Search
  • Follow NativePlanet
Share
» »సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం.. దైవ మహిమ అంటే ఇదే !

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం.. దైవ మహిమ అంటే ఇదే !

By Venkatakarunasri

హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. హంపి గురించిన కొన్ని వాస్తవాలు హంపి ప్రాచీన పట్టణమే కాదను. దీనిని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అనేవారని చరిత్ర చెపుతోంది. 13 నుండి 16 శతాబ్దాలవరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్దితిలో రాణించింది. కర్నాటకకు ఉత్తర భాగాన బెంగుళూరుకు 350 కిలో మీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరునుండి బస్సులు అనేకం. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్ధ యునెస్కో గుర్తించింది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు దీనిని దర్శిస్తారు.

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

హంపి శిధిలాలు చూడాలంటే, స్ధానికంగా ఒక సైకిల్ అద్దెకు తీసుకొని దనిపై తిరుగుతూ చూస్తే పూర్తిగా వాటిని ఆనందించినవారవుతారు. అసలు టూరిస్టులు హంపి ఎందుకు ఇష్టపడతారు. హంపి పట్టణం దాని శిధిలాలకంటే కూడా దాని మతపర చరిత్రకు ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, ఆంజనేయాద్రి మొదలైనవి కలవు. కర్నాటకలోని ప్రధాన నదులలో ఒకటైన తుంగభద్ర ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఎంతో ఆనందింపజేస్తుంది. హంపి పట్టణంలోని దేవాలయాల నిర్మాణానికి గాను విజయనగర రాజులు అక్కడి సమీప కొండల రాళ్ళను చక్కగా చెక్కించి నిర్మించారు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

దేవాలయాలు, సహజ అందచందాలే కాక అక్కడ అనేక సరస్సులు కూడా ఉన్నాయి. అందమైన భవనాలను నర్మించారు. ఈ పట్టణ నిర్మాణంలో విజయనాగర రాజుల ఎంతో నేర్పరితనం ప్రణాళిక కనపడతాయి. 13 నుండి 15 శతాబ్దాలలోనే ఈ పట్టణంలో అనేక నేటి ఆధునిక నీటి ప్రణాళికా విధానాలు ఆచరించారు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

తుంగభద్ర నదీ పరవళ్ళు ఓ వైపు,పచ్చదనం పరచిన అందాల ప్రకృతి మరోవైపు.అదే విజయనగర సామ్రాజ్యవైభవానికి తీపి గురుతు హంపి.అక్కడి ఎత్తైన కొండగట్టలమీద దాగి యున్న శిల్పసౌందర్యాన్ని మాటల్లో వర్ణించటం కష్టమే.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

అలనాటి స్మారకాల శిల్పసౌందర్యవైభవం తెలుసుకోవాలంటే హంపీని సందర్శించాల్సిందే. నేటి కర్ణాటక రాష్ట్రంలోని హంపిగ్రామం ఆనాటి విజయనగర రాజుల కాలంలో ఎంతో ప్రముఖస్థానంలో వుండేది.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

ఈ పట్టణం తుంగభద్ర నది ఒడ్డున నిర్మించబడినది. తుంగభద్ర నదిని గతంలో పంపాఅనే పేరుతో పిలిచేవారు.ఆ పంపానదిని కన్నడ భాషలో హంపి అని పిలిచేవారు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

ఆ తరువాత కాలంలో ఆంగ్లభాష సంపర్కం కారణంగా హంపి అనే హంపిగా మారింది. పంపానది ఒడ్డున నిర్మించబడిన కారణంగా ఈ పట్టణానికి హంపి అన్న పేరు వచ్చిందని చెపుతారు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

ఈ పట్టణంలోనే ఆ నాటి విజయనగరరాజుల విరూపాక్షస్వామి ఆలయం నిర్మించబడినది.విరూపాక్ష అనగా అక్రమ ఆకారంలో కళ్ళు గలవాడు.అనగా త్రినేత్రుడు లేదా శివుడు అని అర్ధం.ఈ క్షేత్రం తుంగబధ్రనది దక్షిణఒడ్డులో వుంది.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

పార్వతీదేవి ఈ క్షేత్రంలో పంపాదేవి గా జన్మించింది. శివుడ్ని తన భర్తగా చేసుకోవటంకోసం ఆమె ఈ క్షేత్రంలో ఎంతో కాలం తీవ్రతపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చుకున్న పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

పార్వతీపరమేశ్వరులకు ఆనాడు వివాహం జరిగిన ప్రదేశంలోనే ప్రస్తుతం విరూపాక్షస్వామి ప్రధానఆలయం వుంది.దేశ వ్యాప్తంగా వున్న అనేక మంది శివభక్తులు చూడటానికి ఈ విరూపాక్షఆలయానికి వస్తూవుంటారు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

