Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్యామిలీతో వెళ్ళవలసిన ప్రదేశాలు !!

ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్యామిలీతో వెళ్ళవలసిన ప్రదేశాలు !!

By Staff

ఆంధ్ర ప్రదేశ్ 13 జిల్లాల సమూహం. ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రాంతాలు కలవు అవి ఒకటి రాయలసీమ కాగా, రెండవది కోస్తా ఆంధ్ర . ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు, పట్టణాలు మరియు బీచ్ లు ఉన్నాయి. దీనినే ' కోహినూర్ ఆఫ్ ఇండియా' గా చెపుతారు. ఎన్నో పర్యాటక ప్రదేశ అందాలకు ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు.

ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యామిలీ తో మొదట వెళ్ళవలసిన ప్రదేశం తిరుపతి. దాని తర్వాతనే మిగితా ప్రదేశాలు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రదేశాలను సందర్శిస్తే మీరు గొప్ప అనుభూతిని పొందుతారు. మీరు సందర్శించే ఈ ప్రదేశాలు చాలా అందంగా, ఆహ్లాదంగా ప్రకృతి రమణీయంగా చూడముచ్చటగా ఉంటాయి. ఇక ఆలస్యం ఎందుకు ఒక్కొకటిగా చూసెద్దాం పదండి ...

తిరుమల, తిరుపతి

తిరుమల, తిరుపతి

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది. తిరుమల అనే పదం ‘తిరు' (పవిత్ర), ‘మల' (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా ‘పవిత్ర పర్వతం' అని అనువదించబడింది.

Photo Courtesy: Akshay Axe

విశాఖపట్టణం

విశాఖపట్టణం

విశాఖపట్నం ను వైజాగ్ అని కూడా పిలుస్తారు. వైజాగ్ అనగానే మనకు అందమైన బీచ్లు, సుందరమైన తిప్పలు, ఒక పచ్చ పచ్చని భూభాగం మనకు గుర్తుకువస్తుంది. వైజాగ్ గురించి చెప్పాలే గాని, స్వర్గదామంలా ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ లో పర్యాటకులకు కావలసినంత వినోదం లభిస్తుంది. ఇంకా సింహాచలం హిల్స్, కంబలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, వార్ మెమోరియల్ అండ్ నావల్ మ్యూజియం పర్యాటకులు సందర్శించటానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. జగదంబ సెంటర్ లో ఉన్న షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేయవచ్చు.

Photo Courtesy: Venkat Yarabati

కనక దుర్గ ఆలయం, విజయవాడ

కనక దుర్గ ఆలయం, విజయవాడ

కనక దుర్గ ఆలయం కృష్ణా నది ఒడ్డున విజయవాడ లో ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా అంటే తనకు తానుగా వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఇక్కడే అర్జునుడు కి పాసుపత అస్త్రం ను శివుడు అనుగ్రహించాడు. ఈ ఆలయంలో ప్రధాన పండుగలు సరస్వతి పూజ మరియు తెప్పోత్సవం జరుపుకుంటారు.ఈ ఆలయమున కు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ రెండు దగ్గరగానే ఉంటాయి.

Photo Courtesy: Manfred Sommer

సింహాచలం

సింహాచలం

సింహాచలం దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామము. ఈ గ్రామం విశాఖపట్నం (వైజాగ్) నగరానికి చాలా దగ్గరలో ఉంది. సింహాచలం పుణ్య క్షేత్రానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయం విష్ణు భక్తులకు చాలా ప్రసిద్ది చెందింది. ఇక్కడ నరసింహ స్వామి విష్ణువు యొక్క సగం మనిషి, సగం సింహం అవతారం ఉన్న పద్దెనిమిది ఆలయాలలో ఒకటి. ఆలయంలో అర్చకులు స్వామిలోని వేడిని చల్లార్చడానికి విగ్రహానికి గంధం పేస్ట్ తో పూత పూస్తుంటారు.

Photo Courtesy: Praveen B

శ్రీశైలం

శ్రీశైలం

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో నల్లమల కొండలలో చిన్న పట్టణం శ్రీశైలం హిందువులకు చాలా పవిత్ర మైనది. ఈ పట్టణం కృష్ణ నది ఒడ్డున కలదు. ఇక్కడి దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడు గా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబ గా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు.

