Search
  • Follow NativePlanet
Share
» »సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే ఈ పండుగలన్నీ మీకు తెలుసా?

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే ఈ పండుగలన్నీ మీకు తెలుసా?

సెప్టెంబర్, అక్టోబర్ నెల్లో వచ్చే ఈ పండుగల గురించి

భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పండుగలది విడదీయరాని బంధం. ఈ పండుగల్లో కొన్ని భారతీయ చరిత్ర ఔనత్యాన్ని ప్రతిబింబింపచేయగ మరికొన్ని మన పురాణాలకు నిలువుటద్డాలు. ఇక సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్నో పండుగలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి, వినాయకచవితి, నవరాత్రి, దసరా, విజయదశమి, మైసూరు దసరా, తీజ్, అశ్వపూజ తదితర పండుగలు ప్రధానమైనవి. వీటితో పాటు ఆయా ప్రాంతాల్లో జరుపుకొనే కొన్ని ప్రత్యేక పండుగలకు సంబంధించిన వివరాలు మీ కోసం

శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీ కృష్ణ జన్మాష్టమి

P.C: You Tube

శ్రీ కృష్ణుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జన్మాష్టమిని నిర్వహిస్తారు. దేశంలోని అన్ని శ్రీ క`ష్ణ ఆలయాలతో పాటు వైష్ణవ ఆలయాల్లో ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. ముఖ్యంగా మధుర, బృందావన్ లలో ఈ క`ష్ణుడి జన్మాష్టమి కన్నుల పండువగా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 2న ఈ పండుగ జరుపుకొంటారు.

మొహరం

మొహరం

P.C: You Tube

ముస్లీంలు జరుపుకొనే ఒక బాధాతప్త హ`దయాలతో జరుపుకొనే కార్యక్రమమే మొహరం. కొన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమంలో హిందువులూ పాల్గొంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న దేశం మొత్తం ఈ పండుగను జరుపుకొంటారు. పండుగ సందర్భంగా శోభయాత్ర నిర్వహిస్తారు.

వినాయక చవితి

వినాయక చవితి

P.C: You Tube

దీనినే గణష చతుర్ధశి అని కూడా అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12న మొదలయ్యే వినాయక చవితి ఉత్సవాలు దాదాపు 23 వరకూ కొనసాగుతాయి. భారత దేశం మొత్తం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటకలో చవితి ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి.

హర్తాలిక తీజ్

హర్తాలిక తీజ్

P.C: You Tube

ఉత్తరభారత దేశంలో ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్ లలో ఈ హర్తాలిక తీజ్ పండుగను జరుపుకొంటారు. తమ పసుపుకుంమలను చల్లగా చూడాలని పెళ్లైనవారు పార్వతి దేవిని పూజిస్తే, తమకు మంచి భర్త రావాలని పెళ్లికాని యువతులు ఆ జగన్మాతను కొలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12న ఈ హర్తాలికా తీజ్ ను జరుపుకొంటారు.

 గాంధీ జయంతి

గాంధీ జయంతి

P.C: You Tube

జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ జయంతిని భారత దేశం మొత్తం నిర్వహిస్తారు. ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. ముఖ్యంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో గాంధీ జయంతిని వేడుకగా జరుపుతారు. ప్రతి ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి

నవరాత్రి లేదా దుర్గా పూజా

నవరాత్రి లేదా దుర్గా పూజా

P.C: You Tube

నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు దేశం నలుమూలలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దుర్గా పూజ ఈ పండుగలో ప్రధాన ఘట్టం. చేపట్టిన పనుల్లో విజయం చేకూరాలని కోరుతూ ఈ పండుగను నిర్వహించడం తరతరాలుగా హిందూ సంస్క`తిలో భాగంగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాలు అదేనెల 19న ముగుస్తాయి.

కోట దసరా

కోట దసరా

P.C: You Tube

రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో దసరాను నిర్వహిస్తారు. విజయదశమి చివరి రోజున సాధారణంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఎతైన రావణుడి విగ్రహాన్ని దహనం చేయడం ఈ పండుగ ఇక్కడ ప్రత్యేకత. అందంగా అలంకరించిన ఏనుగులను కూడా ఊరేగిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 19న ఈ ఉత్సవాన్ని కోట ప్రాంతంలో నిర్వహిస్తారు.

విజయదశమి

విజయదశమి

P.C: You Tube

నవరాత్రి ఉత్సవాల చివరి రోజున దసరా పండుగను భారత దేశం నలుమూలలా నిర్వహిస్తారు. దీనినే విజయదశమి అని కూడా పేర్కొంటారు. రాముడు రావణుడి పై గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పండుగను ఆచరించడం తరతరాలుగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 19న ఈ పండుగను నిర్వహిస్తారు.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసేది మైసూరు దసరా గురించే. చాముండేశ్వరిని బంగారు అంబారీ పై ఊరేగిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఈ మైసూరు ఉత్సవాలు జరుగుతాయి. అయితే పదవరోజు జరిగే జంబూసవారీని చూడటానికి దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి హారవుతారు. ఈ ఏడాది జంబూసవారి అక్టోబర్ 19న నిర్వహిస్తారు.

అశ్వపూజ

అశ్వపూజ

P.C: You Tube

నవరాత్రి చివరి రోజున మేవాడ్ రాజులు ఈ అశ్వపూజను నిర్వహిస్తారు. ఉదయ్ పూర్ లో జరిగే ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. తరతరాలుగా ఈ ఉత్సవాన్ని ఉదయ్ పూర్ రాజవంశానికి చెందినవారు నిర్వహిస్తూ వస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X