Search
  • Follow NativePlanet
Share
» »అందమైన సరస్సుల నగరం ఉదయపూర్ ను సందర్శించండి

అందమైన సరస్సుల నగరం ఉదయపూర్ ను సందర్శించండి

By Venkata Karunasri Nalluru

2010 సం. యొక్క అత్యుత్తమ పర్యాటక ప్రదేశంగా "ఉదయపూర్" ను ప్రకటించారు. ఇది భారతదేశం యొక్క అత్యంత శృంగార నగరాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దీనిని "రాజస్థాన్ యొక్క కాశ్మీర్" అని పిలుస్తారు. ఇంకా "మేవార్ జ్యువెల్" అని, " వెనిస్ అఫ్ ది ఈస్ట్" అని కూడా పిలుస్తారు.

ఉదయపూర్ మేవార్ రాజ్యానికి రాజధాని నగరం. మహారాణా ఉదయసింగ్ 1553 సంవత్సరంలో ఈ నగరాన్ని స్థాపించారు. ఇతను రాజధానిని చిత్తోర్గర్ నుండి ఉదైపూర్ కు మార్చినారు.

ఇది కూడా చదవండి :

ఉదయపూర్ కు ట్రావెల్ గైడ్

ఉదయపూర్ నాలుగు సరస్సులు చుట్టూ ఒక లోయలో ఉన్నది. మంత్రముగ్ధమైన మరియు చిరస్మరణీయ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి.

నగరంలో సరస్సులే కాకుండా కోటలు, రాజభవనాలు, దేవాలయాలు మరియు కొండలు విస్తృతంగా వున్నాయి.

సరస్సులో సందర్శకుల కోసం అందమైన బోట్ రైడింగ్, ఎన్నో దగ దగ మిరిసే రంగు రంగుల హసల్ బసల్ ఆభరణాల మార్కెట్లతో పాటు దుస్తులు మరియు హస్తకళలతో తయారుచేసిన వస్తువులను విక్రయించే దుకాణాలు అనేకం వున్నాయి.

పురాణాల ప్రకారం :

పురాణాల ప్రకారం :

ఉదయపూర్ ప్యాలెస్ వెనుక ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. ఈ పురాణం ప్రకారం, మహారాణా ఉదయ సింగ్ ఒక రోజు వేటకు బయలుదేరాడు. ఒక కొండ మీద పిచోలా సరస్సు కోసం తపస్సు చేస్తున్న ఒక సన్యాసిని కలిసాడు. ఆ సన్యాసి మహారాణా ఉదయసింగ్ ను ఆశీర్వదించి ఆ సరస్సు జలమయమవుతుందని ఆ సారవంతమైన లోయలో ఒక ప్యాలెస్ నిర్మించమని కోరతాడు. ఆ రాజు సన్యాసి సలహా అనుసరించి 1559 లో నగరాన్ని నిర్మించారు.

ఉదయపూర్ టూరిజం గురించి మరింత చదవండి

PC: wikimedia.org

మరింత తెలుసుకోండి....

మరింత తెలుసుకోండి....

పిచోలా సరస్సు ఒడ్డున ఒక అందమైన సిటీ ప్యాలెస్ నెలకొన్నది. దీని నిర్మాణంలో గ్రానైట్ మరియు పాలరాయిని వుపయోగించారు. అసలు ఉదయపూర్ నగరానికి మొత్తం 11 గేట్లు వుండేవి. కానీ ఇప్పుడు కేవలం వాటిలో ఐదు మాత్రమే వున్నాయి. నగరానికి తూర్పు వైపున గల "సూరజ్ పోల్ లేదా సన్ గేట్" నగరానికి ప్రధాన ద్వారం.

PC: wikimedia.org

ఇది కవులు, చిత్రకారులు మరియు రచయితలు ఒక స్ఫూర్తి. అందమైన ప్రకృతి మరియు శబ్దాల పరిపూర్ణ సమ్మేళనం.

1. సిటీ ప్యాలెస్

1. సిటీ ప్యాలెస్

మొట్టమొదట నిర్మాణం మహారాణా ఉదయ సింగ్ చేసినా తర్వాత పలు రాజభవనాలు మరియు ఇతర నిర్మాణాలు అతని వారసులు చేశారు. ప్యాలెస్ లోపలా, బయటా చాలా అందంగా వుంటుంది. అద్దాల పలకలు, చిత్రలేఖనాలు, గాజు పని మరియు అలంకారమైన పలకలు వంటి అలంకరణలు ప్యాలెస్ నిర్మాణానికి మచ్చుతునకలు.

