Search
  • Follow NativePlanet
Share
» »కర్నూలు జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న అలంపూర్‌ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించాల్సిందే..

కర్నూలు జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న అలంపూర్‌ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించాల్సిందే..

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. కొన్ని వందల ఏళ్ల పాటు పుణ్య క్షేత్రంగా విరాజిల్లిన ప్రదేశం ఇప్పుడు శిధిలావస్థకు చేరుకుంది. దక్షిణ కైలాసం గా భక్తుల నీరాజనాలు అందుకున్న ఆ చారిత్రక పట్టణం ఇప్పుడు చరిత్ర పుటలకే పరిమితం కావచ్చు కానీ అప్పట్లో శిల్ప సంపదకు నిలువెత్తు దర్పణంలా సాక్షాత్కరించింది.

బాదామి చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రదేశం అలంపూర్. బాదామి చాళుక్యులు... కన్నడ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక నిర్మాణాలు చేపట్టారు.బీజాపూర్‌ జిల్లా మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక పట్టణం ఉన్నది. జాతీయ రహదారికి చేరువలో ఉన్న అలంపూర్ కు బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

అలంపూర్ పట్టణం కర్నూల్ నగరానికి 27 కి. మీ ల దూరంలో, మహబూబ్ నగర్ పట్టణానికి 90 కి. మీ ల దూరంలో, గద్వాల కు 61 కి. మీ ల దూరంలో మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 200 కి. మీ ల దూరంలో కలదు. అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో 5 దవది మరియు ఈ క్షేత్రంలో నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బాదామి చాళుక్యలు 2000 సంవత్సరాల క్రితం ఈ తొమ్మిది ఆలయాలను నిర్మించి శివునికి అంకితం చేశారు. జోగులాంబ, బ్రహ్మశ్వర స్వామి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచినవి. అలంపూర్‌ క్షేత్రం ఉత్తర వాహిణీ తుంగభద్రతీరంలో నెలవై... దక్షిణ కాశి గా పేరుగాంచిన ఈ క్షేత్ర విశేషాలు...

ప్రస్తుతం అలంపూర్‌గా పిలవబడుతున్న ఈ గ్రామం

ప్రస్తుతం అలంపూర్‌గా పిలవబడుతున్న ఈ గ్రామం

ప్రస్తుతం అలంపూర్‌గా పిలవబడుతున్న ఈ గ్రామం పూర్వ కాలంలో హలంపుర, హతంపుర, అలంపురం అని స్థల పురాణాలలో హేమలాపురమని ఈ గ్రామం వ్యవహరించబడిం దని శాసనాలను బట్టి తెలుస్తోంది. ఉర్దు రికార్డులలో అల్పూర్‌, అలంపూర్‌ అనే పేర్లతో వ్రాయబడి ఉన్నది. భారత ప్రభుత్వం అర్ష శాఖ వారు సేకరించిన డాక్టర్‌ ె.ఏ నీలకంఠశాస్ర్తి ప్రకటించిన గురజాల బ్రహ్మి శాసనంలో అలంపూర్‌ ప్రస్తావన ఉంది. నడుకస్రి అనే వాడు తన ఆయుష్షు పెరగడం కోసం భగవంతుడైన అలంపుర స్వామికి (బాలబ్రహ్మేశ్వర) కొంత భూమిని దారాదత్తం చేశాడు. గ్రామ దేవత అయిన ఎల్లమ్మ పేరుతో ఎల్లమ్మపురంగా ఉండి రానురాను అలంపురం, అలంపూర్‌గా మారడం జరిగింది.

PC: wikipedia.org

స్థల పురాణంలో హేమలాపురం,

స్థల పురాణంలో హేమలాపురం,

స్థల పురాణంలో హేమలాపురం, ఎల్లమ్మపురంగా ఉండేది. అలంపూర్‌ దేవాలయంలో తోటను ఆనుకొని ఉన్న గుంతలో తవ్వకాలు జరిపినప్పుడు శతవాహనంలో నాణ్యాలు, పూసలు, దక్షిణవర్త శంఖం, అందమైన గాజులు, నలుపు, ఎరుపు రంగు పూత వేయ బడిన చిన్న మట్టి పాత్రలు, నలుచెదరం 21 అంగుళాల పొడవు వెడ ల్పు ఉన్న ఇటుకలు బయటపడడం వల్ల ఈ ప్రదేశంలో శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయం నిర్మించారు.

PC: wikipedia.org

శ్రీశైల క్షేత్ర పశ్చిమ ద్వారమే ఈ అలంపుర క్షేత్రం...

శ్రీశైల క్షేత్ర పశ్చిమ ద్వారమే ఈ అలంపుర క్షేత్రం...

బాదామి చాళుక్యులు అలంపూర్‌లో నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు. ‘‘పరమే శ్వర’’ అనే బిరుదుతో పాలించిన రెండవ పులేశి కాలంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. అలాగే బ్రహ్మేశ్వరుని గుడి ఆవరణలోని మ్యూజియంలో విజయాదిత్యుడు వేయించిన శాసనం ఉంది. స్వర్గ బ్రహ్మాలయ ద్వార పాలకుని మీద వినయాదిత్యుని కాలం నాటి శాసనం ద్వారా చరిత్రకు తెలియని ఒక లోకాధిత్యుడు కనిపించడం జరుగుతుంది. ఆర్క బ్రహ్మా లయంలోని మంటప స్తంభంపై ఒకటవ విక్రమాదిత్యుని భార్య శాసనం ఉంది.అలంపూర్‌ ప్రాంతాన్ని క్రీశ 566 నుంచి 757 సంవత్సరం వరకు బాదామి చాళుక్యులు పరిపాలించారు. నవబ్రహ్మ ఆలయాల నిర్మాణాల్లో ఎర్ర ఇసుక రాళ్లను వాడడం జరిగింది.

PC: wikipedia.org

ఈ రాతిని కర్నూల్‌ జిల్లా శాతనకోట గ్రామం నుంచి

ఈ రాతిని కర్నూల్‌ జిల్లా శాతనకోట గ్రామం నుంచి

ఈ రాతిని కర్నూల్‌ జిల్లా శాతనకోట గ్రామం నుంచి తెప్పించారు. శ్రీ కృష్ణదేవరాయలు క్రీశ. 1521 సంవత్సరంలో రాయచూర్‌ను సాధించి బాలబ్రహ్మేశ్వర స్వామికి, శ్రీ నరసింహస్వామికి దాన ధర్మాలు చేశారు. దక్షిణపదంలోని ప్రాచీన శైవ క్షేత్రాల్లో శ్రీశైలం పురాణ ప్రసిద్దమైంది. ఆ మహా క్షేత్రానికి నాలుగు దిక్కులు, నాలుగు ద్వారాలు ఉన్నాయి. అవి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవతం, పశ్చిమాన అలంపురం, ఉత్తరాణ ఉమమహేశ్వరం. పశ్చిమద్వారంగా ఉన్న ఈ క్షేత్రం భాస్కర క్షేత్రమని, పరుశరామ క్షేత్రమని దక్షిణ కాశీ అని పిలువడం జరుగుతుంది.

PC: wikipedia.org

కాశీ క్షేత్రానికి

కాశీ క్షేత్రానికి

కాశీ క్షేత్రానికి, ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని కాశీలో గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, 64 ఘట్టాలున్నాయి. దగ్గరలో త్రివేణి సంగమం కూడా ఉంది. అలంపూర్‌లో తుంగభద్ర, బ్రహ్మేశ్వరుడు, జోగుళాంబ, పాపనా శిని, మణికర్ణికలు 64 ఘట్టాలు ఉన్నాయి. దగ్గరలో కృష్ణ, తుంగభద్ర నదులు కూడా కలవు. పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్టించినందువల్ల ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో విశేషంగా బ్రహ్మమూర్తులు ఉన్నారు. ఇక్కడి లింగం ‘‘జ్యోతిర్‌జ్వాలమయం''. దీన్ని పూజించిన వారు అంతు లేని పుణ్యం పొందుతారు.

PC: wikipedia.org

సంతాన ప్రదాయిని... ఎల్లమ్మ

సంతాన ప్రదాయిని... ఎల్లమ్మ

ఈ ప్రాంతంలో జమదగ్ని ఆశ్రమం ఉండేది. ఆయన భార్య రేణుకదేవి ప్రతిరోజు నదికి వెళ్లి ఇసుకతో కుండను తయారు చేసుకుని వాటితో నీరు తీసుకొని వచ్చేది. ఒకరోజు మహ రాజు వెయ్యి మంది భార్యలతో అక్కడికి వచ్చి జలక్రీడలు ఆడు తుండగా చూసిన రేణుక తన మనసులో రాజు వైభవాన్ని, అత ని భార్యల గురించి అనుకోవడం వలన మనోవికారం కలుగు తుంది. అందువల్ల ఆ రోజు ఇసుక కుండ తయారు కాదు. దాంతో రేణుక ఆలస్యం చేసి నీరు తీసుకురానందువల్ల జమదగ్ని కోపగించి ఆమెను చంపమని కొడుకులను ఆజ్ఞాపిస్తాడు.

తల్లిని చంపడానికి పెద్ద కుమారులు ఎవ రూ ముందుకు రారు. కానీ పరుశురాముడు మాత్రం తల్లి తలను నరికి తండ్రికి సంతోషాన్ని కలిగిస్తాడు. అప్పుడు జమదగ్ని సంతృప్తి చెంది ఏం వరం కావాల ని అడుగగా పరుశురాముడు తల్లిని బ్రతికించమని ప్రార్థిస్తాడు. రేణుక తల చాండల వాటికలో పడడం వల్ల బ్రతికించడం కష్టమని, ఈ తల ఎల్లమ్మ పేరు తో గ్రామదేవతల పూజలు అందుకుంటుందని జమదగ్ని చెప్పడం జరిగింది. మానవపాడు మండ లం ఉండవెల్లి గ్రామంలో గుడి కట్టించి గ్రామ దేవతగా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ పూజించు కోవడం జరుగుతోంది. ఆమె శరీరం బ్రహ్మేశ్వర ఆలయంలో సంతానం లేని స్ర్తీలచే పూజలందుకుని సంతానం ఇచ్చే దేవతగా ఉంటుందని జమదగ్ని అనుగ్రహించాడు. ఇప్పటికీ భూదేవి పేరుతో స్ర్తీలతో పూజలందుకుంటుంది.

PC: YOUTUBE

శక్తిపీఠం... జోగులాంబ ఆలయం...

శక్తిపీఠం... జోగులాంబ ఆలయం...

నవ బ్రహ్మ ఆలయాల్లో బాలబ్రహ్మే శ్వరుడు ప్రధాన దైవం. ఈ దేవాల యం క్రీశ 702 సంవత్సరంలో నిర్మించడం జరిగిందని స్థల పురాణాలను బట్టి తెలుస్తోంది. రెండవ ద్వారమే ఆలయ ప్రధాన ద్వారంగా ఉంది. దీనికి రెండువైపులా బ్రహ్మ అర్ధనారీశ్వర మూర్తులున్నారు. స్వామికి అఖండ దీపరాధానం, నిత్యపూజ, నైవేద్యాలు, శ్రావణ కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు, శివరా త్రి సమయంలో రథోత్సవం జరుగుతుంది. 18 శక్తి పీఠాలలో 5 వ శక్తి పీఠంగా పిలువబడుతున్న జోగుళాంబ అమ్మవారి ఆలయం, అలంపూర్‌, శ్రీశైలం, ద్రాక్షారామం, పిఠాపురంలు నాలుగు మనరాష్ట్రంలోనే ఉండడం గమనార్హం.

అమ్మవారి దేవాలయం క్రీ.శ 7వ శతాబ్దంలో నిర్మించారు. 9వ శతాబ్దంలో ఆదిశంకరుడు, శ్రీ చక్రి ప్రతిష్ట చేసింది మొదలు నేటికీ భక్తుల పూజలు అందుకోవడం జరుగుతోంది. క్రీశ 14వ శతాబ్దంలో ముస్లింలు దండయాత్ర చేసి అమ్మవారి దేవాలయం ధ్వంసం చేశారు. స్థాని కులు అమ్మవారి విగ్రహాన్ని, బాలబ్రహ్మేశ్వర ఆలయంలో చిన్న గుడిలో పెట్టి పూజించేవారు. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయల కుమారుడు దేవరాయలు తండ్రి ఆజ్ఞాను సారం సైన్యంతో వచ్చి బహమనీ సైన్యాలను తరిమికొట్టి అలంపూర్‌ క్షేత్రాలను రక్షించాడు.

ఈ సంఘటన 1390 లో జరిగిందని చరిత్ర చెబుతోంది. 600 సంవత్సరాల తరువాత జగదాంబ ఇష్టానుసారం పాత ఆలయం ఉన్నచోట అదే వాస్తు ప్రకారం కొత్త దేవాలయాన్ని నిర్మించిన దేవదాయ, ధర్మాదాయ శాఖ పాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. నవబ్రహ్మ ఆలయాల్లో కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవ బ్రహ్మ ఆలయాలు ఈ ప్రాంతంలో నిర్మించారు.

నవ బ్రహ్మ ఆలయాలు

నవ బ్రహ్మ ఆలయాలు

నవ బ్రహ్మ ఆలయాలు నవబ్రహ్మ ఆలయాలను బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో చాలానే ఆలయాలను కట్టించారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ మరియు విశ్వ బ్రహ్మ అనే తొమ్మిది బ్రహ్మ ఆలయాలు నవ బ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినాయి.

PC : krishna gopal

 బాలబ్రహ్మశ్వర దేవాలయం

బాలబ్రహ్మశ్వర దేవాలయం

బాలబ్రహ్మశ్వర దేవాలయం ఆలయాలన్నింటిలో పెద్దది. తారక బ్రహ్మ దేవాలయం శిధిలమై ఉంటుంది మరియు గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు స్వర్గ బ్రహ్మ దేవాలయం సుందరమైనది మరియు చాళుక్యుల మచ్చుతునక.

PC : siva saradhi

సూర్యదేవాలయం

సూర్యదేవాలయం

క్రీ.శ. 9 వ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. అలాగే, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఉన్నది. కృష్ణా, తుంగభద్ర రెండు నదులకు పుష్కరాలు వచ్చినప్పుడు అలంపూర్‌లో భక్తుల కోలాహలం తో కిటకిటలాడుతుంది.

PC : Venugopala Rao Veerisetti

ఇలా వెళ్ళాలి...

ఇలా వెళ్ళాలి...

అలంపూర్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం

జాతీయ రహదారి అలంపూర్ గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Naidugari Jayanna

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more