Search
  • Follow NativePlanet
Share
» »తింగలూరు - చంద్రునిచే దీవించబడినది !

తింగలూరు - చంద్రునిచే దీవించబడినది !

By Mohammad

తింగలూరు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన చిన్న, అందమైన పట్టణం. తంజావూర్ పట్టణానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించే ప్రతి యాత్రికుడు తింగలూరు లో ఉన్న కైలాసనాథ ఆలయాన్ని తప్పక దర్శించుకోవడం ఆనవాయితీ.

తింగలూరు సమీపంలోనే ఉన్న మరో గ్రామం కన్జనూర్. ఈ గ్రామం తింగలూర్ కు 13 కిలోమీటర్ల దూరంలో, కుంభకోణం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అగ్నిస్వరార్ ఆలయం, శివునికి అంకితం చేయబడినది. ఆలయంలో శుక్ర గ్రహం కోసం ప్రార్థనలు జరుపుతారు.

ఇది కూడా చదవండి : తిరునల్లార్ - శనిగ్రహానికి అంకితం చేసిన ఊరు !

కైలాసనాథర్ ఆలయం, తింగలూరు

కైలాసనాథర్ ఆలయం, తింగలూరు

చిత్ర కృప : Rsmn

కైలాసనాథర్ ఆలయం, తింగలూరు

తింగలూరు లోని కైలాసనాథర్ ఆలయం దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఆలయంలో ప్రధానంగా పూజించబడే దేవుడు శివుడు. గుడి ప్రాంగణంలో చంద్రుని విగ్రహం కూడా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమిళంలో చంద్రుడిని 'తింగళ్' అని పిలుస్తారు. బహుశా ఆ పేరుమీదే ఈ పట్టణానికి తింగలూరు అని పేరువచ్చి ఉంటుంది.

పురాణ కధనం

శివుడు దక్ష ప్రజాపతి శాపం నుండి చంద్రుడిని రక్షించి, ఎవరైతే తమ జాతకంలో చంద్రుడు సరైన స్థానంలో లేకుండా బాధపడుతున్నారో, అట్టివారికి సహాయంగా తింగలూరు లో ఉండమని శివుడు చంద్రుడిని కోరాడని కధనం.

చంద్రన్ విగ్రహం , తింగలూరు

చంద్రన్ విగ్రహం , తింగలూరు

నేడు, కైలాసనాథర్ ఆలయం అనేక మంది హిందువులకు దర్శనా స్థలంగా మారిపోయింది. ఏటా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రజలు తమ జాతక చక్రంలో చంద్రుని చెడు ప్రభావాల వల్ల ఏర్పడే దుష్ప్రభావాలను పోగొట్టుకోవటానికి చంద్రుడి ఆశీర్వాదం కోసం వస్తారు.

ఆలయ సందర్శన వేళలు : ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు

అగ్నిస్వరార్ స్వామి ఆలయం, కన్జనూర్

కన్జనూర్ లో అగ్నిస్వరార్ స్వామి ఆలయం, కావేరి నది తీరంలో ఉన్నది. ఈ గుడి శుక్ర గ్రహానికి అంకితం చేయబడినది.ఇందులో శివుడు, పార్వతి దేవి విగ్రహాలు ఉంటాయి.

అగ్నిస్వరార్ స్వామి ఆలయం, కన్జనూర్

అగ్నిస్వరార్ స్వామి ఆలయం, కన్జనూర్

చిత్ర కృప : Prabhu Krishnamurthy

అగ్ని స్వరార్ ఆలయం రేడు ప్రాకారాలు కలిగి ఉన్నది. సందర్శకులు రాతి శివకామి మరియు రాతి నటరాజ విగ్రహాన్ని మరియు చిత్రాలను గమనించవచ్చు. ఆలయంలో విజయనగర, చోళుల కాలం నాటి శిలా శాశనాలను చూడవచ్చు. గుడి లోని నటరాజ సభ ను ముక్తి మండపం మరియు శివతాండవం అని పిలుస్తారు.

కావేరి నది

కావేరి నది ని కన్జనూర్ లో శుభప్రదమైనదిగా భావిస్తారు భక్తులు. ఈ నది ఒడ్డున హిందువులు తమ ఆచారాలను మరియు సాంప్రదాయాలను నిర్వహిస్తుంటారు. నదిలో మునిగి అగ్నిస్వరార్ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు.

తింగలూరు చేరుకోవటం ఎలా ?

విమాన మార్గం

తింగలూరు లో ఎటువంటి ఎయిర్ పోర్ట్ లేదు. తిరుచిరాపల్లి లోని విమానాశ్రయం తింగలూరు కు సమీపాన ఉన్న విమానాశ్రయం. సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి తింగలూరు చేరుకోవచ్చు.

రైలు మార్గం

తింగలూరు చేరుకోవాలంటే సమీపాన ఉన్న అరియలూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టాక్సీ లేదా ఏదేని ఇతర వాహనాలలో ప్రయాణించి తింగలూరు చేరుకోవచ్చు.

బస్సు సౌకర్యాలు, తింగలూరు

బస్సు సౌకర్యాలు, తింగలూరు

చిత్ర కృప : Ramesh Palanisamy

రోడ్డు / బస్సు మార్గం

తంజావూర్, తిరుచిరాపల్లి, కుంభకోణం ల నుండి ప్రతి రోజా ప్రభుత్వ బస్సులు తింగలూరు కు తిరుగుతుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X