Search
  • Follow NativePlanet
Share
» »దేశ.. విదేశ ..పర్యాటకులను ఆకర్షిస్తోన్నపంచగని లోయల అందాలు..!!

దేశ.. విదేశ ..పర్యాటకులను ఆకర్షిస్తోన్నపంచగని లోయల అందాలు..!!

ప్రకృతి అందాలు చూడాలి. చారిత్రక ప్రదేశాలను సందర్శించాలి. పనిలో పనిగా కొన్ని ఆలయాలను దర్శించుకోవాలి అనుకునే వారు మహాబలేశ్వరం టూర్‌ ప్లాన్‌ చేసుకోవాలి. ప్రకృతి రమణియత తో శోభిల్లే జంట పర్యాటక కేంద్రాలు మహారాష్ట్ర లోని పంచగని, మహాబలేశ్వర్ లు. పంచగని బ్రిటీషు వారిచే కనుగొనబడిన వేసవి విడిది. ఇది సముద్రమట్టానికి 1,350 మీటర్ల ఎత్తులో ఉంది. చరిత్ర అందిస్తున్న ఆధారాల ప్రకారం జాన్ ఛెసన్ అనే బ్రిటీష్ సూపరింటెండ్ ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ ఉండేవాడట.

పంచగని అంటే అయిదు కొండల ప్రాంతం అని అర్ధం. పంచగని లోయల అందాలు దేశ విదేశ పర్యాటకులకు కనువిందు చేస్తూ వారిని ఆకర్షిస్తున్నాయి. చారిత్రకంగా ఆనాడు బ్రిటీషు వారికి ఇష్టమైన వేసవి విడిది ఇది. ఇప్పటికీ పంచగని లో ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తోంది. అడ్వెంచర్‌ లవర్స్‌కి ఇది పర్‌ఫెక్ట్‌ ప్లేస్‌. ఇక వర్ష ఋతువులో ఈ ప్రాంతం అందాలను చూడవలసిందే. ఇరుకైన కొండల మధ్య సన్నని జలపాతాలు మనోహరంగా ఉంటాయి. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం మనసు దోచేస్తుంది. ట్రెక్కింగ్‌ చేయడానికి అనువైన చోటిది. చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి.

అందమైన పకృతిలో కొండల మధ్య సూర్యాస్తమయం ఆస్వాదించాలన్నా, అలా కాసేపు బొటులో షికారు చేయవచ్చు, స్ట్రా బెర్రీ పళ్ళూ కోసుకోవచ్చు. సాహసోపేతమైనా ఆలోచనలున్నవారైతే పారాగ్లైడింగ్ చేయవచ్చు. ఇలా ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరిచే ఎన్నో ప్రత్యేకతలు కలిగిఉన్న ప్రదేశం పంచగని.

పశ్చిమ భారతదేశంలోని పారాగ్లైడింగ్కు అనువైన ప్రదేశాల్లో

పశ్చిమ భారతదేశంలోని పారాగ్లైడింగ్కు అనువైన ప్రదేశాల్లో

పశ్చిమ భారతదేశంలోని పారాగ్లైడింగ్కు అనువైన ప్రదేశాల్లో ప్రముఖమైన ప్రాంతం పంచగని. 4,500 అడుగుల ఎత్తులో సుందరమైన లోయలు, చల్లని గాలుల సహజ సౌందర్యంతో కట్టి పడేస్తుంది. ఇక్కదనుంచి పారాగ్లైడింగ్ చేస్తుంటే ఆ కొండల సౌందర్యం కన్నుల విందుగా ఉంటుంది. మరి పంచగని చూడాలంటే ఇది ముంబాయ్ కి 242కిలోమీటర్ల దూరంలో, పూనెకు 99కిలోమీటర్ల ఊదరంలో బెంగళూరు నుండి 778కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం పంచగనిలో రా రమ్మని ఆహ్వానించే పంచగనిలోని ఆ ప్రదేశాలేంటో ఒకసారి చూసేద్దాం..

పంచగని కొండలు

పంచగని కొండలు

మహారాష్ట్రలో వుండే ఈ జంట పర్యాటక కేంద్రం.. ప్రకృతి రమణియతతో శోభిల్లుతుంటుంది. అందమైన పకృతిలో కొండల మధ్య పయనించే ఆ సరస్సు నీరు తన అందంతో పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. ఇక్కడ సాహసోపేతమైనా పారాగ్లైడింగ్ చేయవచ్చు. వర్ష ఋతువు ఈ ప్రాంతానికి సరికొత్త అందాలను తీసుకువస్తుంది.

మురగన్ దేవాలయం

మురగన్ దేవాలయం

శివుడి కుమారుడైన కార్తికేయుని కి రాయ్ పురి గుహల్లో ఓ గుడి ఉంది. ఈ గుహల్లో ఇసుక తో నిర్మించిన ఈ అందమైన గుడి చూడానికి జనం బారులు తీరతారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో థాయ్ పూయం అనే పండుగ పర్వదినాల్లో భక్తులతో ఈ ప్రదేశం మరింత రద్దీగా కిటకిటలాడుతుంది. ఈ పరిసర ప్రాంతాలన్నీ మనలో భక్తి భావాన్ని పెంపొందించేవిగా ఉంటూ, ఉత్తేజితుల్ని చేస్తాయి.

