Search
  • Follow NativePlanet
Share
» »టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

By Venkatakarunasri

వాగమోన్ కేరళ రాష్ట్రంలోని ఒక ప్రముఖ పర్వత ప్రదేశం(హిల్ స్టేషన్). ఇది పడమటి కనుమలు విస్తరించిన కొట్టాయం, ఇడుక్కి జిల్లాల సరిహద్దులో ఉన్నది. ఈ ప్రదేశం పర్యాటకులకి ఎంతో ఇష్టం, ప్రత్యేకించి కొత్తగా పెళ్లి చేసుకొనివచ్చిన హనీమూన్ జంటలకి, ఏకాంతం కోరుకోనే యాత్రికులకి ఆసక్తికరంగా ఉంటుంది. ఆకుపచ్చని మైదానాలు, నీలం రంగు కొండలు, గలగల పారే నదులు, సెలయెర్లు, ఉవ్వెత్తు నుంచి ఎగిసిపడే జలపాతాలు, కాలుష్యరహితమైన గాలి ... ఇవన్ని కలిసి వాగమోన్ కు మరింత అందాన్ని చేకూర్చాయి. ఎన్నో ప్రకృతి ప్రదేశాలు, సినిమా షూటింగ్ ప్రదేశాలు, రిశార్ట్‌లు కలిగిన వాగమోన్ అందాలు ఒకసారి పరిశీలిస్తే ...

కేరళ రాష్ట్రం తో మనకు గట్టి సంబంధమే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రజలు ముమ్ముట్టి, మోహన్ లాల్ తరువాత ఎక్కువగా అల్లు అర్జున్ నే ఆదరిస్తారు. ఈ రాష్ట్రంలో మన టాలీవూడ్ సినిమా షూటింగ్ లు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఉదాహరణకి పవన్ కల్యాణ్ నటించిన పంజా, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, రవితేజ నటించిన నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్, ప్రభాస్ నటించిన బాహుబలి ... ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది.

కేరళ ... ఈ పేరు వింటే చాలు పర్యాటకులకు పచ్చని ప్రదేశాలు, కొబ్బరి చెట్లు, తాటి చెట్ల వరుసల బీచ్ లు, బ్యాక్ వాటర్స్ లో బోట్ విహారాలు, ఆయుర్వేద మసాజ్ లు, సుగుంధ ద్రవ్యాలు, తేయాకు తోటలు ... ఇంకా ఇలా ఎన్నో ఆకర్షణలు గుర్తుకువస్తాయి.

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

వాగమోన్ కి 10 కి. మీ. దూరంలో, కురిసుమల హిల్ కలదు. దీనిని మౌంటెన్ ఆఫ్ ది హోలీ క్రాస్ అని కూడా అంటారు. ఈ కొండ క్రిస్టియన్లకు ప్రముఖ యాత్రా స్థలం కాబట్టే క్రిస్మస్ మరియు గుడ్ ఫ్రైడే వేడుకలకు సమీప ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు.

చిత్ర కృప : telugu native planet

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

కురిసుమల హిల్, వాగమోన్

కురిసుమల కొండ చుట్టూ దట్టమైన అడవులు, తేయాకు తోటలు విస్తరించడం వల్ల కొండలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. కొండ మీదికి వెళ్ళేటప్పుడు ఐరోపా శిల్ప శైలిలో నిర్మించబడిన ఒక పురాతన ఇల్లు మరియు మానవ నిర్మిత సరస్సు చూడవచ్చు.

చిత్ర కృప : Vibha Raj

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

మురుగన్ పారా, వాగమోన్

మురుగన్ పారా కురిసుమల కొండ కి సమీపంలో ఉన్నది. దూర ప్రాంతాల నుండి ఇక్కడికి చాలామంది ట్రెక్కింగ్, కేంపింగ్ మరియు పారాగ్లైడింగ్ ల కొరకు వస్తుంటారు. ఇక్కడి సమీపంలో గల సుబ్రమణ్యం స్వామి(మురుగన్) వారి ఆలయం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని రాళ్ళ నుండి అందంగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు మురుగన్ దర్శనానికి వస్తుంటారు.

చిత్ర కృప : kmurugeshbabu

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

తంగల్ పేరా, వాగమోన్

వాగమోన్ పేరుపొందిన మరొక మత పరమైన ఆకర్షణ గల ప్రదేశం తంగల్ పేరా. ఇస్లాం మతాన్ని స్వీకరించిన ప్రజలు ఇక్కడికి వస్తారు. షేక్ ఫరియుద్దీన్ సమాధి అవశేషాలు కల ఒక పెద్ద రాయి ఇక్కడ కలదు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఉరుసు ఉత్సవాల సందర్భంలో దీనిని సందర్శిస్తుంటారు.