ఆ అద్భుతం ఏంటంటే విరూపాక్షఆలయానికి వెనకవున్న సాలుమంటప గోడమీద రాజగోపురం యొక్క నీడ తలక్రిందులుగా పడుతుంది. రాజగోపురం నుండి 3న్నర అడుగులదూరంలో ఈ సాలుమంతప గోడ వుంటుంది. 3.6అంగుళాల పొడవుండే సన్నని చీలిక ప్రధాన ఆలయగోపురం గోడమీద 6అంగుళాలపొడవుండేసన్నటి చీలిక వుంటుంది.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

ఈ చీలిక గుండా సూర్యకిరణాలు ఆలయం లోపల పశ్చిమంగోడ పైన పడి ఆలయం యొక్క తూర్పు అభిముఖంగా వుండే ప్రధానరాజగోపురం యొక్క నీడ తలక్రిందులుగా పడుతుంది.ఆ నీడ సంవత్సరమంతా కనిపిస్తుంది.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

ఈ రాజగోపురం సాలుమంటపం మరియు రాజగోపురానికి మధ్యలో వుంటుంది.సాలు మంటపం నేలపై పడే గోపురం ఎత్తు 15అడుగులువుంటుంది నిజంగా గోపురం ఎత్తుకూడా 15అడుగులే వుంటుంది.ఇంకొక అద్భుతం కూడా ఈ క్షేత్రంలో బయటపడింది.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

అది ఏంటంటే ఈ క్షేత్రంలో ప్రధానదైవమైన విరూపాక్ష స్వామి వేంచేసివున్న గర్భగుడి యొక్క నీడ విరూపాక్షఆలయం వెనకాలవున్న సాలుమంటపంలో ఒక చోట తలక్రిందులుగా పడుతుంది. గర్భగుడి యొక్క నీడ గర్భగుడి పైన ఒక రంధ్రం గుండా ప్రయాణించి సాలుమంటపంలోపల వున్న నేల పైన పడుతుంది.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

విరూపాక్షస్వామి ఆలయప్రాకారం సూర్యోదయం నుండి వుదయం 9గంల వరకూ ఈ నీడ కనిపిస్తుంది. కొన్ని సార్లు సాయంసమయాల్లోనూ ఈ నీడ కన్పిస్తుంది. విరూపాక్షఆలయ ప్రాకారం లోపల అనేకచిన్న చిన్న ఆలయాలు మరియు మంటపాలు నిర్మించబడి వున్నాయి.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

3తలలు వుండే నంది ఈ క్షేత్రంలో వున్న ఇంకొక ప్రత్యేకత. ఇక ప్రధానఆలయానికి వుత్తరదిశలో వున్న రెండు ఉపఆలయాల్లో పరమ శివుని సతీమణియైన పంపాదేవి మరియు భువనేశ్వరీపూజలు అందుకుంటున్నారు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

ప్రధానఆలయానికి తూర్పుదిశలో భూమి లోపల పాథాలేశ్వరస్వామి ఆలయం వుంది.ఈ ఆలయంలోకి వెళ్ళటానికి మెట్లున్నాయి.వీలున్నప్పుడువెళ్లికళ్ళారా ఆ అద్భుతాన్ని తనివి తీరాచూడండి.ఆనందాన్ని పొందండి.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

విఠల దేవాలయం వద్ద గల రాతి రధం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విజయనగర రాజుల సాంప్రదాయాలను వెల్లడిస్తూంటుంది. దీనినే రాష్ట్ర టూరిజం శాఖ తన పర్యాటక చిహ్నంగా ఆమోదించింది. నేటికి హంపి లో పురావస్తు శాఖ తన పరిశోధనలు సాగిస్తూనే ఉంది.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

ఇక్కడి పురావస్తు మ్యూజియం తప్పక చూడదగినది. తుంగభధ్రా నది ఒక వైపు, మూడు వైపుల కొడలు గల హంపి పట్టణాన్ని విజయనగర రాజులు ఎంతో ప్రణాళికగా తమ రాజ్య రాజధానిగా చేసుకొని పాలించారు. ఈ పట్టణాన్ని జయించటం శత్రురాజులకు అసంభవంగా భావించి వారు దీనిని ఎంపిక చేశారు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

నేడు ఈ కొండ ప్రాంతాలు, చక్కటి నదీ ప్రవాహం పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. దక్షిణ భారత దేశానికి వచ్చిన పర్యాటకులు హోయసల శిల్ప సంపదలకు ప్రధానమైన హంపి పట్టణాన్ని తప్పక దర్శించి తీరాల్సిందే.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

