» »మధ్యయుగాల కళావైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే పర్యాటకకేంద్రం సిద్ధవటం

మధ్యయుగాల కళావైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే పర్యాటకకేంద్రం సిద్ధవటం

Posted By: Venkata Karunasri Nalluru

కడప జిల్లాలోని సిద్ధవటంలో ఉన్న కోట ఆ కాలంనాటి చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినది ఈ కోట. ఇటువంటి ప్రాముఖ్యత కల్గిన ఈ కోటను మీకూ దర్శించాలని వుంది కదూ! ఇంకెందుకాలస్యం సిద్ధవటం చూద్దామా ! పూర్వకాలంలో సిద్ధులు ఇక్కడ ఎక్కువగా నివసించేవారట. వీరు మఱ్ఱి చెట్లలో నివశించేవారు. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ జెైనులు కూడా నివశించేవారు. ఈ కోట దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిచెందిన కోట. 1956 వ సం నుండి పురావస్తు శాఖ ఆధీనంలో వుంది. ఇక్కడ దేవాలయాలు కూడా బాగా ప్రసిద్ధిగాంచినవి వున్నాయి. రంగనాథస్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఇక్కడ స్మశానవాటికలో భాకరాపంతులు అనే పేరుతో 16 స్తంభాల మంటపం ఉంది. ఇది సందర్శకులను బాగా ఆకర్షిస్తుంది.

ఎలా వెళ్ళాలి

siddavatam fort

కడప నుంచి సిద్ధవటం 20 కిమీల దూరంలో వుంది. కడప నుంచి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్ళే మార్గంలో పెన్నా నది ఒడ్డున వుంది.

రహదారి మార్గం

హైదరాబాద్‌ నుండి కడప వరకు విరివిగా బస్సులున్నాయి. అలాగే రెైలు సౌకర్యం కూడా ఉంది.

విమాన మార్గం

దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు అనుకూలమైన విమానాశ్రయాలు: తిరుపతి, హైదరాబాద్‌.

ఈ ప్రదేశం చూచుటకు అనుకూల సమయం

ఈ కోటను సెప్టెంబర్‌ మరియు అక్టోబర్‌ నెలలలో చూడవచ్చును. అంతేకాకుండా ఎండాకాలంలో కూడా సందర్శకులతో కిటకిటలాడుతుంది.

కోట చరిత్ర

siddavatam fort

PC :Youtube

చారిత్రక ఆధారాల ప్రకారం వరదరాజు పరిపాలనా కాలంలో ఈ కోటను ఎంతో అభివృద్ధి చేశారని తెలుస్తుంది. మొదట ఈ కోట మట్టితో నిర్మించబడి వుండినది. మట్లి రాజులలో ఒకడైన మట్లి అనంతరాజు శత్రువుల నుండి రక్షించుకొనుటకు పటిష్టంగా ఈ మట్టికోటను రాతికోటగా నిర్మించాడు. ఇతను చెరువులను త్రవ్వించాడు.

siddavatam fort

PC :Youtube

అనంతరాజు 'కకుస్థ విజయం'అనే కావ్యాన్ని రచించాడు. ఈయన ఆస్థానంలో కవి చౌడప్ప, ఉప్పుగుండూరు వెంకటకవి వంటి పేరొందిన కవులు ఉండేవారు. మట్లి రాజుల పరిపాలనా కాలంలో ఔరంగజేబు సేనాపతి మీర్‌ జుమ్లా ఈ ప్రాంతంపై దండెత్తి ఆక్రమించుకున్నాడు. తర్వాత ఆర్కాటు నవాబులు స్వాధీనం చేసుకున్నారు. 1714 లో కడపను పాలిస్తున్న అబ్దుల్‌ నబీఖాన్‌ స్వాధీనపరుచుకున్నాడు. ఆఖరికి 799 సం. లో సిద్ధవటాన్ని ఈస్టిండియా కంపెనీ వారు ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు

సిద్ధవటం కోటను పటిష్టంగా నిర్మించారు. కోటకు రెండు ద్వారాలున్నాయి. తూర్పు వైపు ఒక ద్వారం, పశ్చిమం వైపు మరొక ద్వారం వుంది. పశ్చిమం వైపు వున్న ద్వారానికి ఇరు వెైపులా నాట్య భంగిమలో ఉండే అందమైన శిల్పాలను చూడవచ్చును.

ఈ శిల్పాలు చూచుటకు రామణీయంగా వుంటాయి. కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం చూడవచ్చును. అద్భుతంగా నిర్మించిన కామాక్షిదేవి ఆలయాన్ని చూడవచ్చును.

siddavatam fort

PC :Youtube

టిప్పు సుల్తాన్‌ కాలంలో నిర్మించిన బిస్మిల్లా షావలి దర్గాను తూర్పువైపు గల ద్వారం వద్ద చూడవచ్చును. దాని పక్కనే మసీదు చూడవచ్చును. మసీదుకు తూర్పుగా కోటగోడలో ఏట్లోకి వెళ్ళే సొరంగ మార్గాన్ని నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నెలకొని ఉన్న ప్రతి రాయిలో ఏదో ఒక విశిష్టత దాగుందని చెప్పవచ్చు.