» »పేదవారు శ్రీమంతులుగా మారే మహిమాన్వితమైన "కప్పల దేవాలయం"....

పేదవారు శ్రీమంతులుగా మారే మహిమాన్వితమైన "కప్పల దేవాలయం"....

Written By: Venkatakarunasri

భారతదేశంలో హిందువులకు ప్రతీ జీవిలో కూడా దైవత్వాన్ని చూసే పవిత్రమైన హృదయాలు. మనం భారతదేశంలోని మూడు కోట్ల దేవతల దేవాలయాలను చూసాము, అక్కడికి చేరుకున్నాము. దీనిని పాటు, మన నేటివ్ ప్లానెట్ ద్వారా మరెన్నో విచిత్రమైన దేవాలయాల గురించి కూడా మీరు తెలుసుకొనవచ్చును.

అవేమిటంటే బులెట్ బాబా, ఎలుకల దేవాలయం, చీమల దేవాలయం, వీసా దేవాలయం, సెలిబ్రెటీ దేవాలయం, భారతమాత దేవాలయం ఈవిధంగా అనేక విభిన్నమైన దేవాలయాల గురించి ఇప్పటికే తెలుసుకుని ఉన్నారు. అట్లయితే నేను మీకోసం ఇంకొక విచిత్రమైన దేవాలయం గురించి తెలియజేయబోతున్నాను.

అదేంటంటే అదే కప్ప దేవాలయం. ఆశ్చర్య పడకండి నాకు మీకు తెలీకుండా వుండే ఎన్నెన్నో విచిత్రమైన దేవాలయాలు మన భారతదేశంలో వున్నాయి. ఆశ్చర్యం ఏమంటే ఈ దేవాలయాన్ని దర్శించుకున్న పేదవాళ్ళు కూడా ధనవంతులవుతారంట. అలాగయితే ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలసిందే కదా?

ప్రస్తుత వ్యాసంలో కప్పలకు సంబంధించిన దేవాలయం మరియు ఆ దేవాలయం యొక్క మహత్యాన్ని గురించి తెలుసుకుందాం.

కప్పల దేవాలయం

కప్పల దేవాలయం

ఈ విచిత్రమైన దేవాలయం వుండేది ఉత్తరప్రదేశ్ లో. ఎప్పుడైనా ఒకసారి ఉత్తరప్రదేశ్ కు వెళితే కప్పల దేవాలయానికి కూడా చూసి రండి. ఈ దేవాలయానికి వెళ్లివచ్చిన పేదవాళ్ళు కూడా ధనవంతులౌతారంట.

Photo Courtesy: Abhi9211

ఐశ్వర్యం మరియు సిరి-సంపదకు రాయబారి

ఐశ్వర్యం మరియు సిరి-సంపదకు రాయబారి

కొన్ని పౌరాణిక సాహిత్యాల ప్రకారం సూచించిన మండూకాలు అంటే కప్పలు సంతానోత్పత్తి శక్తికి పేరు గాంచినది. అంతే కాదు కొంతమంది పండితుల ప్రకారం ఐశ్వర్యం మరియు సిరి-సంపదకు రాయబారిగా కప్పలను సూచిస్తారు.

Photo Courtesy: Abhi9211

ఎంతోమంది భక్తులు

ఎంతోమంది భక్తులు

సిరి-సంపదలు వృద్ధిచెందుతుంది అనే కారణంచేతనే ఇక్కడకు అనేకమంది భక్తులు సందర్శిస్తుంటారు. అయితే ముఖ్యమైన విషయమేమంటే అన్ని సమయాలలో ఇక్కడకు భక్తులు రారు. బదులుగా ప్రత్యేక సమయాలలో మాత్రం దేవాలయాన్ని సందర్శిస్తారు.

Photo Courtesy: Abhi9211

దీపావళి పండుగ

దీపావళి పండుగ

అది ఎప్పుడు అంటే దీపావళి పండుగ, శివరాత్రి మరియు శ్రావణ సోమవారాలప్పుడు ఈ దేవాలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. విశేషంగా దీపావళి పండుగ రోజు మాత్రం ఇక్కడ భక్తులతో నిండివుంటుంది.

పేదరికం నుండి విముక్తి

పేదరికం నుండి విముక్తి

ఈదేవాలయంలోని కప్పలు కొన్ని వరాలను ప్రసాదిస్తాయి. వాటి వల్ల పిల్లలులేని వారు ఈ దేవాలయానికి దర్శిస్తే పిల్లలు కలుగుతారంట. అలాగే పేదరికం నుండి విముక్తి కలగాలనుకునేవారు కూడా ఇక్కడ అపార జన సాగరం దర్శించుకుంటారు.

