Search
 • Follow NativePlanet
Share
» »ర‌ణ‌తంబోర్ కోట‌లో అడుగుపెట్టేందుకు స‌రైన స‌మ‌య‌మిది

ర‌ణ‌తంబోర్ కోట‌లో అడుగుపెట్టేందుకు స‌రైన స‌మ‌య‌మిది

ర‌ణ‌తంబోర్ కోట‌లో అడుగుపెట్టేందుకు స‌రైన స‌మ‌య‌మిది

దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో రణతంబోర్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పెద్ద పులులు. అయితే, కేవలం అడవి జంతువులే కాదు శీతాకాలంలో ఇక్కడి పచ్చని ప్రకృతి అందాల‌ను మనసారా ఆస్వాదించొచ్చు. పచ్చనితివాచీ పరిచి నట్టు ఉండే కొండలు ఈ సీజన్‌లో వచ్చే వివిధ రకాల పక్షుల కిలకిలరావాలకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడి నేషనల్ పార్కుకు ఎదురుగానే ఉంటుంది రణతంబోర్ కోట. ఈ కోట హామీర్ దేవ్ చౌహాన్ వైభవానికి ప్రతీక. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న రాచరికపు అందాల రణతంబోర్ కోట విశేశాలు మీకోసం!

రాజస్థాన్‌లోనే కాదు భారతదేశంలోనే గొప్ప చరిత్రగల, గౌరవప్రదమైన కోటలలో రణతంబోర్ కోట ఒకటి. ఈ రణతంభోర్ కోట వారసత్వానికి ప్రతీకగా రూపుదిద్దుకుంది. ఉదయం ఆరు గంటలకు లేచి రెడీ అయ్యి సర్కిట్ హౌస్‌లోనుంచి మా ప్రయాణం మొదలైంది. మేం బయలుదేరే సమయానికి ఆకాశం మేఘావృతమై ఉంది. కొంతదూరం వెళ్లేసరికే చిన్న చిన్న జల్లులతో వర్షం పలకరించింది. మా కారు డ్రైవర్ చల్లని వాతావరణంలో ఉత్సాహంగా బండిని ముందుకు తీసుకువెళ్లాడు. మేం చేరుకోబోయే కోట మాధోపూర్ జిల్లా నుంచి రోడ్డు మార్గంలో సౌకర్యవంతగానే ఉంది. కోట అడవి మధ్యలో పర్వతాలపై నిర్మింపబడి ఉంది. ఈ కోటకు యూనెస్కో వారు ప్రపంచ వారసత్వ (వరల్డ్ హెరిటేజ్ సైట్) కోట అనే గుర్తింపునిచ్చారు. 9వ శతాబ్దంలో నాగిల్ జాట్ రాజులు ఈ కోటను నిర్మించారని స్థానికులు చెబుతుంటారు. నేటికీ ఈ కోట ఎంతో గంభీరంగా సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తునే ఉంది.

చారిత్రక నేపథ్యం..

చారిత్రక నేపథ్యం..

చరిత్రను ఒక్కసారి తిరగేసేలోపే మా బండి కోటలోపలికి ప్రవేశించింది. శీతాకాలం కావడంతో ధూలే సెమల్, బెర్రీలు, దక్, తాటి, మర్రి, చింత, అకాసియా చెట్లన్నీ చాలా దట్టంగా కనిపించాయి. ఎదురుగా ఓ పెద్ద పాతబడిన ద్వారం, దానికి పోటీగా రహదారి వెంట సాగే జలప్రవాహ సౌందర్యాలు మమ్మల్ని కారు దిగేందుకు ప్రోత్సహించాయి. అయితే, కిందకి దిగకూడదని అక్కడ హెచ్చరిక బోర్డులు కనిపించాయి. అందుకే మేమంతా దిగలేకపోయాం. ఆ ద్వారం గుండా కొంతదూరం వెళ్లగానే కోట దగ్గరికి చేరుకున్నాం. కోట లోపలికి వెళ్లేముందే అధిక సంఖ్యలో కోతులు కనపడ్డాయి. స్థానిక గైడ్స్‌కానీ, ఇతర పర్యాటకులు కానీ ఎక్కువగా కనిపించలేదు. మేం బండి దిగగానే ముందుగానే మాట్లాడుకున్న‌ మా గైడ్ మాకు స్వాగతం పలికారు. రణతంబోర్ కోటకు పక్కనే ఉన్న బావులు, వాటి మినార్లను చూస్తూ నిలబడ్డాం. ఎందుకంటే, ఈ సీజ‌న్‌లో అక్కడి బావులు, చెరువులు నీటితో కళకళలాడుతూ కనిపించాయి.

శ‌త్రు ద‌ర్బేక్షంగా కోట‌..

శ‌త్రు ద‌ర్బేక్షంగా కోట‌..

కోట గోడలు చూడగానే చారిత్రక నేపథ్యం మా కళ్లముందు సాక్షాత్కారం అయినట్లనిపించింది. అన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. కోటలోపలికి ప్రవేశించడానికి మెట్లు ఉన్నాయి. ఆ కోటకు చాలా ద్వారాలు ఉన్నాయి. ప్రధానద్వారం నవలోఖా తలుపులు, తర్వాత అంథేరీ ద్వారం. అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అంథేరీ ద్వారం కోట లోపలికి ప్రవేశించడానికి చివరి ద్వారం. కోట పక్కనే వరుడు (దుల్హా) మహల్, బాదల్ మహల్స్ ఉన్నాయి. ఈ కొండపైనుంచి చూస్తే అడవి విస్తృత దృశ్యం తారసపడినట్లు అనిపిస్తుంది. శ‌త్రు ద‌ర్బేక్షంగా కోట‌ను ఎలా నిర్మిస్తారో ర‌ణ‌తంబోర్ కోట‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ప్రతి అడుగూ ఆహ్లాదమే!

