Search
  • Follow NativePlanet
Share
» »ఈ సతురగిరి పర్వతంలో మీరు ఎప్పటికీ ఊహించని రహస్యాలు వున్నాయి

ఈ సతురగిరి పర్వతంలో మీరు ఎప్పటికీ ఊహించని రహస్యాలు వున్నాయి

ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయం ఇక్కడ 18 సిద్ధ పురుషులు మరియు పరమ శివుడు వెలసిన పవిత్రమైన క్షేత్రమై వుంది. ఇక్కడ చాలా మంది భక్తులు కాళీని అదేవిధంగా పరమశివుని దర్శనం చేసుకొనుటకు వస్తారు.

By Venkatakarunasri

ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయం ఇక్కడ 18 సిద్ధ పురుషులు మరియు పరమ శివుడు వెలసిన పవిత్రమైన క్షేత్రమై వుంది. ఇక్కడ చాలా మంది భక్తులు కాళీని అదేవిధంగా పరమశివుని దర్శనం చేసుకొనుటకు వస్తారు. ఈ దేవాలయం చుట్టుపక్కల వుండేదంతా ఆశ్చర్యకరమైవుంది.

ఈ దేవాలయం వాతావరణం దట్టమైన అడవి, పాలు మాదిరి దుముకుతున్న జలపాతాలు, పర్వతాలు రమణీయమైనవి. ఇక్కడ చూణి అనే ఒక సుందరమైన జలపాతం వుంది. ఇక్కడ సతురగిరి అనే కొండ వుంది. ఆ కొండలో వుండేవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు........

ప్రస్తుత వ్యాసంలో ఆశ్చర్యకరాలన్నీ తనలో చతురగిరి శిఖరం గురించి తెలుసుకుందాం.

ఈ సతురగిరి పర్వతంలో మీరు ఎప్పటికీ ఊహించని రహస్యాలు వున్నాయి

సతుర గిరి

సతుర గిరి

సతుర గిరి దేవీని దర్శించటానికి కాలు నడకలో సుమారు 10 కి.మీ దూరం నడవాల్సుంటుంది. పర్వతం మీద దేవాలయం వుండటం వల్ల భక్తులకు చిన్న చిన్నవైన మెట్లను నిర్మించబడివుంది.

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

దేవాలయం పర్వతం మీద వుండటం వల్ల ట్రెక్కింగ్ ప్రియులకు ఇదొక సదవకాశం మహిమాన్విత దేవి యొక్క దర్శనానికి జత జతగా స్నేహితుల జతలో ట్రెక్కింగ్ కి కూడా వెళ్ళవచ్చు.

తీర్థ క్షేత్రం

తీర్థ క్షేత్రం

చెప్పాలంటే ఈ తీర్థక్షేత్రానికి చేరటానికి కాలి నడకన వెళ్ళవలసివుండటం వల్ల భక్తులకు ఎటువంటి ఆయాసం రాదు. ఇది కూడా ఇక్కడి దేవి మహిమలలో ఒకటిగావుంది.

మహాలింగం దేవాలయం

మహాలింగం దేవాలయం

సతురగిరి పర్వతంలో సుందరమైన మహాలింగం యొక్క దేవాలయముంది. ఇక్కడి సుందర మహాలింగస్వామిఅత్యంత మహిమాన్వితుడు కావటం చేత అనేకమంది భక్తులు ఈ స్వామి యొక్క దర్శనం మరియు ఆశీర్వాదం కోరి ఇక్కడకు విచ్చేస్తారు.

ఎక్కడుంది?

ఎక్కడుంది?

తమిళనాడులో మధురై నుంచి సులభంగా సతురగిరికి వెళ్ళవచ్చు. ఈ దేవాలయం మధురైలో విరుధనగరం జిల్లాలో థేణి తాలూకాలో వున్నది.

కాళి

కాళి

ఇక్కడ వున్న ఆదిశక్తి కాళి రూపంలో దర్శనమిస్తుంది. కాళి సామాన్యంగా రౌద్ర అవతారంలో వున్నందువల్లభయానకంగా భక్తులకు దర్శనమిస్తుంది.