Photo Courtesy: toyin adepoju

వేడుకలు

వేడుకలు

అది ఏ దేవాలయం కానీ దేవతకు శ్రద్ధ మరియు భక్తి లేకుండా ఎటువంటి వేడుకలు కూడా దేవతలు నెరవేర్చరు. ఇక్కడ కూడా భక్తి, నమ్మకం మరియు శ్రద్ధలను అనుసరించి కప్ప యొక్క ఆశీర్వాదం కోసం వుంటుందని భక్తుల నమ్మకం.

Photo Courtesy: Himanshu Sharma

మహాశివుని దేవాలయం

మహాశివుని దేవాలయం

ముఖ్యంగా ఇది మహాశివునికి ముడిపడ్డ దేవాలయం, కప్పు వీపు మీద అందంగా నిర్మించబడివుంది.ఈ దేవాలయం వున్న ప్రదేశానికి "మండూక మందిరం" అని కూడా పిలుస్తారు.
మండూక విద్య ప్రకారం కప్ప వీపు మీద వుంచిన తాంత్రిక చక్రం మీద ఈ దేవాలయాన్ని నిర్మించారు.

దారిద్ర్య నివారణం

దారిద్ర్య నివారణం

ఈ దేవాలయం సుమారు 200 సంవత్సరాల పురాతన దేవాలయం అని చెప్పబడింది. ఈ దేవాలయాన్ని సందర్శించటం వల్ల వారి యొక్క దారిద్ర్యం నివారణ అవుతుంది అని నమ్ముతారు. దీనికి సంబంధించిన ఒక స్థలపురాణం కూడా వుంది.

Photo Courtesy: Abhi9211

రాజా భకత్ సింగ్

రాజా భకత్ సింగ్

ఇక్కడ రాజపుత్ర పాలకుడు భగత్ సింగ్ అనునతనికి ఎక్కడెక్కడి కష్టాలో ఎదురైనాయంట. ఈ విధంగా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కప్ప యొక్క ఆశీర్వాదం రాజునకు మరియు ప్రజలకు లభించినదంట. అప్పటి నుంచి రాజు యొక్క అన్ని కష్టాలు దూరమై సకల సంపదలు లభించెనంట. ఇది అక్కడి స్థల పురాణం. ఆ విధంగా ఆ రాజు కప్ప యొక్క దేవాలయాన్ని నిర్మించాడని చెప్పవచ్చును.

వాస్తు శిల్పాలు

వాస్తు శిల్పాలు

ఈ దేవాలయం యొక్క ముఖ్యమైన ఆకర్షణ వాస్తు శిల్పాలు. ఈ రచనలో కప్ప వెనుక భాగంలో మొత్తం నిర్మాణం కనిపిస్తుంది. ముందుభాగంలో కప్ప యొక్క ఒక భవ్యమైన శిల్పం కూడా వుంది. కప్ప వెనకభాగంలో చతురస్రఆకారంలో ఒక గోపురాన్ని నిర్మించారు.

Photo Courtesy: Himanshu Sharma

తాంత్రిక సంప్రదాయం అంటే ఏమిటి?

తాంత్రిక సంప్రదాయం అంటే ఏమిటి?

తాంత్రిక సంప్రదాయం అంటే ప్రాచీన హిందూ ధర్మం మరియు బౌద్ధధర్మం యొక్క ప్రభావాన్ని కలిగియున్న ప్రాచీనమైన భారతీయ సంస్కృతి. ఇది ముఖ్యంగా స్త్రీ శక్తిని ప్రతిబింబించే పూర్వవైదిక సంప్రదాయం. ఈ తాంత్రిక సంప్రదాయాన్ని దేవతలు ఉగ్రరూపాల్లో ఈ సంప్రదాయాన్ని పూజిస్తారు. కప్ప దేవాలయం కూడా ఈ తాంత్రిక పద్దతిని అనుసరిస్తుంది.

Photo Courtesy: toyin adepoju

ఎలా చేరుకోవాలి? దేవాలయం ఎక్కడుంది?

ఎలా చేరుకోవాలి? దేవాలయం ఎక్కడుంది?

ఇంతకీ ఈ దేవాలయం వుండేది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా?అయితే వినండి ఈ విచిత్రమైన దేవాలయముండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లఖింపుర్ ఖేరినుంచి సీతాపురానికి వెళ్ళే మార్గంలో.

లఖింపురనుంచి సుమారు 12 కి.మీ ల దూరంలో ఓయల్ అనే గ్రామంలో ఈ విచిత్రమైన కప్ప దేవాలయం వుంది. లఖింపుర్ లక్నో పట్టణంనుంచి సుమారు 135 కి.మీ ల దూరంలో వుంది.