Photo Courtesy: kishoremadugula

లేపాక్షి

లేపాక్షి

అనంతపూరు జిల్లాలో భాగమైన లేపాక్షి దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందమైన ఒక కుగ్రామం. దక్షిణ భారత దేశంలో మహా శివుడు, మహావిష్ణువు, వీరభద్ర స్వామి ల కి అంకితమివ్వబడి, ప్రఖ్యాతి గాంచిన మూడు ఆలయాలు ఈ ప్రాంతం లో ఉన్నాయి. కఠినమైన ఆలయ రాతి గోడల పై చేక్కేందుకు నియమింపబడిన విశ్వబ్రాహ్మణుల కళా నైపుణ్యానికి నిదర్శనం ఇక్కడున్న ఆలయాలపై ప్రదర్శింపబడిన వారి పనితనం. వ్రేలాడే స్థంభం, రాతి గొలుసు, వాస్తు పురుషుడు, పందెపు స్త్రీ వంటి ఎన్నో వివిధ ప్రత్యేకతలకి ఈ ఆలయం ప్రసిద్ది చెందినది.

Photo Courtesy: Trayaan

పుట్టపర్తి

పుట్టపర్తి

పుట్టపర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో అనంతపురం అనే జిల్లాలో ఉన్న చిన్న పట్టణం. ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసం ఇక్కడ ఉండటం వల్ల ఒక ప్రసిద్ధ యాత్రా కేంద్రంగా మారింది. సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసంను ప్రశాంతి నిలయం అని అంటారు. ప్రశాంతి నిలయంలో పేరుకు తగ్గట్టు శాంతి, మనస్సు మరియు ఆత్మ యొక్క శాంతి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆశ్రమానికి భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆశ్రమంలో ఉన్న విద్యా సంస్థలు, స్టేడియాలు మొదలైనవి సందర్శకులను ఖచ్చితంగా ఆకర్షిస్తాయి.

Photo Courtesy: Miran Rijavec

బెలూం గుహలు

బెలూం గుహలు

బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే అతి పొడవైనవి. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత. గుహల లోపల ఫౌంటెన్ , కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ముంచుతోంది.

Photo Courtesy: zafi

అరకు వాలీ

అరకు వాలీ

దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ లో కల విశాఖ పట్టణం జిల్లాలో కల అరకు వాలీ ఒక ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఈ పట్టణం అందమైన తూర్పు కనుమలలో వుండి ఎంతో గొప్ప సంస్కృతి మరియు ప్రాచీన సంప్రదాయాలు కలిగి వుంది. ఈ లోయ అందాలు అనేక టాలీవుడ్ సినిమాలలో ప్రదర్శిస్తారు. హ్యాపీ డేస్, డార్లింగ్ మరియు, కధ వంటి సినిమాలు కొంత భాగాన్ని ఇక్కడే షూట్ చేసారు. వాలీ లో అధిక జీవ వైవిధ్యం కల అనంతగిరి మరియు సున్కరిమెట్ట రిజర్వు ఫారెస్ట్ లు ఉన్నాయి. అరకు వాలీ అందమైన ప్రదేశమే కాక, అనేక కాఫీ తోటలకు కూడా పేరు గాంచినది. తాజా కాఫీ గింజల సువాసనలు వాలీ అంతా వ్యాపించి వుంటాయి.

Photo Courtesy: roadconnoisseur

మంత్రాలయం

మంత్రాలయం

మంత్రాలయం దక్షిణ భారత దేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో ఉంది. ఈ పట్టణం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. ఈ పట్టణం మంచాలే అనే పేరు తో ప్రసిద్ధికెక్కింది. గురు రాఘవేంద్ర స్వామి నిర్మించిన బృందావనం వల్ల తెలుగు వారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. స్థానికుల నమ్మిక ప్రకారం, గురూజీ బృందావనం లో అడుగుపెట్టినప్పుడే ఆ ప్రదేశాన్ని 700 సంవత్సరాల పాటు తన ఆవాసం గా స్వీకరిస్తానని ప్రకటించారట. ఈ కారణం చేత దేశం లోని హిందువులచే ఇది పవిత్ర పట్టణం గా పరిగణించబడుతుంది.