PC: flickr.com

2. లేక్ ప్యాలెస్

2. లేక్ ప్యాలెస్

లేక్ ప్యాలెస్ ని "జాగ్ నివాస్ ప్యాలెస్" అని పిలుస్తారు. ఇది వేసవి విడిదిగా వుంది. దీనిని "జగ్ మందిర్ ప్యాలెస్" ని 1743 సం. మరియు 1746 సం. మధ్య కాలంలో ఒక ద్వీపంలో నిర్మించారు. ప్యాలెస్ తూర్పు ముఖాలు చూపరులకు కనువిందు చేస్తాయి. రాజభవనం గోడలు నలుపు మరియు తెలుపు పాలరాతితో మరియు దానికి సమానమైన విలువైన రాళ్ళతో కట్టబడి వున్నాయి. ఇప్పుడు ఈ వారసత్వ నిర్మాణం ఒక హోటల్. ఇక్కడ తోటలు, ఫౌంటైన్లు మరియు దాని ప్రాంగణాలతో పాటు స్తంభాల డాబాలు కూడా ఉన్నాయి.

PC: flickr.com

3. జాగ్ మందిర్

3. జాగ్ మందిర్

సరస్సు పిచోలా వద్ద ఒక ద్వీపంలో నిర్మించిన భవనం "జాగ్ మందిర్". దీనిని "లేక్ గార్డెన్ ప్యాలెస్" అని అంటారు. ఈ భవన నిర్మాణం 1551లో ప్రారంభమై 1652 లో పూర్తయిందని అంటారు. రాజ కుటుంబం ఒక వేసవి విడిది. హోస్టింగ్ పార్టీలకు కూడా ప్యాలెస్ ఉపయోగిస్తారు. మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్ తన తండ్రి జహంగీర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు ప్యాలెస్ ఆశ్రయం ఇచ్చింది. ఈ పాలెస్ తాజ్ మహల్ నిర్మాణానికి కారణమైందని చెబుతారు.

PC: flickr.com

4. వర్షాకాల ప్యాలెస్

4. వర్షాకాల ప్యాలెస్

ఆరావళి పరిధిలో గల బంస్దార మౌంటైన్ పైన ఉన్న ఈ 18 వ శతాబ్దపు భవంతిని "మహారాణా సజ్జన్ సింగ్" నిర్మించారు. కింగ్ మొదట్లో ఒక ఐదు అంతస్తుల ఖగోళ కేంద్రంగా చేసి దీనిని అప్పగించారు. మేవార్ రాజ కుటుంబానికి చెందినవారు ఈ ప్యాలెస్ ను ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.

PC: wikimedia.org

5. జగదీష్ ఆలయం

5. జగదీష్ ఆలయం

ఈ నిర్మాణం ఇండో-ఆర్యన్ శైలికి పరిపూర్ణ ఉదాహరణగా చెప్పవచ్చును. ఆలయం 1651లో నిర్మించబడింది. ఉదయపూర్ ప్రఖ్యాత దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో విష్ణువు ప్రధానమైన దేవుడు. చెక్కిన స్తంభాలు, పెయింట్ గోడలు మరియు సొగసైన పైకప్పులు అధ్బుతంగా ప్లేయింగ్ హోస్ట్ లాగా వుంటుంది.

PC: wikimedia.org

6. ఫతే సాగర్ లేక్

6. ఫతే సాగర్ లేక్

1678 లో ఈ చెరువును మహారాణా జైసింగ్ నిర్మించాడు. మట్టి ఆనకట్ట, వరదల్లో కొట్టుకుపోయిన తర్వాత మహారాణా ఫతే సింగ్ హయాంలో దీనిని పునర్నిర్మించారు. ఇది ఉదయపూర్ లో మూడు చిన్న దీవులలో గల నాలుగు సరస్సులలో ఒకటి. పచ్చని పర్వతాల నేపథ్యంలో సరస్సు ప్రశాంతంగా, ఉపరితలం నీలంగా ఉదయపూర్ మరో కాశ్మీర్ ను తలపింపు చేస్తుంది.

