• Follow NativePlanet
Share
» »బహుశా దేవుడు కూడా ఈ రహస్యాలను ఛేదించలేడేమో?

బహుశా దేవుడు కూడా ఈ రహస్యాలను ఛేదించలేడేమో?

Written By: Kishore

భారత దేశంలో అనేక దేవాలయాలకు నిలయమన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత. అదే విధంగా అక్కడి ఆచారా వ్యవహారాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అందులో కొన్ని విషయాలు వేలాది సంవత్సరాలుగా రహస్యంగానే ఉండిపోయాయి. ఆ రహస్యాలను ఛేదించాలని ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ఇందులో కేవలం దేవాలయాలే కాకుండా ముస్లీం సోదరులు పరమ పవిత్రంగా భావించే దర్గాలు కూడా ఉండటం విశేషం. ఇందులో 90 కిలోల రాయి పైకి లేవడం, లింగాకారంలో బిల్వ చెట్టుకు కాయలు కాయడం, నిత్యం కాయలు కాసే మామిడి చెట్టు, ఉత్సవమూర్తులే లేని పుణ్యక్షేత్రం వంటివన్నీ ఈ కథనంలో తెలుసుకొందాం. 

ఇక్కడే ఆమె పిరుదులు పడ్డాయి...సందర్శనతోనే

1. బిల్వపత్రాలతో పూజ చేసిన పాము

1. బిల్వపత్రాలతో పూజ చేసిన పాము

P.C:YouTube

తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరింది. దాదాపు ఏడేళ్ల క్రితం ఆ శివాలయంలోకి ఎక్కడి నుంచో ఓ పాము వచ్చి లింగం పై కూర్చొంది. అటు పై నోటితో బిల్వ పత్రాలు సేకరించి శివలింగానికి పూజ చేసింది. ఈ విషయాన్ని చాలా మంది చూశారు. అయితే ఆ పాము ఎందుకు అలా చేసిందన్న విషయం పై ఇప్పటికీ సమాధానం లేదు.

2. దొంగలకు ద్వారాలు తెరిచినా

2. దొంగలకు ద్వారాలు తెరిచినా

P.C: Singhmanroop

మహారాష్ట్రలోని శింగనాపూర్ ఒక గ్రామం. ఇక్కడి ఉన్న ఒక్ ఇళ్లకు కూడా ద్వారాలు, తాళాలు ఉండవు. ఒక వేళ ఎవరైనా దొంగతనం చేస్తే గ్రామ పొలిమేరు దాటేలోపు చనిపోతారని చెబుతారు. కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇక్క దొంగతనం కూడా ఇక్కడ జరగలేదు.

3.రోజూ కాయలు కాసే మామిడి

3.రోజూ కాయలు కాసే మామిడి

P.C: Syed Shiyaz Mirza

పంజాబ్ లోని మోహాలిలో ఒక గురుద్వార్ ఉంది. ఈ గురుద్వార్ లోని మామిడి చెట్టుకు ప్రతి రోజూ కాయలు కాస్తాయి. సాధారణంగా మామిడి చెట్టుకు కేవలం వేసవిలో మాత్రమే కాయలు కాయస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే.

4. యాగంటి

4. యాగంటి

P.C: Saisumanth532

యాగంటిలో ఉన్న నంది విగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా నిర్థారించారు. అయితే అలా పెరగడానికి కారణం మాత్రం వారు కనిపెట్టలేక పోయారు.

5. గాల్లో పైకి లేచే రాయి

5. గాల్లో పైకి లేచే రాయి

P.C:YouTube

పూణేకు దగ్గరగా దార్వేష్ దర్గా ఉంది. అక్కడ దాదాపు 90 కిలోల బరువున్న రాయి ఉంది. 11 మంది కలిసి కేవలం ఒక వేలుతో ఈ రాయిని పైకి లేపుతారు. అలా పైకి లేపే సమయంలో హజరత్ కమార్ ఆలీ దర్వేష్ అని చెప్పాలి. ఇలా చెప్పిన వెంటనే రాయి దాదాపు 10 అడుగులు పైకి లేస్తుంది. ఇలా ఎందుకు లేస్తుందన్న విషయం తెలియని సమాధానం.

6.తంజావూరులోని బృహదీశ్వరాలయం

6.తంజావూరులోని బృహదీశ్వరాలయం

P.C: Jean-Pierre Dalbéra

తంజావూరులోని బృహదీశ్వరాలయం ఆలయం గోపురం నీడ భూమి పై పడదు. ఇందుకు గల కారణాలు మాత్రం ఏ ఇంజనీరు, శాస్త్రవేత్తా కనుగొనలేక పోయాడు.