Photo Courtesy:Raghunathan Krishnarao

అన్నవరం

అన్నవరం

అన్నవరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం ఎందుకంటే ఇక్కడ శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం ఉంది. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు లేదా మెట్లు గుండా కూడ వెళ్ళవచ్చు.

Photo Courtesy: benharlanes

ఇస్కాన్ ఆలయము, రాజమండ్రి

ఇస్కాన్ ఆలయము, రాజమండ్రి

ఇస్కాన్ ఆలయం రాజమండ్రి లో వినోద మరియు ఆరాధన ప్రదేశం. ఇది గౌతమి ఘాట్ దగ్గర ఉంది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇస్కాన్ వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. మొదటి అతి పెద్ద ఇస్కాన్ ఆలయం బెంగుళూర్ లోనిది. తర్వాత రెండో పెద్ద ఇస్కాన్ ఆలయం రాజమండ్రి లోనిది. ఆలయం కూడా శ్రీ చైతన్య మరియు రామానంద రాయ గుర్తుగా రామానంద రాయ గుడియ మఠం అని పిలుస్తారు.

Photo Courtesy: sheen-him

గోదావరి ఆర్చి బ్రిడ్జి / హేవ్‌లాక్‌ బ్రిడ్జ్‌

గోదావరి ఆర్చి బ్రిడ్జి / హేవ్‌లాక్‌ బ్రిడ్జ్‌

ప్రస్తుతం దేశంలో మూడవ అతిపెద్ద రైలు వంతెనగా, ఆసియాలోనే రెండవ అతిపెద్ద రైలు-రోడ్డు బ్రిడ్జిగా కొనసాగుతున్న గోదావరి ఆర్చి బ్రిడ్జి... ఇక్కడ ఇప్పటివరకు నిర్మించిన మూడు బ్రిడ్జిలలో కొత్త వంతెన. ఈ వంతెన చూడటానికి చాలా మనోహరంగా ఉంటుంది. నిన్నటి వరకు జరిగిన గోదావరి పుష్కరాలలో ఈ బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Photo Courtesy: Roopesh Kohad

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా నిలుస్తాయి.

Photo Courtesy: Subramanian V

గండికోట, కడప

గండికోట, కడప

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వై ఎస్ ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకా లో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణి నే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది.

Photo Courtesy: Vincent Albert

జగన్నధ గట్టు, కర్నూలు

జగన్నధ గట్టు, కర్నూలు

జగన్నధ గట్టు కర్నూలు నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ గట్టు మీద శివుని ఆలయం బాగా ప్రాచూర్యం పొందింది. ఈ ఆలయంలోని శివలింగం పాండవులలో ఒకరైన భీముడు ప్రతిష్టించినారని ఇక్కడి ప్రజలు విశ్వశిస్తారు. ఈ శివలింగం 6 మీ. ఎత్తు కలిగి, 2 మీ. వెడల్పుగా ఉండి పూర్తిగా గ్రానైట్ తో చేయబడినది అంతే కాదు ఈ గట్టు మీద వినాయకుని ఆలయం, నిల్చుని ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఉన్నాయి. ఇక్కడ శివరాత్రి పర్వదినాన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు.

Photo Courtesy: Pusulurisudhakara

హార్సిలీ హిల్స్, మదనపల్లె

హార్సిలీ హిల్స్, మదనపల్లె

హార్సిలీ హిల్స్ ఆంధ్రప్రదేశ్ లో మదనపల్లె పట్టణం సమీపంలో ఉన్న చాలా ప్రజాదరణ పొందిన వేసవి హిల్ రిసార్ట్. ఏప్రిల్ మరియు మే నెలల్లో వేడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి పర్యాటకులు అధికంగా వస్తారు. ఈ రిసార్ట్ కు బెంగుళూర్, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఈ సుందరమైన పర్వతం వేడి వాతావరణం నుంచి బాగా అవసరమైన ఉపశమనం ను కలిగిస్తుంది.