ధూం డ్యాం

ధూం డ్యాం

వాయి గ్రామానికి దగ్గరలో ఉన్న ఈ ఆనకట్ట ను 1976 లో జల విద్యుత్ మరియు నీటి సరఫరా నిమిత్తం నిర్మించారు.బోటింగ్ సౌకర్యమూ, వివిధ వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. స్పీడ్ బోత్లు, స్కూటర్ బోట్లూ కుడా ఉన్నాయి.దేవాలయాలు

టేబుల్ ల్యాండ్

టేబుల్ ల్యాండ్

లాటరైట్ నేలతో కూడిన పీఠ భూమి ఇది. సుమారు 99 ఎకరాల ఈ ప్రాంతాన్ని ఆసియా లోకెల్లా రెండవ పెద్ద కొండ ప్రాంతపు పీఠభూమి అని గుర్తించారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఆట పాటలతో సరదా సాయంత్రాలు గడపడానికి పంచగని లో ఇదో గొప్ప ప్రదేశం.ఇక దక్షిణం వైపుగా వెళితే డెవిల్స్ కిచెన్ వస్తుంది. ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారని ప్రతీతి. ఇక్కడ నుంచి రాయ్ పూరి గుహలూ కనిపిస్తాయి.

కమల్ గాఢ్ ఫోర్ట్ :

కమల్ గాఢ్ ఫోర్ట్ :

ఈ ఫోర్ట్ దాదాపు 3 నుండి 4 ఎకారాల ప్రదేశాన్ని ఆక్రమించి ఉంది. చుట్టు పక్కల అద్భుతమైన కొండలు, మద్య అత్యంత ఎత్తులో ఉంది. ఇక్కడ నుండి చుట్టు పక్కల అందమైన ప్రదేశాలను చూసి ఆశ్వాదించవచ్చు.

మాప్రో గార్డెన్ లో అనేక స్ట్రాబెరీ తోటలు

మాప్రో గార్డెన్ లో అనేక స్ట్రాబెరీ తోటలు

మాప్రో గార్డెన్ లో అనేక స్ట్రాబెరీ తోటలు నోరూరిస్తుంటాయి. ఆ తోటల్లో విహరించడం ఒక మధురానుభూతి. తపోలా చుట్టూ ఈ స్ట్రాబెర్రీ నర్రరీలు అనేకం ఉన్నాయి. స్ట్రాబెర్రీ తోటల్లో విహరించాలంటే వింటర్ సీజల్లో తప్పకుండా వెళ్ళాలి. అలాగే ఈ తోటల్లో అచ్చు సన్ ఫ్లవర్ లా ఉండే గెర్బెరా ఫ్లవర్ ను చూసి ఆనందించవచ్చు.

వీనా లేక్:

వీనా లేక్:

మహాబలేశ్వరంలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రదేశం ఇది. చుట్టూ చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే ఈ సరస్సులో బోట్‌లో విహరించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఇక్కడ దగ్గరలో హార్స్‌ రైడ్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు.

సిడ్నీపాయింట్

సిడ్నీపాయింట్

పంచగని బస్ స్టాండ్ కు 2 కి.మీ. దూరం లో ఉన్న ఈ కొండ శిఖరం నుంచి ధూం డ్యాం పరిసరాలనూ, మన్ దర్ దేవీ, పాడవగృహ్ లను వీక్షించవచ్చు. ఈ అందమైన కృష్ణా లోయ చూడచక్కని ప్రదేశం.

పంచగంగ టెంపుల్‌

పంచగంగ టెంపుల్‌

కృష్ణా, వీణా, సావిత్రి, కోయనా, గాయత్రి... ఈ ఐదు నదుల సంగమ ప్రదేశంలో నిర్మించిన ఆలయాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆలయంలో గోముఖి విగ్రహం, శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూడొచ్చు. ఈ ఆయలాన్ని శ్రీకృష్ణునికి అంకితం చేయబడినది. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత మూలంగా ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాల్లో రంగురంగుల హ్యాండీక్రాఫ్ట్స్ ను కొనుగోలు చేయవచ్చు. ఆలయం వేళలు ఉదయం 5:00 AM To 12:00 PM and సాయంత్రం 4:00 PM to 9:00 PM. ఈ ఆలయం సందర్శించడానికి అక్టోబర్ నుండి జూన్ వరకు మంచిగా ఉంటుంది.

మహాబలేశ్వరం టెంపుల్‌

మహాబలేశ్వరం టెంపుల్‌

మహాబలేశ్వరం టూర్‌ ప్లాన్‌ చేసుకున్న వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. ఈ ఆలయంలో అతి పురాతనమైన శివుని మంచం, డమరుకం, త్రిశూలం చూడొచ్చు. ప్రతిరోజు ఉదయం బెడ్‌ షీట్‌ నలిగిపోయి ఉండటాన్ని భక్తులు గుర్తిస్తారు. రాత్రి శివుడే వచ్చి నిద్రించాడనడానికి ఇది గుర్తుగా విశ్వసిస్తుంటారు. ఉదయం 5 నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

పంచగని సందర్శించడానికి మంచి సమయం సంవత్సరం పొడవును అనుకూలంగానే ఉంటుంది. అయితే వర్షాకాలంలో అయితే పచ్చని ప్రక్రుతి మరింత ఆహ్లాదపరుస్తుంది. అలాగే సమ్మర్లో కూడా వేసవి విహారానికి చల్లగా ఉంటుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి మే వరకు సందర్శించవచ్చు.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

ముంబై నుంచి బయలుదేరినట్టయితే 285 కి. మీ. దూరాన్ని ముంబై పూణె ఎక్స్ప్రెస్ వేలో పంచగని చేరుకోవచ్చు. ఒక వేళ గోవా రోడ్ లో వస్తే పొల్ హత్ పూర్ దగ్గిర లెఫ్ట్ టర్న్ తర్వాత కొండ దారి గుండా ప్రయాణిస్తూ పోతే మొదటగా మహా బలేశ్వర్ చేరుకోవచ్చు. పంచగనికి వెళ్ళేదారి కొండ దిగువగా సతారా వెళ్ళే దారిలో ఉంటుంది.
Rajpuri Caves

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X