» »మూడు తలల రాక్షసుడు ఉన్న తిరుచురాపల్లి మన తెలుగు పల్లి !

మూడు తలల రాక్షసుడు ఉన్న తిరుచురాపల్లి మన తెలుగు పల్లి !

Written By: Venkatakarunasri

LATEST: భారతదేశంలో పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన పది పచ్చని నగరాలు ఏవేవో మీకు తెలుసా ?

దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చి లేదా తిరుచురాపల్లి ఒక పారిశ్రామిక విద్యాకేంద్రమైన నగరం. తిరుచ్చి అదే పేరు గల జిల్లాకు ఒక ప్రధానకేంద్రం. ఈ నగరం కావేరీ నది ఒడ్డున వుంది. ఈ ప్రాంతం పేరు, పుట్టుక గురించి చాలా కథనాలు వున్నాయి.

సంస్కృతంలో త్రిశిర అంటే మూడు తలలు, పల్లి లేదా పురం అంటే నగరం అని అర్ధం వచ్చే రెండు పదాల కలయిక త్రిశిరాపురం. త్రిశిరాపురం నుండి తిరుచునాపల్లి పేరు వచ్చింది. మూడు తలల రాక్షసుడు త్రిసురుడు ఇక్కడే శివుడు గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తెలుగు పండితుడు సి.పి. బ్రౌన్ చిన్న వూరు అని అర్ధం వచ్చే ఈ పేరు వచ్చిందని భావించాడు.

 తిరుశిలాపల్లి

తిరుశిలాపల్లి

16వ శతాభ్దానికి చెందిన రాతిశాసనం పవిత్ర శిలా నగరం అని అర్ధం వచ్చే తిరుశిలాపల్లి అనే పదం నుండి తిరుచురాపల్లి అనే పేరు వచ్చిందని చెబుతుంది.

pc:youtube

తిరుచ్చి

తిరుచ్చి

జనావాసాలు ఏర్పడ్డ అతి ప్రాచీన నగరాలలో తిరుచ్చి ఒకటి. గొప్ప సాంస్కృతిక వైభవం వున్న ఈ నగరం ఎన్నో రాజ్యాల ఉద్దాన పతనాలు చూసింది.

pc:youtube

గుహాలయాలు

గుహాలయాలు

క్రీ.పూ. 2 వ శతాభ్దానికి చెందిన జనావాసాలు కనుగొనబడ్డాయి.మధ్యయుగంలో క్రీ.శ.6 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజు ఒకటో మహేంద్రవర్మన్ రాక్ పోర్ట్ లో చాలా గుహాలయాలు నిర్మించాడు.

pc:youtube

చోళులు

చోళులు

పల్లవుల తర్వాత మధ్యయుగాలలో చోళులు తిరుచ్చిని జయించి క్రీ.శ.17వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు.

pc:youtube

గొప్ప సాంస్కృతిక వైభవం

గొప్ప సాంస్కృతిక వైభవం

తిరుచ్చి గొప్ప సాంస్కృతిక వైభవం,సంప్రదాయం వల్ల చాలా అద్భుతమైన చారిత్రక, ధార్మిక ప్రదేశాలు,చాలా కోటలు వున్నాయి.

pc:youtube

 ప్రాచీన కట్టడాలు

ప్రాచీన కట్టడాలు

విరళిమలై మురుగన్ దేవాలయాలు, రాక్ ఫోర్ట్ దేవాలయం,శ్రీ రంగనాథస్వామి దేవాలయం,జంబుకేశ్వర్ దేవాలయం, సమయపురం మరియమ్మన్ దేవాలయం ఇలా ఎన్నో రకాల దేవాలయాలు వున్నాయి. నవాబ్ అంతఃపురం, ముక్కొంబు డ్యాం తిరుచ్చిలోని కొన్ని ప్రాచీన కట్టడాలు.

pc:youtube

రవాణా మార్గాలు

రవాణా మార్గాలు

తిరుచ్చికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

pc:youtube