» »వారికి ఈ పర్యటక ప్రాంతాలు అంటేనే ఎక్కువ ఇష్టం

వారికి ఈ పర్యటక ప్రాంతాలు అంటేనే ఎక్కువ ఇష్టం

Written By: Beldaru Sajjendrakishore

పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో విదేశీయులను ఎక్కువగా ఆకర్షిస్తున్న దేశాల్లో భారత దేశం మొదటి ఐదు స్థాన్నాల్లో ఉంటుందనడంలో అతిషయోక్తి లేదు. ఇందుకు భారత దేశ ప్రాచీన సంస్కతి సంప్రదాయాలులతో పాటు ఆచార వ్యవహరాలు మొదటి కారణం. ఇక వెలకట్టలేని శిల్ప సంపద కలిగిన దేవాలయాలు, కట్టడాలు, కూడా విదేశీయులను ఆకర్షించడంలో ముందున్నాయి. మరోవైపు భారత దేశంలో ఉన్న విభిన్న భౌగోళిక పరిస్థితులు కూడా ఇతర దేశీయులను ఆకర్షించడంలో ముందుంటున్నాయి. మన దేశంలో అటు సముద్ర తీర ప్రాంతాలతో పాటు ఎడారులూ ఉన్నాయి. అదే విధంగా ఇదే దేశంలో దట్టమైన అడువులతో పాటు నిర్మలమైన జీవనదులు కూడా కనిపిస్తాయి. ఇక భారత దేశం వేర్వేరు మతాలకు నిలయం. అన్ని మతాల సంప్రదాయాలు, వారికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు కూడా కనిపిస్తాయి. ఇన్ని విశిష్టతలు ఉండటం వల్లే అటు అరబ్ దేశాల నుంచి వారితో మొదలు కొని అమెరికన్ పర్యాటకులకు భారత దేశం ఎంతో ప్రీతిపాత్రమయ్యింది. భారత దేశం పలు ప్రపంచ దేశాలకు నిలయమైనా కొన్ని ప్రాంతాలకు విదేశీయులు ఎక్కువగా రావడమే కాకుండా అక్కడ ఎక్కువ రోజులు ఉంటున్నారు. అటు వంటి మొదటి ఐదు ప్రాంతాలు, అక్కడికి ఎప్పుడు వెళ్లడం ఉత్తమం అన్న వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం....

1. గోవా

1. గోవా

Image source

ఇండియా లోని పడమటి తీరంలోని గోవా భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా విదేశీయులను అత్యంగా ఆకర్షించే ప్రాంతంగా పేరుగాంచింది. . వయో, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని గోవా రా..రమ్మని పిలుస్తూ ఉంటుంది.

2.బీచ్ లఅందానికి ఫిదా

2.బీచ్ లఅందానికి ఫిదా

Image source

ఇక్కడి బీచ్ ల అందాలకు విదేశీయులు ఫిదా అవుతారు. అంతేకాకుండా స్థానిక ప్రభుత్వం విదేశీయులకు అవసరమైన సదుపాయాలు అన్నీ కల్పిస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన ఆహార పదార్థాలతో పాటు వైన్, బీర్, మద్యం వంటి పానీయాలు అత్యంత చవకగా దొరుకుతాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో గోవాను చూడటం మరిచిపోలేని అనుభూతి

3.హంపి

3.హంపి

Image source

హంపి పేరు వింటే చాలు వెంటనే మనకు విజయనగర పట్టణ అందచందాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ పట్టణం గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అని పిలిచే వారు. 13 నుండి 16 శతాబ్దాలవరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్దితిలో రాణించింది.

4.శిల్పకళల కాణాచి

4.శిల్పకళల కాణాచి

Image source

ప్రస్తుతం ఇక్కడ ఉన్న విరూపాక్షదేవాలయంలోని శిల్పకళను చూడటానికి కనీసం రెండు రోజుల సమయం అయినా పడుతుంది. దీంతో విదేశీయులు తమ భారత దేశ పర్యటనలో హంపిని తప్పక ఉండేలా చూసుకోవడమే కాకుండా ఇక్కడ కనీసం ఐదు నుంచి పదిరోజుల పాటు ఉండేలా ప్రణాళిక రచించుకుంటారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ దగ్గర్లో ఉన్న అభయారణ్యాలను కూడా సందర్శించవచ్చు.

