Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ 10వేల అడుగుల ఎత్తు నుంచి దూకిబతక గలరు?

ఇక్కడ 10వేల అడుగుల ఎత్తు నుంచి దూకిబతక గలరు?

ఇక్కడ 10వేల అడుగుల ఎత్తు నుంచి దూకిబతక గలరు? స్కై డైవింగ్ కు సంబంధించిన కథనం.

ఎస్ మీరు చదివింది నిజమే. అయితే కొన్ని జాగ్రత్తలతో సుమా. దాని పేరే స్కై డైవింగ్. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ప్రాచూర్యం పొందిన ఈ సాహసక్రీడ భారత దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ క్రీడకు నిపుణులతో పాటు వాతావరణం అనుకూలించడం కూడా ముఖ్యం. భౌగోళికంగా విభిన్నత కలిగిన భారత దేశంలో ఈ క్రీడకు ప్రాచూర్యం కల్పించడానికి ఇప్పటికే ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలు ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. అయితే స్కై డైవింగ్ కు నిపుణులు, వాతావరణ అనుకూలంతో పాటు 18 ఏళ్లు నిండి, ఆస్తమా వంటి వ్యాధులు లేనివారై ఉండాలి. అప్పుడు మాత్రమే అనుమతిస్తారు. ఇక భారత దేశంలో స్కై డైవింగ్ కు అనుకూలమైన ప్రాంతాలు, ఖర్చు తదితర వివరాలు మీ కోసం...

మైసూరు

మైసూరు

P.C: You Tube

స్కైడైవింగ్ విషయంలో కర్నాటకలోని మైసూరు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ రాచనగరికి బెంగళూరు నుంచి సులభంగా చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమానయాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మైసూరులోని చాముండి హిల్స్ స్కై డైవింగ్ కు చాలా అనుకూలమైన ప్రాంతం.

శిక్షణ తర్వాత

శిక్షణ తర్వాత

P.C: You Tube

దాదాపు రెండు నుంచి మూడు రోజుల శిక్షణ తర్వాత స్కై డైవింగ్ క అనుమతిస్తారు. ఇందులో టాండెమ్ జంప్, స్టాటిక్ జంప్, యాక్సిలరేట్ జంప్ తదితర రకాలు ఉంటాయి. వినీలాకాశంలో పక్షిలాగా ఎగురుతూ నేలపైకి మెల్లగా జారుకోవడం సహాసవీరులకు నచ్చుతుంది.

రూ. 35 వేల నుంచి రూ.42 వేలు

రూ. 35 వేల నుంచి రూ.42 వేలు

P.C: You Tube

సాధారణ రోజుల్లో ఒక డైవింగ్ కు రూ.35వేలు ఛార్జ్ చేసే నిర్వాహకులు వీకెండ్ సమయంలో రూ.42,000 వసూలు చేస్తారు. మీకు స్కైడైవింగ్ చేయాలనిపిస్తే స్కైరైడర్, మైసూర్ ఎయిర్ పోర్ట్ డిపార్చర్ టర్మినల్, మందకల్లి, మైసూరు చిరునాలమాలో సంప్రదించాలి.

ధన, మధ్యప్రదేశ్

ధన, మధ్యప్రదేశ్

P.C: You Tube

మధ్యప్రదేశ్ లోని ధన స్కైడైవింగ్ ను భారత దేశంలో మొదట అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రాంతం. ఇక్కడ స్టాటిక్ జంప్, ట్యాన్ డెమ్ జంప్ అందుబాటులో ఉంటుంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు దగ్గరగా ఉన్న ధనలో స్కైడైవింగ్ చేస్తూ ఆటోమేటెడ్ కెమారాతో ఫోటోలు, విడియోలు తీయడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తికాదు.

4వేల అడుగుల ఎత్తు నుంచి

4వేల అడుగుల ఎత్తు నుంచి

P.C: You Tube

దాదాపు 4వేల అడుగుల ఎత్తునుంచి మీరు స్కై డైవింగ్ చేయడానికి వీలవుతుంద.ి ఇక్కడ స్టాటిక్ జంప్ కు రూ.12 వేల నుంచి రూ.20 వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తం ఖర్చులోనే మీకు శిక్షణ, ఫోటోలు, వీడియోలు, భోజనం, వసతి సౌకర్యాలను నిర్వహకులు సమకూరుస్తారు.

అంబేవాలి, మహారాష్ట్ర

అంబేవాలి, మహారాష్ట్ర

P.C: You Tube

సహసం నీలో ఉంటే అంబేవాలి నీకు స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం ఇక్కడ 45 నిమిషాల పాటు స్కైడైవింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దాదాపు 10 వేల అడుగల ఎత్తు నుంచి మీరు కిందికి దుమకవచ్చు.

టెండామ్ జంప్ మాత్రమే

టెండామ్ జంప్ మాత్రమే

P.C: You Tube

ఇక్కడ టెండామ్ జంప్ మాత్రమే అండుబాటులో ఉంటుంది. సోమవారం నుంచి గురువారం వరకూ ఒక జంప్ కు రూ.25 వేలు వసూలు చేస్తే శుక్రవారం నుంచి ఆదివారం వరకూ ఆ ధర రూ.30 వేలుగా ఉంటుంది.

దీసా, గుజరాత్

దీసా, గుజరాత్

P.C: You Tube

ఆకాశంలో నుంచి జారుతూ సరస్సు ఒడ్డున వచ్చి చేరడం ఎంత మంచి అనుభూతిని మిగులుస్తుంది కదా? ఆ అనుభూతి నిజం కావాలంటే మీకు గుజరాత్ లోని దీసా కు వెళ్లాల్సిందే.

సర్టిఫికెట్

సర్టిఫికెట్

P.C: You Tube

ముఖ్యంగా ఇప్పుడిప్పుడే స్కై డైవింగ్ నేర్చుకుంటున్నవారికి ఇది ఉత్తమమైన ప్రాంతం. ఒక్కక్క స్టాటిక్ లైన్ జంప్ కు రూ.16,500 నుంచి రూ.33, 500 వరకూ ఖర్చవుతుంది. ఇందులోనే మనకు ఫోటో, వీడియో, భోజన, వసతి సౌకర్యాలతో పాటు సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.

పాండిచ్ఛేరి

పాండిచ్ఛేరి

P.C: You Tube

సాధారణంగా పాండిచ్ఛేరి అడ్వెంచర్ టూరిజం అన్న తక్షణం మన మదిలో మెదిలేది స్కాబా డైవింగ్ మాత్రమే. అయితే ఇక్కడ స్కై డైవింగ్ కూడా అందుబాటులో ఉంది. భారత దేశంలోని అత్యుత్తమ స్కై డైవింగ్ ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.

రూ.62 వేలు

రూ.62 వేలు

P.C: You Tube

ఇక్కడ స్టాటిక్ జంప్ కు రూ.18వేలు (ఒక జంప్) నుంచి రూ.62వేలు (ఐదు జంప్ లు) ఖర్చవుతుంది. అదే టాన్ డెమ్ జంప్ కు రూ.27 వేలు ఖర్చు చేయాలి. డబ్బు కొంత ఎక్కువ ఖర్చైనా థ్రిల్ కోరుకొనేవారికి ఈ స్కై డైవింగ్ నచ్చుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X