Search
  • Follow NativePlanet
Share
» »వరంగల్ - చరిత్ర, కట్టడాలు మరియు సహజ ఆకర్షణలు కలిసే ప్రదేశం !

వరంగల్ - చరిత్ర, కట్టడాలు మరియు సహజ ఆకర్షణలు కలిసే ప్రదేశం !

By Mohammad

వరంగల్ సాహితీ కళలకు, కట్టడాలకు మరియు కాకతీయ వైభోగాలకు నిదర్శనం. ప్రఖ్యాత ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో వ్రాసిన 'బుక్ ఆఫ్ మార్వెల్స్ అఫ్ ది వరల్డ్' లో వరంగల్ కట్టడాల గురించి హైలెట్ చేసి ప్రస్తావించాడు. కాకతీయుల హయాంలో అప్పటివరకు ఉన్న తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నత స్థితికి చేరాయని, వారు ఎన్నో అద్భుత కట్టడాలు నిర్మించారని కూడా తన రచనల్లో పేర్కొన్నాడు.

భారతదేశ చరిత్రను దర్పించే కట్టడాలు నేటికీ వరంగల్ లో కనిపిస్తాయి. ఈనాటికీ చెక్కుచెదరని ఆనాటి విశేషాలను కళ్ళముందు చూడాలంటే ఒక్కసారైనా వరంగల్ ను చూడాల్సిందే!

వరంగల్ జిల్లా, 29 వ రాష్ట్రంగా కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ లో ఉత్తర దిక్కున కలదు. కాకతీయుల రాజ్యంలో వరంగల్ రాజధానిగా సేవలు అందించింది. వీరు క్రీ. శ. 12 వ శతాబ్దం నుంచి క్రీ.శ. 14 వ శతాబ్దం వరకు అంటే సుమారు 200 సంవత్సరాల పాటు తెలుగు నేలను పాలించారు. వీరు ఎన్నో కట్టడాలను, దేవాలయాలను నిర్మించారు. ప్రజల దాహార్తి తీర్చేందుకై సరస్సులను తవ్వించారు.

ఇది కూడా చదవండి : తెలంగాణ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

వరంగల్ కు గల మరో పేరు ఓరుగల్లు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీని పాత్ర కీలకమైనది. వరంగల్ లో నేటికీ నాటి కట్టడాలు, సంస్కృతిని ప్రతిబింబించే కాకతీయ కళాతోరణం, శిధిలావస్థ లోని కోట, రామప్ప దేవాలయం, స్వయంభూ ఆలయం మొదలైన వాటిని చూడవచ్చు. వరంగల్ లో మరియు దాని చుట్టుపక్కల తప్పక చూడవలసిన కొన్ని ప్రదేశాలను తెలుసుకుందాం ..!

వరంగల్ కోట

వరంగల్ కోట

వరంగల్ కోట 13 వ శతాబ్దం నాటిది. దీనిని గణపతిదేవుడు ప్రారంభిస్తే, రుద్రమదేవి పూర్తి చేసింది. ఇప్పుడు ఇక్కడ కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కాకతీయ కీర్తి తోరణాలు, స్వయంభూ లింగం, ఏకశిలగట్టు, గుండుచెరువు, ఖుష్ మహల్ తదితర దర్శనీయ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. కాకతీయల కాలంలో ఈ కోట 19 చదరపు కి. మీ ల విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది.

చిత్రకృప : abhinaba

వేయిస్తంభాల గుడి

వేయిస్తంభాల గుడి

వేయి స్తంభాల గుడి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిచెందినది. వరంగల్ కు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మకొండ లో క్రీ.శ. 11 వ శతాబ్దంలో రుద్రదేవునిచే చాళుక్యుల నిర్మాణ శైలిలో గుడి నిర్మించబడింది. ఇందులో శివుడు, విష్ణువు మరియు సూర్యుడు మొదలైన హిందూ దేవుళ్ళ, దేవతల ప్రతిమలు ఉన్నాయి. ఈ కట్టడం నిర్మించటానికి దివ్యంగా చెక్కబడిన వెయ్యి స్తంభాలను ఉపయోగించారు. కనుకనే గుడి కి వేయి స్థంబాల గుడి అనే పేరొచ్చింది.