Photo Courtesy: Harish Shivaraman

రాక్‌ గార్డెన్‌ , కర్నూలు

రాక్‌ గార్డెన్‌ , కర్నూలు

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలానికి సమీపాన ఉన్న ప్రదేశమే రాక్ గార్డెన్. ఓర్వకల్లు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలకు చాలా ప్రసిద్ధి. వీటికి రాక్‌ గార్డెన్‌ గా ఎపి టూరిజం వారు పేరు పెట్టి ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం హోటల్‌ ను కూడా నిర్వహిస్తున్నారు. సహజ సిద్ధంగా బండరాయితో ఏర్పడిన ఈ కొండలను జిల్లా వారే కాక, ఇతర ప్రాంతాల వారు కూడా సందర్శిస్తుంటారు. ఇక్కడ ప్రముఖ సినిమా షూటింగ్‌ లు జరుగుతుంటాయి. ఉదాహరణకి వెంకటేష్ నటించిన సుభాస్ చంద్రబోస్ , రవితేజ నటించిన శంభోశివ శంభో ఇక్కడనే షూటింగ్‌లు జరుపుకున్నాయి. మొన్న వచ్చిన బాహుబలి కూడా ఇక్కడే షూటింగ్ జరుపుకొని హార్స్ పవర్ మాదిరి దూసుకుపోతుంది.

Photo Courtesy: rkashyap

ఒంటిమిట్ట, కడప

ఒంటిమిట్ట, కడప

ఒంటిమిట్ట అనే మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కడప జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రము ఏకశిలానగరము గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది, సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది కూడానూ. భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

Photo Courtesy: Saimanohar Pondalur

పాండవుల మెట్ట

పాండవుల మెట్ట

కాకినాడ కి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురంలో పాండవుల మెట్ట ఉంది. మెట్ట అంటే ఒక చిన్నికొండ. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు ఈ కొండపై కొంతకాలం తల దాచుకున్నట్లు, కిమ్మీరుడు అనే రాక్షసుడ్ని భీముడు ఇక్కడే సంహరించాడనే కథ ప్రచారంలో ఉంది. ఈ మెట్టపై రాతిని తొలిచి నిర్మించిన గదిని భీముడు వంటశాలగా ఉపయోగించేవాడని చెబుతుంటారు. ఈ గది పక్కనే గుహ వుంది. ఈ గుహను పాండవులే స్వయంగా తవ్వి నిర్మించుకున్నారంటారు.

Photo Courtesy: Adityamadhav83

ద్రాక్షారామం

ద్రాక్షారామం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. ఇది పుణ్య క్షేత్రం మరియు పంచారామాల్లో ఒకటి. ద్రాక్షారామం పంచారామాలలో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తి పీఠాల్లొ ఒకటిగా, త్రిలింగ క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. భీమేశ్వర స్వామి స్వయంభు లింగరూపంలో 14 అడుగుల ఎత్తు వుంటారు. లింగం సగభాగం నల్లగా, మిగిలిన సగభాగం తెల్లగా ఉంటుంది. ఆలయంలో క్రింద దర్శన అనంతరం పై అంతస్తులో పూజాదికాలతో మళ్లీ దర్శనం చేసుకుంటారు. అంటే రెండు అంతస్తులలో వుంటుంది.

Photo Courtesy: Kalyan Konduri

మంగళగిరి, గుంటూరు

మంగళగిరి, గుంటూరు

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న ఈ మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల కి ఒక ప్రధాన పర్యాటక మజిలీ. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. ప్రఖ్యాతమైన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. ఈ కొండ పూర్వం అగ్నిపర్వతంగా ఉండేది. రానురాను ఆ అగ్నిపర్వతం కనుమరుగపోయింది. ఇక్కడ పానకాన్ని మాత్రమే నైవేద్యంగా పెడతారు ఎందుకంటే అగ్నిపర్వతం రాకుండా ఉండటానికి రసాయనిక చర్యలో భాగంగా బెల్లం, చెక్కర, చెరకు లను వాడతారు. ఈ స్వామిని పానకాల స్వామి అని కూడా పిలుస్తారు.

Photo Courtesy: viharikapavuluri

పద్మావతీ దేవి గుడి

పద్మావతీ దేవి గుడి

తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు. ఆవిడనే అలమేలు మంగ అని కూడా అంటారు - అంటే ప్రేమ, కరుణల నిరంతర, అక్షయ వనరు అని అర్ధం. ఆవిడ పెరిగి పెద్దదయ్యాక దైవ నిర్ణయంగా వెంకటేశ్వర స్వామి ఆవిడను వివాహమాడారని చెప్తారు.

