Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో మీరు చూడవలసిన 10 ధనిక ఆలయాలు

భారతదేశంలో మీరు చూడవలసిన 10 ధనిక ఆలయాలు

By Venkatakarunasri

LATEST: కాలినడకన 2300 మెట్లను ఎక్కి తిరుమలకు చేరిన ఆవు

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

భారతావని పుణ్యభూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచు కొని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించి పోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు.

క్రొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. ఆలయాల వల్ల వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి, తద్వారా దేశ భక్తి కలిగి, ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది. ఈ భావన వలన అటు వ్వక్తులకు (ప్రజలకు), ఇటు దేశానికి (సమాజానికి) ఆరోగ్య కరమైన అభివృద్ధి కలుగు తుంది.

భారతదేశంలో మీరు చూడవలసిన 10 ధనిక ఆలయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరింకెందుకలస్యం.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

1. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

అనంతపద్మనాభస్వామి టెంపుల్ కేరళరాష్ట్రంలోని తిరువనంతపురంలో వుంది.

pc: Maheshsudhakar

2. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

2. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

ఇది శ్రీ మహావిష్ణువు ఆలయం.ఈ ఆలయం కూడా 108దివ్యదేశాలలో ఒకటి.

PC: Manu Jha

3. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

3. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

దివ్యదేశాలు అంటే శ్రీమహావిష్ణువు ఆలయాలు గల దివ్యక్షేత్రాలు అని అర్ధం.

PC:Aravind Sivaraj

4. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

4. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

ఈ మధ్యకాలంలో దేవాలయంతో బయటపడిన అనంతసంపదతో ఇది మొదటి స్థానంలో నిలబడింది.

PC:Shishirdasika

5. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

5. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

ఈ ఆలయంలో స్వామి వారు ఒక భారీవిగ్రహ రూపంలో దర్శనమిస్తుంటారు.

PC:Aravind Sivaraj

6. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

6. అనంతపద్మనాభస్వామి టెంపుల్, కేరళ

ఆలయంలోని గదులలో సంపద బయటపడినప్పటికీ ఇంకా ముఖ్యమైన ఒక గది తెరవాల్సివుంది. మరి అందులో ఎంత సంపద వుందో తెలియాలంటే మాత్రం వేచిచూడాల్సిందే.

PC:arijitdas.x

7. వేంకటేశ్వరస్వామి టెంపుల్, తిరుమలతిరుపతి

7. వేంకటేశ్వరస్వామి టెంపుల్, తిరుమలతిరుపతి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గల తిరుపతి పట్టణంలో వున్న తిరుమల కొండలపై ఈ ఆలయం వుంది.

PC:Nikhilb239

8. వేంకటేశ్వరస్వామి టెంపుల్, తిరుమలతిరుపతి

8. వేంకటేశ్వరస్వామి టెంపుల్, తిరుమలతిరుపతి

ఈ ఆలయాన్ని ప్రతీరోజు లక్షకుపైగా భక్తులు దర్శించుకుంటారు. ఇది భారతదేశంలోని ఎంతో ప్రసిద్ధి పొందిన దేవాలయాలలో ఒకటి.

PC:Ashok Prabhakaran

9. వేంకటేశ్వరస్వామి టెంపుల్, తిరుమలతిరుపతి

9. వేంకటేశ్వరస్వామి టెంపుల్, తిరుమలతిరుపతి

తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల నమ్మకం. అంతేగాక శ్రీ వైష్ణవ సంప్రదాయాలలోని 108 దివ్యదేశాలలో కూడా ఈ ఆలయం ఒకటి.

PC:daimalu

10. వేంకటేశ్వరస్వామి టెంపుల్, తిరుమలతిరుపతి

10. వేంకటేశ్వరస్వామి టెంపుల్, తిరుమలతిరుపతి

అధిక సంఖ్యలలో భారతదేశంలోని నలుమూలల నుండే గాక విదేశీయులు కూడా స్వామివారిని దర్శించుకుంటారు.

PC:Adityamadhav83

11. సాయిబాబా టెంపుల్, షిరిడీ

11. సాయిబాబా టెంపుల్, షిరిడీ

షిరిడీ సాయిబాబా ఆలయం మహారాష్ట్రలోని అహమ్మద్ జిల్లాలో వుంది. ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన సాయిబాబా మందిరం. ఇక్కడికి ఆలయ సందర్శనానికి ఎంతో మంది సాయి భక్తులు వస్తుంటారు. అక్కడ సాయిబాబా వాడిన వస్తువులతో పాటు ఆయన పెంచిన పూల తోటలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ బాబాకు ఇచ్చే హారతులు చాలా ప్రసిద్ధి గాంచినవి. ప్రత్యేకంగా హారతి దర్శనంలో పాల్గొనటానికి కూడా అధికంగా భక్తులు వస్తుంటారు.

PC:Thurlapati

12. సిద్ధి వినాయక టెంపుల్, ముంబై

12. సిద్ధి వినాయక టెంపుల్, ముంబై

సిద్ధి వినాయక ఆలయం మహారాష్ట్రంలోని ముంబై నగరంలోని ప్రభదేవి ప్రాంతంలో వుంది. ఈ ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించబడింది. ముంబై నగరంలో వున్న అతి ఐశ్వర్యవంతమైన దేవాలయం ఇది. ఈ ఆలయానికి పర్వదినాలలోనే కాక మామూలు రోజులలో కూడా భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయంలోని వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి వుండటమే ఇక్కడ ప్రత్యేకత. 18 వ శతాబ్దంలో ఒక చిన్న గుడిగా ప్రారంభమైన ఆలయం ప్రస్తుతం 6 అంతస్తులలో వుంది.

