Search
  • Follow NativePlanet
Share
» »స్వయంగా శివుడే లింగాన్ని సృష్టించిన తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం దర్శిస్తే..

స్వయంగా శివుడే లింగాన్ని సృష్టించిన తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం దర్శిస్తే..

తిరువిడైమరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయంను మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంను శివుడికి అంకితం చేయబడినది. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్లే ఆలయంలో ఉన్న శివలింగం కూడా చాలా పెద్దగా ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ బృహత్ సుందర గుజాంబాల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి వార్లు కొలువైన ఈ ఆలయం తమిళనాడు లోని అతి పెద్ద ఆలయా లలో ఒకటిగా పేరొందినది. దీనిని చోళ రాజులు తొమ్మిదో శతాబ్దంలో నిర్మించారు. ఇది అతి పురాతన ఆలయం. చాలా ప్రశాంతంగా, దర్శకుల మనసులో భక్తిభావం పెల్లుబికేలా ఉంటుంది. దూరం నుండే మహాలింగేశ్వరుని చుట్టూ ఆర్చిలో వెలిగించిన దీపాలు కనులవిందు చేస్తుంటే తాదాత్మ్యంగా స్వామిని దర్శించుకోవచ్చు.

సాధారణంగా శివలింగాన్ని మహాపురుషులు లేదా రాజులు ప్రతిష్టింపజేసి దానికి ఆలయాలను నిర్మిస్తారు. మరికొన్ని చోట్ల స్వయంభువుగా వెలుస్తుంది. అయితే ఇది కొంత అరుదైన విషయం. ఇదిలా ఉండగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్టించిన శివలింగం ఒకే ఒక చోట ఉంది.

అంతే కాకుండా ఆయన చాలా ఏళ్లపాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని చెబుతారు. అందువల్లే ఆ శివలింగం భూమి పై ఉన్న అన్ని శివలింగాల కంటే విశిష్టమైనదని చెబుతారు.ఇక ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి. తిరువిడైమరుదూర్ ఆలయం ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తులు విశ్వాసం. ఇటువంటి మద్ది చెట్లు కేవలం మధ్యార్జునం , శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి.

ఈ ఆలయం పక్కనే భారత దేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయాన్ని కూడాచూడవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ ఆలయానికి సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం..

కుంభకోణం దగ్గర్లోనే

కుంభకోణం దగ్గర్లోనే

సృష్టి మొదలయ్యినప్పుడు బ్రహ్మ దేవుడు రూపొందించిన కలశం మొదట భూమి పై తాకిన ప్రదేశం కుంభకోణం. అందువల్లే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన ప్రాంతంగా హిందూ పురాణాల్లో పేర్కొంటారు. అటువంటి కుంభకోణం దగ్గర్లోనే తిరువిడైమరుదూర్ అనే పుణ్యక్షేత్రం ఉంది.

PC:Youtube

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం

ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి మొదలయినప్పుడు భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని. పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి మహాద్భుత లింగమో పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

P.C: You Tube

మహాలింగస్వామి స్వంభువుడు.

మహాలింగస్వామి స్వంభువుడు.

అందువల్లే ఈ శివలింగానికి అంతటి శక్తి అని చెబుతారు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని మహాలింగస్వామి అని పిలుస్తారు. మహాలింగస్వామి స్వంభువుడు. భక్తితో ఈయన ఆలయానికి ప్రదక్షిణ చేసివారికి ఏ విధమైన మానసిక బాధలైనా తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, వివాహం, పిల్లలు, ఉద్యోగం వగైరా సకల కోరికలూ నెరవేరుతాయట.

P.C: You Tube

సప్త విగ్రహ మూర్తులకు మధ్యలో కొలువుతీరిన మహాలింగేశ్వరుడు

సప్త విగ్రహ మూర్తులకు మధ్యలో కొలువుతీరిన మహాలింగేశ్వరుడు

ఈయన ఈ ప్రాంతంలోని అన్ని శివాలయాలుకు, సప్త విగ్రహ మూర్తులకు మధ్యలో కొలువుతీరి ఉన్నాడు. చిదంబరంలోని ఉన్న నటరాజ స్వామి ఆలయంలోని నటరాజు, తిరు చెంగళూరులోని చండికేశ్వరుడు, తిరువలంజులిలోని వైట్ వినాయకుడు, స్వామిమలై లో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలయాల్లో ఉన్న సూర్యుడు, అలాన్ దేవాలయంలోని దక్షణామూర్తి.

