Search
  • Follow NativePlanet
Share
» » వందేళ్ల పై బడిన మిలట్రీ హోటల్స్ లో తలమాంసం, ఖీమా తిన్నారా?

వందేళ్ల పై బడిన మిలట్రీ హోటల్స్ లో తలమాంసం, ఖీమా తిన్నారా?

బెంగళూరులో ప్రాచూర్యం చెందిన మిలటరీ హోటల్స్ గురించి కథనం.

బెంగళూరులోని మిలటరీ హోటల్స్ కు గొప్ప చరిత్రనే ఉంది. మరాఠా యోధులకు మాంసాహారాన్ని తయారు చేసిపెట్టే గోవిందరావ్ రన్నోవర్ మొదటి సారిగా బెంగళూరులో మిలటరీ హోటల్ ను స్థాపించాడు. ఈ హోటల్స్ లోని రుచులు చాలా బాగుండటంతో చాలా ఇక్కడ తినడం మొదలుపెట్టారు.

అటు పై మరికొంతమంది ఇదే రకమైన హోటల్స్ ను ప్రారంభించారు. మిగిలిన హోటల్స్, రెస్టోరంట్లతో పోలిస్తే ఈ ఈ హోటల్స్ లోని రుచులు భిన్నంగా ఉండటంతో వీకెండ్ లో ఇక్కడకు చాలా మంది వస్తుంటారు.

ముఖ్యంగా తలమాంసం, ఖీమా, బేజీఫ్రై, బోటీ మసాలా తదితర నాన్ వెజ్ డిషెష్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ హోటల్స్ ఎక్కువగా కాటన్ పేట, జయనగర, మల్లేశ్వరం తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఈ కథనం చదివి మీకు దగ్గరగా ఉన్న మిలట్రీ హోటల్స్ కు వెళ్లండి. లాగించండి

శివాజీ మిలటరీ హోటల్

శివాజీ మిలటరీ హోటల్

P.C: You Tube

ఈ మిలటరీ హోటల్ ను 1930లో బెంగళూరులో లక్ష్మణరావ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన కుమారులు నడుపుతున్నారు. దొన్నే బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్. రాగి పాత్రలో బొగ్గుల పొయ్యి పై వండటం వల్ల దీనికి అంతటి రుచి వస్తుందని చెబుతారు.

జయనగర్ లో

జయనగర్ లో

P.C: You Tube

అదే విధంగా చికెన్ లెగ్ ఫ్రై మటన్ ఫ్రై కూడా చాలా ఫేమస్. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకూ ఇక్కడ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరులోని జయనగర్ 8వ బ్లాక్ 45 క్రాస్ లో ఉంది.

రంగన్న మిలటరీ హోటల్

రంగన్న మిలటరీ హోటల్

P.C: You Tube

తలమాంసం కూర, పాయ ఇక్కడ ఉన్నంత రుచిగా ప్రపంచంలో మరెక్కడా దొరకదని చెబుతారు. అదేవిధంగా ఖైమా ఫ్రై కూడా బెంగళూరులో ఇక్కడ దొరికినంత రుచిగా మరెక్కడా ఉండదు. ఉదయం కాల్ సూప్ తో ఇడ్లీకి ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది.

ఎప్పుడూ కిటకిట

ఎప్పుడూ కిటకిట

P.C: You Tube

ఉదయం 7.30 గంటల నుంచి 4 గంటల వరకూ, అదే విధంగా రాత్రి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ హోటల్ తెరిచి ఉంటుంది. జయనగర్ లోని కే.ఆర్ రోడ్ టాటా సిల్క్ ఫామ్ వద్ద ఉన్న రంగన్న హోటల్ ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది.

న్యూ గోవిందరావ్ మిలటరీ హోటల్

న్యూ గోవిందరావ్ మిలటరీ హోటల్

P.C: You Tube

దాదాపు 108 ఏళ్ల నుంచి ఈ మిలటరీ హోటల్ నడపబడుతూనే ఉంది. ఇక్కడ మటన్ కు సంబంధించిన అన్ని రకాల డిషెస్ చాలా బాగుంటాయి. నగరంలోని చాలా చోట్ల నుంచి ఇక్కడకు వస్తుంటారు.

 ఉదయం 6 గంటలకే

ఉదయం 6 గంటలకే

P.C: You Tube

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ , అదే విధంగా రాత్రి 7 గంటల నుంచి 10.30 గంటల వరకూ ఈ హెటల్ లో నాన్ వెజ్ డిషెష్ అందుబాటులో ఉంటాయి. బెంగళూరులోని కాటన్ పేట్ లో ఈ హోటల్ ఉంటుంది.

నాయుడు మిలటరీ హోటల్

నాయుడు మిలటరీ హోటల్

P.C: You Tube

ఈ మిలటరీ హోటల్ ను పదుల ఏళ్లుగా కుంటుంబ ఆధ్వర్యంలో నడపబడుతోంది. హోటల్ చిన్నగా ఉన్న ఇక్కడ ఈ నాన్ వెజ్ రెస్టోరెంట్ లో ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి.

పెప్పర్ చికెన్

పెప్పర్ చికెన్

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడ దొరికే పెప్పర్ చికెన్ కోసమే చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. భోజనం చివర్లో ఇచ్చే లెమెన్ రసం తాగడం మాత్రం మిస్ చేసుకోకండి. నగరంలోని సిటీ మార్కెట్ లో వెంకట చల్లయ్య లేన్ లో ఈ హోటల్ ఉంటుంది.

గౌడ్రు మిలటరీ హోటల్

గౌడ్రు మిలటరీ హోటల్

P.C: You Tube

రోమియో జూలియట్ జంట ఎంత ఫేమస్సో నాన్ వెజ్ డిషెష్ కు గౌడ్రు హోటల్ అంత ప్రాచూర్యం చెందినది. ఇక్కడి రాగి ముద్దతో ఏ నాన్ వెజ్ డిష్ అయినా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా మటన్ కర్రీతో రాగి ముద్ద ను ఇక్కడ ఎక్కువ మంది తింటూ ఉంటారు.

బేజా ప్రై, బోటీ మసాలా

బేజా ప్రై, బోటీ మసాలా

P.C: You Tube

దీనితో పాటు బేజా ప్రై, బోటీ మసాలా, మటన్ చాప్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందిరా నగర్ లోని పాపరెడ్డి పాళ్యాలో గౌడ్రు హోటల్ గురించి తెలియనివారు ఉండరు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అదే విధంగా రాత్రి 7 గంటల నుంచి 10.30 వరకూ ఈ హోటల్ లో ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X