈ అభయారణ్యంలో కేవలం పులులే కాకుండా 600 జాతుల పక్షులు, జంతువులను ఈ అభయారణ్యంలో మనం చూడవచ్చు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఈ అభయారణ్యం చూడటానికి అనుకూలమైన స్థలం. ఇక్కడ జీప్, ఎలిఫెంట్ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X