PC: wikimedia.org

7. సరస్సు పిచోలా

7. సరస్సు పిచోలా

పిచోలి గ్రామం వల్ల సరస్సుకు పిచోలా అనే పేరు వచ్చింది. మహారాణా ఉదయసింగ్ అసలైన సరస్సును విస్తరించడం ద్వారా ఉదయపూర్ నగరం స్థాపించబడింది. దీనిని 1362లో రూపొందించారు. అంతేకాకుండా ఉదయపూర్ నగరానికి తాగు నీరు మరియు ఇతర నీటిపారుదల అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించబడినది. పిచోలా ప్యాలెస్ సరస్సు మధ్యలో ఉంది. ప్రసిద్ధ సిటీ ప్యాలెస్ సరస్సు యొక్క తూర్పు తీరం వెంట వ్యాపించి ఉంది.

PC: flickr.com

8. సహేలియన్ కి బరి

8. సహేలియన్ కి బరి

సహేలియన్ కి బరి లేదా మైడెన్స్ యొక్క ఆవరణాన్ని మహిళలకు ఒక ఉద్యానవనంగా "రాణా సంగ్రామ్ సింగ్" నిర్మించారు. ఇది ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాల హౌసెస్ లో ఒక చిన్న మ్యూజియం. ఇక్కడ పాలరాటితో నిర్మించబడిన ఏనుగులు, ఒక లోటస్ పూల్ మరియు ఫౌంటైన్లు వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి.

PC: wikimedia.org

9. భారతీయ లోక్ కళా మండల్

9. భారతీయ లోక్ కళా మండల్

ఈ కళా మండల్ ఒక సాంస్కృతిక సంస్థ. జానపద కళ, సంస్కృతి, పాటలు మరియు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ పండుగలు అధ్యయనంగా కలిగినది. ఇది భవనంలో ఒక మ్యూజియం కూడా. రాజస్థానీ సంస్కృతికి సంబంధించిన వివిధ కళాఖండాలు ఇక్కడ ప్రదర్శన కూడా.

PC: wikipedia.org

10. దూద్ తలై లేక్ :

10. దూద్ తలై లేక్ :

ఉదయపూర్ మున్సిపల్ కౌన్సిల్ 1995లో దీనిని నిర్మించారు. ఇక్కడ అనేక చిన్న గుట్టలు మధ్య సరస్సు ఉంది. ఇది పర్యాటక ఆకర్షణలలో ఒకటి. మెట్ల మార్గం ద్వారా లేదా డ్రైవింగ్ ద్వారా చేరవచ్చును. స్థానికులు తరచుగా కర్ణి ఆలయం కొండ పైకి దేవత యొక్క తెల్ల రాయి విగ్రహం మరియు వేల కొలది ఎలుకలను చూచుటకు వెళ్తారు.

PC: wikimedia.org

11. జైసమంద్ లేక్ :

11. జైసమంద్ లేక్ :

సరస్సు ఆసియాలో గల రెండవ అతిపెద్ద మానవ నిర్మిత తీపి నీటి సరస్సుగా పేరుగాంచింది. స్థానికులు సరస్సు రుపరెల్ నది నీటిని రానీయకుండా చేయడానికి నిర్మించబడింది అని చెప్తారు.

పెద్ద ద్వీపంలో గల సరస్సు వివిధ జాతుల పక్షులను నిలయం.

PC: wikimedia.org

ఉదయపూర్ చేరుకోటానికి

ఉదయపూర్ చేరుకోటానికి

ఉదయపూర్ లోనే విమానాశ్రయం ఉంది. ఇది ముంబై నుండి 761 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీ నుండి 663 కిలోమీటర్ల దూరంలో, జైపూర్ నుండి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో వున్నది. ఇక్కడ గల రైల్వేస్టేషన్ భారతదేశంలో గల అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.

PC: wikimedia.org

సందర్శించవలసిన ఉత్తమ సమయం

సందర్శించవలసిన ఉత్తమ సమయం

శీతాకాలం ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. ఉష్ణోగ్రత చాలా తక్కువగా వుంటుంది కాబట్టి చూచుటకు బాగుంటుంది. సెప్టెంబర్ నుండి మార్చి వరకు సందర్శించవచ్చును.

PC: wikipedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more