నాలుగు దిక్కుల్లో

నాలుగు దిక్కుల్లో

ఇక ఈ దేవాలయానికి చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు దేవాలయాలు ఉన్నాయి. అవి తూర్పు వీధిలో విశ్వనాథుడు, పడమట ఉన్న బుుషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఉన్న ఆత్మనాధుడు, వీధిలో ఉన్న చొన్ననాధుడు. ఇంతటి విశిష్టమైన దేవాలయంను హిందువులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.
P.C: You Tube

నంది చాలా పెద్దది

నంది చాలా పెద్దది

ఆలయ మండపంలో ఉన్న నంది చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే దీనిని ఒకే శిలతో చేయబడలేదు. అందువల్ల అంత బరువుగా ఉండదని చెబుతారు. ఈ మహాలింగస్వామికి భక్తితో ప్రదక్షిణ చేస్తే ఏవిధమైన మానసిక బాధలైనా తొలిగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం, పిల్లలు కావాల్సిన వారు ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.
P.C: You Tube

ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు

ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు

ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారిపాండ్య రాజు వరుగుణ పాండ్యన్ అడవిలో వేటకి వెలుతాడు.

P.C: You Tube

పాండ్యరాజు

పాండ్యరాజు

తిరిగి వచ్చే సమయంలో చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతని గుర్రం ఒక బ్రాహ్మణుడి మీదుగా వెళ్లి అతిని చావుకు కారణమవుతుంది. దీంతో అతనికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. శివ భక్తుడైన పాండు రాజు శివుడిన ప్రార్థిస్తాడు.
P.C: You Tube

శివుడు కలలలో కనిపించి

శివుడు కలలలో కనిపించి

శివుడు కలలో కనిపించి తిరువిడైమరుదూర్ వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా సూచిస్తాడు. దీంతో రాజు తిరువిడైమరుదూర్ వెళ్లి తూర్పు ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తాడు. అతన్ని అన్ని చోట్లకు వెంటాడుతున్న బ్రహ్మహత్యా దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉండి పోతుంది.
P.C: You Tube

బ్రహ్మహత్య దోషం

బ్రహ్మహత్య దోషం

ఇక రాజు శివుడిని ఆరాధించే సమయంలో ఒక అశరీర వాణి వినిపిస్తుంది. తూర్పు ద్వారం నుంచి కాక వేరే ద్వారం గుండా వెళ్లమని సూచిస్తుంది. రాజు అలాగే చేస్తాడు. దీంతో ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషం అక్కడే ఉందని లోనికి వెళ్లిన వారు ఎవరైనా ఈ ద్వారం గుండా వస్తే బ్రహ్మహత్య దోషం వారికి చుట్టుకుంటుందని చెబుతారు.

P.C: You Tube

ఈ పవిత్రక్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు

ఈ పవిత్రక్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు

ఈ పవిత్రక్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు. ఉత్తరంలో ఉన్న శ్రీశైల మల్లికార్జునిడికి, దక్షిణాన ఉన్న తిరుపుట్టైమరుదూరుకు మధ్యన ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని మధ్యార్జునం అని అంటారు. అర్జునం అంటే మద్ది చెట్టు. ఈ మూడు క్షేత్రాల్లో మాత్రమే అత్యంత అరుదైన మద్ది చెట్టును మనం చూడగలం.
P.C: You Tube

మూకాంబిక దేవాలయం

మూకాంబిక దేవాలయం

ఇక ఈ ఆలయం పక్కనే మనకు భారత దేశంలో అత్యంత ఆలయాల్లో ఒకటిగా చెప్పబడే మూకాంబిక అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చొన్న స్థితిలో మనకు కనిపిస్తుంది. మూకాసురుణ్ణి చంపడం వల్ల వచ్చి బ్రహ్మ హత్యా దోషం పోవడానికి ఇక్కడ తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతుంది.
P.C: You Tube

సంతానం కోసం

సంతానం కోసం

కర్నాటకలోని మూకాంబిక దేవి ఆలయం వలే ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తికల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ హత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు.
P.C: You Tube

ఎలా చేరుకోవాలి:

ఎలా చేరుకోవాలి:

రైలు మార్గం: తిరువిడై మరుదూర్ కు కేవలం 9కిలోమీటర్ల దూరంలో కుంబకోనం రైల్వే స్టేషన్ ఉంది.. అక్కడి నుండి లోకల్ బస్స్ సర్వీలు ఉన్నాయి.

రోడ్డు మార్గం : తిరువిడై మరుదూర్ కు కుంబకోణం బస్ స్టాండ్ చాలా దగ్గర. అక్కడి నుండి జిల్లా సర్వీస్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

విమాన మార్గం: 98కిలోమీటర్ల దూరంలో తిరుచురాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంది. అక్కడి నుండి బస్సు, టాక్సీ ల ద్వారా తిరువిడై మరుదూర్ చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X