Search
  • Follow NativePlanet
Share
» »ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా ? కొన్ని చిట్కాలు!

ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా ? కొన్ని చిట్కాలు!

కుటుంబ సమేతంగా విహారాలకు వెళ్ళాలంటే, ప్రదేశ ఎంపిక కష్టమే! కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరికి ఒకొక్క ఇష్టమైన ప్రదేశం వుంటుంది. అయితే కలసి ప్రయాణించటం లోని ఉద్దేశ్యం అందరూ కలసి ఆ ప్రదేశాలలో ఆనందించటం. ఎక్కడికైనా ట్రిప్ వేసే ముందు, కొన్ని అంశాల పట్ల ముందస్తు జాగ్రత్త వహించాలి. అవి ఏమిటో మనం ఇక్కడ కొద్దిగా చర్చిద్దాం. మీ కుటుంబ సభ్యులు, పిల్లలు, లేదా వృద్ధుల తో కలసి వెళ్ళేటపుడు, ఆ ట్రిప్ ను వీలైనంత ముందుగా అందరూ కలసి ప్రదేశాన్ని ప్రణాళిక చేయాలి. ఈ ప్రదేశం పట్ల అందరకూ ఆసక్తి కలిగే వుండాలి. సాధారణంగా పిల్లలు అడ్వెంచర్ ప్రదేశం, పెద్దలు రిలాక్సేషన్ లభించే ప్రదేశాలు కోరతారు. కనుక కుటుంబం అందరకూ ఇష్టమైన ప్రదేశం ఎంచుకోండి.

ప్రయాణపు వ్యయం

మీ ప్రయాణపు ఖర్చును ప్రణాళిక చేయండి. ఎక్కువ మంది తో కనుక మీరు ప్రయాణిస్తూ వుంటే ఇది కొంచెం కష్ట తరమే. అటువంటపుడు, ఎంత మంది వెళ్ళాలి ? వ్యయాన్ని ఎంత చేయాలి ? దానిని అందరూ కలసి షేర్ ఎలా చేసుకోవాలి ? అనేవి నిర్ణయించు కోవాలి. ఈ ప్రణాళికలో ఖర్చులు కొంచెం అధికంగానే వేయండి. కొన్ని అనుకోని ఖర్చులు కూడా వుంటాయి.

ఫ్యామిలీ వెకేషన్ - కొన్ని చిట్కాలు!

ప్రదేశం

మీ ట్రిప్ ను ఎక్కువ రోజులు ముందుగా కూడా ప్లాన్ చేయకండి. పిల్లలు సిక్ అవడం లేదా ఇతర ఎమర్జెన్సీ లు మధ్యలో రావచ్చు. ఎంపిక చేసే ప్రదేశం ఎక్కువ దూరం లేనిదిగా చూడండి. ఎక్కువ అలసి పోకుండా ఆనందంగా గడిపి రావచ్చు. మీరు వెళ్ళవలసిన ప్రదేశం రూట్ బాగా తెలుసుకోండి. కొత్త రూట్ లు అన్వేషించటం అందరకీ సరదాయే. కాని రూట్ తప్పితే, పిల్లలు, వృద్ధులతో సమస్య వస్తుంది. కనుక తెలిసిన రోడ్ ల పై ప్రయానించండి. అయితే మరొక దారి కూడా మీకు తెలిసి వుండాలి. వెళ్ళే మార్గంలో కల హోటళ్ళు, మెడికల్ షాప్ లు గురించి కూడా కొంత తెలుసుకుంటే మంచిది.

అవసరాలు

ప్రయాణానికి అవసరమైన అన్ని వస్తువులనూ సేకరించండి. ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రిన్ కింగ్ వాటర్ వంటి అత్యవసరాలు మరువకండి. అవసరం లేనప్పటికీ కొన్ని అదనపు దుస్తులు, పాత న్యూస్ పేపర్ లు, వేస్ట్ క్లోత్ ఒకటి పెట్టుకోండి.

ఆనందం పంచుకోండి

సాధారణంగా కుటుంబం లో వివిధ వయసులవారు వివిధ అభిరుచుల వారూ వుంటారు. ఎవరేం చెప్పినా, ప్రశాంతం గా విని చర్చ చేయండి. మార్గంలో మీకు ఇష్టం లేని ప్రదేశం, కుటుంబ సభ్యులకు ఇష్టమైన ప్రదేశం వంటివి తారస పడితే, వారి ఆనందాలు పాడు చేయక వాటిని వారికి చూపండి. కుటుంబ సభ్యుల ఐడియా లు కూడా వింటూ అందరికీ ఆనందం కలిగించే ట్రిప్ లా ఉండేట్లు చూసుకోండి.

Read more about: tips road trips travel travel tips
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X