Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌కృతి ప్ర‌సాదం.. ఉమ్‌గోట్‌!

ప్ర‌కృతి ప్ర‌సాదం.. ఉమ్‌గోట్‌!

ప్ర‌కృతి సౌంద‌ర్యాల‌ను చూస్తే ఎవ్వ‌రికైనా ఆనందంగా ఉంటుంది. ఎటుచూసినా ప‌చ్చ‌నిచెట్లు, మొక్క‌లు, ప‌ర్వ‌తాలు, న‌దులు అడ‌వులు. ఇలాంటి అందాల‌ను చూస్తే ఎవ‌రి మ‌న‌సు పుల‌క‌రించ‌దు చెప్పండి! మాన‌సిక ప్ర‌శాంత‌త పొందాల‌నుకునేవారు ఇలాంటి ప్రాంతాల‌కు వెళ్లాల్సిందే. మ‌రి ఎలాంటి శ‌బ్దాలూ లేకుండా.. నీటిపై తేలియాడుతూ ఆ నీటి అడుగు భాగంలో ఏం జ‌రుగుతుందో క‌నిపించే ప్ర‌దేశానికి మిమ్మ‌ల్ని తీసుకెళితే ఎలా ఫీల‌వుతారు. అనేక ర‌కాల చేప జాతుల‌తో పాటు అరుదైన జీవుల ఆవాసంలో గ‌డిపితే ఎలా ఉంటుంది? త‌ల‌చుకుంటేనే మ‌న‌సు పుల‌క‌రిస్తోంది క‌దూ! మ‌రెందుకు ఆల‌స్యం ప్ర‌కృతి ప్ర‌తిబింబిస్తోన్న‌ అలాంటి ప్ర‌దేశంలో సేద‌దీరేందుకు మీరు రెఢీనా..!

అట‌వీ ఉత్ప‌త్తుల ఎగుమ‌తి కేంద్రంగా...

ప్ర‌కృతి ప్ర‌సాదించిందా అన్న‌ట్లు క‌నిపించే ఈ న‌ది పేరు ఉమ్‌గోట్ న‌ది. భార‌త్‌- బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని ఓ చిన్న కుగ్రామం దావ్‌కి ద‌గ్గ‌రలో ఈ న‌ది ఉంది. అక్క‌డి న‌దిలో నీరు అద్దంలా స్ప‌ష్టంగా ఉంటుంది. ఈ ప్రాంతం మేఘాల‌య రాజ‌ధాని షిల్లాంగ్ నుంచి సుమారు 95 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇది భార‌త్‌- బంగ్లాదేశ్ మ‌ధ్య‌లో ఓ వ్యాపార మార్గంలా ప‌నిచేస్తుంది. ఈ దారి నుంచి ప్ర‌తిరోజూ చాలా ట్ర‌క్కులు ప్ర‌యాణిస్తూ ఉంటాయి. మంచి వాణిజ్య మార్గంగా ప్రాచుర్యం పొందింది. స‌హ‌జ‌సిద్దంగా ల‌భించే అనేక అట‌వీ ఉత్ప‌త్తులు ఇక్క‌డి నుంచి ఎగుమ‌తి జ‌రుగుతోంది. ఈశాన్య భార‌తదేశంలో ప‌ర్య‌టించేట‌ప్పుడు ఈ నదిని త‌ప్ప‌క చూడాల్సిందే. చుట్టూ ప‌చ్చ‌ని ప్ర‌కృతి మ‌ధ్య ఈ న‌ది ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

Umngot river

అద్దంపై ప్ర‌యాణించే అనుభూతి..

దావ్‌కిలోని ఉమ్‌గోట్ న‌ది ప్ర‌త్యేక‌త ఏంట‌టే ఈ న‌దిలోని నీరు పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది. చూడ్డానికి అద్దంలా మ‌న ప్ర‌తిబింబాలు మ‌న‌కే క‌నిపిస్తుంటాయి. ఈ న‌ది మ‌త్స్య‌కారుల‌కు చేప‌లు ప‌ట్టుకునేందుకు సులువుగా ఉంటుంది. ఇక్క‌డ బోటింగ్ చేయ‌డానికి సుదూర ప్రాంతాల నుంచి సంద‌ర్శ‌కులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. బోటింగ్ చేస్తున్న‌ప్పుడు మ‌న‌కి అద్దంపై ప్ర‌యాణిస్తున్న‌ట్లు ఉంటుంది. ప‌ర్యాట‌కులు ప్ర‌యాణించే బోటు నీడ సైతం న‌ది అడుగు భాగంలో చూడొచ్చు.

న‌దిపై బోటు షికారు చేసేట‌ప్పుడు న‌దీ గ‌ర్భం మొత్తం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అడుగు భాగాన ఉన్న రాళ్ల‌తో స‌హా స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. ఎక్క‌డా చెత్తా చెదారం మ‌చ్చుకైనా క‌నిపంచ‌దు. అందుకే, ప్ర‌పంచంలోని స్వ‌చ్ఛ‌మైన న‌దుల‌లో ఉమ్‌గోట్ కు ప్ర‌త్యేక స్థానం ల‌భించింది. ఇక్క‌డి నీటిలో తిరుగాడే చేప‌లు, ఇత‌ర అరుదైన జీవులు మ‌న‌తో మాట్టాడుతున్న అనుభూతిని క‌లిగిస్తాయి. ఈత కొట్టేవారు చేసే విన్యాసాల‌ను స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చు.

Read more about: umngot river shillong meghalaya
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X