Search
  • Follow NativePlanet
Share
» » పాయా, మున్షీనాన్, ఇరానీ ఛాయ్ ఇవన్నీ రుచి చూడందే కదలరు

పాయా, మున్షీనాన్, ఇరానీ ఛాయ్ ఇవన్నీ రుచి చూడందే కదలరు

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ కు ప్రాచూర్యం పొందిన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

కూసొంత కళా పోషణ ఉండాలి. లేదంటే మనిషికి గొడ్డుకు తేడా ఉండొద్దు అంటాడు విలనిజం పండించడానికి ఓ సినిమాలో చెప్పిన డైలాగులు. అటువంటి విభిన్న డైలాగులు వీనులకు విందును కలిగిస్తాయి. అదే విధంగా కొన్ని రకాల పదార్థాలు కడుపుతో పాటు మనసుకు కూడా విందును కలిగిస్తాయి. అదేంటి మనస్సుకు అంటున్నాడనుకోకండి.

ఇప్పుడే కదా చూసే కళ్లుంటే ప్రతి విషయం కళా పోషణ కిందికే వస్తుంది. అదేవిధంగా వండటం, తినడం కూడా కళాపోషణే. కాదంటారా చెప్పండి. ఇలా విభిన్న రుచులకు కేంద్రమైన హైదరాబాద్ లో వేర్వేరు పదార్థాలకు వేర్వేరు ప్రాంతాలు ప్రాచూర్యం చెందాయి. అటువంటి పదార్థాలు, అవి దొరికే ప్రాంతాలకు సంబంధించిన క్లుప్తమైన వివరాలు మీ కోసం. ఈ కథనంలో మీకు అక్షరాల కంటే నాలుకకు విందును కలుగ చేసే పదార్థాల ఫొటోలే ఎక్కువ కనిపిస్తాయి.

చార్ మినార్ ఏరియా

చార్ మినార్ ఏరియా

P.C: You Tube

విభిన్న రుచుల సమహారం చార్ మినార్ ఏరియా. ముఖ్యంగా అత్యంత అరుదుగా దొరికే మున్షీ నాన్, మొఘలాయ్ ఫుడ్, స్వీట్స్ ఇక్కడ ఎన్నో దొరుకుతాయి. ఇక్కడి ఆగ్రా మిఠాయ్ ఘర్ లో దొరికే స్వీట్ లస్సీ రుచి చూసిన వారు మరెక్కాడా లస్సీతాగరు. ఇక్కడ దొరికే చికెన్ షావర్మ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే.

ప్రగతి గల్లీ

ప్రగతి గల్లీ

P.C: You Tube

ఈ ప్రాంతం టిఫిన్ కోసం చాలా ఫేమస్. వీకెండ్ లో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు. మటన్ పాయ విత్ ఇడ్లీ ఇక్కడ చాలా బాగుంటుంది.

మదీనా

మదీనా

P.C: You Tube

ఇరానీ ఛాయ్ తాగుతూ చోటా సమోసా, ఉస్మాన్ బిస్కెట్ తింటూ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఈ మాదీనాలోని షాదాబ్ హోటల్ ఇరానీ ఛాయ్ కు పెట్టింది పేరు.

సింధ్ కాలనీ

సింధ్ కాలనీ

P.C: You Tube

ఛాట్ కు ఈ ప్రాంతం చాలా ఫేమస్. బేల్ పూరి, మసాలా పూరి, నూడుల్స్, ఇటాలియన్ పిజ్జా, మసాలా నూడెల్స్ ను ఇక్కడ లొట్టెలేసుకొంటూ తినడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు.

ట్యాంక్ బండ్

ట్యాంక్ బండ్

P.C: You Tube

సాయంత్రం సమయంలో ఇక్కడ చాలా తక్కువ ధరకే ఛాట్స్ దొరుకుతాయి. ఇక రాత్రి అయ్యే కొద్ది ఇడ్లీ, వడ, దోసె కూడా దొరుకుతుంది.

అమీర్ పేట్

అమీర్ పేట్

P.C: You Tube

దక్షిణాది వంటకాల రుచులను తక్కువ ధరకు ఆస్వాధించాలంటే ఇంతకు మించిన ప్రదేశం మరెక్కటి ఉండదు. ఉదయమే కాకుండా రాత్రి సమయంలో కూడా రుచి, శుచితో పాటు తాజా ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది.

గోల్కొండ స్ట్రీట్

గోల్కొండ స్ట్రీట్

P.C: You Tube

ఇక్కడ ఫ్రూట్ సలాడ్, ఎగ్ బోండా, సమోసా, ఆనియన్ పకోడా, మిర్చి బజ్జి రుచికరంగా ఉంటుంది.

కాచీగూడ

కాచీగూడ

P.C: You Tube

కేక్, పేస్ట్రీ, బర్గర్, పిజ్జా, కుకీస్, దహీవడా, పపడీ చాట్ ఇలా ఒకటేమిటి అన్ని రకాల తిండి ఇక్కడ దొరుకుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X