Photo Courtesy: Ranjith shenoy R

సబ్ మెరైన్ మ్యూజియం

సబ్ మెరైన్ మ్యూజియం

వైజాగ్ రామకృష్ణ బీచ్ లో ఉన్న సబ్ మెరైన్ మ్యూజియం ఆసియా ఖండంలో మాత్రమే ఉండుట వల్ల ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం గా ఉంది. మ్యూజియంను స్మ్రితిక అని పిలుస్తారు. మ్యూజియంను ఒక రష్యన్ నిర్మించారు. జలాంతర్గామి కుర్సుర 2001 లో సబ్మెరైన్ మ్యూజియం మార్చబడింది.తీరాలకు సబ్మెరైన్ తీసుకురావడానికి నిధులను భారతదేశం యొక్క ప్రీమియర్ రక్షణ శాఖ ప్రయోగశాల, ఒఎన్జిసి, విశాఖపట్నం ఓడరేవు మరియు నేషనల్ షిప్ డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఇవ్వబడింది.

Photo Courtesy: Rupam Roy

ఇస్కాన్ ఆలయం, తిరుపతి

ఇస్కాన్ ఆలయం, తిరుపతి

తిరుపతి లోని ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తెలుపు, బంగారు రంగు స్తంభాల శైలితో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఈ ఆలయ గోడలపై నరసింహ స్వామీ, కృష్ణుడు, కృష్ణ లీలలు, వరాహ స్వామీ విగ్రహాల అద్భుతమైన చేక్కుళ్ళు ఉన్నాయి.పైకప్పులు తంజావూరు శైలి కళతో అలంకరించారు. ఆలయ స్తంభాలపై విష్ణుమూర్తి పది అవతారాలూ ఉంటాయి. గర్భగుడిలో చుట్టూ గోపికలతో కృష్ణుడు ఉంటాడు.

Photo Courtesy:Temple Connect

బొర్రా గుహలు

బొర్రా గుహలు

బొర్రా గుహలు అనంతగిరి హిల్స్ లో ఒక భాగం. ఇవి ఇండియా లోనే అతి పెద్ద గుహలు. సముద్రమట్టానికి సుమారు 2,313 అడుగుల ఎత్తున కలవు. ఈ గుహాలు కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవిగా వుంటాయి. చాలా అందమైనవి. సున్నపు రాయి తో ఏర్పడినవి. దేశం లోనే అతి లోతైన గుహలు గా ప్రసిద్ధి కెక్కాయి. అప్పటి నుండి ఈ గుహలు ఈ ప్రాంతం లో ఒక ఆకర్షణగా ప్రసిద్ధి కెక్కాయి.

Photo Courtesy: wackybecks

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లా మంగళగిరికి 5 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఈ గుహలు ఒక పర్వత సముదాయం. పర్వతం ముందు భాగం నుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళడం చేసారు. మధ్యలో స్థంబాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇవి క్రీ.శ. 4, 5 వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడి ఉంది.

Photo Courtesy: Manfred Sommer

కైలాసగిరి

కైలాసగిరి

వైజాగ్ లోని కైలాసగిరి హిల్ స్టేషన్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది,మరియు అందమైన సైట్ సీయింగ్ ఉంటుంది. కైలాసగిరి లో శివుడు,పార్వతి ఉండుట వల్ల దానికి ఆ పేరు వచ్చింది.కొండ మీద శివుడు,పార్వతి దేవి అతిపెద్ద విగ్రహాలు ఉంటాయి.రోప్ వే ద్వారా కొండ ను చేరవచ్చు. ఈ కొండ పై నుంచి సాయంత్రం కిందికి చుస్తే ఒక అందమైన వ్యూ కనపడుతుంది. శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి.

Photo Courtesy: Venkat Yarabati

వెంకటేశ్వర ఆలయం

వెంకటేశ్వర ఆలయం

తిరుపతి లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి.

Photo Courtesy: Ranjith shenoy R

 నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని దక్షిణ కోస్తా విభాగంలో ఉంది. ఈ పట్టణానికి విక్రమ సింహపురి అని పేరు కూడా ఉంది. ఈ ప్రదేశం ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. రంగనాథ స్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం, రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ చెప్పుకోదగ్గవి. ఈ జిల్లాలో దేశంలో కెల్లా రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సును చూడవచ్చు, నీటి లో బోట్ వేసుకొని విహరించవచ్చు.