యంత్రోధ్ధారక ఆంజనేయ దేవాలయం, హంపి

హంపిలో ఈ దేవాలయం చాలా పవిత్రమైనది. దీనిని ఆంజనేయుడికి అంకితం చేసినట్లు చెపుతారు. ఇది కోదండ రామ దేవాలయ వెనుక భాగంలో ఉంది. హనుమంతుడి విగ్రహాన్ని యంత్ర అని స్ధానికంగా చెపుతారు. ఈ యంత్రంలోనే అనేక కోతులు కూడా చెక్కబడ్డాయి.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

యంత్రధారక ఆంజనేయ దేవాలయంలో హనుమంతుడు కూర్చుని ఉన్న భంగిమలో ఉంటాడు. దేవాలయ గోడలు బయటివైపు సింధూరం మరియు తెలుపు చారలు కలిగి ఉంటాయి. ఈ దేవాలయంలో పవిత్ర చెట్టు కింద భక్తులు కొన్ని నాగ విగ్రహాలు కూడా చూస్తారు. యంత్రోధారక ఆంజనేయ దేవాలయం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళలలో భక్తులకు తెరచి ఉంటుంది.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

యేడూరు బసవన్న, హంపి

యేడూరు బసవన్న అంటే...ఒకే రాతితో చెక్కబడిన శివుడి వాహనం అయిన నంది. హంపి బజార్ లో తూర్పు చివరన ఉంటుంది. ఎంతో మంది యాత్రికులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. దీనిని మంచి ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు. ఈ నంది విరూపాక్ష దేవాలయాన్ని చూస్తూ ఉంటుంది. ఈ రాతి చెక్కడం వద్ద పర్యాటకులు ఒక ఇనుప చువ్వలతో కూడిన రాతి దీప ప్రదేశాన్ని కూడా చూడవచ్చు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

భూగర్భ దేవాలయం, హంపి

హంపి చేరే పర్యాటకులు భూగర్భ దేవాలయాన్ని తప్పక చూడాలి. ఇక్కడ శివుడు ఉంటాడు. ఇతడినే ప్రసన్న విరూపాక్షుడంటారు. దీనిని భూమికి అడుగున నిర్మించారు. ప్రధాన భాగాలు చాలా వరకు నీటిలోపలే ఉంటాయి. నీరు లేని కెనాల్ ఉన్నప్పటికి లోపలి ప్రాంతాలకు ప్రవేశం లేదు. ఈ భూగర్భ దేవాలయం హంపిలో పురాతనమైంది. ప్రసిద్ధి గాంచినది.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

ఇది నోముల్ మాన్ క్వార్టర్స్ కు సమీపంలో మెయిన్ రోడ్డుపై బస్ స్టాండ్ కు దగ్గరగా ఉంటుంది. పర్యాటకులు దేవాలయాన్ని మెయిన్ టవర్ ద్వారా చేరవచ్చు. పెద్ద మెట్లు మరియు గర్భగుడి పర్యాటకులను భూగర్భ దేవాలయానికి తీసుకువెళతాయి. మెయిన్ హాలు, స్తంభాలు ఉంటాయి. నీటి స్ధాయిని బట్టి పర్యాటకులు గర్భగుడిని సందర్శించవచ్చు. గుడి చుట్టూ అందమైన పచ్చని లాన్లు ఉంటాయి.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

హంపి వాతావరణం

యునెస్కో వారసత్వ గుర్తిపు ఉన్న హంపి సందర్శనకుగాను చలికాలం లేదా వింటర్ ఎంతో అనుకూలసమయం. హంపిలో పండుగల సమయంఅయిన సెప్టెంబర్ మరియు ఫిబ్రవరి లలో యాత్రికులు బాగా వస్తారు.

PC:youtube

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

హంపి పట్టణాన్ని చేరటం ఎలా?

హంపి పట్టణం రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు ద్వారా అనుసంధానించబడి ఉంది. ప్రభుత్వ బస్సులు మరియు ప్రయివేటు వాహనాలు విరివిగా దొరుకుతాయి.

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

రైలు ప్రయాణం

హంపికి రైలు స్టేషన్ లేదు. హోస్పేట్ రైలు స్టేషన్ సుమారు 13 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడినుండి బెంగుళూరు, హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాలకు వెళ్ళవచ్చు. ఈ స్టేషన్ నుండి టాక్సీలు, క్యాబ్ లలో హంపి చేరవచ్చు.

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

సైంటిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్న శివలింగం..

విమాన ప్రయాణం

హంపికి దగ్గరి విమానాశ్రయం బెళ్ళారి విమానాశ్రయం. సుమారు 60 కి.మీ. దూరంలో ఉంది. హంపి నుండి 350 కి.మీ. దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది దేశీయంగాను అంతర్జాతీయంగాను అనేక విమానాలు నడుపుతోంది.

దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more