Search
  • Follow NativePlanet
Share
» »వేయినూతల కోన లో వెలసిన నృసింహస్వామిని దర్శించండి !

వేయినూతల కోన లో వెలసిన నృసింహస్వామిని దర్శించండి !

ఒకప్పుడు దండకారణ్యమైన ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రులు, సీతా అమ్మవారితో కొన్ని రోజులిక్కడ వున్నట్లు పురాణాలు చెపుతున్నాయి.

By Mohammad

భారతదేశంలో పుణ్యక్షేత్రాలలో పెండ్లిమర్రి మండలం వెయ్యినూతులకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఈ దేవస్థానాన్ని మహారాజులు, యోగులు, మహాత్ములు, మహామునులు దర్శించి తరించినట్లు పురాణాలు చెప్తుతున్నాయి. మహావిష్ణువు ఆయుధమైన చక్రంతో ఈ ప్రాంతానికి సంబంధముందని పురాణాలు చెపుతున్నాయి. అసురసంహారానికి దోహదపడిన అద్భుత మహిమగల చక్రాన్ని ప్రతి ఒక్కరు శిరస్సు వంచి స్నానం చేయించేది భారత దేశంలోనే ఇదొక్క దైవక్షేత్రం.

వెయ్యి నూతుల కోన పురాణ ప్రసిద్ది పుణ్యమైన రీతంలో ఆవిష్కృతమైందక్కడే. లోకకంటకుడైన రాక్షసచక్రవర్తి హిరణ్యకశిపుడిని ఆసాధరాణమైన రీతిలో సంహరించి అహోబిల క్షేత్రం నుంచి మొట్టమొదటిగా విచ్చేసింది ఇక్కడికే. శ్రీ మహాలక్ష్మీ రూపుడైన చెంచులక్ష్మీతో విహరించింది ఈ మనోహర క్షేత్రంలోనే. అంతేకాదు హిరణ్యకశిపుని వధ సందర్భంగా తాను ప్రదర్శించిన 32 ఛాయల్లో రెండింటిని శాశ్వతంగా నిలిపింది ఈమహిమాన్విత క్షేత్రంలోనే. అందువల్ల ఇది మన రాష్ట్రంలోనే గాక యావద్భారతంలోని నరసింహ క్షేత్రాల్లోనే అగ్రశ్రేణి క్షేత్రంగా అలరారుతోంది. అద్భుతక్షేత్ర సందర్శనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం.

పురాణాలు

పురాణాలు

ఒకప్పుడు దండకారణ్యమైన ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రులు, సీతా అమ్మవారితో కొన్ని రోజులిక్కడ వున్నట్లు పురాణాలు చెపుతున్నాయి. రామచంద్రస్వామి సేదతీరుతున్న సమయంలో కాకసురుడనే రాక్షసుడు సీతమ్మని తన ముక్కుతో పొడిచాడు. స్వామి వారికి నిద్రాభంగం కలిగించకుండా సీతమ్మవారు నొప్పిని ఓర్చుకుని భరించారు. పొడిచినచోట రక్తం ధారలుగా ప్రవహించి శ్రీరామచంద్రుల వారికి తగలడంతో ఆయనకు నిద్రాభంగమైంది. దీంతో స్వామి మేల్కొని ఆ కాకసురుని వధించినట్లు పురాణాలు చెప్తుతున్నాయి. అప్పటి నుండి ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించదని ప్రతీతి.

లక్ష్మీనరసింహస్వామి కొంగుబంగారం

లక్ష్మీనరసింహస్వామి కొంగుబంగారం

ఇన్ని మహిమలు కల్గిన దేవాలయానికి భక్తులు లక్ష్మీనరసింహస్వామి కొంగుబంగారం. శ్రీ స్వామి వారిని దివ్యసుందర మనోహర విశ్వరూప దర్శనం కోసం దేవతలైన ఇష్టపడడం ఆశ్చర్యం. కోనేరు నీటిలో స్నానంచేసి, ఆలయం లోపల స్వామిని దర్శిస్తే చేసిన పాపాలు తొలగుతాయని, అలాగే కోరిన కోర్కెలు ఫలిస్తాయనేది భక్తుల నమ్మకం. ఆలయం లోపల మండుటెండల్లో సహజ చల్లదనం కోసం ఆరాటపడే పర్యాటకులు ప్రకృతి రమణీయత ఉట్టివడి ప్రకృతి సోయగాలతో పర్యాటకులు సేదతీర్చుకుంటున్నారు.