Photo Courtesy: Vamsi Chennupalli

యారాడ బీచ్

యారాడ బీచ్

యారాడ బీచ్ వైజాగ్ నగరానికి చాలా దగ్గరగా ఉండుట వలన పర్యాటకులను, స్థానికులకు బాగా ఆకర్షిస్తుంది. బీచ్ కి మూడు వైపులా పచ్చని కొండలు మరియు నాలుగో వైపున బంగాళాఖాతం ఉండి ఓక అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది.బీచ్ పచ్చదనం మరియు బంగారు రంగు ఇసుక తో ఉంటుంది.ఈ సముద్ర తీరంలో ఒక అందమైన సూర్యాస్తమయం ను చూడవచ్చు. ఇక్కడ ప్రశాంతత ఎక్కువుగా ఉంటుంది.

Photo Courtesy: Vishal A

విజయనగరం

విజయనగరం

విజయనగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కొత్తగా ఏర్పడ్డ జిల్లా. కొత్త అంటే మొన్న ఏర్పడిందని కాదు .. రాష్ట్రం లోని అన్ని జిల్లాల కంటే లేట్ గా ఏర్పడిందని అర్థం. ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రదేశాలలో విజయనగరం కోట, పైడితల్లి అమ్మవారి ఆలయం ప్రముఖమైనవి. విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నాలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. ఆలయ విషయానికి వస్తే, అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవం చాలా ప్రాముఖ్యమున్నది. సిరిమాను అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూచ్చుని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం.

Photo Courtesy: Adityamadhav83

గోవిందరాజ స్వామి గుడి

గోవిందరాజ స్వామి గుడి

తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ గోపురం కాక మరో రెండు గుళ్ళ చుట్టూ బయటి ప్రాకారం వుంటుంది. దక్షిణం వైపు గుడిలో పార్ధసారధి స్వామి విగ్రహం వుండగా ఉత్తరం వైపు గోవింద రాజ స్వామి గుడి వుంది. అలాగే ఇక్కడ మనవాల మాముని, శ్రీ చక్రాతాళ్వార్, సలాయి నాచియార్ అమ్మవారి, శ్రీ మచురకవి ఆళ్వార్, శ్రీ వ్యాసరాజ ఆంజనేయ స్వామి, శ్రీ తిరుమంగాయి ఆళ్వార్, శ్రీ వేదాంత దేశికర్ ల చిన్న చిన్న ఆలయాలు కూడా వున్నాయి.

Photo Courtesy: suryanaidus

మచిలీపట్నం

మచిలీపట్నం

మచిలీపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా కు ముఖ్యపట్టణం మరియు తీర పట్టణం. దీనిని బందరు అని కూడా పిలుస్తుంటారు. మంగినపూడి బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. ఇక్కడి బీచ్ లో సముద్రము లోతు తక్కువగా ఉంటుంది. ఇక్కడ తీరములో ఉన్న శివాలయం చాలా పురాతనమైనది. రామేశ్వరములో ఉన్నట్లుగా ఇక్కడ మంగినపూడిలో పన్నెండు బావులు లింగాకారంలో ఉంటాయి. అంతే కాదు ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు. శ్రీ పాండురంగస్వామి దేవాలయము, శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం, బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వమివారి ఆలయం మరియు శ్రీ అగస్త్యేశ్వర దేవాలయము ఇక్కడ ప్రముఖమైనవి.

Photo Courtesy: phani kumar

రిషికొండ

రిషికొండ

రిషికొండ బీచ్ వైజాగ్ లోనే చాలా అందమైన బీచ్ గా భావిస్తారు. నగరానికి 8 కి.మీ దూరంలో వున్నది. బంగారు రంగులో ఉండే ఇసుక, అటుపోటు, కెరటాలు బాగా పెద్దవిగా ఉండుట వల్ల పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. బీచ్ లో నీటి స్కీయింగ్ మరియు సర్ఫింగ్ ,వాటర్ స్పోర్ట్స్ వంటి రకాలుఉంటాయి. బీచ్ లో స్విమ్మింగ్ చేయటం సురక్షితమే. బీచ్ పరిసర ప్రాంతంలో వృక్షజాలం మరియు జంతుజాలం ఉండుట వల్ల ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు.

Photo Courtesy: FUN with Save Indian Family

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more