5.మైసూరు

5.మైసూరు

Image source

కర్ణాటక సంస్క`తికి రాజధానిగా మైసూరుకు పేరు. భారత దేశ చరిత్రలో సంపన్న ప్రాంతంగా మైసూరుకు ప్రసిద్ధి చెందింది. గంధపుచెక్కల సువాసనల నుంచి గులాబీపూల గుబాలింపు వరకూ ప్రతి ఒక్కటీ ఇక్కడ ప్రత్యేకం అందుకే విదేశీయులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు.

6. రాచప్రసాదాల అందాలకు నెలవు

6. రాచప్రసాదాల అందాలకు నెలవు

Image source

మైసూరులో రాచప్రసాదన్ని చూడటానికి విదేశీయులు ఎక్కువగా ఇష్టపడుతారు. వందల ఏళ్లు గడిచినా చెక్కు చెదరని ఆ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఎవరైనా అచ్చెరువు చెందాల్సిందే. ఇక్కడ ఇప్పుడిప్పుడే యోగా కేంద్రాలు కూడా వెలుస్తున్నాయి. దీంతో చాలా మంది విదేశీయులు తమ పర్యటనలో భాగంగా యోగ నేర్చుకోవడానికి కనీసం నెల నుంచి మూడు నెలల పాటు ఇక్కడ ఉంటారు. దసరా ఉత్సవాలు జరిగే సమయంలో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మైసూరును విదేశీయులు ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతారు.

7.కేరళ

7.కేరళ

Image source

ఇక భారత దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళ విదేశీయులను ఆకర్షించడంలో కొంత ముందు ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక్కడ ప్రకృతి రమణీయతకు ఎటువంటి వారైనా ముగ్థులు కావాల్సిందే. కేరళ సంస్కృతి, సంప్రదాయాలు విభిన్నంగా ఉండి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి.

8. గూటిపడవల్లో విహారం

8. గూటిపడవల్లో విహారం

Image source

కేరళలో గూటి పడవల ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఏకాంతంగా గడపాలనుకునే జంటలకు కేరళ సరైన ప్రాంతం. అందుకే భారత దేశానికి చెందిన వారే కాక విదేశీ జంటల్లో చాలా మంది తమ హనీమూన్ కోసం ఇక్కడకు వస్తుంటారు. ఏడాది మొత్తం కేరళ పర్యాటకానికి అనుకూలంగా ఉంటుంది.

9.తాజ్ మహల్

9.తాజ్ మహల్

Image source

ఆగ్ర పట్టణం యమునా నది ఒడ్డున తాజ్ మహల్ ఉంది. మెఘల్ చక్రవర్తి తన భర్య ముంతాజ్ కోసం అద్భుతమైన సమాధిని నిర్మించాలని భావించాడు. ఈ నేపథ్యంలో రూపు దిద్దుకొన్నదే తాజ్ మహల్. ప్రపంచ వింత కట్టడాల్లో ఈ తాజ్ మహల్ కూడా ఒకటి. ప్రపంచ వారసత్వ సంపదల్లో కూడా తాజ్ మహల్ స్థానం సంపాదించుకుంది.

10.వెన్నల రాత్రుల్లో చూసి తరించాల్సిందే

10.వెన్నల రాత్రుల్లో చూసి తరించాల్సిందే

Image source

దవళ వర్ణంలో మెరిసిపోయే తాజ్ మహల్ ను చూడటానికి స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఇందుకు తగ్గట్టే స్థానిక ప్రభుత్వ పర్యటక శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు ఆపరేటర్లు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది విదేశీయులు ముందుగా సదరు రోజులను బుక్ చేసుకుని భారత దేశ పర్యటనకు వస్తూ ఉంటారు. దీంతో ఈ పర్యాటక ప్రాంతం పై వారికి ఉన్న ఆసక్తి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.