సుందరమైన ప్రకృతి దృశ్యాలతో

సుందరమైన ప్రకృతి దృశ్యాలతో

ఈ వెయ్యినూతుల కోనలో ఎతైనచెట్లు వివిధ రకాలైన పచ్చని వృక్షాలు ప్రకృతి రమణీయతతో కనువిందుచేస్తాయి. కోనేరులో మండు వేసవిలో సైతం పైమెట్లు వరకూ నీరు ఉండడం విశేషం. సుందరమైన ప్రకృతి దృశ్యాలతో కనులకు ఇంపుగా గిరి శిఖరాల నుంచి జాలువారు జలపాతాలతో మానసికోల్లాసాన్ని కలిగించే ఎతైన కొండల నడుమ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెయ్యినూతులకోన దినదిన ప్రవర్ధమానంగా భక్తులకు కోసం విరాజిల్లుతోంది.

పుణ్యప్రాప్తి కలుగుతుందని ప్రతీతి

పుణ్యప్రాప్తి కలుగుతుందని ప్రతీతి

ఈకోనలో నేటికీ మహసిద్ధులు ప్రతి నిత్యం ఏకాంత సమయంలో అదృశ్యరూపంలో స్నానంచేసి తపమాచరించి స్వామిని దర్శిస్తారని ఇక్కడ చెపుతుంటారు. ఇందుకు నిద్శనంగా లక్ష్మీదేవి స్వామి వారి పాదాల చెంత అర్చక ద్రవ్యాలు కనిపిస్తాయి. కాగా భక్తులకు దీర్ఘకాలిక రోగాలు, దృష్టగ్రహలు, బాదలు తొలగి ఏకాగ్రత, ప్రశాంతం, పుణ్యప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.

మరోప్రత్యేకత

మరోప్రత్యేకత

ఈదేవాలయానికి ఏక్కడాలేని మరోప్రత్యేకత కూడా వుంది. సాధారణంగా ఏ గుడిలోనైనా విగ్రహలు ఉత్తరం లేదా తూర్పు ముఖం వుంటారు. కానీ మహలక్ష్మీ ఆలయంలో విగ్రహం మాత్రం పడమర ముఖంగా వుంటుంది. దీనికారణంగా ఎక్కువ సంఖ్యలో మహలక్ష్మి అమ్మవారిని మహిళలు దర్శిణచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సహ్యాద్రికొండల మీదుగా వేయి నూతులు

సహ్యాద్రికొండల మీదుగా వేయి నూతులు

వేయినుతులకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇచ్చట వ్యాపించియున్న సహ్యాద్రికొండల మీదుగా వేయి నూతులు (అనగా చిన్న చిన్న గుంతలు) నుండి సుమారు గువ్వల చరువు కనుమ ఘాట్ రోడ్ నుండి కొండలలో వ్యాపించి, స్వామి వారి కోనేరులో అంతర్లీనంగా కలియుచున్నందున ఈ క్షేత్రంనకు వేయినూతులకోన అని వ్యవహరించబడుచున్నది.

లక్ష్మీ నరసింహ స్వామి నిలయం

లక్ష్మీ నరసింహ స్వామి నిలయం

ఈ ఆలయం ఎంతో అద్భుతంగా వుండడమే గాక ఆలయ ప్రాంగణమంతా భక్తజనులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలుగచేస్తుంది. ఎన్నో కోర్కెలను తీర్చడమే కాక, సమస్యల నుంచి బయటపడవేసే మహత్తర శక్తి కలవారైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిలయం, ఈ ఆలయం. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామి వారి మీద పది పాటలు వ్రాశారు.

క్షేత్ర సందర్శనం ఒక సుకృతం, అదృష్టం, వరం

క్షేత్ర సందర్శనం ఒక సుకృతం, అదృష్టం, వరం

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి అనుగ్రహం వలన భయంకర వ్యాధులు కూడా పాటాపంచాలవుతాయని, దారిద్య దుఃఖాలు అంతరిస్తాయని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత సమకూరుతుందని పురాణాలు చెపుతున్నాయి. 118 వైష్ణవ దివ్యక్షేత్రాలలో అగ్రశ్రేణికి చెందిన వెయ్యినూతుల కోన అద్భుత క్షేత్ర సందర్శనం ఒక సుకృతం, అదృష్టం, వరం.

వేయినూతల కోన ఎలా చేరుకోవాలి ?

వేయినూతల కోన ఎలా చేరుకోవాలి ?

వేయినూతల కోన నుండి వివిధ ప్రాంతాలకు దూరం :

పెండ్లిమర్రి కడప నుండి 43 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడికి చేరుకోవటానికి గంట పడుతుంది.
తిరుపతి నుండి 184 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెండ్లిమర్రి చేరుకోవటానికి 4 గంటలు పట్టవచ్చు.
పెండ్లిమర్రి నుండి వాహనాలలో 15 నిమిషాలలో రోడ్డుమార్గం ద్వారా వేయినూతల కోన చేరుకోవచ్చు. డైరెక్ట్ బస్సు ఉంది కానీ ట్రిప్ లు తక్కువ. ఆటోరిక్షాలు, జీపులు పెండ్లిమర్రి నుండి వేయినూతల కోన కు నేరుగా లభిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X