7.సముద్ర ఘోష వినిపించదు

7.సముద్ర ఘోష వినిపించదు

P.C:Adityamadhav83

పూరి జనన్నాథ ఆలయం సముద్రం ఒడ్డున నిర్మించన విషయం తెలిసిందే. ఇక్కడ ఆలయ సింహ ద్వారం వద్ద వరకూ సముద్ర ఘోష వినిపిస్తుంది. అయితే ఆ సింహద్వారం దాటి లోపలికి వెళితే ఆ సముద్ర ఘోష వినిపించదు. ఈ సాంకేతికత రహస్యాన్ని ఛేదించిన వారు ఒక్కరు కూడా లేరు.

8.ఎందుకు కరవ లేదు.

8.ఎందుకు కరవ లేదు.

P.C:YouTube

మహారాష్ట్రలోని షోలాపూర్ దగ్గర షెత్పల్ అనే గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుంది. మనుషులు తిరిగినట్టే ఇక్కడ పాములు కూడా స్వేచ్ఛంగా తిరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకూ పాములు కరిచినట్లు ఎవరికీ ఫిర్యాదు అందలేదు.

9. భారత దేశంలో మమ్మి

9. భారత దేశంలో మమ్మి

P.C:YouTube

మమ్మి అంటే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది ఈజిప్టు. కాని హిమాచల్ ప్రదేశ్ లో గ్యూ అనే గ్రామంలో 500 ఏళ్ల నాటికి చెందినదిగా భావిస్తున్న సంగాతెన్జింగ్ అనే బౌద్ధ సన్యాసి మమ్మి కొర్చొన్న స్థితిలో ఉంది. చర్మం, జుట్టు అలాగే ఉండటం ఇక్కడ గమనార్హం.

10. హానిచేయని తేళ్లు

10. హానిచేయని తేళ్లు

P.C:YouTube

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ అనే పుణ్యక్షేత్రానికి వచ్చేవారు అక్కడ తిరిగే తేళ్లను ఒళ్లు పై, నాలుక పై పెట్టుకొంటారు. అయినా కూడా ఆ తేళ్లు ఎటువంటి హాని చేయవు.

11. ఉత్సవ విగ్రహాలు ఉండవు

11. ఉత్సవ విగ్రహాలు ఉండవు

P.C:Lakshmanan

చిదంబర ఆలయంలో ఉత్సవ విగ్రహాలు ఉండవు. ఇక్కడ మూల విరాట్టుగా ఉన్న నటరాజు విగ్రహాన్నే తీసుకువచ్చి ఊరేగిస్తారు.

12.లింగాకారంలోని శివలింగాలు

12.లింగాకారంలోని శివలింగాలు

P.C:J.M.Garg

తమిళనాడులోని తిరునల్వేలి, కడియం అనే గ్రామాలకు మధ్య నిత్య కళ్యాణ సమేత విశ్వనాథ దేవాలయం ఉంటుంది. ఇక్కడి బిల్వ చెట్టుకు కాసే కాయాలు లింగాకారంలో ఉండటం విశేషం. అందువల్ల భక్తులు ఈ చెట్టును సాక్షాత్తు శివుడి ప్రతి రూపంగా కొలుస్తారు. అయితే ఆ కాయలు అలా కాయడానికి కారణం మాత్రం తెలియదు.

13. స్త్రీ రూపంలో నవగ్రహాలు

13. స్త్రీ రూపంలో నవగ్రహాలు

P.C: Anant Shivaji Desai, Ravi Varma Press

తమిళనాడులోని ధర్మపురికి దగ్గరగా అభీష్ట వరదస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ నవగ్రహాలన్నీ ఆడవారి రూపంలో ఉంటాయి. ఇటువంటి విగ్రమాలు భారత దేశంలోనే కాదు మరెక్కడా కనిపించదు.

14. కొమ్ములు లేని నంది

14. కొమ్ములు లేని నంది

P.C:YouTube

మదురై జిల్లాలోని విరుదునగర్ సమీపంలో ధన్ పుదూర్ అనే గ్రామంలో శివాలయానికి ఎదురుగా ఉన్న నందికి చెవులు కొమ్ములు ఉండవు. ప్రపంచంలో ఇటువంటి విగ్రహం మరెక్కడా మనకు కనిపించదు.

15. లేపాక్షి

15. లేపాక్షి

P.C:YouTube

లేపాక్షిలోని ఒక రాతి స్తంభం గాలిలో తేలుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి