Search
  • Follow NativePlanet
Share
» »కూవాగం - హిజ్రాల పండగ !

కూవాగం - హిజ్రాల పండగ !

By Mohammad

ఆడామగా కాని మూడోవర్గం లేదా జాతి హిజ్రాలు. వీరిని సంఘంలో చిన్నచూపు చూస్తారు. అంతేకాదు, వారిని దగ్గరికి ఎవ్వరూ రానివ్వరు . ఏడాది పొడవునా ఎన్నో అవమానాలు భరించే హిజ్రాలు సంవత్సరంలో మూడు రోజులు ఆనందోత్సాహాలతో గడుపుతారు. చెప్పాలంటే...దాని కోసమే ఏడాదంతా ఎదురుచూస్తుంటారు. అదే హిజ్రాల పండుగ.

ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది జీవితంలో ముఖ్య మైన ఘట్టం. కానీ, హిజ్రాలకు ఆ అదృష్టం ఉండదు. కానీ, వారు ఆ ఉత్సవాల్లో పెళ్లికూతుళ్లవుతారు. అది ఆ పండుగ వాళ్లకిచ్చిన గొప్ప బహుమానం.

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని ఉలుందూరుపేటై తాలూకాలోని 'కూవాగం' గ్రామంలో ఉన్న 'కూతాండవర్‌' దేవాలయం హిజ్రాలకు పవిత్ర ఆలయం. చెన్నై నుంచి ఈ ఆలయం 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వారు ఆలయంలోని ఆరాధ్య దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇలా చేస్తే కూతాండవర్‌ మరణిస్తాడని వారి భావన. ఆసక్తికరంగా ఉంది కదూ మరింతగా చదవండి !

హిజ్రాలు ఏమంటారంటే ..!

హిజ్రాలు ఏమంటారంటే ..!

కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప యోధుని బలిదానం జరగాలట. అలాంటి యోధుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక ప్రత్యామ్నాయంకోసం ఆలోచించగా అర్జునుడికీ, నాగకన్య ఉలూపికీ జన్మించిన ఇరావంతుడు గుర్తొచ్చి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే, బలయ్యే ముందు పెళ్లి చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమనీ చెబుతారు హిజ్రాలు.

చిత్ర కృప : Sriram Jagannathan

కూతాండవర్‌ ఆలయ ఉత్సవం

కూతాండవర్‌ ఆలయ ఉత్సవం

ఇరావంతుడు, మోహినిల వివాహానికి సూచికగా... ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవర్‌ ఆలయ ఉత్సవం.

చిత్ర కృప : Saravanakumar Thangavelu

కూతాండవర్‌ ఆలయ ఉత్సవం

కూతాండవర్‌ ఆలయ ఉత్సవం

ఈ ఉత్సవాల్లో హిజ్రాలు... అందం, అలంకరణల ప్రదర్శనకే అధిక ప్రాధాన్యమిస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని వీధుల్లో తిరుగుతారు.

చిత్ర కృప : Kannan Muthuraman

కూతాండవర్‌ ఆలయ ఉత్సవం

కూతాండవర్‌ ఆలయ ఉత్సవం

ఈ వేడుకలో హిజ్రాలే కాదు, ఆడవేషం ధరించాలనుకునే మగాళ్లూ భారీగా పాల్గొంటారు. ఉత్సవంలో భాగంగా విల్లుపురంలో హిజ్రాలకు నృత్యాలూ అందాల పోటీలూ జరుగుతాయి. ఉత్సవం 18 రోజులు నిర్వహిస్తారు. 17 వ రోజు మాంగల్యధారణ, 18 వ రోజు వితంతు అవతారం ఈ వేడుకల ముఖ్య ఘట్టాలు.

చిత్ర కృప : Akilan Thyagarajan

ఉత్సవం జరిగే తీరు

ఉత్సవం జరిగే తీరు

మొదట కూవాగం చేరుకున్న హిజ్రాలను గ్రామస్థులు తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు. హిజ్రాలంతా కూవాగం ఆలయంలో వెలసిన ఇరావంతుణ్ణి భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీరలు కట్టుకుని వధువుల్లా మారతారు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు.

చిత్ర కృప : Kannan Muthuraman

ఉత్సవం జరిగే తీరు

ఉత్సవం జరిగే తీరు

ఆలయ నియమానుసారం మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చట. అందుకే, సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు ఆచారానికోసమన్నట్టు... చేతికి రెండుమూడు గాజులు ధరించి, మల్లెపూలు మెడకు చుట్టుకుని పూజారులతో తాళికట్టించుకుంటారు.

చిత్ర కృప : Radhakrishnan S

ఉత్సవం జరిగే తీరు

ఉత్సవం జరిగే తీరు

తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ .. చెక్కలతో ఇరావంతుని విగ్రహం చేసి వూరంతా వూరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచకంగా చెక్కవిగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు.

చిత్ర కృప : Saravanan Dhandapani

ఉత్సవం జరిగే తీరు

ఉత్సవం జరిగే తీరు

ఇరావంతుని బలి జరిగిందని తెలుసుకుని ఏడవడం మొదలుపెడతారు. తలకు పెట్టుకున్న పూలు, తాళిబొట్టు తీసేస్తారు. చేతి గాజులు పగులకొట్టుకుంటారు. బొట్టు చెరిపేస్తారు. ఆ తరువాత స్నానం చేసి వితంతువు సూచనగా తెల్లచీర, రవిక ధరించి ఊరి వదిలి సొంత ఊర్లకు బయలుదేరుతారు. దాంతో ఉత్సవం ముగుస్తుంది.

చిత్ర కృప : Kannan Muthuraman

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X