వృక్షాలు

వృక్షాలు

దేవాలయానికి సాగే మార్గంలో అనేకమైనటువంటి పెద్దపెద్ద వృక్షాలున్నాయి. ఆ వృక్షాల క్రింద ఋషులు,మునులు తపస్సు చేసేవారని భక్తుల నమ్మకం.

 వన మూలికలు

వన మూలికలు

కాలి నడకతో సాగే అనేక భక్తులకు మరియు యాత్రికులకు వన మూలికలతో కూడిన వాతావరణంను ఆస్వాదిస్తూ సాగవచ్చు. ఈ ప్రదేశంలో వున్న ఋషి,మునులు ఉపయోగించిన అనేక దివ్య ఔషదాలు ఎన్నెన్నో వ్యాధులను నయం చేసే శక్తి కలిగి వున్నది.

పంచ లింగాలు

పంచ లింగాలు

ఈ సతురగిరి పర్వతం మీద 5 దేవాలయాలు వున్నాయి. అవేంటంటే మహాలింగం,సుందర మూర్తి లింగం, చందన మహాలింగం,ద్విలింగం మరియు బృహుత్ లింగం.

భక్తులు

భక్తులు

ఈ దేవాలయానికి అనేకమంది భక్తులు వస్తారు. వాళ్ళు అనుకున్న పనులు జరిగితే ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటామని అనుకొని భక్తులు వస్తారు.

 విశేష పూజలు

విశేష పూజలు

ఈ దేవాలయంలో అమావాస్యకు మరియు శివరాత్రి పండుగలు అత్యంత విశేషంగా ఆచరిస్తారు.

సంజీవిని కొండ

సంజీవిని కొండ

ఉత్తర దిక్కులో వున్న మహాలింగ దేవాలయాన్ని సంజీవిని కొండ అని పిలుస్తారు.

భారతీయ అటవీ శాఖ

భారతీయ అటవీ శాఖ

1940 నుంచి ఈ సతురగిరి పర్వతాన్ని భారతీయ అటవీ శాఖవాళ్ళు నిర్వహిస్తున్నారు.

వృక్షాలు

వృక్షాలు

ఈ దేవాలయంలోని పర్వతంలో ముకరవికి అనే వృక్షం వుంది. ఎవరికైనా ముఖం వాచినట్లయితే అటువంటి వారికి ఈ చెట్టు నుండి కారే పాలను ముఖానికి రాసుకుంటే క్షణంలో మాయమౌతుందంట.

గడ్డి

గడ్డి

జ్యోతిపాల గడ్డిని తెల్లవారు జామున నీటిలో నానేసి రాత్రి యందు ఋషులు,మునులు జ్యోతిపాల గడ్డిలో వేలుతురును సృష్టించేవారట.

ఉడుతలు

ఉడుతలు

సామాన్యంగా ఉడుతలు చిన్నవిగా వుంటాయి. అయితే ఈ పర్వతంలో అత్యంత పెద్దవైన ఉడుతలను చూడవచ్చును.

థవసి గుహ

థవసి గుహ

మహాలింగం దేవాలయంలో సుమారు 1 కి.మీ దూరం వెళితే అక్కడ థవసి అనే గుహ వస్తుంది. ఈ గుహ చూడాల్సిన గుహ ఎందుకంటే ఈ గుహలో సుమారు 18 మంది ఋషి మునులను చూసిన పుణ్యమొస్తుందంట. ఇక్కడ అనేకమైన మ్యాజిక్ లను చూడవచ్చు.

రవాణా వ్యవస్థ

రవాణా వ్యవస్థ

చాలామంది ఈ దేవాలయానికి సరియైన రవాణా వ్యవస్థ లేదు అని అనుకుంటారు. కానీ తమిళనాడు మట్టుథావనణి బస్ స్టేషన్ నుంచి సతురగిరికి సుమారు 7 కి.మీ దూరం వుంది. ట్రెక్కింగ్ చేస్తే సుమారు 10కిమీ దూరముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X