Search
  • Follow NativePlanet
Share
» »లక్ష్యం లేని ప్రయాణం మీ అభిరుచి అయితే ఈ మార్గాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి.

లక్ష్యం లేని ప్రయాణం మీ అభిరుచి అయితే ఈ మార్గాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి.

దక్షిణ భారతదేశంలో బైక్ పై వెళ్లడానికి అనుకూలమైన మార్గాలకు సంబంధించిన కథనం.

సాధారణంగా మనం ఒక టూర్ ప్లాన్ చేశామనుకోండి ప్రణాళిక ఎలా ఉంటుంది. ఎప్పుడు ప్రారంభించాలి? ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? ఎక్కడ ముగించాలి? తిరుగు ప్రయాణం ఎప్పుడు? మధ్యలో చూడాల్సిన ప్రాంతాలు ఏవి? ఎంత ఖర్చవుతుంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కొని మనం మన టూర్ ను ప్లాన్ చేసుకొంటాం. అయితే కొన్ని సార్లు ఎప్పుడు ప్రారంభించాలి? అన్న విషయం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది.

మిగిలిన విషయాలన్నింటిని అప్పటికప్పుడు సమాధానాలు వెదుక్కొని మనం నిర్ణయం తీసుకొంటాం. అటు వంటి కోవకు చెందినదే బైక్ ప్రయాణం. ఇందుకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. ముఖ్యంగా రోడ్డు మార్గంతో పాటు చుట్టూ పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉండాలి. అటు వంటి ప్రదేశాలు దక్షిణ భారత దేశంలో అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఐదు మార్గాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

బెంగళూరు టు కన్నూర్

బెంగళూరు టు కన్నూర్

P.C: You Tube

బెంగళూరు నుంచి అటు ఉత్తరం వైపు వెళ్లాలన్నీ, ఇటు దక్షిణం వైపు వెల్లాలన్నా ఎన్నో మార్గాలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమలను పలకరిస్తూ మేఘాలలో తేలిపోతూ బైక్ పై రయ్ మంటూ సాగిపోవడం యువతకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఇటువంటి మార్గాల్లో బెంగళూరు కన్నూర్ ఒకటి. మొత్తం 320 కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో ఎన్న ప్రాంతాలను చూసి రావచ్చు.

ముంబై నుంచి త్రివేండ్రం

ముంబై నుంచి త్రివేండ్రం


P.C: You Tube

మొత్తం ప్రయాణ మార్గం 1700 కిలోమీటర్లు. ప్రయాణ సమయానికి 27 గంటలు పడుతుంది. నేషనల్ హైవే 44, 48 లు ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. ఈ వర్షాకాలంలో చిటపట చినుకులు పడే సమయంలో ముందుకు సాగిపోవడం యువతకు ఎంతో ఇష్టం. ఒకవేళ అంత దూరం ప్రయాణం చేయడం ఇబ్బంది అనుకూన్నా మధ్యలోనే మీరు వెనుదిరగవచ్చు. ఈ మార్గంలో అలప్పి, గోవా, కొచ్చిన్ వంటి అందమైన పర్యాటక ప్రాంతాలను పలకరించవచ్చు.

బెంగళూరు టు మున్నార్

బెంగళూరు టు మున్నార్

P.C: You Tube

బెంగళూరు నుంచి మున్నార్ ప్రయాణ దూరం 480 కిలోమీటర్లు. అందువల్ల ఈ మార్గం మొత్తం బైక్ పై వెళ్లాలనుకొంటే దాదాపు 9 గంటల ప్రయాణానికి మీరు సిద్ధపాడాల్సి ఉంటుంది. నేషనల్ హైవే 44 గుండా ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మార్గంలోని పశ్చిమ కనుమలు మీకు కాఫీ, టీ, సుగంధ ద్రావ్యాల తోటల పరిమళాలను అందిస్తాయి.

చెన్నై నుంచి ఎలగిరి

చెన్నై నుంచి ఎలగిరి

P.C: You Tube

చెన్నై నుంచి ఎలగిరి ప్రయాణం 4 గంటలే. మొత్తం దూరం 200 కిలోమీటర్లు. మీరు ఈ మార్గంలో ఊటిని కూడా పలకరించవచ్చు. ఎలగిరి ప్రముఖ హిల్ స్టేషన్. విశేషం ఏమిటంటే ఈ మార్గంలో కేవలం వర్షాకాలంలోనే కాకుండా ఏ సమయంలోనైనా ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్ హెచ్ 48 లేదా ఎన్ హెచ్ 32 లో ఏ మార్గంలో నైనా ప్రయాణించవచ్చు.

బెంగళూర్ టు పాండిచ్చేరి

బెంగళూర్ టు పాండిచ్చేరి


P.C: You Tube

వీకెండ్ లో బెంగళూర్ నుంచి పాండిచ్చేరి వెళ్లడం చాలా కాలంగా జరుగుతున్న విషయమే. అయితే ఈ మార్గంలో బైక్ ద్వారా వెళ్లడం ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. ముఖ్యంగా బైకర్స్ క్లబ్, యువత ఈ మార్గంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. హెన్ హెచ్ 48 లేదా ఎన్ హెచ్ 75 ద్వారా ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X