Search
  • Follow NativePlanet
Share
» » జోద్ పూర్ - రాచరికపు విలాసాల నగరం !

జోద్ పూర్ - రాచరికపు విలాసాల నగరం !

నీలి రంగు నివాసాలు, ఆహ్లాదకర వాతావరణం, అందమైన రాజ భవనాలు, చారిత్రాత్మక కోటలు అన్నీ కలిసి జోద్ పూర్ నగరాన్ని దాని రాచరికపు హంగులతో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా చేసాయి. ఈ నగర సందర్శనలో మీరు రాజస్థాన్ ఎడారి లోని ఆకర్షణీయ, ప్రసిద్ధ ప్రదేశాలు చూసినట్లే. ఈ ప్రదేశాల అందాలు ఆస్వాదించేందుకు వాస్తవానికి ఒక రోజు చాలదు. మరి సమయం తక్కువ అయినప్పటికి క్రింద తెలిపిన విధంగా టూర్ చేస్తే, మంఛి ప్రదేశాలు చూసిన వారవుతారు.

ఉమైద్ భవన్ పాలస్

జోద్ పూర్ లో ఉమైద్ భవన్ పాలస్ ప్రధాన ఆకర్షనలలో ఒకటి. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు నివాసాలలో ఒకటి. ఇది చిత్తర్ హిల్ అనే ఒక కొండపై వుండటం చేత దీనిని చిత్తర్ పాలస్ అని కూడా అంటారు. చిత్తర్ ఇసుక రాయిని ఖరీదైన భవనాల నిర్మాణానికి ఉపయోగిస్తారు.

ప్రస్తుతం ఈ పాలస్ మూడు భాగాలుగా ఏర్పడింది. అవి ఒకటి ఒక ఫైవ్ స్టార్ హోటల్, రెండవది ఒక మ్యూజియం మరి మూడవది, జోద్ పూర్ రాజ కుటుంబం నివసించే నివాసం. ఏ రకమైన సిమెంట్ వంటి బిల్డింగ్ మెటీరియల్ వాడని అరుదైన ఈ గొప్ప నిర్మాణ చాతుర్యం దీనిని తప్పక చూసేలా చేస్తుంది. ఉమైద్ భవన్ పాలస్ జోద్ పూర్ నగరానికి 8 కి. మీ. ల దూరంలో కలదు.

మేహరాన్ ఘర్ ఫోర్ట్

మేహరాన్ ఘర్ జోద్ పూర్ రాజపుత్రులు గడిపిన రాచరిక జీవనానికి మరొక నిదర్శనంగా వుంటుంది. రాజస్తాన్ లోని కోటలలో అతి పెద్దదైన మేహరాన్ ఘర్ ఫోర్ట్ నగరంలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి.

ఈ కోట ఒక కొండపై కలదు. ఈ కోట కాంప్లెక్స్ లో అనేక పాలస్ లు, టెంపుల్స్ కలవు. పేరొందిన సీష మహల్, మోతి మహల్, ఫూల్ మహల్, జానకి మహల్ వంటివి ఇక్కడ తప్పక చూడగినవి. మేహరాన్ ఘర్ కోట జోద్ పూర్ సిటీ కి 14 కి. మీ. ల దూరంలోను, ఉమైద్ భవన్ పాలస్ కు 6 కి. మీ. ల దూరం లోను వుంటుంది.

ఉమైద్ భవన్ పాలస్ జస్వంత్ తాడ

మేహ్రాన్ ఘర్ ఫోర్ట్ నుండి ఒక కి. మీ. దూరంలో వుంటుంది. ఇది జోద్ పూర్ ౩౩వ పాలకుడైన మహారాజ జస్వంత్ సింగ్ - 2 యొక్క ఒక అందమైన మార్బుల్ స్తూపం. ఈ స్తూపాన్ని ఆయన కుమారుడు నిర్మించాడు. ఈ నిర్మాణం లో అనేక నగిషీలు, చెక్కడాలు వుండటం చే దీనిని ' మార్వార్ తాజ్ మహల్ ' అని కూడా పిలుస్తారు. ప్రధాన స్మారక నిర్మాణం ఒక టెంపుల్ ను పోలి వుంటుంది. జోద్ పూర్ లో ప్రధానంగా చూడదగిన ఆకర్షనలలో ఒకటి.

మందోర్ గార్డెన్

మందోర్ పూర్వకాలంలో మార్వార్ రాజులకు రాజధాని. అయితే వీరు దీనిని వదలివేసి, మహారాన్ ఘర్ కోట నుండి పాలించారు. ఈ గార్డెన్ లో జోద్ పూర్ రాజుల జ్ఞాపకార్ధం నిర్మించిన అనేక స్మారకాలు కలవు.

 జోద్ పూర్ - రాచరికపు విలాసాల నగరం !

అయితే, విశేషం గా , ఈ స్మారక నిర్మాణాలు రాజ పుత్ర శైలి కాకుండా హిందువుల టెంపుల్స్ ను పోలి వుంటాయి. గార్డెన్ లోని ఒక కొండపై నుండి మీరు మందోర్ సిటీ యొక్క పురాతన అవశేషాలను చూడవచ్చు. రాణులకు కట్టిన స్మారక చిహ్నాలను చూడవచ్చు. మందోర్ గార్డెన్ మందోర్ లో జస్వంత్ తాడా కు 8 కి. మీ. ల దూరంలో కలదు.

జోద్ పూర్ లో షాపింగ్

ఇన్ని ప్రదేశాలు చూసిన మీరు జోద్ పూర్ నుండి ఖాళీ చేతులతో వస్తారా ? అవసరం లేదు. జోద్ పూర్ లో అనేక షాపింగ్ ప్రదేశాలు కలవు. వాటిలో క్లోక్ టవర్, సర్దార్ మార్కెట్ లు గొప్ప షాపింగ్ ప్రదేశాలు. మిల మిల మెరిసే వెండి వస్తువులు, హేండి క్రాఫ్ట్ వస్తువులు, పురాతన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. క్లోక్ టవర్ మందోర్ గార్డెన్ కు సర్దార్ మార్కెట్ కు 8 కి. మీ. ల దూరంలో వుంటుంది.

ఎక్కడ తినాలి ? ఎక్కడ వుండాలి ?

జోద్ పూర్ లో మీ బడ్జెట్ కు తగిన అనేక హోటళ్ళు, వసతులు కలవు. వీటి నుండి మీరు ఎంపిక చేసికొనవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X