చిత్రకృప : Devadaskrishnan

రామప్ప దేవాలయం

రామప్ప దేవాలయం

రామప్ప దేవాలయం వరంగల్ పట్టణం నుండి 70 కి. మీ ల దూరంలో పాలంపేట అనే ఊరిలో ఉన్నది. దీనినే 'రామేశ్వరాలయం' అని కూడా పిలుస్తారు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్పకళా నైపుణ్యం వర్ణించవికానివి. ఈ కాకతీయుల శిల్పకళా చాతుర్యం ఇన్నేళ్లు గడిచినా వన్నె తగ్గకుండా చూపరులను ఆకట్టుకుంటున్నది. గుడిలో నల్లనిరాతి నాట్యకత్తెల విగ్రహాలు, స్తంభాలపై శిల్పాలు శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి.

చిత్రకృప : Jayadeep Rajan

పాకాల సరస్సు

పాకాల సరస్సు

పాకాల సరస్సు కృతిమ సరస్సు. దీనిని గణపతి దేవుడు 12 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ సరస్సు 30 చదరపు కి.మీ ల మేర వ్యాపించి ఉన్నది. సరస్సు వద్ద సేదతీరటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు, పర్యాటకులు వస్తుంటారు. సరస్సుకు ఒకవైపు కొండ ప్రాంతం, మరోవైపు దట్టమైన అడవి పర్యాటకులకు వినోదాన్ని కలిగిస్తాయి.

చిత్రకృప : Alosh Bennett

లక్నవరం సరస్సు

లక్నవరం సరస్సు

లక్నవరం సరస్సు కు చేరుకోవాలంటే గోవిందరావుపేట్ సమీపంలోని దట్టమైన అడవి మార్గం గుండా ప్రయాణించాలి. ఈ సరస్సు వరంగల్ పట్టణానికి 70 లో. మీ. దూరంలో కలదు. స్థానికులచే లక్కవరం చెరువు గా పిలువబడే ఈ సరస్సు చుట్టూ పచ్చని చెట్లతో నిండిన కొండలతో, దట్టమైన అడవితో కనువిందు చేస్తుంది.

చిత్రకృప : telangana tourism

ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం

ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం

వరంగల్ కు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరునాగారం మండలంలో ఈ వన్యప్రాణుల అభయారణ్యం కలదు. 806 చ. కి. మీ. మేర వ్యాపించి ఉన్న ఈ అభయారణ్యం అనేక వృక్ష, జంతుజాలాలకు ఆవాసంగా ఉన్నది. పులులు, దుప్పి, మెరుగు జింక, నక్క మొదలైనవి మరియు అనేక రకాల పక్షులను సంరక్షిస్తున్నారు.

చిత్రకృప : Adityamadhav83

వరంగల్ లోని ఇతర సందర్శనీయ స్థలాలు

వరంగల్ లోని ఇతర సందర్శనీయ స్థలాలు

భద్రకాళీ దేవాలయం, పద్మాక్షిదేవాలయం, గోవిందరాజుల గుట్ట, వరంగల్ పానిటోరియం, రాక్ గార్డెన్, శ్రీ విద్య సరస్వతి దేవాలయం, మినీ జూ, సిద్దేశ్వర ఆలయం, మేడారం, జైన్ మందిర్, మ్యూజికల్ గార్డెన్, రామప్ప సరస్సు, ఘనపూర్ ఆలయ కాంప్లెక్స్, సోమేశ్వర ఆలయం, శ్రీ వీర నారాయణ ఆలయం, రాయపర్తి శివాలయం మొదలైనవి చూడదగ్గవి.

చిత్రకృప : Adityamadhav83

వసతి

వసతి

వరంగల్ లో చక్కని లగ్జరీ హోటళ్లు, డీలక్స్ హోటళ్లు, ఏసీ, నాన్- ఏసీ హోటళ్లు ఉన్నాయి. ఆహార అలవాట్లు మనమాదిరే ఉంటాయి.. కాఫీ, టీ, ఇడ్లీ, దోశ, పూరీ, అన్నం, పప్పు, సాంబార్, పెరుగు, బజ్జీలు ... మొదలైనవి దొరుకుతాయి. స్థానిక భాష తెలుగు.

వరంగల్ ఎలా చేరుకోవాలి ?

వరంగల్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : వరంగల్ కు 132 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులలో వరంగల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : వరంగల్ లో రైల్వే స్టేషన్ కలదు. సికింద్రాబాద్, విజయవాడ, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : హైదరాబాద్ తర్వాత తెలంగాణ లో రెండవ అతిపెద్ద నగరం వరంగల్. రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు వరంగల్ కు వస్తుంటాయి.

చిత్రకృప : JohnnyBlaze007

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X