ప్రతి అడుగూ ఆహ్లాదమే!

కొండ దిగువ భాగంలో నూతన జోగిమహల్, గ్రేట్ లేక్స్ ఉన్నాయి. మధ్యలో హామీర్ మహల్, రాణి మహాల్ కూడా ఉన్నాయి. దానిపక్కనే 12వ శతాబ్దంలోని హిందూ మందిరం, దాని ఎదురుగా రాణా హమీర్ 32 సంవత్సరాల ప్రతీకగా 32 పోల్ గొడుగుతోపాటు మణిహారాల స్ట్రీట్ మరో ప్రత్యేక ఆకర్షణ. పర్వతాల పైభాగమంతా సమతలంగా ఉంది. ఇక్కడ చాలా చెరువులున్నాయి. ఎదురుగా ఉన్న పదమ్ చెరువు (జోహర్ చెరువు) విపత్తులు వచ్చినప్పుడు కానీ, విధ్వంసాలు జరిగినప్పుడు ఇక్కడ స్త్రీలు తమను తాము అగ్నికి ఆహుతుల్ని చేసుకునేవారని గైడ్ చెప్పారు. రాణి చెరువు, దీనిదగ్గరే దర్గాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని పాతబడిన సమాధులు కూడా ఉన్నాయి. కోట వెనుక భాగంలో గణేశుని మందిరం, దానికెదురుగానే ప్రతిమాయుక్త కంకాళి మందిరాలున్నాయి. శీతాకాల‌పు పొగ‌మంచు కోటకు మరింత అందాన్ని తెచ్చింది. రణతంభోర్ కోటకు ఇరువైపులా చాలా రకాల చెట్లు ఉన్నాయి. వీటిపై విభిన్నరకాల పక్షులు వాటిస్థావరాలను ఏర్పరచుకున్నాయి.

కోటలో సుమారు నాలుగు గంటలు గడిపిన తర్వాత చివరకు మొదటగా ఎక్కడైతై ఈ కోట చిత్రప్రదర్శనను చూశామో అక్కడకు చేరుకున్నాం. చిత్రప్రదర్శనను చూసేందుకు లోపలకు వెళ్లాం. చాలా అద్భుతమైన చిత్రం టైగర్ ఫారెస్టు. వీటిని చూడకపోయింటే చాలా మిస్సయ్యేవాళ్లం అనిపించింది. ప్రదర్శన హాల్ బయట జోగిమహల్‌కు వెళ్లడానికి షార్ట్‌క‌ట్‌ దారొకటి కనిపించింది. కానీ, ఈ సీజన్‌లో ఆ దారిలో వెళ్లడానికి అనుమతి లేదని అక్కడి వారూ చెప్పారు.

పక్షుల కిలకిలారావాలు!

పక్షుల కిలకిలారావాలు!

అక్కడి నుంచి రోడ్డుపైకి రాగానే మా వాహనం వచ్చింది. అంతలో ఓ చిరుత రోడ్డుపై ఠీవిగా నడుచుకుంటూ అడవిలోకి వెళ్లడం చూశాం. తృటిలో ప్రమాదం తప్పినట్లుగా మాకనిపించింది. ఏమార్గంలో అయితే చిరుత వెళ్లిందో అది కోటప్రాకారాల భాగం. అక్కడినుంచి ముందుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. కొద్దిసేపు అక్కడే ఉండి తర్వాత బయలుదేరాం. రణతంబోర్ కోటలో ఈ సీజన్‌లో చెరువులు, బావులు, కాలువలు పూర్తిగా నిండుగా ఉన్నాయి. ఆ అడవంతా పచ్చగా, పక్షుల కిలకిలరావాలతో రోజంతా ఎలా గడిచిపోయిందో తెలియలేదు. చాలా రకాల పక్షులు, జంతువులు చిరుత, అడవి పంది, జింకలు, కోతులు ఇంకొద్దిసేపు మేం అక్కడే ఉంటే పులులూ కనిపించేవేమో. అండర్ గ్రోత్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సీజన్‌లో పెద్ద పులులు ఎక్కువగా కనిపించే పరిస్థితి లేదనిపించింది. పర్వతాలపై నీళ్లు ఉండడం వల్ల జంతువులు కిందికి వచ్చే అవకాశం లేదు.

పులులను చూడాలంటే జూన్ మాసంలో వస్తే చూడవచ్చు. ఆ సమయంలో అడవి పొదలు, జలక్షేత్రాలన్నీ క్షీణించిపోతాయి. వేసవి కారణంగా పులులు, ఇతర జంతువులు నీటికోసం తప్పకుండా బయటికి వస్తాయని గైడ్ చెప్పారు. ఏదేమైనా ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు సీజన్‌తో పనేముంది అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ మీ ప్ర‌యాణాన్ని మొదలు పెట్టండి!

  Read more about: ranatambore fort
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X