PC:Abhijeet Rane

13. మీనాక్షి అమ్మవారి టెంపుల్, మధురై

13. మీనాక్షి అమ్మవారి టెంపుల్, మధురై

మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులో మధురైలో వున్న ఒక చారిత్రక దేవాలయం.ఈ ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా వుంది. ఈ ఆలయం నలుదిక్కులా నాలుగు ఎత్తైన గోపురాలతో

గంభీరంగా కనపడుతుంది. ఈ ఆలయంలోని అష్ట శక్తి మండపం, వేయిస్తంభాల మండపం కూడా మనకు కనపడుతుంది. ఈ ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు. ఇక్కడున్న కొలనుని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

PC: Harikrishnank123

14. జగన్నాథ్ టెంపుల్, పూరీ

14. జగన్నాథ్ టెంపుల్, పూరీ

పూరీ జగన్నాథ దేవాలయం ఒరిస్సా రాష్ట్రంలోని బంగాళాఖాతం తీరంలో వున్న పూరీ పట్టణంలో వున్న ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయం. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తారు. ఈ దేవాలయం ప్రతి యేటా నిర్వహించే రథయాత్రకు ఎంతో ప్రసిద్ధిచెందింది.ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా మరియు అందంగా అలంకరించి రథాలపై వూరేగిస్తారు.ఈ ఉత్సవాన్ని ప్రతి యేట జూన్ లేదా జులై నెలలలో నిర్వహిస్తారు.ఎంతో ప్రసిద్ధి చెందిన ఛార్ ధాం పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి.

PC:Krupasindhu Muduli

15. వైష్ణోదేవీ టెంపుల్, జమ్మూ

15. వైష్ణోదేవీ టెంపుల్, జమ్మూ

వైష్ణవీదేవి ఆలయం ఉత్తరభారతదేశంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిమీ ల దూరంలో వున్న ఎత్తైన హిమాలయ పర్వతప్రాంతంలోని త్రికూట పర్వతశ్రేణిలో వుంది.

ఇక్కడ భక్తులు అమ్మవారిని మాతా రాణి అని కూడా సంభోదిస్తారు. వైష్ణోదేవీ అమ్మవారు ఇక్కడ 3 రూపాలలో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతీ దేవి రూపాలు.ఈ ఆలయం వార్షికాదాయం 500కోట్ల రూపాయల వరకు వుంటుంది.పర్వదినాలలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది.

PC:Nitishph

16. గోల్డెన్ టెంపుల్, అమృతసర్

16. గోల్డెన్ టెంపుల్, అమృతసర్

గోల్డెన్ టెంపుల్ పంజాబ్ నగరంలోని అమృతసర్ నగరంలో వుంది. దీనిని హరమందిర్ సాహిబ్, దర్బార్ సాహిబ్ మరియు స్వర్ణదేవాలయం అని కూడా పిలుస్తారు.దీనిని 16 వ శతాబ్దంలో నిర్మించారు.మరియు 19 వ శతాబ్దం మొదటి భాగంలో దీనిపై 400కేజీల బంగారు పూత వేసారు. ఈ ఆలయానికి 4 ద్వారాలు వుంటాయి. ఈ ఆలయం చుట్టూ అమృతసరోవర్ అని పిలవబడే కొలను వుంటుంది. ప్రతి యేటా లక్షల భక్తులు ఇక్కడకు వచ్చి ఆలయాన్ని సందర్శిస్తూ వుంటారు.

PC:Oleg Yunakov

17.సోమనాథ్ టెంపుల్, గుజరాత్

17.సోమనాథ్ టెంపుల్, గుజరాత్

సోమనాథ్ ఆలయం గుజరాత్ లోని సౌరాష్ట్రలో వున్న విరావల్ రేవు పట్టణానికి 5 కి.మీ ల దూరంలో వున్న అతి ప్రాచీనమైన హిందు పుణ్యక్షేత్రం. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు తమ యాత్రను ఇక్కడ నుండే ప్రారంభిస్తారు. ఈ పుణ్యక్షేత్రం అరేబియా సముద్రతీరాన నిర్మించబడి వుంది. సముద్రపు అలలు ఈ ఆలయాన్ని తాకుతూ వుంటాయి. వీటి తాకిడిని తట్టుకునే విధంగా ఆలయాన్ని 25 అడుగుల ఎత్తులో నిర్మించారు.

PC:AnjanaChandan

18. కాశీ విశ్వనాథ్ టెంపుల్, వారణాశి

18. కాశీ విశ్వనాథ్ టెంపుల్, వారణాశి

భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన హిందూదేవాలయాలలో కాశీవిశ్వనాథుని దేవాలయం ఒకటి.ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో వుంది. పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం కూడా ఒకటి.వారణాశి నగరాన్ని కాశి అని కూడా పిలుస్తారు. వరుల,ఆశి అని పిలవబడే రెండు నదులు ఇక్కడ గంగనదిలో కలుస్తాయి. అందుకే ఈ నగరాన్ని వారణాశి అని అంటారు. ప్రతి సంవత్సరం లక్షకు పైగా భక్తులు ఇక్కడకు విచ్చేసి గంగా స్నానం చేసి పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటూవుంటారు.

PC:wikimedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more