చిత్ర కృప : Rateesh Upendran

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

గుహలు, వాగమోన్

తంగల్ పేరా కి సమీపంలో చాలా పురాతన గుహ ఒకటి కలదు. మన పూర్వీకులు ఇక్కడే ఉండేవారట ..! తంగల్ పేరా ను చూసి ఈ గుహలో అడుగు పెడితే మీరు మరో లోకంలో అడుగుపెట్టినట్లు అనుకుంటారు. ఆ గుహలు అంత అందంగా ఉంటాయ్ మరి ..!

చిత్ర కృప : Surjith SM

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

వాగమోన్ సరస్సు, వాగమోన్

వాగమోన్ లో గల మరొక అందమైన పర్యాటక ఆకర్షణ వాగమోన్ సరస్సు. ఇక్కడ ఉన్న అందమైన పచ్చటి ప్రదేశాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. అందమైన పువ్వులు, సరస్సు వెనక ఉండే కొండలు ఈ సరస్సు అందాల్ని మరింత రెట్టింపు చేశాయి.

చిత్ర కృప : Vibha Raj

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

వాగమోన్ సరస్సు, వాగమోన్

వాగమోన్ సరస్సులో పర్యాటకులు బోట్ విహారం చేస్తూ చుట్టుప్రక్కల గల సుందర దృశ్యాలను చూడవచ్చు. ఈ సరస్సు పిక్నిక్ లకు, వారాంతపు సెలవులకు విశ్రాంతి ప్రదేశం. ఈ ప్రదేశంలో సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. మరి మీ ఇష్టమైన సినిమా హీరో, హీరోయిన్ చూసి సెల్ఫీలు తీసుకోండి.

చిత్ర కృప : kmurugeshbabu

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

డైరీ ఫారం, వాగమోన్ డైరీ ఫారం లు

కురిసుమల కొండ మీదికి ఎక్కెటప్పుడు కనిపిస్తాయి. ఈ డైరీలను కొండ మీది కురిసుమల ఆశ్రమ సన్యాసులు నిర్వహిస్తుంటారు. ఈ ప్రదేశం ఒక చిన్నపాటి గ్రామంలా అగుపిస్తుంది. ప్రశాంతతను ఇష్టపడేవారు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటారు.

చిత్ర కృప : Anulal

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

కురిసుమల ఆశ్రమం, వాగమోన్

కురుసుమల ఆశ్రమం కురిసుమల కొండ మీద ఉనండి. ఇది క్యాథలిక్ లకు మరియు గాంధీ ఫిలాసఫీ లు నమ్మే వారికి పవిత్రమైనది. ఈ ఆశ్రమాన్ని అన్ని మతాల వారు సందర్శిస్తారు. ఇక్కడ ఉన్న ప్రార్థనా మందిరంలో ప్రతి రోజు ప్రార్థన మరియు ధ్యానం చేస్తుంటారు.

చిత్ర కృప : Vanischenu

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

ముందకాయం ఘాట్ , వాగమోన్

వాగమోన్ కి 8 కి. మీ. దూరంలో ఉన్న ముందకాయం ఘాట్ అద్భుతమైన సూర్యాస్తమం మరియు బర్డ్ వాచింగ్ లకు చక్కని ప్రదేశం. ఒంటరితనం కోరుకోనే వారు, ప్రకృతి ప్రియులు ఈ ప్రదేశాన్ని తరచూ సందర్శిస్తుంటారు.

చిత్ర కృప : Tony Jose

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

ముందకాయం ఘాట్ , వాగమోన్

ముందకాయం ఘాట్ లో అప్పుడప్పుడు పారా గ్లైడింగ్ క్రీడలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఈ ప్రదేశానికి సాహసయత్రికులు వస్తుంటారు. వారి రాకతో ఒక్కసారి ఆ ప్రదేశం మొత్తం కోలాహలంగా మారుతుంది.

చిత్ర కృప : Vibha Raj

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

టాలీవూడ్ షూటింగ్ స్పాట్ - వాగమోన్ !

ఆత్మహత్యల స్థలం, వాగమోన్

అవును ..! మీరు విన్నది నిజమే. ఈ ప్రదేశం ఆత్మహత్యల స్థలం. వాగమోన్ లో మూన్ పారా గా పిలవబడే ఈ ప్రదేశం సుసైడ్ పాయింట్ గా ప్రసిద్ధి చెందినది. సినిమాలలో చాలా వరకు ఈ ప్రదేశాన్ని చూసే ఉంటారు. ఈ స్థలం వి- ఆకారంలో ఉంటుంది. ఎంతో ఎత్తుగా ఉండే ఈ ప్రదేశం నుండి కిందకు చూస్తే ఒళ్ళు గగుర్పొడుతుంది.

చిత్ర కృప : Hari Krishnan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more