Search
  • Follow NativePlanet
Share
» »తూర్పు భారతం ... ఇదో తెలీని ప్రదేశాల పర్యటన !

తూర్పు భారతం ... ఇదో తెలీని ప్రదేశాల పర్యటన !

జోరున కురిసే వర్షాలకు పర్యటన చేయలేమని అనుకుంటున్నారా? ఈ జూన్ నెలలో వర్షాలు పడుతున్నప్పటికి, తూర్పు భారత దేశంలో చూసి ఆనందించదగిన ప్రదేశాలు కొన్ని కలవు.

మీరు ప్రకృతి ప్రియులైనా, పూర్తి విశ్రాంతి కోరుతూ ఒకే చోట వుంది విహారం కోరుకునే వారైనా, లేక సాహస క్రీడలు ఆచరించాలని కోరేవారైనా ఈ ప్రదేశాలకు నిరాటంకంగా వెళ్లి ఆనందించవచ్చు. మరి ఆ ప్రదేశాలు అక్కడ కల ఆకర్షణలు కొన్ని పరిశీలిద్దాం.

బెరహం పూర్

బెరహం పూర్

బెరహం పూర్ ప్రదేశం ఆధ్యాత్మిక ప్రదేశం. బెరహం పూర్ అంటే ' బ్రహ్మ దేవుడి నివాసం' అని అర్ధం చెపుతారు. ఈ దేవాలయాల పట్టణంలో అనేక దేవాలయాలు కలవు. బంకేస్వరి దేవాలయం, కులద దేవాలయం, నారాయణి దేవాలం, మహేంద్రగిరి దేవాలయం వంటివి ఎన్నో ఇక్కడకు ఆధ్యాత్మికులను ఆకర్షిస్తాయి. బెర్హం పూర్ ను సిటీ అఫ్ సిల్క్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ సిల్క్ చీరలు విరివిగా తయారు అవుతాయి. వీటిని బెరహం పూర్ పట్టా అని కూడా అంటారు. బెరహంపూర్ లో ఒక అందమైన బీచ్ కూడా కలదు.

బిలాస్ పూర్

బిలాస్ పూర్

బిలాస్ పూర్, చత్తీస్ ఘర్ లో రెండవ అతి పెద్ద జిల్లా మరియు మూడవ అత్యధిక జనాభా కల రాష్ట్రంగా పేరు పడింది. బిలాస్ పూర్ లోని వివిధ పురా వస్తు ప్రదేశాలు మరిఉ దేవాలయాలు పర్యాటకులను ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షిస్తాయి. అచన కుమార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి ఇక్కడ ఒక ప్రసిద్ధి గాంచిన పర్యావరణ పర్యాటక ఆకర్షణ. మల్హార్ మరియు రతన్ పూర్ లు పురావస్తు కేంద్రాలు. పురాతన దేవాలయాల అవశేషాలు ఇక్కడ చూడవచ్చు.

జష్ పూర్

జష్ పూర్

ఇక్కడ అనేక కొండ ప్రాంతాలు మరిఉ పచ్చటి అడవులు కలవు. ఈ ప్రదేశం చత్తీస్ ఘర్ కు ఈశాన్య భాగంలో కలదు. ఇక్కడ అనేక అందమైన జలపాతాలు ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తాయి. రాజ్ పూరి జలపాతాలు, కైలాష్ గుఫా, దాన పూరి వాటర్ ఫాల్, రాణి డా జలపాతాలు, భ్రింగ్ రాజ్ జలపాతాలు, ధమేరా జలపాతాలు ఇక్కడి ఆకర్షనలలో కొన్ని.

కబీర్ ధాం

కబీర్ ధాం

కబీర్ ధాం గతంలో కవర్ధా జిల్లా గా వుండేది. ఇపుడి అది దుర్గ, రాజ్ నందన్ గావ్, రాయ్ పూర్, బిలాస్ పూర్ ల మధ్య కలద. ఇది ఒక ప్రశాంతమైన ప్రదేశం. ప్రకృతి ప్రియులు బాగా ఇష్టపడతారు. కబీర్ ధాం బ్రహ్మ దేవ్ టెంపుల్ కు ప్రసిద్ధి. టెంపుల్ యొక్క విశిష్ట శిల్ప శైలి ఖజురాహో నిర్మాణాలు గుర్హుకు తెస్తుంది. మాద్వా మహల్ ఇక్కడ మరొక చారిత్రక ప్రదేశం.
Photo Courtesy: Pankaj Oudhia

పూరి

పూరి

పూరి తూర్పు భారత దేశ నగరాలలో ఒకటి. బంగాళా ఖాతా తీరంలో ఒక ఆధ్యాత్మిక నగరం. ఇక్కడ కల జగన్నాధ దేవాలయంలో రాదా క్రిశ్నులే కాక, దుర్గ, లక్ష్మి, పార్వతి, సతి మరియు శక్తి దేవతల విగ్రహాలు కూడా వుంటాయి. ప్రతి సంవత్సరం పూరి కి వేలాది యాత్రికులు ప్రత్యేకించి రాధా యాత్ర వేడుకలలో వస్తారు. ఇక్కడ జగన్నాధ దేవాలయం మాత్రమే కాక, చక్ర తీర్థ టెంపుల్, మౌసిమా టెంపుల్, సునరా గౌరంగ్ టెంపుల్, ది శ్రీ లోకనాథ టెంపుల్, శ్రీ గుండిచ టెంపుల్, అలర్నాత్ టెంపుల్ మరియు బలిహార్ చండి టెంపుల్ లు ప్రధానమైన దేవాలయాలు.
Photo Courtesy: Abhishek Barua

రామ్ ఘర్

రామ్ ఘర్

రాం ఘర్ ఒక సుందరమైన హిల్ స్టేషన్. ఇది ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో కలదు. ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు అందంగా కనపడుతూ పర్యాటకులకు స్వాగతం చెపుతాయి. పర్యాటకులు ఇక్కడ రాక్ క్లైమ్బింగ్, రాపెల్లింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ లు చేయవచ్చు. మశీర్ ఫిషింగ్ కెంప్ లో పర్యాటకులు చేపలు పట్టవచ్చు.

Photo Courtesy: Kuarun

శరణ శరణ

శరణ శరణ

శరణ శరణ అనేది బీహార్ లో ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ప్రదేశంలో పర్యాటకులు ఇంకనూ చారిత్రాత్మక,మరియు శిల్ప కళల ప్రదేశాలు కూడా చూడవచ్చు. ఇక్కడ శివుడు, మాత కాళిక ల గుడులు అనేకం కలవు. ప్రతి సంవత్సరం నవంబర్ లో జరిగే పశువుల పండుగ జాతీంగా మరియు అంతర్జాతీయంగా ప్రసిద్ధి కెక్కింది.

Photo Courtesy: Vsvinaykumar2

సుర్ గూజా సుర్ గూజా

సుర్ గూజా సుర్ గూజా

సుర్ గూజా సుర్ గూజా ప్రదేశం చత్తీస్ ఘర్ యొక్క ఉత్తర భాగంలో కలదు. టూరిస్ట్ లు ఇక్కడకు వచ్చి అతి పురాతన దేవాలయాలు, వాటి ఆవ సేశాలు, కుడ్య చిత్రాలు మొదలైనవి చూడవచ్చు. మెయిన్ పాట్ లోని టైగర్ జలపాతాలు ఇక్కడ మరొక పర్యాటక ఆకర్షణ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X