Search
  • Follow NativePlanet
Share
» »కామానికి కామాలే...,

కామానికి కామాలే...,

జీవితంలో పెళ్లి ఒక మధురమైన ఘట్టం. అధురత్వానికి పరిపూర్ణత్వం తీసుకువచ్చేది హనీమూన్ అంటే అతిశయోక్తి కాదు. ఈ హనీమూన్ కోసం కొత్త దంపతులు ఎన్నోకలలు కంటూ ఉంటారు. ఇందు కోసం కనీసం మూడు నెలల ముందు నుంచి ప్రణాళికలు రచించుకొంటూ ఉంటారు. అలా హనీమూన్ అన్న తక్షణం అందమైన, ఏకాంతానికి అనువైన ప్రాంతాలు ఏవనే విషయమై మదిలో మెదులుతుంది. అటువంటి ప్రాంతాలకు నెలవు ఉత్తరాఖండ్. మరి ఆ ఉత్తరాఖండ్ లో హనీమూన్ కు అనువైన ప్రాంతాల గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

నైనిటాల్

నైనిటాల్

P.C: You Tube

హిమాలయ పర్వత పంక్తుల వద్ద ఉన్న నైనిటాల్ అటు వేసవితో పాటు ఇటు చలి, వర్షాకాలం కూడా నూతన దంపతులను వారి వెచ్చని కోర్కెలను తీర్చుకోవడానికి రారమ్మని ఆహ్వానిస్తుంది. ఉత్తర భారత దేశం నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ హనీమూన్ డెస్టినేషన్స్ లో నైనిటాల్ కు తప్పకుండా చోటు కల్పిస్తారు.

అవులీ

అవులీ

P.C: You Tube

చుట్టూ మల్లెపూల పందిరిలాంటి మంచు పర్వతాలు, పూల సోయగాలను విరజిమ్మె పుష్పలోయలు, ఆపిల్ తోటలు ఇవన్నీ దేశం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా అప్పుడే పెళ్లి చేసుకొన్నవారు ఏకాంతంగా గడపడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇక ఇక్కడ స్కీయింగ్ ప్రధాన ఆకర్షణ.

రామకృష్ణ పరమ హంసకు కాళీ మాత కనిపించింది ఎక్కడో తెలుసా

కౌసాని

కౌసాని

P.C: You Tube

హిమాలయ పర్వత పంక్తుల వద్ద చుట్టూ టీ తోటలతో కనుచూపు మేర పచ్చదమే కనిపించే ప్రాంతం కౌసాని. అందువల్లే ఇక్కడికి వెళితే వేడి కోర్కెలకు అంతే ఉండదు. మీ జీవిత భాగస్వామిని కౌగిలిలో బంధించడానికి ఎటువంటి అడ్డూ ఉండదు. అందువల్లే ఉత్తరాఖండ్ కు హనీమూన్ కు వెళ్లాలనుకొన్నవారు కౌసనికి తప్పకుండా వెలుతారు.

చర్మరోగాలకు మందు ఈ కొలనులో ఉంది

ముస్సోరి

ముస్సోరి

P.C: You Tube

ఈ ముస్సోరి చాలా ప్రాచూర్యం చెందిన హనీమూన్ డెస్టినేషన్. ఇందుకు కారణం లేకపోలేదు. ఇక్కడ పచ్చదనంతో పాటు తెల్లటి మంచుతెరలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ మిమ్ములను పలకరిస్తూనే ఉంటాయి. అందువల్లే చాలా మంది ఇక్కడికి వెలుతుంటారు.

బిన్ సార్

బిన్ సార్

P.C: You Tube

ఉత్తరాఖండ్ లో ప్రముఖ హిల్ స్టేషన్ ఈ బిన్ సార్. అసలే హిమాలయ పర్వత పంక్తుల్లో భాగమైన ఈ బిన్ సార్ పరిసర ప్రాంతాలు జీవిత భాగస్వామి పక్కన ఉన్నప్పుడు వేడి కోర్కెలను రెచ్చకొట్టడానికి ఏ మాత్రం మోహమాట పడవు. ఇక్కడ అభయారణ్యాలకు కొదువు లేదు. ముఖ్యంగా 200 పక్షిజాతులు ఈ బిన్ సార్ అభయారణ్యంలో కనిపిస్తాయి.

రాణిఖేట్

రాణిఖేట్

P.C: You Tube

మీరు, మీ జీవిత భాగస్వామికి సాహస క్రీడలంటే ఇష్టం ఉంటే ఇక్కడికి వెళ్లండి. భారత దేశ ట్రెక్కింగ్ స్వర్గధామంగా రాణిఖేట్ కు పేరుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి పల్లెటూరులో చిన్న చిన్న గుడిసెల్లో సేదతీరుతూ ముందుకు సాగిపోవడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

గోవాలో ఫ్రీగా దొరికే సరుకు గురించి తెలుసుకోవాాలా?

అల్మోరా

అల్మోరా

P.C: You Tube

ఉత్తరాఖండ్ లోని ఒక చిన్న, ప్రముఖ పట్టణమే ఆల్మోరా. ఈ ఆల్మోరా ఆకాశం నుంచి చూస్తే గుర్రపునాడ ఆకారంలో కనిపిస్తుంది. స్వతంత్రానికి పూర్వం బ్రిటీష్ అధికారులు ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల ఆ సంప్రదాయాలు ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ పచ్చదనంతో వేడి కోర్కెలను రెచ్చగొట్టే ఈ ఆల్మోరా హనీమూన్ కు అత్యంత అనువైన ప్రాంతం.

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్

P.C: You Tube

భూమి ఆకాశం ముద్దులు పెట్టుకొనే ప్రాంతం ఈ ముక్తేశ్వరం. నీలి రంగు ఆకాశాన్ని పచ్చటి శిఖరాలు ముద్దులు పెట్టుకొనే సన్నివేశాలు ఇక్కడ మీకు ఎదురవుతాయి. దీంతో మీలో అప్పటి వరకూ అనుచుకొని ఉన్న కోర్కెలు నిద్రలేచి నాట్యం చేస్తాయి. ఇక చెప్పేది ఏమీ లేదు.

దనౌలటీ

దనౌలటీ

P.C: You Tube

అత్యంత సుందరమైన ప్రదేశాల్లో దనౌలటీ ఒక్కటి. స్వచ్చమైన గాలి, వెలుతురు, నీరు ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది. రణగొణ ధ్వనులకు దూరంగా ఇక్కడ అందమైన మధురమైన రాత్రులను గడపడానికి ఇక్కడికి వెళ్లడం ఉత్తమం.

లాన్స్ డౌనే

లాన్స్ డౌనే

P.C: You Tube

భారత దేశానికి క్రీస్తుశకం 1888 నుంచి 1894 వరకూ వైస్రాయిగా పనిచేసిన లార్డ్ లాన్స్ డౌనే గౌరవ సూచనంగా ఈ ప్రాంతాన్ని లార్డ్ లాన్స్ డౌనే గా వ్యవహరిస్తారు. భారత దేశంలో హనీమూన్ కు అత్యంత అనుకూలమైన ప్రాంతాల్లో లాన్స్ డౌనే ఒకటి.

హైదరాబాద్ యల్లమ్మ గురించి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X